Democratic candidate
-
US Election Results 2024: ట్రంప్‌కు 50.8 శాతం, హారిస్‌కు 47.5 శాతం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజేతగా నిలిచిన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తన మెజారిటీని మరింతగా పెంచుకునే దిశగా సాగుతున్నారు. విజయానికి 270 ఎలక్టోరల్ ఓట్లు అవసరం కాగా ఆయనకు ఇప్పటికే 295 ఓట్లు సాధించారు. ఆయన ప్రత్యర్థి, డెమొక్రాట్ అభ్యర్థి కమలా హారిస్ 226 ఓట్లు సాధించారు. మొత్తం 50 రాష్ట్రాల్లోనూ ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉన్నా 48 రాష్ట్రాల్లో ఇప్పటికే ఫలితం తేలింది. అరిజోనా, నెవడాల్లో మాత్రమే తేలాల్సి ఉంది. ఆ రెండు రాష్ట్రాల్లో కూడా ట్రంపే ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వాటిలోని 17 ఎలక్టోరల్ ఓట్లు కూడా ఆయన ఖాతాలోనే పడితే ఆయన మొత్తం 312 ఓట్లు సాధిస్తారు. ఇది 2016లో తొలిసారి అధ్యక్షునిగా నెగ్గినప్పుడు సాధించిన ఓట్ల కంటే (304) అధికం. ట్రంప్‌కు ఇప్పటిదాకా 50.8 శాతం, హారిస్‌కు 47.5 శాతం ఓట్లొచ్చాయి. ఆయన 7,27,34,149 ఓట్లు, హారిస్ 6,80,49,758 ఓట్లు సాధించారు. కాంగ్రెస్‌లో... అధ్యక్షునితో పాటు కాంగ్రెస్‌కు కూడా ఎన్నికలు జరిగాయి. సెనేట్‌లోని 100 స్థానాల్లో 34 సీట్లకు, ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలకు పోలింగ్ జరిగింది. వీటితో పాటు 11 రాష్ట్రాల గవర్నర్ పదవులకు, పలు రాష్ట్రాల అసెంబ్లీలకు, స్థానిక సంస్థలకు కూడా ఎన్నికలు జరిగాయి. బిల్లుల ఆమోదంలో అత్యంత కీలక పాత్ర పోషించే సెనేట్‌లో నాలుగేళ్ల అనంతరం రిపబ్లికన్లు మెజారిటీ సాధించారు. ఇప్పటిదాకా వెల్లడైన ఫలితాల్లో వారి స్థానాల సంఖ్య మెజారిటీ మార్కును దాటి 52కు చేరింది. డెమొక్రాట్లకు 45 స్థానాలకు పరిమితమయ్యారు. డెమొక్రాట్లు ఇప్పటికే 3 సీట్లను రిపబ్లికన్లకు కోల్పోయారు. ప్రతినిధుల సభలో కూడా రిపబ్లికన్ల హవాయే సాగుతోంది. మెజారిటీకి 218 సీట్లు కావాల్సి ఉండగా వారికిప్పటికే 206 సీట్లు దక్కాయి. డెమొక్రాట్లు 192 సీట్లే గెలుచుకున్నారు. వారిప్పటికే 4 సీట్లను రిపబ్లికన్లకు కోల్పోయారు. మరో 37 స్థానాల్లో ఫలితాలు రావాల్సి ఉంది. -
Kamala Harris: పోరులో వెనకబడ్డా.. పోరాటం ఆపబోను
వాషింగ్టన్: విజయతీరాలకు కాస్తంత దూరంలో నిలిచిపోయినా పోరాటం మాత్రం ఆపేదిలేదని డెమొక్రటిక్ నాయకురాలు కమలా హారిస్ వ్యాఖ్యానించారు. హోరాహోరీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ చేతిలో పరాజయం పాలైన హారిస్ ఫలితాల తర్వాత తొలిసారిగా స్పందించారు. గురువారం వాషింగ్టన్‌లోని హొవార్డ్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో వేలాది మంది పార్టీ మద్దతుదారుల సమక్షంలో ఆమె భావోద్వేగ ప్రసంగం చేశారు. 60 ఏళ్ల హారిస్ గతంలో ఇదే వర్సిటీలో రాజనీతి, ఆర్థికశాస్త్రం చదువుకున్నారు.నా హృదయం నిండిపోయింది‘‘దేశంపై ప్రేమతో, దేశం కోసం పాటుపడుతూ మీరంతా నాపై ఉంచిన నమ్మకం, ప్రేమతో ఈ రోజు నా హృదయం నిండిపోయింది. ఈ ఎన్నికల్లో మనం ఆశించిన ఫలితం దక్కలేదు. నిజానికి ఇలాంటి ఫలితం కోసం మనం పోరాడలేదు. మీరంతా ఓటేసింది కూడా ఇలాంటి ఫలితం కోసం కాదు. అయితే ఒక్కటి మాత్రం నిజం. అమెరికా అభ్యున్నతి కోసం మనందరం చేసిన ప్రతిజ్ఞా జ్వాల ఎప్పటికీ మండుతూనే ఉంటుంది. ఓడిపోయాక పార్టీ అశేష అభిమానుల్లో పెల్లుబికి వస్తున్న భావోద్వేగాలను అర్థంచేసుకోగలను. అయినాసరే ఈ ఫలితాలను అంగీకరించక తప్పదు. ఫలితం ఎలా ఉన్నా ఆమోదించడం ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రం. నేను ఈ ఫలితాలను, ఓటమిని అంగీకరిస్తున్నా. అయితే పోరాటాన్ని మాత్రం ఆపబోను’’ అని అన్నారు. ట్రంప్‌ను విష్ చేశాగత ఎన్నికల్లో ఓడినాసరే ఓటమిని అంగీకరించకుండా ట్రంప్ ప్రభుత్వం సాఫీగా అధికార మార్పిడి జరక్కుండా అడ్డుకున్న అంశాన్ని హారిస్ ప్రస్తావించారు. ‘‘ అధ్యక్ష్య ఎన్నికల్లో రెండోసారి గెలిచిన ట్రంప్‌కు స్వయంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పా. కాలపరిమితి ముగిశాక శాంతియుతంగా అధికార మార్పిడికి మా ప్రభుత్వం సాయపడుతుందని హామీ ఇచ్చా. మన దేశంలో ఒక అధ్యక్షుడికో, రాజకీయ పార్టీకో నిబద్దులై ఉండాల్సిన పనిలేదు. కానీ దేశ రాజ్యాంగానికి ఖచ్చితంగా మనం బద్ధులమై ఉండాలి. ఎన్నికలు ముగియడంతో మన పోరాటం ముగిసిపోలేదు. మన పోరాటం కొనసాగుతుంది. అగ్రరాజ్య ఆవిర్భావానికి పునాదులైన సూత్రాలకు కట్టుబడి ఉందాం. కొన్నిసార్లు పోరాటం అనేది సుదీర్ఘకాలం కొనసాగొచ్చు. అంతమాత్రాన మనం గెలవబోమని కాదు. గెలిచేదాకా పోరాటం ఆపకపోవడమే ఇక్కడ ముఖ్యం. స్వేచ్ఛా, అవకాశాలు, పారదర్శకత, ప్రజలకు మెరుగైన జీవితం అందించేదాకా మన పోరాటం కొనసాగుతుంది. ప్రజాస్వామ్యం, శాంతి, సమానత్వం, న్యాయం కోసం నా పోరు ఆగదు. స్వేచ్ఛ కోసం జరిపే సమరం చాలా శ్రమతో కూడుకొని ఉంటుంది. ఇలాంటి కష్టాన్ని మనం ఇష్టపడతాం. మన దేశం కోసం ఆమాత్రం కష్టపడటం సబబే. ఫలితాల తర్వాత మనం ఓటమి చీకట్లోకి జారుకుంటున్నామని చాలా మంది భావించి ఉండొచ్చు. కానీ ఈ కష్టకాలం పెద్ద విషయమే కాదు’’ అని అన్నారు.సభలో గంభీర వాతావరణంపార్టీ ఓటమితో డెమొక్రాట్లలో ఒకింత నైరాశ్యం నిండింది. సభకు వేలాది మంది వచ్చినా సరే కొన్ని నిమిషాలు నిశ్శబ్దం రాజ్యమేలింది. మధ్యమధ్యలో హారిస్ తన ఉత్సాహభరితమైన ప్రసంగంతో వాళ్లలో హుషారు నింపే ప్రయత్నంచేశారు. పార్టీ సీనియర్ నేతలు కొందరు ప్రసంగించారు. దిగువసభ మాజీ మహిళా స్పీకర్ నాన్సీ పెలోసీ, డీసీ మేయర్ మురేల్ బౌసర్ తదితరులు మాట్లాడారు. పార్టీ గెలుపుపై గంపెడాశలు పెట్టుకున్న కొందరు యువ ఓటర్లు, మద్దతుదారులు సభలోనే కన్నీటిపర్యంతమయ్యారు. -
స్థిరత్వం లేని ట్రంప్‌ను ఓడించండి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రచారం వేడెక్కుతోంది. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ తన ప్రత్యర్థి, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై మరోసారి విరుచుకుపడ్డారు. ట్రంప్ ఏమాత్రం స్థిరత్వం లేని మనిషి, ప్రతీకారమే అతడి విధానమని మండిపడ్డారు. విభజనవాది, గందరగోళానికి మారుపేరైన ట్రంప్‌ను చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తాజాగా డెమొక్రటిక్ ఎన్నికల ప్రచార సభలో కమలా హారిస్ మాట్లాడారు. అమెరికా పౌరులపైకి అమెరికా సైన్యాన్ని ప్రయోగించాలనుకుంటున్న ట్రంప్‌కు బుద్ధి చెప్పాలని సూచించారు. వ్యతిరేకులను బల ప్రయోగంతో అణచివేయాలన్నదే ఆయన ఆలోచన అని ఆరోపించారు. ప్రజలను శత్రువులుగా భావిస్తున్న ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎంతమాత్రం పనికిరారని తేల్చిచెప్పారు. ప్రజలు కోరుకుంటున్న కొత్త తరం నాయకత్వాన్ని పరిచయం చేస్తానని, అధ్యక్ష ఎన్నికల్లో తనను గెలిపించాలని ఓటర్లకు కమలా హారిస్ విజ్ఞప్తి చేశారు. ప్రజలకు మేలు చేయడమే తన లక్ష్యమని, అందుకోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని స్పష్టంచేశారు. దుష్ట స్వభావం కలిగిన వ్యక్తులపై, స్వప్రయోజనాల కోసం పాకులాడే శక్తులపై కఠినమైన పోరాటానికి భయపడబోనని చెప్పారు. తన తల్లి తనకు ధైర్యసాహసాలు నూరిపోశారని వ్యాఖ్యానించారు. కష్టపడి పనిచేసే నిజాయతీపరులైన ప్రజలను స్వార్థ శక్తుల నుంచి కాపాడుతానని హామీ ఇచ్చారు. అధికారికంలోకి వచ్చాక రాజకీయాలకు అతీతంగా అందరి బాగు కోసం కృషి చేస్తానని ప్రకటించారు. అన్ని పార్టీలతో కలిసి పని చేస్తానన్నారు. అమెరికా అధ్యక్షురాలిగా తాను భిన్నమైన సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని కమలా హారిస్ ఉద్ఘాటించారు. ఆకాశాన్నంటున్న ధరలే తన ముందున్న అతిపెద్ద సవాలు అని చెప్పారు. ధరలు తగ్గించడానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తానని వెల్లడించారు. నాకు ఓటేయని వారికీ ప్రతినిధినే: హారిస్బైడెన్ వివాదం నేపథ్యంలో వ్యాఖ్యలువాషింగ్టన్: ‘‘నేను అమెరికన్లందరికీ ప్రాతినిధ్యం వహిస్తా. అధ్యక్ష ఎన్నికల్లో నాకు ఓటేయని వారు కూడా అందులో భాగమే’’ అని హారిస్ స్పష్టం చేశారు. ట్రంప్ మద్దతుదారులను ‘చెత్త’గా అభివర్ణిస్తూ అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీయడం తెలిసిందే. వాటిపై హారిస్ ఇలా స్పందించారు. ఎవరికి ఓటేస్తారన్న దాని ఆధారంగా వ్యక్తులపై విమర్శలు చేయడాన్ని తాను అంగీకరించబోనని స్పష్టం చేశారు. -
USA Presidential Elections 2024: హారిస్‌కు మొగ్గు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల సర్వేల్లో డెమొక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్ మరోసారి స్వల్ప ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో పోలిస్తే ఆమెకు ఒక శాతం మొగ్గున్నట్టు మంగళవారం వెలువడ్డ రాయిటర్స్/ఇప్సోస్ తాజా సర్వేలో తేలింది. శుక్రవారం నుంచి ఆదివారం దాకా జరిపిన ఈ మూడు రోజులు హారిస్‌కు 44 శాతం, ట్రంప్‌కు 43 శాతం మంది మద్దతిచ్చారు. 975 మంది నమోదైన ఓటర్లతో కలిపి మొత్తం 1,150 మంది అమెరికా పౌరులు ఈ సర్వేలో పాల్గొన్నారు. అయితే ఎకానమీ, నిరుద్యోగం, ఉపాధి వంటి అతి కీలకమైన అంశాల్లో ఏకంగా 47 శాతం మంది ట్రంప్‌కే ఓటేశారు. హారిస్‌కు మద్దతిచ్చిన వారు కేవలం 37 శాతం మాత్రమే. మరో కీలకాంశమైన వలసల విషయంలో కూడా ట్రంప్ 48 శాతం మంది వైఖరిని సమర్థిస్తే హారిస్‌ను 33 శాతం మందే సమర్థించారు. కచ్చితంగా ఓటేస్తామన్న వారిలో 47 శాతం హారిస్‌ను, 46 శాతం ట్రంప్‌ను బలపరిచారు. హారిస్ అధ్యక్ష రేసులోకి వచ్చినప్పటి నుంచి సర్వేలన్నీ ఆమెకే మొగ్గున్నట్టు తేల్చడం విశేషం. -
USA Presidential Elections 2024: ఊరిస్తున్న ఊయల సేవ
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు కురుక్షేత్రాన్ని తలపిస్తూ అత్యంత హోరాహోరీగా సాగుతోంది. రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాట్ ప్రత్యర్థి కమలా హారిస్ నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్నారు. ఎన్నికలు మొత్తం 50 రాష్ట్రాల్లోనూ జరుగుతున్నా వాటిలో ఏడు రాష్ట్రాలు విజేతను తేల్చడంలో అతి కీలకంగా మారాయి. స్వింగ్ స్టేట్స్‌గా పిలిచే ఆ ఏడింటిపైనే అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. వాటిలో మెజారిటీ రాష్ట్రాలను నెగ్గిన వారే అధ్యక్షుడు కావడం ఖాయంగా కన్పిస్తోంది. అయితే అన్ని పోల్స్‌లోనూ ఆ ఏడు రాష్ట్రాల్లో కూడా ట్రంప్, హారిస్ దాదాపుగా సమవుజ్జీలుగా నిలుస్తుండటం విశేషం. దాంతో ఈ ఎన్నికలు అత్యంత ఆసక్తికరంగా మారిపోయాయి. స్వింగ్ స్టేట్స్ అంటే...?అమెరికాలోని 50 రాష్ట్రాల్లో చాలావరకు డెమొక్రాట్, రిపబ్లికన్ పార్టీల్లో ఏదో ఒకదానివైపు స్పష్టంగా మొగ్గేవే ఉంటాయి. వాటిని సేఫ్ స్టేట్స్‌గా పిలుస్తారు. పారీ్టల జెండా రంగుపరంగా వీటిని బ్లూ (డెమొక్రాట్), రెడ్ (రిపబ్లికన్) స్టేట్స్‌గా పేర్కొంటారు. కొన్ని రాష్ట్రాలు మాత్రం ఒక ఎన్నికలో డెమొక్రాట్లకు జై కొడితే మరో ఎన్నికలో రిపబ్లికన్ అభ్యరి్థని గెలిపిస్తుంటాయి. వీటినే స్వింగ్ స్టేట్స్, బ్యాటిల్‌గ్రౌండ్ స్టేట్స్, పర్పుల్ స్టేట్స్ (డెమొక్రాట్, రిపబ్లికన్ పారీ్టల్లో ఎటైనా మొగ్గవచ్చనే అనే అర్థంలో) అని పిలుస్తుంటారు. అభ్యర్థులు సేఫ్ స్టేట్స్పై పెద్దగా దృష్టి పెట్టరు. ఈ స్వింగ్ స్టేట్స్ను తమవైపు తిప్పుకోవడం, లేదా అవి ప్రత్యరి్థకి జై కొట్టకుండా చూడటంపైనే శక్తియుక్తులన్నింటినీ కేంద్రీకరిస్తారు. దాంతో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ హోరాహోరీ ప్రచారం సాగుతుంటుంది. మీడియాలోనూ, బయటా భారీగా ఎన్నికల ప్రకటనలు ఇతరత్రా హడావుడి కూడా స్వింగ్ స్టేట్స్లోనే ఎక్కువ. ఆ 7 రాష్ట్రాలివే... ఈ ఎన్నికల్లో 7 రాష్ట్రాలు స్వింగ్ స్టేట్లుగా అందరి దృష్టినీ తమవైపు తిప్పుకుంటున్నాయి. అవి... పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, జార్జియా, అరిజోనా, మిషిగన్, నెవడా, విస్కాన్సిన్పెన్సిల్వేనియా ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు 19 రాష్ట్ర జనాభా 1.3 కోట్లు 2020లో విజేత బైడెన్ (82 వేల ఓట్ల మెజారిటీ) ఏడు స్వింగ్ స్టేట్లలో అత్యధిక ఎలక్టోరల్ కాలేజీ ఓట్లున్న రాష్ట్రం. దాంతో సహజంగానే ఇక్కడ గెలుపు అభ్యర్థులకు అత్యంత కీలకం. ట్రంప్‌పై గత జూలైలో హత్యాయత్నం జరిగింది పెన్సిల్వేనియాలోనే. ఇది బైడెన్ సొంత రాష్ట్రం కూడా. ఆర్థిక పరిస్థితులు ఈసారి ఇక్కడ కీలక ఎన్నికల అంశంగా మారాయి. ధరాభారంతో పెన్సిల్వేనియావాసులు నానా కష్టాలు పడుతున్నారు. అమెరికా అంతటినీ అతలాకుతలం చేస్తున్న జీవన వ్యయం మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ మరీ ఎక్కువగా పెరిగిందని మార్కెట్ సర్వే సంస్థ డేటాసెంబ్లీ సర్వేలో తేలింది. కనీవిని ఎరగని రీతిలో రాష్ట్రంలో ప్రతి పదిమందిలో ఏకంగా ఎనిమిది మంది ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నట్టు ఆ సర్వే తేలి్చంది! ఇది హారిస్‌కు బాగా ప్రతికూలంగా మారవచ్చంటున్నారు. తాజా పరిస్థితి తాజా పోల్ ఆఫ్ పోల్స్‌లో హారిస్ 0.9 శాతం ఆధిక్యంలో ఉన్నారునార్త్ కరోలినా ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు 16 రాష్ట్ర జనాభా 10.8 కోట్లు 2020లో విజేత ట్రంప్ (74 వేల ఓట్ల మెజారిటీ) గత ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన ఏకైక స్వింగ్ స్టేట్ ఇదే. ఈసారి కూడా బైడెన్ ప్రత్యరి్థగా ఉన్నన్ని రోజులూ ట్రంప్ హవాయే నడిచింది. ఆయన తప్పుకుని హారిస్ తెరపైకి రావడంతో పరిస్థితి మారుతూ వచి్చంది. దాంతో ఈ రాష్ట్రాన్ని నిలబెట్టుకోవడం ట్రంప్‌కు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ విషయాన్ని ఆయన కూడా అంగీకరించారు. అందుకే ఇక్కడ వీలైనన్ని ఎక్కువ ఎన్నికల ర్యాలీలు నిర్వహించారు. తాజా పరిస్థితి ట్రంప్ 0.9 శాతం ఆధిక్యంలో ఉన్నారుమిషిగన్ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు 15 రాష్ట్ర జనాభా కోటి 2020లో విజేత బైడెన్ (1.5 లక్షల ఓట్ల మెజారిటీ) గత ఎన్నికల్లో బైడెన్‌కు మంచి మెజారిటీ కట్టబెట్టిన రాష్ట్రమిది. కానీ రాష్ట్రంలో ప్రబల శక్తిగా ఉన్న అరబ్ అమెరికన్లు హారిస్ పట్ల చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఆమె ఇజ్రాయెల్‌కు మద్దతిస్తుండటం బాగా ప్రతికూలంగా మారేలా కని్పస్తోంది. దీన్ని గమనించి కొద్ది రోజులుగా ఇజ్రాయెల్ విషయంలో హారిస్ కాస్త విమర్శనాత్మక వైఖరి అవలంబిస్తూ వస్తున్నారు. అది ఇక్కడ అరబ్ ఓటర్ల ఆగ్రహాన్ని ఏ మేరకు చల్లార్చిందన్నది ఫలితాలొస్తే గానీ తేలదు. తాజా పరిస్థితి కమలా హారిస్ 0.8 శాతం ఆధిక్యంలో ఉన్నారుజార్జియా ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు 16 రాష్ట్ర జనాభా 1.1 కోట్లు 2020లో విజేత బైడెన్ (13 వేల ఓట్ల మెజారిటీ)గత ఎన్నికల్లో అత్యంత వివాదాస్పదంగా నిలిచిన ఫలితం జార్జియాదే. ఇక్కడి ఓటమిని ఒప్పుకునేది లేదంటూ ట్రంప్ భీషి్మంచారు. ఏకంగా ఫలితాలనే మార్చేసేందుకు ప్రయతి్నంచి భంగపాటుకు గురయ్యారు. దీనికి సంబంధించి నాలుగు కేసులను కూడా ఎదుర్కొంటున్నారు. ఒకదాంట్లో ట్రంప్ ఇప్పటికే దోషిగా తేలగా మూడింట్లో విచారణ కొనసాగుతోంది. జార్జియా జనాభాలో ఏకంగా మూడో వంతు ఆఫ్రికా మూలాలున్నవారే. 2020లో బైడెన్‌ను గెలిపించినా, ఆయన నాలుగేళ్ల పాలనపై వారంతా పెదవి విరుస్తున్నారు. ఇది హారిస్‌కు ప్రతికూలంగా మారేలా కని్పస్తోంది. కానీ ఇక్కడ నిర్వహించిన ముమ్మర ప్రచారం పరిస్థితిని ఆమెకు కాస్త అనుకూలంగా మార్చిందంటున్నారు. తాజా పరిస్థితి ట్రంప్ ఏకంగా దాదాపు 2 శాతం ఆధిక్యం కనబరుస్తున్నారుఅరిజోనా ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు 11 రాష్ట్ర జనాభా 74 లక్షలు 2020లో విజేత బైడెన్ (10 వేల ఓట్ల మెజారిటీ) 2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ల విజయంలో ఈ రాష్ట్రానిదే కీలక పాత్ర. ఇక్కడ డెమొక్రాట్ అభ్యర్థి గెలవడం 1990ల తర్వాత అదే తొలిసారి కావడం విశేషం. మెక్సికోతో అరిజోనా వందలాది కిలోమీటర్ల మేరకు సరిహద్దులను పంచుకుంటుంది. దాంతో సహజంగానే వలసలు ఇక్కడ కీలక ఎన్నికల అంశంగా మారాయి. తాను గెలిస్తే ఏకంగా 10 లక్షల మంది అక్రమ వలసదారులను వెనక్కు పంపుతానన్న ట్రంప్ ప్రకటన అరిజోనావాసులను బాగా ఆకట్టుకుంటోంది. వలసలపై హారిస్ విధానాల పట్ల వారు పెదవి విరుస్తున్నారు. అయితే అబార్షన్లపై ట్రంప్ స్పష్టమైన వైఖరంటూ ప్రకటించకపోవడంపై ఆయనకు కాస్త మైనస్‌గా మారే ఆస్కారముంది. మహిళా ఓటర్లలో హారిస్ పట్ల స్పష్టమైన మొగ్గు కనిపిస్తుండటం కూడా డెమొక్రాట్లకు సానుకూలాంశమే. తాజా పరిస్థితి ట్రంప్ ఏకంగా దాదాపు 3 శాతం ఆధిక్యం కనబరుస్తున్నారువిస్కాన్సిన్ ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు 10 రాష్ట్ర జనాభా 59 లక్షలు 2020లో విజేత బైడెన్ (21 వేల ఓట్ల మెజారిటీ) స్వతంత్ర అభ్యరి్థగా తొలుత బరిలో ఉన్న మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్.కెనెడీ మేనల్లుడు రాబర్ట్ ఎఫ్.కెనెడీకి విస్కాన్సిన్లో భారీ జనాదరణ దక్కింది. ఆగస్టు చివర్లో ఆయన బరి నుంచి తప్పుకుని ట్రంప్‌కు మద్దతు పలకడం రిపబ్లికన్లకు బాగా కలిసొచ్చేలా ఉంది. దీనికి తోడు గ్రీన్ పార్టీ అభ్యర్థి జిల్ స్టెయిన్ ఇక్కడ డెమొక్రాట్ల అవకాశాలకు మరింత గండి కొట్టేలా కని్పస్తున్నారు. ఆయన్ను ఎలాగైనా బరిలోంచి తప్పించాలని డెమొక్రాట్లు చివరిదాకా ప్రయతి్నంచినా కుదర్లేదు. తాజా పరిస్థితి హారిస్ ఒక్క శాతం కంటే తక్కువ ఆధిక్యంలో ఉన్నారునెవడా ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు 6 రాష్ట్ర జనాభా 32 లక్షలు 2020లో విజేత బైడెన్ (34 వేల ఓట్ల మెజారిటీ) కొద్ది ఎన్నికలుగా వరుసగా డెమొక్రాట్లకే జై కొడుతూ వస్తున్న రాష్ట్రమిది. కానీ ఈసారి మాత్రం ట్రంప్ ఖాతాలో పడే సూచనలు గట్టిగానే కని్పస్తున్నాయి. పోల్ ట్రాకింగ్ సంస్థ 538 తాజా గణాంకాల ప్రకారం ట్రంప్‌కు ఈ రాష్ట్రంలో ఆదరణ బాగా పెరిగింది. హారిస్ రంగప్రవేశంతో పరిస్థితి కాస్త మారినా ఇప్పటికీ ఇక్కడ ట్రంప్‌దే పై చేయిగా కన్పిస్తోంది. అమెరికాలోకెల్లా నిరుద్యోగం అతి ఎక్కువగా (5.1 శాతం)ఉన్న రాష్ట్రం నెవడానే. ఇక్కడ లాటిన్ అమెరికన్లు చాలా ఎక్కువ. వారంతా చాలీచాలని వేతనాలతో సతమతమవుతున్నారు. వారిలో హోటళ్లలో వెయిటర్లు తదితర పనులు చేసేవాళ్లే ఎక్కువ. టిప్పులపై పన్ను ఎత్తేస్తామన్న ట్రంప్ హామీ వారిని బాగా ఆకట్టుకుంది. దాన్ని గమనించిన హారిస్ తాను కూడా ఈ మేరకు గత ఆగస్టులోనే హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రం వారిలో ఎవరికి దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది. తాజా పరిస్థితి హారిస్ ఒక్క శాతం కంటే తక్కువ ఆధిక్యంలో ఉన్నారు – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఫాక్స్‌న్యూస్ ఇంటర్వ్యూలో హారిస్.. సారీలు.. హామీలు
వాషింగ్టన్: మూడు వారాల్లోపు ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ ప్రచార జోరు పెంచారు. ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు బహిరంగంగా మద్దతు పలుకుతూ ఆయనను తరచూ ఇంటర్వ్యూచేసే ‘ఫాక్స్ న్యూస్’వార్తాసంస్థకు బుధవారం హారిస్ ఇంటర్వ్యూ ఇచ్చారు. లక్షలాది మంది రిపబ్లికన్ మహిళా ఓటర్ల మనసునూ గెల్చుకునే ప్రయత్నంచేశారు. యాంకర్ బ్రెట్ బేయర్ అడుగడుగునా అడ్డుతగిలి ప్రశ్నలబాణాలు సంధిస్తుంటే హారిస్ వాటికి దీటుగా ఎదుర్కొని ఇంటర్వ్యూను రక్తికట్టించారు. హోరాహోరీగా సాగిన ఈ ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు కొన్ని.. వలస బిల్లుపై తొలి సంతకం అమెరికాలోకి అక్రమంగా వలసవచి్చన వ్యక్తి చేతిలో హత్యకు గురైన 12 ఏళ్ల జాస్లిన్ నంగరే తల్లి పడే ఆవేదన వీడియోను యాంకర్ తొలుత హారిస్‌కు చూపించారు. అక్రమ వలసదారుల చేతుల్లో చనిపోతున్న అమెరికన్ల కుటుంబాలను క్షమాపణ కోరాలని మీకెప్పుడూ అనిపించలేదా? అని యాంకర్ ప్రశ్నించగా.. ‘చిన్నారిని కోల్పోయాం. ఈ విషయంలో నన్ను క్షమించండి’అని హారిస్ సారీ బేషరతుగా సారీ చెప్పారు. అక్రమ వలసలకు మద్దతు పలుకుతూ, వారిపై క్రిమినల్ కేసులను ఎత్తేయాలంటూ హారిస్ గతంలో చేసిన వ్యాఖ్యలను యాంకర్ వినిపించారు. ఈ అంశంలో మాట మార్చారని దెబ్బిపొడిచారు. దీంతో హారిస్ ‘సరిహద్దు దాటి అక్రమ చొరబాట్లపై నేరాలను మోపాల్సిందే. నాటి అభిప్రాయాలు ఉపాధ్యక్షురాలిగా చేసినవి కాదు. ఇకమీదట అధ్యక్షురాలినైతే అలా చేయను. అస్తవ్యస్తంగా ఉన్న వలస విధానాన్ని సంస్కరిస్తా. నేను దేశాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టగానే అక్రమ వలసల కట్టడిపైనే చట్టం తెస్తా. ఆ బిల్లుపైనే తొలి సంతకం చేస్తా’అని హారిస్ అన్నారు. ఖైదీల లింగమార్పిడి సర్జరీలపై.. ఖైదీల లింగ మార్పిడి శస్త్రచికిత్సల కోసం ప్రజాధనాన్ని ఖర్చుచేస్తారా ? అని యాంకర్ ప్రశ్నించగా చట్టప్రకారమే వెళ్తామని హారిస్ సమాధానమిచ్చారు. ట్రంప్ హయాంలో కూడా ఇలాంటి సర్జరీలు జరిగాయని హారిస్ అన్నారు. అయితే ట్రంప్ హయాంలో కొందరు ఖైదీలకు హార్మోన్ థెరపీ చేశారుగానీ ఇలాంటి ఆపరేషన్లు జరగకపోవడం గమనార్హం. బైడెన్ హయాంలోనే ఇలాంటి ఆపరేషన్లు జరగడం విశేషం. వారసత్వ పాలన కాబోదు బైడెన్‌తో పోలిస్తే ఉపాధ్యక్షురాలిగా మీరేమైనా చేశారా? అని గతంలో ‘ది వ్యూ’టాక్‌షోలో అడిగిన ప్రశ్నకు ‘నాకేం గుర్తురావట్లేవు’అని హారిస్ చెప్పిన సమాధానాన్ని యాంకర్ ప్లే చేసి హారిస్‌ను ఇరకాటంతో పెట్టారు. అధికారంలో ఉన్న సొంత పార్టీ నేత బైడెన్ అనుసరిస్తున్న విధానాలను అధ్యక్షురాలిగా కొనసాగిస్తారా? అని ప్రశ్నించగా ‘నా పరిపాలన అనేది బైడెన్ పాలనకు కొనసాగింపుగా ఉండబోదు. నా జీవితపాఠాల సారాన్ని, ప్రాసిక్యూటర్‌గా, జిల్లా అటారీ్నగా, కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా వృత్తి అనుభవాన్ని, ఉపాధ్యక్షురాలిగా పరిపాలనా దక్షతను జోడించి ప్రజారంజకంగా పరిపాలిస్తా ’అని హారిస్ హామీ ఇచ్చారు. గత ఎన్నికల్లో ఓడిన ట్రంప్‌కు ఇంకా మద్దతు ఇస్తున్న వాళ్లను తెలివితక్కువ వాళ్లుగా, విషయపరిజ్ఞానం లేని వాళ్లుగా పరిగణిస్తారా? అని ప్రశ్నించగా ‘అమెరికా ప్రజలను అంతమాట నేను ఎప్పుడూ అనలేదు’అని హారిస్ స్పష్టంచేశారు. బైడెన్ మానసిక స్థితిపై.. ‘‘మా పార్టీ నేత జో బైడెన్ నిర్ణయాలు ఏనాడూ తప్పుకాలేదు. అమెరికా ప్రజల కోసం అధ్యక్షుడిగా ఆయన ఎన్నో కీలకమైన విధాన నిర్ణయాలు తీసుకున్నారు. ఆయనతో పోలిస్తే ట్రంప్ అసమర్థుడు. అధ్యక్ష పీఠంపై కూర్చునే అర్హత ఆయనకు లేదు. ట్రంప్ అమెరికా ప్రజాస్వామ్యానికి ప్రమాదకారి. అయినా బైడెన్ గురించి ఇక్కడ ప్రస్తావన అనవసరం. ఎందుకంటే ఇప్పుడు బైడెన్ రేసులో లేరు. ట్రంప్ గురించే మాట్లాడదాం’’అని హారిస్ అన్నారు. మహిళల అబార్షన్ వంటి కీలక అంశం ఇంటర్వ్యూలో అస్సలు చర్చకురాలేదు. ప్రధానంగా సరిహద్దు భద్రత, వలసలపైనే ఎక్కువ సేపు ఇంటర్వ్యూ సాగింది. -
ట్రంప్, హారిస్ హోరాహోరీ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ మధ్య పోరు హోరాహోరీగా కొనసాగుతోందని ఆదివారం విడుదలైన న్యూయార్క్ టైమ్స్, సియానా సర్వేలో వెల్లడైంది. ఆస్తులను ఎక్కువ చేసి చూపి రుణాలు పొందడం, పార్లమెంట్‌పైకి తన మద్దతుదారులను ఉసిగొల్పిన ఘటనల్లో నిందితుడిగా ఉన్నాసరే సగం ఓటర్లు ట్రంప్‌కు మద్దతు పలుకుతున్నట్లు సర్వే పేర్కొంది. దేశవ్యాప్తంగా చూస్తే దాదాపు 48 శాతం మంది ట్రంప్‌కు మద్దతు పలికారు. కమలా హారిస్ విస్కాన్సిన్, మిషిగన్, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో ఆధిక్యత చూపారు. నెవడా, జార్జియా, నార్త్ కరోలినా, అరిజోనాలో ఇద్దరికీ గట్టి పోటీ ఉంది. మిషిగన్, విస్కాన్సిన్లో హారిస్ ఒక శాతం ఆధిక్యం కనబరిచారని, పెన్సిల్వేనియాలో గట్టి పోటీ నెలకొందని సీబీఎస్ న్యూస్, యూగౌ సర్వేలో తేలింది. బిగ్ డిబేట్‌కు వేళాయే!వాషింగ్టన్: డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య అధ్యక్ష చర్చ మంగళవారం జరగనుంది. పలు అంశాలపై తమ వైఖరిని తెలుపుతూ అమెరికన్లను మెప్పించడానికి అధ్యక్ష అభ్యర్థులు సిద్ధమయ్యారు. ఏబీసీ న్యూస్ ఛానెల్లో ఈ బిగ్ డిబేట్ మంగళవారం రాత్రి 9 గంటలకు (భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 6:30 గంటలకు) జరగనుంది. ఫిలడెలి్ఫయాలోని నేషనల్ కాస్టిట్యూషన్ సెంటర్లో ఏబీసీ న్యూస్ యాంకర్లు డేవిడ్ ముయిర్, లిన్సే డేవిస్ దీన్ని నిర్వహిస్తారు. 90 నిమిషాల పాటు ఈ చర్చ ఉంటుంది. అధ్యక్ష చర్చ నిర్వహించే యాంకర్లు మాత్రమే ప్రశ్నలు అడుగుతారు. -
Michelle Obama: అత్యంత అర్హురాలు హారిసే
షికాగో: ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాకు నేతృత్వం వహించేందుకు అత్యంత అర్హురాలు, సమర్థురాలు కమలా హారిసేనని దేశ మాజీ ప్రథమ మహిళ మిషెల్ ఒబామా అభిప్రాయపడ్డారు. ‘‘చాలామంది సగటు అమెరికన్ల మాదిరిగానే కమలా హారిస్‌ది కూడా మధ్యతరగతి నేపథ్యం. అక్కడినుంచి ప్రతి దశలోనూ నిరంతరం కష్టించి ఎదిగారు. తనను తాను మలచుకుంటూ ఉపాధ్యక్షురాలి స్థాయికి చేరుకున్నారు. అందుకే ఆమె కథ మీ కథ. నా కథ. మెరుగైన జీవితం కోసం కలలుగంటున్న అమెరికన్లందరి కథ!’’ అంటూ కొనియాడారు. షికాగోలో జరుగుతున్న డెమొక్రాట్ల జాతీయ కన్వెన్షన్‌లో మంగళవారం ఆమె ఆద్యంతం స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. హారిస్ రాకతో అమెరికాకు మెరుగైన భవితపై కొత్త ఆశలు చిగురిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ‘‘అమెరికన్లందరికీ ఎదుగుదలకు అవకాశాలు దక్కేలా కమల నిరంతరం కృషి చేశారు. దేశం పట్ల తన నిబద్ధతను అలా చాటుకున్నారు. అంతే తప్ప ట్రంప్ మాదిరిగా జాతులపై విద్వేషం చిమ్మడం ద్వారానో, వ్యక్తులపై బురదజల్లడం ద్వారానో కాదు’’ అని రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యరి్థపై మిషెల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘ట్రంప్ ప్రపంచం పట్ల విశాల దృష్టి లేని కురచ వ్యక్తి. బాగా చదువుకున్న, నిరంతరం కష్టించే స్వభావమున్న నల్లజాతీయులను చూస్తే ఆయనకు భయం’’ అంటూ దుయ్యబట్టారు. ‘‘నన్ను, నా భర్త (మాజీ అధ్యక్షుడు) ఒరాక్ ఒబామాను ట్రంప్ ఎప్పుడూ ఆయన రాజకీయ మనుగడకే పెను ముప్పుగానే చూశారు. మేం అత్యంత విజయవంతమైన నల్లజాతి వ్యక్తులం కావడమే అందుకు కారణం’’ అని చెప్పుకొచ్చారు. కనుక హారిస్‌పై కూడా ట్రంప్ జాతి విమర్శలు, తప్పుడు ప్రచారాలు చేయడం ఖాయమన్నారు. వాటన్నింటినీ అమెరికన్లు తిప్పికొడతారని, హారిస్‌ను ప్రెసిడెంట్‌గా ఎన్నుకుని చరిత్ర సృష్టిస్తారని జోస్యం చెప్పారు. అయితే, ‘‘ఈసారి అధ్యక్ష ఎన్నిక అత్యంత హోరాహోరీగా సాగడం ఖాయం. చాలా రాష్ట్రాల్లో అతి తక్కువ ఓట్ల తేడాతో ఫలితాలు తారుమారు కావచ్చు. అందుకే భారీ సంఖ్యలో తరలిరండి. పార్టీ అభిమానాలను, రాగద్వేషాలను పక్కన పెట్టి కేవలం మీ మనస్సాక్షి ప్రకారం నడచుకోండి. అమెరికన్లు ప్రాణప్రదంగా భావించే స్వేచ్ఛను, మానవత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, హుందాతనాన్ని నిలబెట్టే హారిస్‌కే ఓటేయండి’’ అని అమెరికన్లకు పిలుపునిచ్చారు. ట్రంప్ రూపంలో మరో నాలుగేళ్ల అస్తవ్యస్త పాలనను నెత్తిన రుద్దుకునేందుకు అమెరికన్లు సిద్ధంగా లేరని, హారిస్‌ను ప్రెసిడెంట్‌గా ఎన్నుకుని కొత్త చరిత్ర సృష్టించనున్నారని బరాక్ ఒబామా అన్నారు. నల్లవాళ్లంటే ట్రంప్‌కు చులకన నల్లవాళ్లంటే ట్రంప్‌కు బాగా చిన్నచూపంటూ మిషెల్ మండిపడ్డారు. అసహ్యకరమైన స్త్రీ విద్వేష, జాత్యహంకార వ్యాఖ్యలు చేయడం ఆయన నైజమన్నారు. ‘‘అందుకే ఆయన అమెరికా అధ్యక్షునిగా ఉన్న నాలుగేళ్ల కాలంలో నల్లజాతీయులంటే అందరికీ భయం కలిగించేందుకు ఎంతగానో ప్రయతి్నంచారు. నల్లజాతీయులు చేసే ఉద్యోగాలను బ్లాక్ జాబ్స్ అంటూ చులకనగా మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు ట్రంప్ అర్రులుచాస్తున్న అమెరికా అధ్యక్ష పదవి కూడా బ్లాక్ జాబేనని ఆయనకు ఎవరు చెప్పాలి!’’ అంటూ ఎద్దేవా చేశారు. అమెరికా చరిత్రలో తొలి నల్లజాతి అధ్యక్షునిగా బరాక్ ఒబామా చరిత్ర సృష్టించడం తెలిసిందే.మా తల్లులు నేరి్పందదే ‘‘హారిస్ తల్లి, నా తల్లి సప్త సముద్రాలకు చెరోవైపున పుట్టి ఉండొచ్చు. కానీ వాళ్లు నిత్యం విశ్వసించిందీ, మాకు నిరంతరం నేరి్పంది ఒక్కటే. వ్యవస్థను విమర్శించే బదులు దాన్ని సరిచేసేందుకు మన వంతుగా శక్తివంచన లేకుండా కృషి చేయాలని’’ అని మిషెల్ అన్నారు. మిషెల్ ప్రసంగానికి డెమొక్రాట్ ప్రతినిధులంతా మంత్రముగ్ధులయ్యారు. ఆమె మాట్లాడటం ముగించిన చాలాసేపటిదాకా చప్పట్లతో అభినందించారు.హారిస్, నేను అలా కలిశాం: డగ్లస్ అమెరికన్లందరూ గరి్వంచేంత గొప్ప ప్రెసిడెంట్‌గా హారిస్ చరిత్రలో నిలిచిపోతారని ఆమె భర్త డగ్లస్ ఎమోఫ్ అభిప్రాయపడ్డారు. తనను తాను అమెరికా చరిత్రలో తొలి ‘సెకండ్ జంటిల్మన్ (ఉపాధ్యక్షురాలి భర్త)’గా సభకు పరిచయం చేసుకుని ఆకట్టుకున్నారు! 2013లో ఒక క్లయింట్ మీటింగ్ సందర్భంగా కమలతో తాను బ్లైండ్ డేట్‌కు వెళ్లడం, అది ప్రేమగా మారి, పెళ్లిగా పరిణమించిన వైనాన్ని ఆసక్తికరంగా వివరించారు. తొలి భార్యతో తనకు కలిగిన సంతానం కూడా కమలను ప్రేమగా మొమలా అని పిలుస్తారని డగ్లస్ వివరించారు. -
USA Presidential Elections 2024: భిన్న ధ్రువాలు.. విభిన్న వైఖరులు
అగ్రరాజ్యం. అమెరికా ప్రపంచ పెద్దన్నగా కొనసాగాలంటే అధ్యక్షపీఠంపై ఆసీనులై పరిపాలించే నేత తీసుకునే నిర్ణయాలు తిరుగులేనివై ఉండాలి. దేశ అంతర్గత భద్రత, ప్రజా సంక్షేమం, అభివృద్ధి, ధరలుసహా యుద్ధాలు, వాతావరణ మార్పు వంటి అంతర్జాతీయ అంశాలపై పట్టుండాలి. అంతర్యుద్ధాలు, సంక్షోభాలు, అంతర్జాతీయ సమస్యలపై మిత్ర దేశాలతోపాటు శత్రుదేశాలనూ ఒప్పించగల నేర్పు తప్పనిసరి. నవంబర్‌లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడుతున్న డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌లు తాము గెలిస్తే ఎలాంటి పాలన అందిస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత నాలుగేళ్లుగా జో బైడెన్ అమలుచేసిన అభివృద్ధి పథకాలను కొనసాగిస్తానని హారిస్ చెబుతుండగా అక్రమ వలసలను నిలువరించి బహిష్కరణ పర్వానికి తెరలేపుతానని, విప్లవాత్మక విధానాలను అమలుచేస్తానని ట్రంప్ భీష్మ ప్రతిజ్ఞచేశారు. ‘‘అధ్యక్షురాలిగా గెలవగానే శ్రామిక కుటుంబాల కోసం పాటుపడతా. కనీస వేతనాన్ని పెంచుతా. సేవలు, ఆతిథ్యరంగంలోని సిబ్బందికి అందే టిప్పులపై వసూలుచేస్తున్న పన్నులను రద్దుచేస్తా’ అని హారిస్ అన్నారు. జూన్‌లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సైతం ఇదే హామీ ఇవ్వడం విశేషం. ఈ నేపథ్యంలో పలు కీలక అంశాలపై ఇప్పటికే ట్రంప్, హారిస్ వెల్లడించిన అభిప్రాయాలు వారి పాలనాపంథాపై స్పష్టత తీసుకొస్తున్నాయి. వాటిని ఒకసారి తరచి చూస్తే..అబార్షన్హారిస్: సురక్షితమైన, చట్టబద్ధమైన అబార్షన్‌కు కమలా హారిస్ మద్దతు పలుకుతున్నారు. రిపబ్లిక్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అబార్షన్లపై నిషేధం విధించడాన్ని ఆమె ఇప్పటికే పలుమార్లు తప్పుబట్టారు. తాము అధికారంలోకి వస్తే చట్టబద్ధ అబార్షన్‌కు అనుమతిస్తూ పార్లమెంట్లో చట్టం తెచ్చేందుకు కృషిచేస్తానని చెప్పారు. ట్రంప్: కొన్ని రాష్ట్రాల్లో అబార్షన్‌పై నిషేధం అమలవుతుండగా కొన్ని రాష్ట్రాల్లో షరతుల మేరకు అనుమతిస్తున్నారు. దీంతో అబార్షన్‌పై ఎప్పుడు ప్రశ్నించినా ట్రంప్ సమాధానం దాటవేశారు. అబార్షన్‌పై జాతీయస్థాయి విధానాన్ని ప్రకటించలేదు. రాష్ట్రాలకే ఆ నిర్ణయం వదిలేస్తే మంచిది అన్నట్లు గతంలో వ్యాఖ్యానించారు.చట్టాల అమలు/ ప్రజాస్వామ్యంహారిస్: హారిస్ గెలిస్తే ట్రంప్‌పై కేసులపై దృష్టిపెట్టే అవకాశముంది. గత అధ్యక్ష ఫలితాలను తప్పుబడుతూ, పార్లమెంట్ భవంతి మీదకు రిపబ్లికన్ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులను ట్రంప్ ఉసిగొల్పడం, నీలితారకు అనైతిక నగదు చెల్లింపులు, ఆస్తిగా ఎక్కువగా చూపు రుణాల పొందటం వంటి కేసుల్లో తీర్పులు త్వరగా వచ్చేలా హారిస్ ఒత్తిడి తేవచ్చు. ప్రజాస్వామ్యయుత పాలనకు కట్టుబడతానని హారిస్ గతంలో అన్నారు. ట్రంప్: బైడెన్ చేతిలో ఓడినపుడు అధ్యక్ష ఫలితాలను ట్రంప్ అంగీకరించలేదు. ఈసారి కూడా ఓడిపోతే ఓటమిని ట్రంప్ ఒప్పుకోకపోవచ్చు. నాటి పార్లమెంట్‌పై దాడి, అక్కడి పోలీసులను గాయపరిచిన నిందితులకు క్షమాభిక్ష పెడతానని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఎఫ్బీఐను ప్రక్షాళిస్తానని చెప్పారు. బైడెన్ పాలనలో అవినీతిపై ప్రత్యేక ప్రాసిక్యూటర్‌తో విచారణ జరిపిస్తానని హామీ ఇచ్చారు.వాతావరణ మార్పులు/ఇంథనంహారిస్: అమెరికాలో కర్భన ఉద్గారాల విడుదల తగ్గిస్తానని ఉపాధ్యక్షురాలి హోదాలో హారిస్ గతంలో చెప్పారు. హరిత ఇంథనానికి జై కొట్టారు. సముద్రగర్భంలో చమురు వెలికితీతను వ్యతిరేకించారు. విద్యుత్ వినియోగం ఆదాతోపాటు పర్యావరణ అనుకూల పథకాలను ప్రోత్సహించారు. ట్రంప్: వాతావరణ మార్పుల అంశాన్ని గాలి కొదిలేశారు. పారిస్ ఒప్పందం నుంచి వైదొలిగారు. ప్రభుత్వ భూముల్లో విచ్చలవిడిగా చమురు తవ్వకాలకు పచ్చజెండా ఊపారు. బైడెన్ ప్రభుత్వం వచ్చాక పారిస్ ఒప్పందంలో అమెరికా చేరింది. అయితే ఈసారి తాను గెలిస్తే పారిస్ ఒప్పందానికి మళ్లీ కటీఫ్ చేప్తానని ట్రంప్ అన్నారు.ఇజ్రాయెల్/ ఉక్రెయిన్యుద్ధాలుహారిస్: గాజా స్ట్రిప్‌లో హమాస్‌పై ఇజ్రాయెల్ దాడులను సమర్థిస్తూనే పాలస్తీనియన్ల ప్రాణాలూ ముఖ్యమేనని హారిస్ చెప్పారు. త్వరగా యుద్ధాన్ని ముగించాలని ఇటీవల ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూను కోరారు. కాల్పుల విరమణ ఒప్పందానికి, సంధికి మొగ్గుచూపారు. ఈజిప్ట్, ఖతార్‌లతో కలసి మధ్యవర్తిత్వానికి ఓటేశారు. ఈమె గెలిస్తే గాజా యుద్ధం త్వరగా ముగిసే వీలుంది. ఉక్రెయిన్ యుద్ధంపై ఆమె ఇంకా ఎలాంటి స్పష్టమైన విధానాలు ప్రకటించలేదు.ట్రంప్: హమాస్ అంతమయ్యేదాకా ఇజ్రాయెల్‌కు మద్దతు పలుకుతానని ట్రంప్ గతంలో అన్నారు. అయితే మరింత మారణహోమం జరక్కుండా త్వరగా యుద్ధం ముగించి గాజాలో శాంతి నెలకొల్పాలని ఆయన కోరుతున్నారు. జనావాసాలపై ఇజ్రాయెల్ దాడులనూ ట్రంప్ సైతం ఖండించారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని త్వరగా ముగించే సత్తా తనకుందని ట్రంప్ గతంలో అన్నారు.ప్రభుత్వపాలనహారిస్: ప్రభుత్వ ఉద్యోగులను హఠాత్తుగా తొలగించే వివాదాస్పద ‘ప్రాజెక్ట్ 2025’ సిద్ధాంతాన్ని హారిస్ పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులను సులభంగా తీసేసేందుకు వీలు కల్పించేలా 2020లో ట్రంప్ ఇచ్చిన షెడ్యూల్–ఎఫ్ ఉత్తర్వును హారిస్ వ్యతిరేస్తున్నారు. సిబ్బంది ఉద్యోగ భద్రతకు పాటుపడతానని ఆమె మాటిచ్చారు. అక్రమ వలసలను తగ్గిస్తానని చెప్పారు. ఆహార ఉత్పత్తుల ధరను తగ్గిస్తానని హామీ ఇచ్చారు. కార్మికుల టిప్‌లపై పన్నును తొలగిస్తానన్నారు. కార్మికుల కనీస వేతనం పెంచుతానని, పౌరులు కొనే అధునాతన ఆయుధాలపై నిషేధం విధిస్తానని చెప్పారు.ట్రంప్: తన హయాంలో అమలు చేయాలని ప్రయత్నించిన ‘ప్రాజెక్ట్ 2025’ సిద్ధాంతం గురించి ట్రంప్ ఎక్కడా మాట్లాడట్లేదు. అయితే అధ్యక్ష కేంద్రంగా కేంద్రీకృత ప్రభుత్వానికి బాటలువేసే ఈ సిద్ధాంతాన్ని తాను గెలిస్తే అమలుచేయాలని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తనపై పలు కేసులకు కారకులైన న్యాయశాఖ సిబ్బందిపై వేటు వేయడానికి ట్రంప్ సిద్దంగా ఉన్నాడని వార్తలొచ్చాయి. విద్యాశాఖను రద్దుచేస్తానని, ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ వంటి సంస్థలను ప్రక్షాళిస్తానని చెప్పారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
USA Presidential Elections 2024: టిప్‌లపై పన్ను ఎత్తేస్తా: హారిస్
లాస్ వెగాస్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే దేశంలోని రెస్టారెంట్ల సిబ్బంది టిప్పులపై పన్నులను రద్దు చేస్తానని డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ హామీ ఇచ్చారు. హోటళ్లు, రెస్టారెంట్లు, వినోద పరిశ్రమల పన్నులపైనే అధికంగా ఆధారపడే నెవెడా రాష్ట్రంలో ర్యాలీలో ఆమె ఈ మేరకు ప్రకటించారు. మాట్లాడారు. శ్రామికుల కనీస వేతనం పెంచుతానన్నారు. రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ కూడా ఇదే హామీ ఇవ్వడం విశేషం. దాన్నే హారిస్ కాపీ కొట్టారంటూ ఆయన ఎద్దేవా చేశారు. తన ఐడియాలను దొంగిలించడం మినహా హారిస్‌కు ఇంకేమీ చేతకాదన్నారు. -
‘కమల’ వికాసం సాధ్యమే: లిచ్‌మాన్
వాషింగ్టన్: గత నాలుగు దశాబ్దాలుగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను దాదాపు ఖచి్చతంగా ఊహించి చెప్పిన అలాన్ లిచ్‌మాన్ మరోమారు తన విశ్లేషణను వెల్లడించారు. తాజా ఎన్నికల ప్రచార సరళి, అమెరికా ఓటర్ల మనోభావాలను లెక్కలోకి తీసుకుంటే డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ నెగ్గే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని ఆయన చెప్పారు. అయితే వచ్చే నెలలో డెమొక్రటిక్ కన్వెన్షన్ తర్వాతే తన తుది అంచనాలను వెల్లడిస్తానని ఆయన స్పష్టంచేశారు. 1984 ఏడాది నుంచి అమెరికాలో 10 సార్లు అధ్యక్ష ఎన్నికలు జరిగితే తొమ్మిది సార్లు ఈయన చెప్పింది నిజమైంది. దీంతో ఆయన్ను అమెరికా అధ్యక్ష ఎన్నికల నోస్ట్రడామస్‌గా అందరూ పిలుస్తారు. అమెరికన్ విశ్వవిద్యాలయంలో గత యాభై సంవత్సరాలుగా అధ్యాపకుడిగా పనిచేస్తున్న లిచ్‌మాన్ 1981 ఏడాదిలో ‘గెలుపునకు 13 సూత్రాలు’ అనే విధానాన్ని ప్రతిపాదించారు. ఈ 13 అంశాల ప్రాతిపదికన ఏ పార్టీ, అభ్యర్థి గెలుస్తారని అంచనా వేస్తానని ఆయన చెప్పారు. 2016లో ట్రంప్, 2020లో బైడెన్ గెలుస్తారన్న జోస్యాలు నిజమవడంతో 2024లో గెలుపుపై ఏం చెప్పబోతున్నారోనని ఆసక్తి నెలకొంది. -
USA Presidential Elections 2024: డెమొక్రటిక్ అభ్యర్థిగా కమల
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్ పోటీ చేయబోతున్నట్లు దాదాపు తేలిపోయింది. డెమొక్రటిక్ పార్టీ నుంచి తన అభ్యర్థిత్వాన్ని నిర్ధారించే అధికారిక పత్రాలపై ఆమె సంతకాలు చేశారు. తమ అభ్యర్థిగా కమలా హారిస్ పేరును డెమొక్రటిక్ పార్టీ తరఫున అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇప్పటివరకు పారీ్టలో కమలా హారిస్ మినహా ఇతరులెవరూ అభ్యర్థిత్వం కోసం పోటీపడలేదు. డెమొక్రటిక్ నేషనల్ కమిటీ నిబంధనల ప్రకారం ఆగస్టు 1న పార్టీ ప్రతినిధులు వర్చువల్ సమావేశంలో తమ నామినీని ఎన్నుకోవాల్సి ఉంటుంది. పార్టీలో ఇతరులు పోటీ పడకపోతే కమలా హారిస్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం లాంఛనమే. అలాగే ఆగస్టు 7లోగా ఆమె తమ ఉపాధ్యక్ష అభ్యర్థిని(రన్నింగ్ మేట్) ఎంపిక చేసుకోవాల్సి ఉంది. షికాగోలో ఆగస్టు 19 నుంచి 22 వరకు డెమొక్రటిక్ జాతీయ సదస్సు జరుగుతుంది. నవంబర్ 5న జరిగే ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై విజయం తనదేనని కమలా హారిస్ మరోసారి ధీమా వ్యక్తం చేశారు. ప్రజల విశ్వాసం పొందడానికి, ప్రతి ఓటునూ సంపాదించడానికి కష్టపడి పని చేస్తానని ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ప్రజలకు మరింత చేరువయ్యేలా ప్రచారం సాగిస్తానని, వారి మద్దతుతో రాబోయే ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధిస్తానని పేర్కొన్నారు. అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకుంటున్నట్లు జో బైడెన్ గత ఆదివారం ప్రకటించిన తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్ తెరపైకి వచి్చంది. ఆమె ప్రచారం కూడా ప్రారంభించారు. ఇప్పటికే 40కిపైగా రాష్ట్రాల డెమొక్రటిక్ ప్రతినిధులు ఆమె అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. ట్రంప్‌కు సమఉజ్జీగా... న్యూయార్క్ టైమ్స్ పోల్ వెల్లడి జో బైడెన్ నిష్క్రమణలో అర్ధాంతరంగా అమెరికా అధ్యక్ష రేసులోకి వచి్చనప్పటికీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అనూహ్యంగా పుంజుకుంటున్నారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో సమానంగా కమల ప్రజామోదాన్ని పొందుతున్నారని న్యూయార్క్ టైమ్స్– సియానా కాలేజ్ తాజా పోల్ పేర్కొంది. సర్వేలో పాల్గొన్న అమెరికా ఓటర్లలో 48 శాతం మంది ట్రంప్ వైపు మొగ్గగా, 47 శాతం మంది కమలా హారిస్‌కు మద్దతు తెలిపారు. ఇదే న్యూయార్క్ టైమ్స్ పత్రిక జూలై మొదటివారంలో నిర్వహించిన సర్వేలో బైడెన్‌పై ట్రంప్ ఏకంగా ఆరు పాయింట్ల ఆధిక్యాన్ని సాధించారు. దీన్ని హారిస్ ఒక పాయింటుకు తగ్గించడం గమనార్హం. రిజిస్టర్డ్ ఓటర్లలో ట్రంప్‌కు 48 శాతం, హారిస్‌కు 46 శాతం మద్దతు లభించింది. సొంత పారీ్టల్లో సమాన మద్దతు రిపబ్లికన్లలో ట్రంప్‌ను 93 శాతం మంది బలపరుస్తుండగా, కమలా హారిస్‌కు సైతం డెమొక్రాట్లలో 93 శాతం మద్దతు లభించడం విశేషం. శ్వేతజాతియేతర, యువ ఓటర్లలో బైడెన్‌కు పెద్దగా ఆదరణ ఉండేది కాదు. ఇప్పుడు హారిస్‌కు ఈ వర్గాల మద్దతు లభిస్తోందని సర్వే తెలిపింది. లాటిన్ అమెరికా మూలాలున్న ఓటర్లు, 30 ఏళ్ల లోపు ఓటర్లలో హారిస్‌కు 60 శాతం మద్దతు లభించింది. -
ఎట్టకేలకు కమలా హారిస్‌కు మద్దతు ప్రకటించిన ఒబామా
అమెరికా ఉపాధ్యక్షురాలు, డెమొక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్‌కు.. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన భార్య మిచెల్ ఒమాబా మద్దతు ప్రకటించారు. నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థిగా కమలా హారిస్‌ను వారు ఆమోదించారు. న స్నేహితురాలు హారీస్ అమెరికాకు గొప్ప అధ్యక్షురాలు అవుతుందని భావిస్తున్నామని, ఆమెకు మా పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఈమేరకు ట్వీట్ చేశారు. ‘అధ్యక్ష ఎన్నికల్లో నా స్నేహితురాలు యూనైటెడ్ స్టేట్స్కు అధ్బుతమైన అధ్యక్షురాలిగా అవుతుంది. రెండు రోజుల క్రితం కమలా హ్యారిస్‌కు మేము ఫోన్ చేశాం. మిచెల్, నేను ఆమెతో మాట్లాడాం. తనకు మా పూర్తి మద్దతు ఉందని ఆమెకు చెప్పాము. ఈ క్లిష్టమైన సమయంలో నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో ఆమె గెలుపొందేందుకు మేము చేయగలిగినదంతా చేస్తాం. నీ పట్ల మాకు గర్వంగా ఉంది. నువ్వు చరిత్ర సృష్టిస్తామని తెలుసు’ అని అని బరాక్ ఒబామా ట్వీట్ చేశారు. దానికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు.ఇక ఈ నవంబర్‌లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హ్యారిస్ పోటీ పడే అవకాశాలు ఉన్నాయి. రేసు నుంచి తప్పుకున్న అధ్యక్షుడు బైడెన్.. తన స్థానంలో కమలా హ్యారిస్‌ను ప్రతిపాదించారు. అయితే కమలా హ్యారిస్ విషయంలో డెమోక్రటిక్ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఇప్పటి వరకు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన మద్దతును తెలపలేదు. అయితే ఇవాళ ఒబామా దంపతులు .. కమలా హారిస్‌కు మద్దతు ప్రకటించారు. -
బైడెన్‌కు కరోనా
మిల్వాకీ: ఓవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికలు శరవేగంగా సమీపిస్తున్నాయి. ప్రత్యర్థి అసలే డొనాల్డ్ ట్రంప్. ఆదినుంచీ దూకుడుగా దూసుకెళ్తున్నారు. అది చాలదన్నట్టు హత్యా యత్నంతో ఆయన గ్రాఫ్ మరింత పెరిగింది. దాన్ని వీరోచితంగా ఎదుర్కొన్న తీరుతో మరింత ఫేవరెట్‌గా మారారు. అలాంటి ట్రంప్‌ను దీటుగా ఎదుర్కోవాల్సిన డెమొక్రాట్లు మాత్రం ఇంకా కాలూ చెయ్యీ కూడదీసుకునే ప్రయత్నంలోనే ఉన్నారు. వయోభారం, మతిమరుపుతో రోజుకో రకంగా తడబడుతున్న అధ్యక్షుడు జో బైడెన్ ఎలా చూసినా ట్రంప్‌కు పోటీ ఇవ్వలేరని దాదాపుగా తేలిపోయింది. అయినా పోటీ నుంచి తప్పుకునేందుకు, మరొకరికి చాన్సిచ్చేందుకు 81 ఏళ్ల బైడెన్ ససేమిరా అంటున్నారు. ఇవి చాలవన్నట్టు బైడెన్ తాజాగా కరోనా బారిన పడ్డారు! దాంతో కీలక దశలో ఎన్నికల ప్రచారానికి విరామం ఇవ్వాల్సి వచ్చింది. ఈ వరుస పరిణామాలతో డెమొక్రాట్లు తల పట్టుకుంటున్నారు. పోటీకి ముందే ఓటమి ఖాయమయ్యేలా ఉందని వాపోతున్నారు. బైడెన్‌ను ఎలాగోలా బుజ్జగించి తప్పించేందుకు చివరి నిమిషం ప్రయత్నాలను ముమ్మరం చేశారు. లాస్‌వెగాస్‌లో ప్రచార ఈవెంట్లో మాట్లాడాల్సి ఉండగా బైడెన్‌కు కరోనా సోకినట్టు తేలింది. దాంతో డెలావెర్ నివాసంలో ఐసోలేషన్‌లో ఉన్నారు.ట్రంప్‌ను మీరు ఓడించలేరు: పెలోసీ బైడెన్ తప్పుకోవాలంటున్న డెమొక్రాట్ల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. పార్టీ కీలక నేత, ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ ఇటీవల బైడెన్‌తో ఫోన్లో మాట్లాడినట్టు సీఎన్ఎస్ వార్తా సంస్థ వెల్లడించింది. ట్రంప్‌ను ఓడించడం ఆయన వల్ల కాదని ఆమె స్పష్టం చేసినట్టు చెప్పుకొచి్చంది. ‘‘పోల్స్ కూడా మీరు గెలవలేరనే చెబుతున్నాయి. కనుక తప్పుకుంటే మంచిది. కాదని మొండికేస్తే మీరు ఓడటమే గాక ప్రతినిధుల సభలో డెమొక్రాట్ల విజయావకాశాలను కూడా చేజేతులా నాశనం చేసిన వారవుతారు’’ అంటూ పెలోసీ కుండబద్దలు కొట్టారట. -
USA Presidential Elections 2024: తప్పుకోవాలంటూ బైడెన్‌పై ఒత్తిళ్లు
వాషింగ్టన్: అట్లాంటాలో టీవీలో ముఖాముఖి చర్చలో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ధాటికి చేతులెత్తేసిన డెమొక్రటిక్ అభ్యర్థి, అధ్యక్షుడు జో బైడెన్‌పై సొంత పారీ్టలోనే వ్యతిరేకత ఎక్కువవుతోంది. 81 ఏళ్ల వయసున్న ఆయన అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఆయన మాత్రం తాను తప్పుకునే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు! ట్రంప్‌తో చర్చలో బైడెన్ పేలవ ప్రదర్శనను పలు మీడియా సంస్థలు సంపాదకీయాల్లో ఏకిపారేశాయి. సోషల్ మీడియాలో మీమ్స్‌కు కొదువే లేదు. ఈ విమర్శలపై బైడెన్ స్పందించారు. ‘‘బరాక్ ఒబామా మాదిరి ప్రత్యర్థిని నేను వాగ్ధాటితో ఇరుకున పెట్టలేకపోయిన మాట వాస్తవమే. దీనిపై నా మద్దతుదారులు, పారీ్టలోనూ కొంత అసంతృప్తి నెలకొందని తెలుసు. కానీ ట్రంప్‌పై మరింతగా పోరాడతా’ అని అన్నారు. డెమొక్రటిక్ ముఖ్యుల్లో పెరిగిన అసంతృప్తి ట్రంప్‌తో డిబేట్ తర్వాత బైడెన్ అభ్యరి్థత్వంపై చాలా మంది డెమొక్రటిక్ నేషనల్ కమిటీ(డీఎన్సీ) సభ్యుల్లో అసమ్మతి పెరిగింది. యువనేతకు అవకాశమిశ్వాలన్న డిమాండ్ తెరపైకి వస్తోంది. షికాగోలో ఆగస్ట్ 19న జరిగే డెలిగేట్ల భేటీలో దీనిపై కీలక నిర్ణయం తీసుకోవచ్చని పార్టీ వర్గాల కథనం. -
Presidential Debate: ట్రంప్ జోరు బైడెన్ బేజారు
అట్లాంటా: అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (78) దూకుడు పెంచారు. దేశాధ్యక్షుడు, డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్‌తో తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్లో స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించారు. శుక్రవారం (భారత కాలమానం ప్రకారం) సీఎన్ఎన్ చానల్లో దాదాపు 90 నిమిషాల పాటు జరిగిన వాదనలో బైడెన్ సర్వశక్తులూ ఒడ్డారు. తన వయసుపై విమర్శలు, అధ్యక్ష బాధ్యతలను సజావుగా నిర్వర్తించడంపై అమెరికన్లలో నానాటికీ పెరుగుతున్న అనుమానాలను కొట్టిపారేసేందుకు అన్ని ప్రయత్నాలూ చేశారు. ట్రంప్ తనకంటే కేవలం మూడేళ్లే చిన్నవాడని పదేపదే చెప్పుకున్నారు. కానీ డిబేట్ పొడవునా బైడెన్ పదేపదే తడబడ్డారు. ప్రసంగం మధ్యలో ఉన్నట్టుండి మౌనాన్ని ఆశ్రయించారు. మాటల కోసం తడుముకున్నారు. తనలో తానే గొణుక్కుంటూ కన్పించారు. మాట్లాడుతున్న అంశాన్ని అర్ధంతరంగా వదిలేసి మరో విషయం ఎత్తుకుని ఆశ్చర్యపరిచారు. కొన్నిసార్లు బైడెన్ ఏం చెప్తున్నదీ ఎవరికీ అర్థం కూడా కాలేదు. పలు అంశాలపై ట్రంప్ పచ్చి అబద్ధాలు చెప్పినా వాటిని ఎత్తిచూపడంలో, సొమ్ము చేసుకోవడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. తనకు అనుకూలమైన గణాంకాలను సమయానుకూలంగా ప్రస్తావించడంలో కూడా చతికిలపడ్డారు. డిబేట్లో ట్రంపే నెగ్గారని సీఎన్ఎన్ పోలింగ్‌లో ఏకంగా 67 శాతం మంది ఓటర్లు పేర్కొన్నారు. బైడెన్‌కు 33 శాతం ఓట్లే లభించాయి. న్యూయార్క్ టైమ్స్ వంటి ప్రఖ్యాత వార్తా పత్రికలు కూడా తొలి డిబేట్ ట్రంప్‌దేనని పేర్కొన్నాయి. ‘‘బైడెన్‌పై వయోభారం కొట్టొచ్చినట్టు కని్పస్తోంది. ఆయన మాటతీరులోనూ అది స్పష్టంగా ప్రతిఫలించింది. ఆయన చెబుతున్న విషయాల్లో పొందికే లేకుండా పోయింది’’ అంటూ విమర్శలు గుప్పించాయి. దూకుడుకు మారుపేరైన ట్రంప్‌కు 81 ఏళ్ల బైడెన్ ఏ మేరకు పోటీ ఇవ్వగలరోనంటూ డెమొక్రాట్లలో ఇప్పటికే గట్టిగా ఉన్న అనుమానాలు కాస్తా తాజా డిబేట్ నేపథ్యంలో ఆందోళనగా మారాయి. వాదనలో బైడెన్ తొలుత కాస్త వెనకబడ్డారని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కూడా అంగీకరించారు. అయితే క్రమంగా పుంజుకుని సమర్థంగా ముగించారని చెప్పుకొచ్చారు. బైడెన్ భార్య జిల్ మాత్రం తన భర్త భలే బాగా మాట్లాడారంటూ ప్రశంసించారు! ‘‘ప్రతి ప్రశ్నకూ చక్కగా బదులిచ్చావు. అన్ని సమాధానాలూ తెలుసు నీకు!’’ అంటూ ఆయన్ను మెచ్చుకున్నారు. కానీ ఈ డిబేట్ నేపథ్యంలో బైడెన్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలంటున్న వారి సంఖ్య డెమొక్రాట్లలో క్రమంగా పెరుగుతోంది. ట్రంప్, బైడెన్‌లను అధ్యక్ష అభ్యర్థులుగా ఇంకా లాంఛనంగా ప్రకటించాల్సి ఉంది. జూలై 15–18 మధ్య జరిగే సదస్సులో రిపబ్లికన్లు, ఆగస్టు 19న సదస్సులో డెమొక్రాట్లు తమ అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటిస్తారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5న జరగనున్నాయి. పరస్పర విమర్శల వర్షం... అమెరికా ఆర్థిక వ్యవస్థ, అబార్షన్ చట్టం, విదేశీ వ్యవహారాలు, వలసల వంటి పలు అంశాలపై ట్రంప్, బైడెన్ మధ్య వాడివేడి వాదనలు సాగాయి. ఆ క్రమంలో నేతలిద్దరూ తిట్ల పర్వానికి దిగారు. ‘‘నువ్వే అబద్ధాలకోరు. అమెరికా చరిత్రలోనే అత్యంత చెత్త ప్రెసిడెంట్ కూడా నువ్వే’’ అంటూ పరస్పరం దుయ్యబట్టుకున్నారు. పలు రకాల విమర్శలు చేసుకున్నారు. హష్ మనీ కేసు దోషి అంటూ ట్రంప్‌కు బైడెన్ చురకలు వేశారు. ‘‘జరిమానాలుగా నువ్వు ఎన్ని బిలియన్ డాలర్లు కట్టాలో గుర్తుందా? భార్య గర్భవతిగా ఉండగా నీలి చిత్రాల తారతో గడిపావు. నైతికత విషయంలో వీధుల్లో విచ్చలవిడిగా తిరిగే పిల్లి కంటే కూడా హీనం’’ అంటూ విమర్శల వర్షం కురిపించారు. బైడెన్‌తో పాటు ఆయన కుమారుడు హంటర్ కూడా క్రిమినలేనంటూ మాజీ అధ్యక్షుడు ట్రంప్ కూడా విరుచుకుపడ్డారు. అస్తవ్యస్తమైన వలసల విధానంతో దేశ భవితవ్యాన్నే బైడెన్ ప్రమాదంలోకి నెట్టారంటూ దుయ్యబట్టారు. డిబేట్ ఆరంభం నుంచే ట్రంప్ పై చేయి కనబరిచారు. ఆయనను ఇరుకున పెట్టేందుకు బైడెన్ చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. -
USA Presidential Elections 2024: బైడెన్, ట్రంప్ రె‘ఢీ’
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఇరు పారీ్టల అభ్యర్థులు వాదనలతో ఎదురెదురుగా బలాబలాలు తేల్చుకునే ‘చర్చల’ అంకానికి డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తెరలేపారు. సీఎన్ఎన్ టీవీ ఛానల్లో జూన్ 27వ తేదీన, ఏబీసీ ఛానల్లో సెప్టెంబర్ పదో తేదీన ఈ డిబేట్లు ఉంటాయి. మూడు దశాబ్దాలుగా డిబేట్లు నిర్వహించే ‘కమిషన్ ఆన్ ప్రెసిడెన్షియల్ డిబేట్’ను కాదని ఈసారి మీడియాసంస్థల ఆధ్వర్యంలో టీవీ ఛానళ్లలో డిబేట్‌కు బైడెన్ ప్రచార బృందం ఓకే చెప్పింది. ‘‘అట్లాంటా స్టూడియోలో ఈ డిబేట్‌ను నిర్వహిస్తాం’ అని సీఎన్ఎన్ తెలిపింది. జనం మధ్యలో డిబేట్ జరిపితే బాగుంటుందని ట్రంప్ అన్నారు. -
US presidential election 2024: బైడెన్.. బైడెన్.. బై బై ఎందుకు చెప్పలేదు?
ఎస్.రాజమహేంద్రారెడ్డి: చట్టం తన పని తాను చేసుకుపోతున్నట్టే కాలమూ తన మానాన తాను పరిగెడుతూనే ఉంటుంది. ఎవరి కోసమూ ఆగదు. ఈ పరుగెత్తే కాలమే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాళ్లకు అడ్డం పడుతోంది. అయినా సరే, 80 ఏళ్ల బైడెన్ ఆగేదే లేదంటున్నారు. ‘అప్పుడేనా...!’ అంటూ మరో విడత అధ్యక్ష పదవికి సిద్ధమయ్యారు. 2024 అధ్యక్ష ఎన్నికల బరిలో డెమొక్రాట్ల అభ్యర్థిని తానేనని మొన్న మంగళవారం ఆయన అధికారకంగా ప్రకటించేశారు. ఎదురు పడేది టెంపరి డొనాల్డ్ ట్రంపే కదా, ఇంకోసారి ఓడించలేనా అన్నది ఆయన ధీమా. ‘ఆయనకు 76, నాకు 80... అంతే కదా’ అన్నది ఆయన ధైర్యం. అంతేగానీ, ఇక కొత్త తరానికి వదిలేద్దామన్న భావన మాత్రం ఇద్దరిలోనూ లేకపోవడం గమనార్హం. డొనాల్డ్ ట్రంప్ విషయంలో చట్టం, ప్రెసిడెంట్ బైడెన్ విషయంలో కాలం తమ మానాన తమ పని చేసుకుంటూ వెళ్లిపోతూనే ఉంటాయి. గిర్రున ఏడాది తిరిగేసరికి ఎన్నికల నగారా మోగుతుంది. గెలుపెవరిదో, ఓడేదెవరో మళ్లీ కాలమే చెబుతుంది... రెండో ప్రపంచ యుద్ధం భీకరంగా సాగుతున్న కాలంలో, అమెరికా ఆ యుద్ధ మైదానంలోకి దిగిన ఏడాదికి 1942లో బైడెన్ జన్మించారు. కాలచక్రం మరో 30 ఏళ్లు తిరిగేసరికి 1973లో తొలిసారి సెనేటర్ అయ్యారు. అప్పటికి వైట్‌హౌస్‌లో రిచర్డ్ నిక్సన్ కొలువుదీరి ఉన్నారు. అత్యంత పిన్న వయసు సెనేటర్‌గా చరిత్ర సృష్టించిన బైడెన్‌కు, 15 ఏళ్లు విరామం లేకుండా ఆ పదవిలో కొనసాగాక ‘నేనెందుకు శ్వేతసౌధంలో అడుగుపెట్టకూడదు?’ అన్న ఆలోచన వచ్చింది. 1988లో ఆ ముచ్చటా తీర్చుకుందామనుకున్నా పరిస్థితులు అనుకూలించలేదు. డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి రేసులో ముందు వరుసలో నిలిచి ముచ్చటగా మూడు నెలలు ముమ్మరంగా ప్రచారం కూడా చేసుకున్నాక అనివార్యంగా, అర్ధంతరంగా వైదొలగాల్సి వచ్చింది. ఆ సమయానికి అమెరికా, సోవియట్ యూనియన్ మధ్య ప్రచ్ఛన్నయుద్ధం ఇంకా ముగియలేదు. ఇక్కడ సీన్ కట్ చేస్తే, 2020లో బైడెన్ 78 ఏళ్ల వయసులో వైట్‌హౌస్ మెట్లెక్కి అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఆ వయసులో అధ్యక్షుడు కావడం కూడా అమెరికా చరిత్రలో రికార్డే. తన రికార్డును తానే బద్దలు కొట్టేందుకు ఈ డెలావర్ పెద్దాయన బరిలో దిగుతున్నారు. గెలిచి తీరతానన్న ఆత్మవిశ్వాసమే ఆయనను ముందుకు నడిపిస్తోంది. ఈ ధీమా వెనక పలు కారణాలున్నాయి. మళ్లీ ట్రంపే ప్రత్యర్థి అవుతారని... దూకుడుకు కాసింత దుందుడుకుతనం కలిపితే డొనాల్డ్ ట్రంప్. అదే ఆయన స్వభావం. అదే ఆయన పెట్టుబడి కూడా. ఒకసారి తన చేతిలో ఓడిన ఈ ట్రంపే ఈసారి కూడా తన రిపబ్లికన్ ప్రత్యర్థి అని బైడెన్ ఫిక్సయిపోయారు. రిపబ్లికన్ పార్టీ తమ తుది అభ్యర్థిని ఇంకా ప్రకటించకపోయినా, ట్రంప్‌కే చాన్స్ దక్కే సూచనలు పుష్కలంగా ఉన్నాయి. సౌత్ కరోలినా మాజీ గవర్నర్ నికీ హేలీ, టెక్ దిగ్గజం వివేక్ రామస్వామి, రేడియో హోస్ట్ లారీ ఎల్డర్, అర్కన్సాస్ మాజీ గవర్నర్ అసా హుచిన్సన్ ప్రధానంగా ఆయనతో పోటీ పడుతున్నారు. వీరిలో నికీ హేలీ నుంచే ట్రంప్‌కు కొంచెం గట్టి పోటీ ఎదురవ్వచ్చు. ట్రంప్‌ను పక్కకు నెట్టి బరిలోకి దిగుతాడనుకున్న ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించే యోచనలో ఉన్నట్టు లేరు. మొత్తమ్మీద బైడెన్ ప్రత్యర్థిగా ట్రంప్ దాదాపుగా ఖాయమైనట్టే. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఓడినా తానే గెలిచానని డాంబికాలు పలికి, కేపిటల్ హిల్‌పై దాడికి తన అభిమానులను, రిపబ్లికన్ పార్టీ కార్యకర్తలను ఉసిగొల్పడంతో ట్రంప్ గ్రాఫ్ దారుణంగా పడిపోయిందన్నది బైడెన్ అంచనా. అపప్రథ మూటగట్టుకున్న ట్రంప్‌ను ఓడించడం ఈసారి మరింత తేలికని ఆయన భావిస్తున్నారు. మీద పడుతున్న వయసును లెక్కచేయకుండా బైడెన్ ముందుకురకడానికి ఇదే ప్రధాన కారణం. పోర్న్ నటికి డబ్బుల చెల్లింపు విషయంలో ట్రంప్‌ను కోర్టు ముద్దాయిగా ప్రకటించడమూ తనకు లాభిస్తుందని ఆశపడుతున్నారు. అయితే ట్రంప్‌ను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని రిపబ్లికన్లలో చాలామంది నమ్ముతుండటంతో ఆ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ఆయన అవకాశాలు మరింత మెరుగయ్యాయన్నది విశ్లేషకుల అంచనా. రిపబ్లికన్ పార్టీ మద్దతుదారుల్లో ట్రంప్ హవా కొనసాగుతున్నా ప్రజల్లో మాత్రం ఆయన పట్ల అసంతృప్తి పెరిగిందన్నది డెమొక్రాట్ల వాదన. 2018 నుంచీ ట్రంప్ పయనం ఓటమి బాటలోనే సాగుతుండటం గమనార్హం. 2018 మిడ్‌టర్మ్ ఎన్నికల్లో రిపబ్లికన్లు సెనేట్ను, హúజ్ను రెండింటినీ కోల్పోయారు. 2020లో అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమి చవిచూశారు. 2022 మిడ్ టర్మ్ ఎన్నికల్లోనూ ట్రంప్ సారథ్యం వల్ల పార్టీ అనూహ్య పరాజయం చవిచూసింది. మొత్తమ్మీద రిపబ్లికన్లకు ట్రంప్ గుదిబండగా తయారవుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కోర్టు కేసులు ట్రంప్‌కు కొత్త ఊపిరిలూదినా ఆయనను ఓడించడం తనకొక్కడికే సాధ్య మని బైడెన్ నొక్కివక్కాణిస్తున్నారు. ఇప్పటికే ఒకసారి ఓడించి చూపించానని పదేపదే చెబుతున్నారు. వయసుదేముంది, అదో అంకె మాత్రమేనన్నది ఆయన భావన. వచ్చే ఏడాది బరిలో దిగే సమయానికి ట్రంప్‌కు 78 ఏళ్లొస్తాయి. తనకన్నా నాలుగేళ్లే చిన్న కదా అంటారు బైడెన్. ఒకవేళ అంచనాలన్నీ తారుమారై ట్రంప్‌కు రిపబ్లికన్ అభ్యర్థిత్వం దక్కకున్నా ఆయన స్వతంత్రుడిగా బరిలోకి దిగడం ఖాయం. రిపబ్లికన్ మద్దతుదార్ల ఓట్లు చీలడం తథ్యం. అదే జరిగితే బైడెన్ పని మరింత సులువవుతుంది. ఓటు ‘విచ్ఛి్చత్తి’ అబార్షన్ల (గర్భవిచ్ఛిత్తి) చట్టబద్ధత చెల్లదని రిపబ్లికన్స్ అనుకూల సుప్రీంకోర్టు తేల్చిచెప్పడం కూడా డెమొక్రాట్లకు రాజకీయంగా లాభించింది. అబార్షన్లు అనైతికమని రిపబ్లికన్లు బాహాటంగా ప్రచారం చేసి స్వేచ్ఛావాదులు, స్త్రీవాదుల ఆగ్రహానికి గురయ్యారు. తన దేహం మీద స్త్రీకే పూర్తి హక్కుంటుందని, అబార్షన్ చేయించుకోవాలా, వద్దా అన్నది ఆమె ఇష్టాయిష్టాల మీదే ఆధారపడి ఉంటుందనేది బైడెన్ టీమ్ వాదన. సనాతనవాదులు, మతవాదులకు ఇది రుచించకపోయినా ప్రజల్లో అధిక భాగం బైడెన్‌తో ఏకీభవించారు. ఈ పరిణామం వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతుంది. అబార్షన్ల చట్టబద్ధతను తిరస్కరిస్తూనే, ఆయా రాష్ట్రాలు తమ అభీష్టం మేరకు దాన్ని అమలు చేసే వెసులుబాటును సుప్రీంకోర్టు కల్పించడం గమనార్హం. అమెరికావ్యాప్తంగా ఈ తీర్పుకు అనుకూల, ప్రతికూల ప్రదర్శనలు మిన్నంటాయి. రిపబ్లికన్ పాలిత కాన్సాస్, కెంటకీ, మోంటానా రాష్ట్రాలు ఆగమేఘాల మీద అబార్షన్లపై ఉక్కుపాదం మోపాయి. డెమొక్రటిక్పాలిత కాలిఫోర్నియా, మిషిగన్, వెర్మోంట్ అబార్షన్ హక్కుల పరిరక్షణకు ప్రతినబూనాయి. ఈ పరిణామాలు ఓటర్లనూ రెండు వర్గాలుగా చీల్చాయి. సుప్రీం తీర్పు తర్వాత జరిగిన మిడ్ టర్మ్‌లో రిపబ్లికన్ల ఓటు బ్యాంకు చెల్లాచెదురు కావడానికి ఇదే ప్రధాన కారణమైంది. అబార్షన్ వ్యతిరేకతను రాజకీయ నినాదంగానే భావించిన రిపబ్లికన్ పార్టీ, ప్రజలు ఇంతగా ప్రభావితమవుతారని అంచనా వేయలేకపోయింది. పరోక్షంగా డెమొక్రాట్లకు అదనపు లాభం చేకూరింది. అబార్షన్లపై రిపబ్లికన్ల వైఖరే తన విజయానికి రెండో మెట్టు అవుతుందని బైడెన్ గట్టిగా నమ్ముతున్నారు. అనుకూల ఓటు పదిలం బైడెన్ విజయావకాశాలను ప్రభావితం చేసే పై రెండు అంశాలు ట్రంప్ వ్యతిరేక ఓటుతో ముడిపడి ఉన్నాయి. సగటు ఓటరును తమవైపు తిప్పుకునే మంచి పనులు కూడా బైడెన్ గత రెండేళ్లలో చాలానే చేశారు. అనుకూల ఓటు, కొత్త ఓటును పదిలం చేసుకోవడానికి ఇవి అండగా నిలుస్తాయి. ట్రంప్ పాలనలో అమెరికాను ఉక్కిరిబిక్కిరి చేసిన కరోనాను బైడెన్ సమర్థంగా అరికట్టి పార్టీలకతీతంగా ప్రజల మనన్నలు అందుకున్నారు. దిగుమతుల మీద ఆధారపడకుండా స్వదేశీ తయారీ ‘మేడిన్ అమెరికా’ భావానికి బహుళ ప్రచారం కల్పించారు. ఆ దిశగా మాన్యుఫాక్చరింగ్ యూనిట్ల స్థాపనకు బిల్లు తెచ్చారు. వైద్య చికిత్స ఖర్చులను తగ్గించడంతో పాటు ఉద్యోగ కల్పనకు చర్యలు తీసుకున్నారు. విదేశీ వ్యవహారాల్లోనూ చెప్పుకోదగ్గ ప్రగతి సాధించారు. నాటోకు వెన్నుదన్నుగా, ఉక్రెయిన్‌కు అండగా నిలిచి రష్యాను నిలువరించడం గమనించదగ్గవి. ప్రపంచంపై తన పెత్తనాన్ని నిలుపుకోవాలంటే చైనాపై ఓ కన్నేసి ఉంచాలనే సూక్ష్మాన్ని కూడా బైడెన్ గుర్తించడం విశేషం. వచ్చే ఎన్నికల్లో ఈ అంశాలన్నీ తనకు అనుకూలంగా ఓటుబ్యాంకును సుస్థిరం చేస్తాయనే నమ్మకమే బైడెన్‌ను ఎన్నికలవైపు నడిపిస్తోంది. కొస మెరుపు బైడెన్‌కు ఇన్ని అనుకూలతలున్నా ట్రంప్‌కు 2020 ఎన్నికల్లో 7.4 కోట్ల ఓట్లు వచ్చాయన్నది తోసిపుచ్చలేని అంశం. రిపబ్లికన్లు ట్రంప్‌ను పక్కన పెట్టి అనూహ్యంగా తమ తురుపు ముక్క డిసాంటిస్‌ను తెరపైకి తెస్తే మాత్రం బైడెన్ వయసు చర్చనీయాంశంగా మారుతుంది. అన్నీ మంచి శకునములేనని బైడెన్ భావిస్తున్నా ఆర్థిక నిర్వహణ వంటి వ్యవహారాల్లో ఆయన పనితీరుపై విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. వెక్కిరిస్తున్న ద్రవ్యోల్బణం వంటివాటిని ఉదాహరణగా చూపుతున్నారు. అనుకూల, ప్రతికూల పవనాలెలా ఉన్నా వయసు విషయంలో మాత్రం బైడెన్, ట్రంప్ దొందూ దొందే అన్నది తటస్థుల అభిప్రాయం. 2024 నవంబర్‌లో జరిగే ఎన్నికల్లోగా ఏమైనా జరగొచ్చు. చివరికి గెలుపు ఎవరినైనా వరించవచ్చు. ఇప్పటికైతే బైడెన్ ఆత్మవిశ్వాసాన్ని కొట్టిపారేయలేం. అయినా రాజకీయాల్లో వయసుతో పనేముంది? అధికారమే ముఖ్యం! బైడెన్కైనా, ట్రంప్‌కైనా లక్ష్యం అదే! ‘‘రాజకీయం ఒక రంగులలోకం అధికారమొక తీరని దాహం’’ -
అమెరికాలో ప్రారంభమైన ఎలక్టోరల్ ఓటింగ్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలకు సంబంధించి మరో ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 538 మంది ఎలక్టర్లు సోమవారం తమ తమ రాష్ట్రాల రాజధానుల్లో సమావేశమై అధ్యక్ష అభ్యర్థులకు ఓట్లు వేస్తున్నారు. మీడియా కథనాల ప్రకారం తుది సమాచారం అందేవరకు డెమొక్రట్ అభ్యర్థి బైడెన్‌కు 156, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (రిపబ్లికన్ పార్టీ)కు 106 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. మొత్తం బ్యాలెట్లు డిసెంబర్ 23వ తేదీ నాటికి వాషింగ్టన్ చేరుకుంటాయి. జనవరి 6వ తేదీన అమెరికా పార్లమెంటు ఉభయసభలు సంయుక్తంగా సమావేశమై ఆ బ్యాలెట్లను లెక్కిస్తాయి. కొత్త అధ్యక్షుడిగా బైడెన్ ఎన్నిక లాంఛనమే. అమెరికాలో రాష్ట్రాల వారీగా ఎలక్టోరల్ ఓట్లు ఉంటాయన్న విషయం తెలి సిందే. -
జార్జియా రీకౌంటింగ్‌లో బైడెన్ గెలుపు
వాషింగ్టన్: రిపబ్లికన్లకు గట్టి పట్టున్న జార్జియా రాష్ట్రంలో జరిగిన ఎన్నికల రీకౌంటింగ్‌లో డెమొక్రాటిక్ జోబైడెనే గెలుపు సాధించారు. దీంతో 1992 తర్వాత ఈ రాష్ట్రంలో గెలిచిన డెమొక్రాట్ అభ్యర్థిగా బైడెన్ నిలిచారు. ఇటీవల జరిగిన కౌంటింగ్‌లో ట్రంప్ కన్నా బైడెన్‌కు 14వేల ఓట్ల మెజార్టీ లభించింది. ఇరువురి మధ్య మెజార్టీ స్వల్పం కావడంతో ఇక్కడ బ్యాలెట్లను మాన్యువల్‌గా రీకౌంటింగ్ చేశారు. రీకౌంటింగ్‌లో బైడెన్‌కు 12,284 ఓట్ల మెజార్టీ లభించింది. రీకౌంటింగ్ కచ్చితత్వంతో జరిపామని జార్జియా స్టేట్ సెక్రటరీ బ్రాడ్రాఫెన్స్పెర్గర్ చెప్పారు. గత ఫలితాల్లో ఎలాంటి భారీ అవకతవకలు జరగలేదని ఆడిట్లో తేలినట్లు అధికారులు వెల్లడించారు. తమ ఎన్నికల అధికారుల కృషి కారణంగానే స్వల్పకాలంలో రీకౌంటింగ్ పూర్తయిందన్నారు. శుక్రవారం ఈ రీకౌంటింగ్ ఫలితాలన్నీ సర్టిఫై చేయవచ్చని అంచనా. ఈ గెలుపుతో బైడెన్‌కు జార్జియాలోని 16 ఎలక్ట్రోరల్ ఓట్లు లభిస్తాయి. దీంతో ఆయనకు వచ్చిన ఓట్లు 306కు చేరతాయి. 2016లో ట్రంప్ ఈ రాష్ట్రాన్ని హిల్లరీతో పోటీపడి గెలుచుకున్నారు. తాజా రీకౌంటింగ్‌పై ట్రంప్ లీగల్ అధికారులు స్పందిస్తూ ఇంకా సర్టిఫై కాకముందే మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోందన్నారు. న్యాయం జరిగేందుకున్న అన్ని లీగల్ మార్గాలను పరిశీలిస్తామన్నారు. మళ్లీ డబ్ల్యూహెచ్‌వోలో చేరతాం: బైడెన్ తమ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటయ్యాక తిరిగి ప్రపంచ ఆరోగ్య సమాఖ్య(డబ్ల్యూహెచ్‌వో)లో చేరతామని అమెరికా ప్రెసిడెంట్ ఎలక్ట్ జోబైడెన్ స్పష్టం చేశారు. అయితే, డబ్ల్యూహెచ్‌వోలో సంస్కరణలు అవసరమన్నారు. చైనాతో సంబంధాలపై మాట్లాడుతూ ‘శిక్షించడంపై కన్నా నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని చైనాకు అవగాహన కల్పించడం ముఖ్యం’ అని చెప్పారు. ఇతర దేశాలతో కలిసి చైనాకు అవగాహన కలిగించేందుకు యత్నిస్తామని చెప్పారు. పారిస్ పర్యావరణ ఒప్పందంలో కూడా మరలా చేరతామన్నారు. అమెరికా–చైనా సంబంధాలు ట్రంప్ హయాంలో బాగా దెబ్బతిన్నాయి. -
అమెరికా ఎన్నికలు: ‘పెద్దన్న’ ఎవరో?!
అగ్రరాజ్యం అమెరికాలో మరికొద్ది గంటల్లో ఎన్నికలు!.. నాలుగేళ్ల అధ్యక్ష అనుభవంతో రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.. ఒబామా హయాంలో ఉపాధ్యక్షుడు, 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో డెమొక్రాట్ పార్టీ తరఫున జో బైడెన్ మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది! విజేత ఎవరో తెలిసేందుకు ఇంకా సమయమున్నా.. కొన్ని నెలలుగా దేశం మొత్తమ్మీద వేర్వేరు సంస్థలు నిర్వహిస్తున్న ఒపీనియన్ పోల్స్ గెలిచేదెవరో చూచాయగా చెప్పేస్తున్నాయి. ఒపీనియన్ పోల్స్ తారుమారైన చరిత్ర ఉన్న నేపథ్యంలో ఈనెల 3న జరిగే ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఒపీనియన్ పోల్స్‌లో ‘జై’డెన్ ఎన్నికల గడువు ముంచుకొస్తున్న నేపథ్యంలో అమెరికాలోని పలు సంస్థలు అభిప్రాయ సేకరణ చేపడుతున్నాయి. యూనివర్సిటీలు, ప్రైవేట్ సంస్థలు నిర్వహించిన ఈ పోల్స్ అన్నింటి సారాంశం రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ గెలుపు వాకిట్లో ఉన్నారని!. అయితే ఎన్నికల ఫలితాలను కచ్చితంగా తేల్చేందుకు ఇవి పెద్దగా ఉపయోగపడవు. 2016లో హిల్లరీ క్లింటన్ దాదాపు అన్ని నేషనల్ ఒపీనియన్ పోల్స్‌లో కలిపి ట్రంప్ కంటే దాదాపు 30 లక్షల ఓట్లు అధికంగా సాధించినా అసలు ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలయ్యారు. ఎలక్టోరల్ కాలేజీ వ్యవస్థ దీనికి కారణం. ఇక, అక్టోబర్ 29న మూడు సంస్థలు నిర్వహించిన ఒపీనియన్ పోల్స్ ప్రకారం కూడా జో బైడెన్‌దే పైచేయిగా తేలింది. ఇప్పటివరకు నిర్వహించిన అన్ని ఒపీనియన్ పోల్స్ సగటు తీసుకుంటే బైడెన్ (52%), ట్రంప్ (43%) మధ్య తొమ్మిది శాతం ఓట్ల అంతరం ఉంది. గత ఎన్నికల్లో ఈ అంతరం ఒకట్రెండు శాతానికి మించలేదు. ఈ రాష్ట్రాలు ఎటు మొగ్గితే వారే విజేత! అమెరికా ఎన్నికల్లో ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయన్నది కాకుండా.. ఎవరికి ఎన్ని ఓట్లు ఏయే రాష్ట్రాల్లో పడ్డాయన్నదే కీలకం. ఉదాహరణకు 2016లో హిల్లరీ క్లింటన్‌కు పాపులర్ ఓట్లు ఎక్కువగా పోలైనా ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు తక్కువగా పడ్డాయి. ట్రంప్‌కు 303 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు పడటంతో విజేతగా నిలిచారు. సంప్రదాయకంగా అమెరికన్ రాష్ట్రాల్లో ఓటింగ్ సరళి దాదాపుగా ఒకేలా ఉంటుంది. మొత్తం 50 రాష్ట్రాల్లో రిపబ్లికన్లకు కొన్ని, డెమొక్రాట్లకు మాత్రమే ఓటేసే రాష్ట్రాలు కొన్ని ఉంటాయి. వీటిని మినహాయిస్తే మిగిలిన కొన్ని రాష్ట్రాలు ఒక్కోసారి ఒక్కోలా స్పందిస్తుంటాయి. ఈ బ్యాటిల్ గ్రౌండ్ రాష్ట్రాలే అధ్యక్ష ఎన్నికల విజేతను నిర్ణయిస్తుంటాయి. 2020 ఎన్నికల విషయా నికొస్తే.. ఈసారి 38 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లున్న టెక్సాస్ బ్యాటిల్‌గ్రౌండ్ రాష్ట్రాల్లో అతి పెద్దది. కేవ లం 4 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉన్న న్యూహ్యాంప్‌షైర్ అతిచిన్నది. అమెరికా మొత్తమ్మీద 538 ఎలక్టోరల్ ఓట్లు అందుబాటులో ఉండగా, 270 ఓట్లు సాధించిన పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తాడు. బ్యాటిల్ గ్రౌండ్ రాష్ట్రాల్లో జరిగిన ఒపీనియన్ పోల్స్ ప్రకారం జో బైడెన్ అధ్యక్షుడు ట్రంప్ కంటే ఆధిక్యంలో ఉన్నారు. హాట్‌హాట్‌గా డిబేట్ అమెరికా ఎన్నికల్లో ఒపీనియన్ పోల్స్, బ్యాటిల్‌గ్రౌండ్ రాష్ట్రాల పరిస్థితి ఎంత ముఖ్యమో.. అధ్యక్ష స్థానానికి పోటీచేస్తున్న అభ్యర్థుల ముఖాముఖి చర్చలూ అంతే ముఖ్యం. సెప్టెంబర్ 29న జరిగిన తొలి ముఖాముఖి చర్చపై సీబీఎస్ న్యూస్/యూగవ్ సంస్థలు బ్యాటిల్‌గ్రౌండ్ రాష్ట్రాల్లో సర్వే నిర్వహించాయి. టెలివిజన్ చానళ్లలో చర్చను వీక్షించిన వారిలో 48% మంది బైడెన్‌కు, 41% మంది ట్రంప్‌కు ఓటేశారు. సీఎన్ఎన్ ఆకస్మిక పోలింగ్‌లో బైడెన్ ఏకంగా 60 శాతం మంది మద్దతు కూడగట్టగలిగారు. అక్టోబర్ 22న జరిగిన మూడో డిబేట్‌పై సీఎన్ఎన్, యూగవ్ నిర్వహించిన పోల్‌లోనూ బైడెన్ వైపు ఎక్కువ మంది మొగ్గు చూపారు. శతాబ్దపు రికార్డు... ముందస్తు ఓటింగ్ అధ్యక్ష ఎన్నికలలో 2020 అక్టోబర్ 29వ తేదీ నాటికి అత్యధికంగా 8.63 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇది ఈ శతాబ్దపు రికార్డుగా భావిస్తున్నారు. దేశమంతటా కోవిడ్ సమస్య ఉండటంతో ఓటర్లు ఎవరికి వారు వీలుని బట్టి ఓటు వేస్తున్నారు. ఓటర్లలో చైతన్యం పెరిగిందనీ, మొదటిసారి ఓటేస్తున్న యువత, ఓటు హక్కు కొత్తగా వచ్చిన విదేశీయులు కూడా ముందస్తు ఓటింగ్‌లో ఉత్సాహంగా పాల్గొంటున్నారని అంటున్నారు. దాదాపు దేశమంతా ముందస్తు ఓటింగ్ రికార్డు స్థాయిలో పెరిగింది. ముందస్తు ఓటర్లలో ఆఫ్రికన్ అమెరికన్ల సంఖ్య మామూలుగానే ఉందని తెలుస్తోంది. ముందుగానే ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో 27 శాతం మంది కొత్త ఓటర్లని తేలింది. 2016లో 10% ముందస్తు ఓటు వేసిన ఈ వర్గం వారిలో ఇప్పటికి 9% మంది ఓటేశారు. మంగళవారం కూడా ఎక్కువ శాతం పోలింగ్ జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ ర్యాలీలతో 30వేల మందికి కోవిడ్ డొనాల్డ్ ట్రంప్ జూన్ 20 నుంచి సెప్టెంబర్ 22 వరకు నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమాల ద్వారా 30 వేల మందికి పైగా కరోనా సోకిందని, వారిలో 700 మంది చనిపోయారని స్టాన్ఫోర్డ్ వర్సిటీ పరిశోధకులు తెలిపారు. ట్రంప్ ఎన్నికల ర్యాలీలలో పాల్గొన్న ప్రజలు వ్యాధుల రూపంలో, మరణాల రూపంలో తీవ్రంగా నష్టపోయినట్టు చెప్పారు. ‘ది ఎఫెక్ట్స్ ఆఫ్ లార్జ్ గ్రూప్ మీటింగ్స్ ఆన్ ది స్ప్రెడ్ ఆఫ్ కోవిడ్ 19 : ద కేస్ ఆఫ్ ట్రంప్ ర్యాలీస్’ పేరుతో స్టాన్ఫోర్డ్ వర్సిటీ ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. భారీ సభల ద్వారా కోవిడ్ విజృంభించే ప్రమాదం ఉంటుందని, అధికారులు చేసిన హెచ్చరికలను, సిఫార్సులను తమ విశ్లేషణ బలపరుస్తోందని వారు తెలిపారు. ‘‘ట్రంప్ మీ గురించి పట్టించుకోడు. తన సొంత మద్దతుదారులనూ పట్టించుకోడు’’ అని డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ ఈ అధ్యయనంపై స్పందిస్తూ ట్వీట్ చేశారు. మాస్కులు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా హాజరయ్యే వ్యక్తిగత సభలు కోవిడ్ వ్యాప్తికి అవకాశం కల్పిస్తాయని ది సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) సూచించింది. -
భారత్‌తో భాగస్వామ్యాన్ని గౌరవిస్తున్నాం
వాషింగ్టన్: భారత్‌లో వాయు కాలుష్యంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను మాజీ ఉపాధ్యక్షుడు, డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ తప్పుపట్టారు. తాను, తమ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ భారత్‌తో అమెరికా భాగస్వామ్యానికి అత్యధిక విలువ ఇస్తున్నామని, ఎంతగానో గౌరవిస్తున్నామని పేర్కొన్నారు. తమ విదేశాంగ విధానంలో అమెరికా–భారత్ సంబంధాలకు అత్యంత ప్రాధాన్యం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన శనివారం ట్వీట్ చేశారు. ఒబామా–బైడెన్ హయాంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయని గుర్తుచేశారు. బైడెన్–కమలా హారిస్ హయాంలో ఈ సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి చేరుస్తామని స్పష్టం చేశారు. ఇండియా ఒక మురికి దేశమని ట్రంప్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. వాతావరణ మార్పులు మానవాళికి పెను సవాళ్లు విసురుతున్నాయని, ఆ సమస్యను పరిష్కరించడంపై దృష్టి పెట్టకుండా మిత్రుల గురించి చెడుగా మాట్లాడడం మంచిది కాదని బైడెన్ హితవు పలికారు. చైనా, ఇండియా, రష్యా దేశాలు వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయని గురువారం అధ్యక్ష అభ్యర్థుల సంవాదంలో ట్రంప్ ఆరోపించిన సంగతి తెలిసిందే. -
ట్రెండింగ్‌లో ‘మై నేమ్ ఈజ్’
వాషింగ్టన్: డెమొక్రాటిక్ ఉపాధ్యక్ష అభ్యర్ధి కమలాహారిస్ పేరును రిపబ్లికన్ సెనేటర్ తప్పుగా పలకడం ఆమె మద్దతుదారులకు ఆగ్రహం తెప్పించింది. ఇందుకు నిరసనగా బైడెన్ బృంద ఏసియన్ అమెరికన్ పసిఫిక్ ఐలాండర్ కోఆర్డినేటర్ అమిత్ జాని ఆరంభించిన ‘‘మై నేమ్ ఈజ్..’’ క్యాంపైన్ ట్రెండింగ్‌లో నిలిచింది. జార్జియాకు చెందిన రిపబ్లికన్ సెనేటర్ డేవిడ్ పెర్డ్యూ ఇటీవల ఒక ర్యాలీలో కమలా హారిస్ పేరును వ్యంగంగా ఉచ్ఛరించారు. ‘‘ఖ మ లా? ఖ మ్మ లా? కమలా మలా మాలా? ఏమో నాకు తెలీదు.. ఏదో ఒకటిలే’’ అని ఆయన ర్యాలీలో కమలా హారిస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. దీంతో పలువురు సోషల్ మీడియాలో తమ పేరు ఉత్పత్తి, అర్థాన్ని వివరిస్తూ పోస్టులు పెట్టడం ఆరంభించారు. డేవిడ్ కావాలనే కమలా పేరును అలా పలికారని, నాలుగేళ్లు తనతో పనిచేసిన తోటి సెనేటర్ పేరును గుర్తుంచుకోలేరా? అని కమలా మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ #MyN్చఝ్ఛఐటహ్యాష్ట్యాగ్తో పోస్టులు ట్రెండ్ అవుతున్నాయి. పలువురు సెలబ్రెటీలు కూడా ఈ హ్యాష్‌ట్యాగ్‌తో పోస్టులు చేశారు. డేవిడ్ సమర్థకులు మాత్రం ఈ ఆగ్రహాన్ని తేలిగ్గా తీసుకుంటున్నారు. సెనేటర్ డేవిడ్ తెలీక కమలా పేరును తప్పుగా పలికారని, ఇందులో ఎలాంటి దురర్ధం లేదని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. గతంలోకూడా కమలా పేరును కొందరు కావాలని తప్పుగా పలకడం గమనార్హం. -
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరీ
వాషింగ్టన్: కరోనా వైరస్‌కి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారి పీడ ఎప్పటికి విరగడ అవుతుంది? ఈ ప్ర«శ్నలతో పాటు ప్రపంచవ్యాప్తంగా మరో ప్రశ్న అందరినీ వేధిస్తోంది. అదే ప్రపంచానికి పెద్దన్న ఎవరు కాబోతున్నారు? అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపెవరిది? రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. దీంతో స్వింగ్ స్టేట్స్ ఎటువైపు మొగ్గు చూపిస్తాయన్నది కీలకంగా మారింది. నవంబర్ 3న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల పైనే అందరి దృష్టి నెలకొని ఉంది. ఎన్నికల ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో స్వింగ్ స్టేట్స్ (ఆఖరి నిమిషం వరకు ఏ పార్టీ వైపు ఉంటారో అంచనా వేయలేని రాష్ట్రాలు) ఎటు వైపు మొగ్గుతాయన్న ఉత్కంఠ రేగుతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జాతీయ స్థాయిలో ప్రజాదరణ ఓట్లు సాధించిన వారే పీఠాన్ని దక్కించుకుంటారని చెప్పలేం. గత ఎన్నికల్లో ట్రంప్ కంటే పాపులర్ ఓట్లు 30 లక్షలు అధికంగా హిల్లరీ క్లింటన్ సాధించినప్పటికీ ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ట్రంప్‌కి ఎక్కువ రావడంతో ఆయన అ«ధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు. నవంబర్ 3న జరిగే ఎన్నికల్లో ప్రజలు తమకు నచ్చిన అభ్యర్థి పార్టీకి ఓటు వేస్తారు. ఆ ఓటింగ్ రాష్ట్రాల స్థాయిలోనే ఉంటుంది. అక్కడ ఎన్నిౖకైన ప్రతినిధులంతా కలిసి అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. దేశం మొత్తమ్మీద 50 రాష్ట్రాలు, డిస్ట్రిక్ట్ కొలంబియాలో జనాభా ప్రాతిపదికన ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉంటాయి. దేశవ్యాప్తంగా 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లకిగాను 270 ఓట్లు సాధించిన వారే అధ్యక్షుడిగా ఎన్నికవుతారు. స్వింగ్ రాష్ట్రాలు ఇవే ఈసారి ఎన్నికల్లో మొత్తం 14 రాష్ట్రాల్లో ఎవరి వైపు ప్రజలు మొగ్గు చూపుతారో తెలీని పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకు అమెరికా ఎన్నికల చరిత్రలో ఈ స్థాయిలో జనం నాడి తెలియకుండా ఎప్పుడూ లేదు. టెక్సాస్ (38 ఎలక్టోరల్ ఓట్లు), ఫ్లోరిడా (29 ), పెన్సిల్వేనియా (20), ఒహియో (18), మిషిగాన్ (16), జార్జియా (16 ), నార్త్ కరోలినా (15), వర్జీనియా (13), అరిజోనా (11), విస్కాన్సన్ (10), మిన్నెసోటా (10), నెవడా (6), అయోవా (6) న్యూ హ్యాంప్‌షైర్ (4) రాష్ట్రాల్లో ప్రతీ నెల జనం మూడ్ మారిపోతున్నట్టుగా సర్వేలు చెబుతున్నాయి. తాజా సర్వేల్లో జార్జియా, అయోవా, టెక్సాస్ రాష్ట్రాల్లో ట్రంప్‌కి మొగ్గు కనిపిస్తూ ఉంటే, మిగిలిన స్వింగ్ స్టేట్స్లో బైడెన్ దూసుకుపోయే అవకాశాలున్నట్టుగా రియల్ క్లియర్ పాలిటిక్స్ సర్వే అంచనా వేస్తోంది. టెక్సాస్, జార్జియా రాష్ట్రాలు ఎప్పుడూ రిపబ్లికన్ల వైపు ఉంటాయి. ఈసారి కూడా ట్రంప్‌వైపే ఉన్నప్పటికీ మొగ్గు చాలా స్వల్పంగా ఉందని అంచనా. అందుకే టెక్సాస్, జార్జియా రాష్ట్రాల్లో ఎలాగైనా పాగా వెయ్యాలని బైడెన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆ రాష్ట్రాల్లో ప్రచారం కోసం డాలర్ల వరద పారిస్తున్నారు. జాతీయ స్థాయిలో చూసుకుంటే ట్రంప్ కంటే బైడెన్‌కు 10 పాయింట్లు అధికంగా ఉన్నాయి. ఫ్లోరిడా ఫ్యాక్టర్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 1964 నుంచి ఫ్లోరిడాలో నెగ్గిన వారికే అధ్యక్ష పదవి దక్కుతూ వస్తోంది. 1992 ఎన్నికలు మాత్రం దీనికి మినహాయింపుగా ఉన్నాయి. గత ఎన్నికల్లో ట్రంప్‌కి 48.6% ఓట్లు వస్తే, హిల్లరీకి 47.4% ఓట్లు వచ్చాయి. అంతకు ముందు ఎన్నికల్లో బరాక్ ఒబామా 51% ఓట్లను సాధించి అవలీలగా అధ్యక్ష పదవిని అందుకున్నారు. ఈ రాష్ట్రంలో ప్రజల ఆలోచనా ధోరణి వినూత్నంగా ఉంటుంది. యువ ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ ఓటర్లు అధ్యక్ష అభ్యర్థుల మధ్య జరిగే డిబేట్లను విన్నాక ఓటుపై నిర్ణయం తీసుకుంటారు. ఎన్నికలకి ముందు మూడు సార్లు సెప్టెంబర్ 29, అక్టోబర్ 7, అక్టోబర్ 15న అధ్యక్ష అభ్యర్థుల మధ్య బిగ్ డిబేట్స్ జరుగుతాయి. ఈ డిబేట్స్‌లో ట్రంప్, బైడెన్ తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తారో వివరిస్తారు. ఆ డిబేట్స్ తర్వాత పరిస్థితులన్నీ మారే అవకాశాలైతే ఉన్నాయి. ఈ డిబేట్స్‌లో ట్రంప్ నెగ్గుతారని 47% మంది అమెరికన్లు భావిస్తూ ఉంటే, బైడెన్ వైపు 41% మంది మాత్రమే ఉన్నారు. కరోనా ఎఫెక్ట్ ఈసారి ఎన్నికల్లో కరోనా వైరస్ నంబర్ గేమ్‌ని మార్చేస్తుందని అంచనాలున్నాయి. కరోనా కట్టడిలో ట్రంప్ వైఫల్యంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అగ్రరాజ్యంలో ఎన్నికల నాటికి వైరస్ కారణంగా 2 లక్షల 60 వేల వరకు మరణాలు నమోదవుతాయని అంచనాలున్నాయి. ట్రంప్ చెబుతున్నట్టుగా అక్టోబర్ సర్ప్రైజ్ సాకారమై పోలింగ్ తేదీలోగా వ్యాక్సిన్ వస్తే ఆయనకి మళ్లీ అనుకూలంగా పరిస్థితులు మారే అవకాశాలున్నాయి. ఆర్థిక మాంద్యం, పెరిగిపోతున్న నిరుద్యోగం, జాతివివక్ష, వలసవిధానం, వాతావరణంలో మార్పులు వంటి అంశాలు కూడా ఎన్నికల్లో ప్రధాన అంశాలు కానున్నాయి. -
బైడెన్‌కు అధికారమిస్తే కలలన్నీ నాశనం: ట్రంప్
వాషింగ్టన్: డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌కు అధికారాన్ని అప్పగిస్తే అమెరికా కన్న కలలన్నీ సర్వనాశనం అవుతాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అమెరికా గొప్పతనాన్ని నాశనం చేయడంతో పాటుగా ప్రజలకెవరికీ ఉద్యోగాలు ఉండవన్నారు. కరోనా సంక్షోభం నుంచి బయట పడడానికి ఈ ఏడాది చివరిలోగా వ్యాక్సిన్ తీసుకువస్తానని హామీ ఇచ్చారు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా రెండోసారి నామినేషన్‌ను ఆమోదించిన సందర్భాన్ని పురస్కరించుకొని గురువా రం ట్రంప్ పార్టీ సదస్సులో మాట్లాడారు. అందరి చూపు మెలానియా,ఇవాంక పైనే సదస్సు వేదికపై మెలానియా ట్రంప్, ట్రంప్ మొదటి భార్య కుమార్తె ఇవాంకా ఒకరికొకరు ఎదురుపడిన వీడియో ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. తన తండ్రిని అధ్యక్ష అభ్యర్థిగా పరిచయం చేసి వేదిక దిగి వస్తుండగా ఎదురపడిన మెలానియా ఇవాంకను చూసి చిరునవ్వుతో పలకరించారు. ఇవాంక కాస్త ముందుకు వెళ్లగానే మెలానియా ముఖంలో రంగులు మారాయి.