అమెరికా ఉపాధ్యక్షురాలు, డెమొక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్‌కు.. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన భార్య మిచెల్ ఒమాబా మద్దతు ప్రకటించారు. నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థిగా కమలా హారిస్‌ను వారు ఆమోదించారు. న స్నేహితురాలు హారీస్ అమెరికాకు గొప్ప అధ్యక్షురాలు అవుతుందని భావిస్తున్నామని, ఆమెకు మా పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు.
ఈమేరకు ట్వీట్ చేశారు. ‘అధ్యక్ష ఎన్నికల్లో నా స్నేహితురాలు యూనైటెడ్ స్టేట్స్‌కు అధ్బుతమైన అధ్యక్షురాలిగా అవుతుంది. రెండు రోజుల క్రితం కమలా హ్యారిస్‌కు మేము ఫోన్ చేశాం. మిచెల్, నేను ఆమెతో మాట్లాడాం. తనకు మా పూర్తి మద్దతు ఉందని ఆమెకు చెప్పాము. ఈ క్లిష్టమైన సమయంలో నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో ఆమె గెలుపొందేందుకు మేము చేయగలిగినదంతా చేస్తాం. నీ పట్ల మాకు గర్వంగా ఉంది. నువ్వు చరిత్ర సృష్టిస్తామని తెలుసు’ అని అని బరాక్ ఒబామా ట్వీట్ చేశారు. దానికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు.
ఇక ఈ నవంబర్‌లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హ్యారిస్ పోటీ పడే అవకాశాలు ఉన్నాయి. రేసు నుంచి తప్పుకున్న అధ్యక్షుడు బైడెన్.. తన స్థానంలో కమలా హ్యారిస్‌ను ప్రతిపాదించారు. అయితే కమలా హ్యారిస్ విషయంలో డెమోక్రటిక్ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఇప్పటి వరకు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన మద్దతును తెలపలేదు. అయితే ఇవాళ ఒబామా దంపతులు .. కమలా హారిస్‌కు మద్దతు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment