
వాషింగ్టన్: డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌కు అధికారాన్ని అప్పగిస్తే అమెరికా కన్న కలలన్నీ సర్వనాశనం అవుతాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అమెరికా గొప్పతనాన్ని నాశనం చేయడంతో పాటుగా ప్రజలకెవరికీ ఉద్యోగాలు ఉండవన్నారు. కరోనా సంక్షోభం నుంచి బయట పడడానికి ఈ ఏడాది చివరిలోగా వ్యాక్సిన్ తీసుకువస్తానని హామీ ఇచ్చారు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా రెండోసారి నామినేషన్‌ను ఆమోదించిన సందర్భాన్ని పురస్కరించుకొని గురువా రం ట్రంప్ పార్టీ సదస్సులో మాట్లాడారు.
అందరి చూపు మెలానియా,ఇవాంక పైనే
సదస్సు వేదికపై మెలానియా ట్రంప్, ట్రంప్ మొదటి భార్య కుమార్తె ఇవాంకా ఒకరికొకరు ఎదురుపడిన వీడియో ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది. తన తండ్రిని అధ్యక్ష అభ్యర్థిగా పరిచయం చేసి వేదిక దిగి వస్తుండగా ఎదురపడిన మెలానియా ఇవాంకను చూసి చిరునవ్వుతో పలకరించారు. ఇవాంక కాస్త ముందుకు వెళ్లగానే మెలానియా ముఖంలో రంగులు మారాయి.
Comments
Please login to add a commentAdd a comment