ట్రంప్, హారిస్‌ హోరాహోరీ | USA Presidential Elections 2024: Trump and Harris Neck and Neck After Summer Upheaval, Times and Siena Poll Survey | Sakshi
Sakshi News home page

ట్రంప్, హారిస్‌ హోరాహోరీ

Published Tue, Sep 10 2024 5:42 AM | Last Updated on Tue, Sep 10 2024 3:12 PM

USA Presidential Elections 2024: Trump and Harris Neck and Neck After Summer Upheaval, Times and Siena Poll Survey

స్వల్ప ఆధిక్యత కనబరిచిన ట్రంప్‌

న్యూయార్క్‌ టైమ్స్, సియానా పోల్‌లో వెల్లడి

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్, డెమొక్రటిక్‌ అభ్యర్థి కమలా హారిస్‌ మధ్య పోరు హోరాహోరీగా కొనసాగుతోందని ఆదివారం విడుదలైన న్యూయార్క్‌ టైమ్స్, సియానా సర్వేలో వెల్లడైంది. ఆస్తులను ఎక్కువ చేసి చూపి రుణాలు పొందడం, పార్లమెంట్‌పైకి తన మద్దతుదారులను ఉసిగొల్పిన ఘటనల్లో నిందితుడిగా ఉన్నాసరే సగం ఓటర్లు ట్రంప్‌కు మద్దతు పలుకుతున్నట్లు సర్వే పేర్కొంది. 

దేశవ్యాప్తంగా చూస్తే దాదాపు 48 శాతం మంది ట్రంప్‌కు మద్దతు పలికారు. కమలా హారిస్‌ విస్కాన్సిన్, మిషిగన్, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో ఆధిక్యత చూపారు. నెవడా, జార్జియా, నార్త్‌ కరోలినా, అరిజోనాలో ఇద్దరికీ గట్టి పోటీ ఉంది. మిషిగన్, విస్కాన్సిన్‌లో హారిస్‌ ఒక శాతం ఆధిక్యం కనబరిచారని, పెన్సిల్వేనియాలో గట్టి పోటీ నెలకొందని సీబీఎస్‌ న్యూస్, యూగౌ సర్వేలో తేలింది.  

బిగ్‌ డిబేట్‌కు వేళాయే!
వాషింగ్టన్‌: డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్య అధ్యక్ష చర్చ మంగళవారం జరగనుంది. పలు అంశాలపై తమ వైఖరిని తెలుపుతూ అమెరికన్లను మెప్పించడానికి అధ్యక్ష అభ్యర్థులు సిద్ధమయ్యారు. ఏబీసీ న్యూస్‌ ఛానెల్‌లో ఈ బిగ్‌ డిబేట్‌ మంగళవారం రాత్రి 9 గంటలకు (భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 6:30 గంటలకు) జరగనుంది. ఫిలడెలి్ఫయాలోని నేషనల్‌ కాస్టిట్యూషన్‌ సెంటర్‌లో ఏబీసీ న్యూస్‌ యాంకర్లు డేవిడ్‌ ముయిర్, లిన్సే డేవిస్‌ దీన్ని నిర్వహిస్తారు. 90 నిమిషాల పాటు ఈ చర్చ ఉంటుంది. అధ్యక్ష చర్చ నిర్వహించే యాంకర్లు మాత్రమే ప్రశ్నలు 
అడుగుతారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement