హిల్లరీకి వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేయొద్దు
అమెరికా మాజీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ హిల్లరీ క్లింటన్కు వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేయవద్దని దేశంలో ప్రముఖ న్యూస్ చానల్స్కు ద రిపబ్లికన్ పార్టీ మంగళవారం హెచ్చరించింది. యూఎస్లోని ప్రముఖ న్యూస్ చానల్స్ సీఎన్ఎన్, ఎన్బీసీలకు ఈ మేరకు ద రిపబ్లికన్ నేషనల్ కమిటీ చైర్మన్ రినిస్ ప్రిబస్ మంగళవారం లేఖ రాశారు. 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆమె ఆ దేశాధ్యక్ష పదవికి డెమెక్రటిక్ అభ్యర్థిగా బరిలో నిలవనున్నారు. వ్యతిరేక కథనాల వల్ల హిల్లరీ తీవ్రంగా కలత చెందే అవకాశాలున్నాయన్నారు.
అలాగే ఆమెపై రూపొందించి ప్రసారం చేసే కథనాలపై అమెరికన్లు ఆ న్యూస్ చానల్స్ ప్రశ్నించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దానితోపాటు ఆ న్యూస్ చానల్స్ విశ్వసనీయత దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. కాగా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా జరిగే ప్రాధమిక చర్చల కథనాలను మాత్రం ప్రసారం చేయాలని ఆయా న్యూస్ చానల్స్కు సూచించారు. అయితే హిల్లరీపై చిన్న చిన్న కథనాలను రూపొందించి ప్రసారం చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఎన్బీసీ తెలిపింది. అలాగే ఆమెపై డాక్యుమెంటరీని నిర్మిస్తున్నట్లు సీఎన్ఎన్ పేర్కొంది. ఈ నేపథ్యంలో రినిస్ ప్రిబస్ ఆ న్యూస్ చానల్స్ ఈ హెచ్చరికలు జారీ చేశారు.