చట్టసభల్లో ట్రంప్‌ తొలి విజయం | In First Legislative Win For US President Trump | Sakshi
Sakshi News home page

చట్టసభల్లో ట్రంప్‌ తొలి విజయం.. లేకెన్‌ రిలే చట్టం గురించి తెలుసా?

Published Thu, Jan 23 2025 9:15 AM | Last Updated on Thu, Jan 23 2025 10:51 AM

In First Legislative Win For US President Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తొలి విజయం సాధించారు. ఆయన ప్రతిష్టాత్మకంగా భావించి తీసుకొచ్చిన ఇమ్మిగ్రేషన్‌ డిటెన్షన్‌ బిల్లు అమెరికా కాంగ్రెస్‌లో ఆమోదం పొందింది. దీంతో అక్రమ వలసదారులపై చర్యలకు లైన్‌ క్లియర్‌ అయినట్లయ్యింది. అలాగే రెండో దఫా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించగా ఆయన సంతకంతో చట్టం రూపం దాల్చిన తొలి బిల్లు కూడా ఇదే అయ్యింది.

లేకెన్‌ రిలే యాక్ట్‌ (Laken Riley Act) పేరుతో తీసుకొచ్చిన ఈ చట్టం ప్రకారం.. దొంగతనాలు, దొపిడీలు ఇతరత్రా చిన్నచిన్న నేరాల్లో శిక్ష పడిన, లేదంటే అలాంటి కేసులు ఉన్న అక్రమ వలసదారుల్ని ఇమ్మిగ్రేషన్ & కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(ICE) కచ్చితంగా‌ అదుపులోకి తీసుకోవాలి. వీలైతే వాళ్లను తిరిగి వెనక్కి పంపించేయాలి. ఎట్టి పరిస్థితుల్లో అమెరికాలో ఉంచడానికి వీల్లేదు. ఒకవేళ ఈ విషయంలో ఏదైనా పొరపాటు జరిగితే.. ఫెడరల్‌ ప్రభుత్వంపై దావాలు వేసే హక్కును స్టేట్‌ అటార్నీ జనరల్‌కు ఉంటుంది. ఈ చట్టాన్ని కిందటి ఏడాది రూపకల్పన చేశారు. తొలి నుంచి రిపబ్లికన్లు ఈ చట్టానికి మద్ధతుగా నిలవగా, డెమోక్రటిక్‌ పార్టీ మాత్రం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వచ్చింది.

ఆ ఏడాది జనవరి 3వ తేదీన 119వ అమెరికా కాంగ్రెస్‌(పార్లమెంట్‌) ప్రారంభమైన సంగతి తెలిసిందే. జనవరి 7వ తేదీన ఈ బిల్లును ప్రవేశపెట్టారు. హౌజ్‌ ఆఫ్‌‌ రిప్రజెంటేటివ్స్‌(ప్రతినిధుల సభ)లో ఇది 264-159తో ఆమోదం పొందింది. రిపబ్లికన్‌ పార్టీకి చెందిన సభ్యులంతా బిల్లుకు మద్ధుతగా ఓటేయగా, డెమోక్రటిక్‌(Democrtic Party) సభ్యుల్లో 48 మంది మద్దతు ప్రకటించారు.  జనవరి 20వ తేదీన సవరణతో కూడిన బిల్లుకు సెనేట్‌ ఆమోదం లభించింది. దీనికి 12 మంది రిబ్లికన్లు సైతం మద్దతుగా ఓటేశారు. చివరకు.. జనవరి 22వ తేదీన బిల్లు పాసైనట్లు హౌజ్‌ ప్రకటించింది.

అయితే.. లేకెన్‌ రిలే యాక్ట్‌ కిందటి ఏడాది మార్చి 27నే ప్రతినిధుల సభ ఆమోదం పొందింది. కానీ, సెనేట్‌లో డెమో​క్రటిక్‌ సభ్యుల అభ్యంతరాలతో అది ఆచరణకు నోచుకోలేదు.

అమెరికా జార్జియా స్టేట్‌ ఏథెన్‌లో  కిందటి ఏడాది ఫిబ్రవరి 22న 22 ఏళ్ల వైద్య విద్యార్థిని లేకెన్‌ రిలే(Laken Riley) దారుణంగా హత్యకు గురైంది. వెనిజులా నుంచి అక్రమంగా అమెరికాకు వలస వచ్చిన జోస్‌ ఆంటోనియా ఇబర్రా(26).. ఉదయం జాగింగ్‌కు వెళ్లిన లేకెన్‌ను దారుణంగా హతమార్చాడు.   ఈ కేసులో దోషిగా తేలిన సదరు అక్రమవలసదారుడికి పెరోల్‌ లేకుండా జీవితఖైదు విధించింది న్యాయస్థానం.  అయితే సదరు వ్యక్తిపై గతంలో ఓ కేసు నమోదు అయినప్పటికీ.. అరెస్ట్‌ మాత్రం జరగలేదు. ఆనాడు అరెస్ట్‌ అయ్యి ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదన్న విమర్శలు సర్వత్రా వినిపించాయి. అలాగే నేరాలకు పాల్పడే అక్రమ వలసదారులకు ఇమ్మిగ్రేషన్‌ చట్టాలు కల్పిస్తున్న రక్షణ ఆ టైంలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ కేసులో న్యాయం కోరుతూ విద్యార్థులంతా ఆందోళనబాట పట్టడంతో.. ట్రంప్‌ అప్పటి నుంచి ఈ చట్టానికి మద్దతు చెబుతూ వచ్చారు.

ఇదీ చదవండి: ట్రంప్‌ మీద కోర్టుకెక్కిన 22 రాష్ట్రాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement