
సాక్షి,లక్డీకాపూల్(హైదరాబాద్): మొగిలయ్య వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. బలగం సినిమాలో..‘నా తోడుగా నా తోడు ఉండి’అనే పాటతో ఫేమస్ అయిన బుడగ జంగాల కళాకారుడు మొగిలయ్య కిడ్నీ సంబంధ సమస్యలతో నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కాగా, శుక్రవారం మొగిలియ్యను మంత్రి ఎర్రబెల్లి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ నిమ్స్‌లో పరామర్శించారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. మొగిలయ్య ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నానని, ఆయనకు మంచి వైద్యం అందించాలని నిమ్స్ డాక్టర్లను ఆదేశించానని మంత్రి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment