erabelli DAYAKAR Rao
-
మొగిలయ్య వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది
సాక్షి,లక్డీకాపూల్(హైదరాబాద్): మొగిలయ్య వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. బలగం సినిమాలో..‘నా తోడుగా నా తోడు ఉండి’అనే పాటతో ఫేమస్ అయిన బుడగ జంగాల కళాకారుడు మొగిలయ్య కిడ్నీ సంబంధ సమస్యలతో నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కాగా, శుక్రవారం మొగిలియ్యను మంత్రి ఎర్రబెల్లి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ నిమ్స్‌లో పరామర్శించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. మొగిలయ్య ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నానని, ఆయనకు మంచి వైద్యం అందించాలని నిమ్స్ డాక్టర్లను ఆదేశించానని మంత్రి తెలిపారు. -
ఎర్రబెల్లి కాన్వాయ్‌లో వాహనం బోల్తా
జనగామ: గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కాన్వాయ్‌లోని ఓ వాహనం పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. శనివారం రాత్రి జనగామా జిల్లా లింగాలఘనపురం మండ లం చీటూరు శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. మంత్రి దయాకర్‌రావు హైదరాబాబాద్ నుంచి పాలకుర్తికి బయలు దేరారు. జనగా మ జిల్లా కేంద్రం వరకు కాన్వాయ్‌లోని వాహనాలన్నీ కలిసే వచ్చాయి. మంత్రితో ఉన్న కాన్వాయ్ మాత్రం వెళ్లిపోగా.. అందులోని ఒక వాహనం మధ్యలో కాసేపు ఆగి బయలు దేరింది. లింగాలఘనపురం మండలం చీటూరు శివారులో అదుపు తప్పి న వాహనం పల్టీలు కొట్టి రోడ్డుపక్కన పడిపోయింది. ప్రమాదం జరిగిన సమాచారాన్ని తెలుసుకున్న మంత్రి వెంటనే అక్కడికి చేరుకున్నారు. కారులో ఇరుక్కుపోయిన క్షతగాత్రులను జిల్లా ప్రభుత్వ ప్ర ధాన ఆస్పత్రికి తరలించారు. బుల్లెట్ ఫ్రూఫ్ కార్ డ్రైవర్ (ఏఆర్ కానిస్టేబుల్) పార్ధసారధి (43), సోషల్ మీడియా ఇన్చార్జి పూర్ణేందర్ (35) మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అటెండర్ తాతారావు, వ్యక్తిగత పీఏ శివ, గన్‌మెన్ నరేష్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స నిమిత్తం వారిని హైదరాబాద్ తరలించారు. అప్పటి వరకు తనతోనే ఉన్న ఇద్దరు మృతి చెందడంతో మంత్రి దయాకర్‌రావు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. -
పుట్టిన ఊరు కన్నతల్లితో సమానం
సాక్షి, కాటారం: మనం పుట్టి, పెరిగిన ఊరు కన్నతల్లితో సమానమని, గ్రామాభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గురువారం కాటారం మండల కేంద్రంలోని అయ్యప్ప కల్యాణ మండపంలో సర్పంచ్ తోట రాధమ్మ అధ్యక్షతన గ్రామసభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి దయాకర్‌రావు, మంథని, భూపాలపల్లి ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, గండ్ర వెంకటరమణారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్లు జక్కు శ్రీహర్షిణి, పుట్ట మధు హాజరయ్యారు. మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ.. గ్రామాలను అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. గ్రామాలను స్వచ్ఛత దిశగా తీసుకెళ్లే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. శ్రమదానాలు నిర్వహించడం, మొక్కలను నాటడం వంటి కార్యక్రమాల్లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని సూచించారు. గ్రామాభివృద్ధికి తోడ్పడిన వారికే గ్రామ అవసరాలు, ప్రభుత్వ పథకాల గురించి గ్రామసభలో ప్రశ్నించే హక్కు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకుంటే వ్యాధులు బాధ ఉండదని, బహిరంగ మలమూత్ర విసర్జన చేసేవారికి జరిమానాలు విధించాలని అధికారులను ఆదేశించారు. ప్రకృతిని నాశనం చేసే వారికి ఎంత ఫైన్ విధిస్తే బాగుంటుందని మంత్రి సభలో గ్రామస్తులను అడుగగా వారు రూ.500 అని అనడంతో అమలు చేయండి అని కలెక్టర్ వెంకటేశ్వర్లుకు సూచించారు. ప్రత్యేక కార్యచరణలో భాగంగా ప్రతి గ్రామం ఓ గంగదేవిపల్లిని మించిపోవాలని మంత్రి అన్నారు. 30 రోజుల ప్రణాళికను గ్రామంలో విజయవంతం చేసుకుంటే ఎన్ని నిధులు అడిగిన కేటాయించే బాధ్యత తనదని మంత్రి హామీ ఇచ్చారు. నిధుల కేటాయింపులో వెనకాడేది లేదన్నారు. ప్రతి ఏటా కాటారం గ్రామపంచాయతీకి 1.20కోట్లకు పైగా నిధులు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టారని కొనియాడారు. రానున్న రోజుల్లో మహిళా సంఘాల సభ్యులకు ఒక్కొక్కరికీ ఎలాంటి పూచికత్తు లేకుండా రూ.3లక్షల మేర రుణం ఇచ్చేలా ముఖ్యమంత్రి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలోని గ్రామాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర వాటాలతో పాటు మరిన్ని నిధులు సమకూర్చేలా మంత్రి చొరవ చూపాలన్నారు. చెక్‌పవర్‌పై సర్పంచ్‌ల్లో ఇంకా స్పష్టత రాలేదని ఆ అంశాన్ని పునఃపరిశీలించి అధికారాలు ఇస్తే గ్రామపంచాయతీలు మరింత అభివృద్ధి దిశగా ముందుకెళ్లే అవకాశం ఉందన్నారు. గ్రామసభలో కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈఓ శిరీష, ఆర్డీఓ వెంకటాచారి, ఎంపీపీ పంతకాని సమ్మయ్య, డీఆర్డీఓ సుమతి, ఎంపీడీఓ శంకర్, తహసీల్దార్ అశోక్‌కుమార్, ఎంపీటీసీలు తోట జనార్దన్, జాడి మహేశ్వరి, ఉడుముల విజయరెడ్డి, మహదేవపూర్ జడ్పీటీసీ గుడాల అరుణ, ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు నాయిని శ్రీనివాస్, ఆయా శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు. పంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ కాటారం: కాటారం గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణం కోసం కేటాయించిన స్థలంలో గురువారం రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు భూమి పూజ చేశారు. వేదమంత్రోచ్ఛరణల మధ్య ప్రతిష్టాపన రాయి వేశారు. కాగా కాటారం గ్రామపంచాయతీ భవనం గత కొంత కాలం క్రితం పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో నూతన పాలకవర్గం గత కొన్ని నెలలుగా కార్యాలయ నిర్వాహాణ అద్దె భవనంలో కొనసాగిస్తున్నారు. దీంతో నూతన భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలని ఇటీవల మండల పర్యటనకు వచ్చిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును సర్పంచ్ తోట రాధమ్మ, పాలకవర్గం సభ్యులు కోరారు. మంత్రి నిధుల మంజూరుకు సూచనాప్రాయంగా అంగీకరించడంతో గురువారం మండల పర్యటనకు వచ్చిన మంత్రి చేతుల మీదుగా భవన నిర్మాణం కోసం భూమి పూజ గావించారు. అనంతరం 30 రోజుల ప్రత్యేక కార్యచరణ ప్రణాళికలో భాగంగా స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారిన భవన నిర్మాణం కూల్చివేతలో మంత్రి పాల్గొన్నారు. మంత్రి స్వయంగా జేసీబీ నడిపి పాత భవనాన్ని కూల్చివేసి పారతో మట్టి ఎత్తి ట్రాక్టర్లో పోశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తోట రాధమ్మ, మంథని, భూపాలపల్లి ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, గండ్ర వెంకటరమణారెడ్డి, జయశంకర్భూపాలపల్లి, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్లు జక్కు శ్రీహర్షిణిరాకేశ్, పుట్ట మధు, జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈఓ శిరీష, ఆర్డీఓ వెంకటాచారి, ఎంపీపీ పంతకాని సమ్మయ్య, డీఆర్డీఓ సుమతి, ఎంపీడీఓ శంకర్, తహసీల్దార్ అశోక్‌కుమార్, ఎంపీటీసీలు తోట జనార్దన్, జాడి మహేశ్వరి, ఉడుముల విజయరెడ్డి, ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు నాయిని శ్రీనివాస్, జక్కు రాకేశ్, ఆయా శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు. -
పవర్ పక్కా లోకల్
సాక్షి, హైదరాబాద్ : కొత్త పంచాయతీరాజ్ చట్టం వెలుగులో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయాలని, గ్రామ పంచాయతీ నుంచి జిల్లా పరిషత్‌ల వరకు ఎవరు ఏ విధులు నిర్వర్తించాలనే విషయంలో పూర్తి స్పష్టత ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లు ఇప్పటి మాదిరిగా ఉత్సవ విగ్రహాలుగా ఉండబోవని, అధికార వికేంద్రీకరణ ద్వారా వారికి విధులు, నిధులు, బాధ్యతలు, అధికారాలు అప్పగిస్తామని స్పష్టం చేశారు. గ్రామాల్లో 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలవడానికి ముందే స్థానిక సంస్థలకు అప్పగించే విధులు, నిధులు, బాధ్యతల విషయంలో స్పష్టత ఇస్తామని వెల్లడించారు. గ్రామాలు, పట్టణాల్లో పచ్చదనం పెంచే కార్యక్రమాన్ని పర్యవేక్షించడం కోసం కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి గ్రీన్ కమిటీని నియమిస్తున్నట్లు చెప్పారు. పంచాయతీరాజ్ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. ‘‘గ్రామాలు బాగుపడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. పట్టుబట్టి పనిచేస్తే గ్రామాల్లో తప్పక మార్పు వస్తుందనే నమ్మకం నాకుంది. పల్లెల రూపురేఖలు మార్చడం కోసం ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టం తెచ్చింది. ప్రజాప్రతినిధులు, అధికారుల బాధ్యతలు స్పష్టంగా నిర్వచించాం. ఇప్పుడు ప్రభుత్వం స్థానిక సంస్థలకు అధికారాలను బదిలీ చేయాలని నిర్ణయించింది. సహాయ మంత్రి హోదాగల జిల్లా పరిషత్ చైర్పర్సన్ కూడా ప్రస్తుతం ఏ పనీ లేకుండా ఉండటం సమంజసం కాదు. ప్రజల ద్వారా ఎన్నికైన ఎంపీపీలు, జెడ్పీటీసీలదీ ఇదే కథ. భవిష్యత్తులో ఇలా జరగడానికి వీల్లేదు. స్థానిక ప్రజాప్రతినిధులు పాలనలో పూర్తిగా భాగస్వాములు కావాలి. విద్య, వైద్యం, పచ్చదనం, పారిశుద్ధ్యం.. ఇలా ఏ విషయంలో ఎవరి పాత్ర ఎంత అనేది నిర్ధారిస్తాం. గ్రామ పంచాయతీలు ఏం చేయాలి? మండల పరిషత్‌లు ఏం చేయాలి? జిల్లా పరిషత్‌లు ఏం చేయాలి? అనే విషయాలపై పూర్తి స్పష్టత ఇస్తాం. త్వరలోనే కేంద్ర ఆర్థిక సంఘం నిధులు కూడా వస్తాయి. దానికి సమానంగా రాష్ట్ర వాటా కేటాయిస్తాం. ఆ నిధులను స్థానిక సంస్థలకు విడుదల చేస్తాం. విధులను స్పష్టంగా పేర్కొన్న తర్వాత, నిధులు విడుదల చేశాకే గ్రామాల్లో 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రారంభిస్తాం’’అని సీఎం కేసీఆర్ చెప్పారు. విస్తృత చర్చలు, అధ్యయనం తర్వాత తుది రూపం.. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లు ఏ విధులు నిర్వర్తించాలి? ఏయే అంశాల్లో వారి బాధ్యతలు ఎంతవరకుంటాయి? ఎలాంటి అధికారాలుంటాయి? తదితర విషయాలపై సమగ్ర చర్చ, పూర్తి స్థాయి అధ్యయనం జరపాలని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. పంచాయతీరాజ్ విభాగంలో పని చేసిన అనుభవంగల నాయకులు, అధికారులు, నిపుణులతో విస్తృతంగా చర్చించి ముసాయిదా రూపొందించాలని సూచించారు. ముసా యిదాపై ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో చర్చిస్తామని, తర్వాత మంత్రివర్గ ఆమోదం అనంతరం అసెంబ్లీలోనూ విస్తృతంగా చర్చిస్తామని వెల్లడించారు. ఆయా సందర్భాల్లో వచ్చిన సూచనలు, సలహాలను కూడా పరిగణనలోకి తీసు కొని ప్రభుత్వం విధులు, నిధులు, బాధ్యతలు, అధికారాలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ ప్రక్రియ పూర్తై మున్సిపల్ ఎన్నికలు కూడా ముగిశాక గ్రామాల్లో, పట్టణాల్లో 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తామని చెప్పారు. ఖాళీలన్నీ భర్తీ చేయాలి... పంచాయతీ కార్యదర్శి నుంచి జిల్లా పరిషత్ సీఈవో వరకు అన్ని ఖాళీలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈవోపీఆర్డీ పోస్టులను ఇకపై మండల పంచాయతీ అధికారులుగా పరిగణిస్తామని చెప్పారు. గ్రామ కార్యదర్శులు, మండల పంచాయతీ అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, డివిజనల్ పంచాయతీ అధికారులు, డిప్యూటీ సీఈవోలు, డీపీఓలు, సీఈవోలు.. ఇలా అన్ని విభాగాల్లో అవసరమైన వారికి పదోన్నతులు కల్పిస్తూ ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శుల ఎంపికకు నేరుగా నియామకాలు జరపాలన్నారు. ఈ సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి, జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ ఎస్.కె.జోషి, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్, సీఎంవో కార్యదర్శులు స్మితా సబర్వాల్, భూపాల్‌రెడ్డి, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, ఎంపీ బండా ప్రకాశ్, ఎమ్మెల్యేలు మర్రి జనార్థన్‌రెడ్డి, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్సీలు శ్రీనివాస్‌రెడ్డి, తేరా చిన్నపురెడ్డి, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, గట్టు రామచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు. అధికారాలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ ప్రక్రియ పూర్తై మున్సిపల్ ఎన్నికలు కూడా ముగిశాక గ్రామాల్లో, పట్టణాల్లో 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తామని చెప్పారు. -
పోస్టుల వివరాలు సిద్ధం చేయండి
సాక్షి, హైదరాబాద్: గ్రామీణవికాసంలో కీలకమైన పంచాయతీరాజ్ శాఖను సంస్థాగతంగా బలోపేతం చేయాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయాలకు అనుగుణంగా ముందుకెళ్లాలని, ఈ మేరకు వెంటనే కార్యాచరణ సిద్ధం చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. పంచాయతీరాజ్, మండల పరిషత్, జిల్లా పరిషత్, గ్రామపంచాయతీలలో అవసరమైన పోస్టుల భర్తీకి అనుగుణంగా విభాగాల వారీగా, హోదాల వారీగా వివరాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం నిర్వహించిన సమావేశంలో ఇచ్చిన ఆదేశాల అమలు దిశగా మంత్రి ఎర్రబెల్లి ఆదివారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగా గ్రామాల వికాసం కోసం సమగ్ర విధానం తెచ్చేందుకు చర్యలు చేపట్టినట్టు చెప్పారు. ‘గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లకు నిధులు, విధులపై స్పష్టత ఇస్తూ కొత్త పంచాయతీరాజ్ చట్టం రూపొందించారు. పటిష్టమైన ఈ చట్టం అమలు కోసం చర్యలు తీసుకునేలా సంస్థాగతంగా పంచాయతీరాజ్ శాఖను బలోపేతం చేయాలి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని జిల్లాలకు డీపీవోలను నియమించాలి. ప్రతి డివిజన్‌కు ఒక్కరు చొప్పున డీఎల్పీవోలుండాలి. ప్రతి మండలానికి ఒక ఎంపీవోను నియమించాలి. ఈవోపీఆర్ అండ్ ఆర్డీ పేరును ఎంపీవోగా మార్చాలి. అన్ని స్థాయిల అధికారులకు పదోన్నతులు కల్పించి పోస్టులను భర్తీ చేయాలి. ఎంపీడీవోల పోస్టులను భర్తీ చేయాలి. అర్హత కలిగిన వారితో సూపరింటెండెంట్ పోస్టులను భర్తీ చేయాలి. అర్హులైన పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతులు ఇవ్వాలి. ప్రతి గ్రామానికి ఒక కార్యదర్శి ఉండాలి. అవసరమైన పోస్టులను వేగంగా భర్తీ చేయాలి. ఈ దిశగా వెంటనే చర్యలు మొదలుపెట్టాలి’అని సూచించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ కోసం అవసరమైన పారిశుధ్య కార్మికుల నియామకం, హేతుబద్ధీకరణ, గౌరవ వేతనాల ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని, గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరిసే విధంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టడం కోసం అమలు చేయాల్సిన 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుకోసం త్వరగా ఏర్పాట్లు పూర్తి చేయాలని, పవర్ వీక్, హరితహారం నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖ సంస్థాగత బలోపేతానికి అవసరమైన అన్ని వివరాలు, ముఖ్యంగా పోస్టుల వారీగా సమగ్ర వివరాలను, ఖాళీల సంఖ్యను సోమవారంలోపు ఇవ్వాలని పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. -
దాతల సహాయం కూడా తీసుకోండి: ఎర్రబెల్లి
సాక్షి, సంగారెడ్డి: దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా హరితహారం కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సహా ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా వాటిని అధిగమించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కాక ముందు 9 గంటలు విద్యుత్ వచ్చేదని ఇప్పుడు 24 గంటలు విద్యుత్ అందించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. 2016 నుంచి ప్రతి ఇంటికి నల్లా ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదే అని అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో తమకు ప్రాతినిథ్యం కలగలేదని సర్పంచ్‌లు ఆందోళన వ్యక్తం చేశారని ఎర్రబెల్లి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పంచాయతిరాజ్ చట్టంలోమార్పులు చేసి ఉద్యోగుల సరిగ్గా పని చేస్తున్నారా లేదా చూసే బాధ్యతను సర్పంచ్ లకు అప్పగించిందని అన్నారు. ఒకవేళ సర్పంచ్‌లు సరిగ్గా విధులు నిర్వహించకపోతే తీసివేసే ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్నట్లు ఆయన అన్నారు. హరితహారంలో భాగంగా సర్పంచ్‌లు కేవలం ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులే కాకుండా సొంత గ్రామాలలో దాతల సహాయం తీసుకోవాలని సర్పంచులకు సూచించారు. మొక్కలు నాటే బాధ్యతను 80 శాతం పూర్తి చేసిన గ్రామాన్ని దత్తత తీసుకుంటామని ఎర్రబెల్లి తెలిపారు. అడవులు అంతరించిపోయి కోతులు ఊర్లకు వస్తున్న స్రస్తుత తరుణంలో హరితహారాన్ని పెంచే విధంగా ప్రజా ప్రతినిధులు, సమాజం కృషి చేయాలని ఎర్రబెల్లి సూచించారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ... టీడీపీ, కాంగ్రెస్ పాలనలో అడవులను, పర్యావరణాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. అటవీశాఖలో నిధులు కేటాయించామని అన్ని గ్రామాల్లో మొక్కలు పెంచాలని సూచించారు. ఇక జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ 657గ్రామపంచాయతీలలో 1లక్ష 50 వేల మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నామని, దాదాపు 3 లక్షలు మొక్కలు నాటి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తామని అన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ అడవులు అంతరించిపోయి వర్షాలు లేని ప్రస్తుత తరుణంలో మొక్కలు నాటడం ఎంతో అవసరం అని అన్నారు. రేపటి తరాలకు ఆక్సిజన్ అందించాలంటే అందరు మొక్కలు నాటాలని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా సింగూరుకు నీటిని అందిస్తామని ఇంద్రకరణ్ హామీ ఇచ్చారు. వీటితో పాటు రెండు పడకల ఇళ్ళకు మంత్రి నిధులు మంజూరు చేశారు. ఇంకా ఈ కర్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, భూపాల్ రెడ్డి, మహిపాల్ రెడ్డి ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. -
డాక్టర్ అవ్వాలనుకున్నా.. నాయకుడినయ్యా
సాక్షి, ఎంజీఎం : కాకతీయ మెడికల్ కళాశాలలో వైద్యవిద్యను అభ్యసించిన విద్యార్థులకు ఐదు ఏళు మాత్రమే అనుబంధం ఉంటుంది.. నాకు మాత్రం కళాశాలతో 45 ఏళ్ల అనుబంధం ఉందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆదివారం కేఎంసీ వజ్రోత్సవ ముగింపు వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. ‘ఈ కళాశాల అంటే నాకు ప్రాణం.. మా తండ్రి కోరిక మేరకు డాక్టర్ కావాలని అనుకుడినే వాడిని.. కాని రాజకీయ నాయకుడిని.. మంత్రిని అయ్యాను.. వైద్యవృత్తి అంటే తనకు ఎంతో ఇష్టం.. రాజకీయ ఎదుగుదలకు వైద్యులు ఎంతో కృషి చేశారు’ అని అన్నారు. ఎల్బీ కళాశాలలో చదువుతున్నప్పుడు కాకతీయ మెడికల్ కళాశాలలో బుల్లెట్ మీద తిరిగేవాడిని.. నాటి మధుర స్మతులు నేటికీ గుర్తుకు వస్తున్నాయని పేర్కొన్నారు. సమాజంలో వైద్యులకు అరుదైన గౌరవం ఉందని, అంకిత భావంతో పనిచేసి రోగులకు మెరుగైన సేవలందించాలని సూచించారు. వజ్రోత్సవాలకు రూ.కోటి కేఎంసీ వజ్రోత్సవ వేడుకల కోసం సీఎం కేసీఆర్ రూ.కోటి కేటాయించారని, ఆ బడ్జెట్ అమలు ఎక్కడ నిలిచిపోయిందో తనకు తెలియందని మంత్రి అన్నారు. 1994 నుంచి 2004 వరకు ఎంజీఎం ఆస్పత్రి అభివృద్ధి కోసం జోలె పట్టుకుని చందాలు వసూలు చేశానని, వ్యాపారస్తులు, రాజకీయ నాయకుల దగ్గరకు వెళ్లి అభివృద్ధి కోసం పాటుపడ్డాడని గుర్తు చేశారు. ఎంజీఎం అభివృద్ధి నా వల్లే జరిగిందని అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి పేర్కొన్నారని, నా స్ఫూర్తితోనే ఆరోగ్య శ్రీ పథకాన్ని అమలు చేశారని అన్నారు. స్వయంగా ఈ అంశాన్ని రాజశేఖరరెడ్డి అసెంబ్లీలో వెల్లండిచారని పేర్కొన్నారు. సెంట్రల్ జైలు తరలింపునకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని మంత్రి వెల్లడించారు. అంతకుముందు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పలువురు వైద్యులను సత్కరించారు. కార్యక్రమంలో నగర మేయర్ గుండా ప్రకాశ్‌రావు, ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య, ఎంజీఎం సూపరింటెండెంట్ శ్రీనివాస్, అలుమినీ కమిటీ చైర్మన్ సుధాకర్‌రెడ్డి, కన్వీనర్ కాళీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పలువురు వైద్యులకు ఘన సన్మానం వజ్రోత్సవ వేడుకల సందర్భంగా పలువురు వైద్యులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన అలుమినీ కమిటీ సభ్యులతో పాటు కళాశాల కమిటీ సభ్యులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఘనంగా సత్కరించారు. ఆరోగ్యంగా జీవించడమే గొప్ప వరం ఆరోగ్యంగా జీవించడమే గొప్పవరం.. ఆస్తులను కోల్పోతే తిరిగి సంపాదించుకోవచ్చు.. ఆరోగ్యాన్ని కోల్పోతే సంపాదించుకోలేమని నగర మేయర్ గుండా ప్రకాశ్‌రావు పేర్కొన్నారు. వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఆదివారం ఉదయం సైకియాట్రిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 2కె వాక్ కార్యక్రమానికి ఆయన ప్రారంభించి మాట్లాడారు. వాక్ కాకతీయ మెడికల్ కళాశాల నుంచి ఎంజీఎం మీదుగా కొనసాగింది. ప్రముఖ వైద్యులు డాక్టర్ సుబ్రమణ్యేశ్వర్ మాట్లాడుతూ ఆరోగ్య సూత్రాలు పాటించి జీవితాన్ని సంతోషాన్ని గడపాలని సూచించారు. వైద్యులపై జరుగుతున్న దాడులను ఆయన తీవ్రంగా ఖండిస్తూనే.. దాడుపై మనం ఆలోచించాల్సి అవసరం కూడా ఉందన్నారు. కార్యక్రమంలో కేఎంసీ ప్రిన్సిపాల్ సంధ్య, వైద్యులు డాక్టర్ ఎర్ర శ్రీధర్‌రాజు, ఐఎంఏ అధ్యక్షుడు నల్లా సురేందర్‌రెడ్డి, రాంకుమార్‌రెడ్డి, బందెల మోహన్‌రావు, జార్జిరెడ్డి, మన్మోహన్రాజు, డాక్టర్ సంధ్యరాణి, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. – నగర మేయర్ గుండా ప్రకాశ్‌రావు -
టీఆర్ఎస్ లఫూట్ కార్యకర్తల పార్టీ
టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు వర్ధన్నపేట: రాష్ట్రంలో టీఆర్ఎస్ ఓ లఫూట్ కార్యకర్తల పార్టీగా మారిందని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని ఇల్లందలో శుక్రవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓ ఢిల్లీ పేపర్, మీడియా సర్వేల్లో కాంగ్రెస్ పార్టీ మూడో స్థానం, టీడీపీ మొదటి స్థానంలో ఉంటుందని వెల్లడించిందన్నారు. ఈ మీడియా సర్వేలో టీఆర్ఎస్ లఫూట్ కార్యకర్తల పార్టీ, కాంగ్రెస్ దొంగల పార్టీగా తేలిందన్నారు. టీఆర్ ఎస్‌లో చేరితే రూ. 15 కోట్లు ఇస్తామని చెబుతున్నారని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆరు నెలల క్రితమే చెబితే వద్దని వారించానన్నారు. మా (ఎమ్మెల్యే) జీతాలు పెంచమని మేము అడిగామా..? రాజకీయ లబ్ధికోసమే ప్రజాప్రతినిదుల వేతనాలను పెంచారని హన్మకొండలో శుక్రవారం నిర్వహించిన ఆర్టీసీ కార్మికుల అఖిలపక్ష సమావేశంలో ఎర్రబెల్లి సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు.