
జనగామ: గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కాన్వాయ్‌లోని ఓ వాహనం పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. శనివారం రాత్రి జనగామా జిల్లా లింగాలఘనపురం మండ లం చీటూరు శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. మంత్రి దయాకర్‌రావు హైదరాబాబాద్ నుంచి పాలకుర్తికి బయలు దేరారు. జనగా మ జిల్లా కేంద్రం వరకు కాన్వాయ్‌లోని వాహనాలన్నీ కలిసే వచ్చాయి. మంత్రితో ఉన్న కాన్వాయ్ మాత్రం వెళ్లిపోగా.. అందులోని ఒక వాహనం మధ్యలో కాసేపు ఆగి బయలు దేరింది. లింగాలఘనపురం మండలం చీటూరు శివారులో అదుపు తప్పి న వాహనం పల్టీలు కొట్టి రోడ్డుపక్కన పడిపోయింది. ప్రమాదం జరిగిన సమాచారాన్ని తెలుసుకున్న మంత్రి వెంటనే అక్కడికి చేరుకున్నారు.
కారులో ఇరుక్కుపోయిన క్షతగాత్రులను జిల్లా ప్రభుత్వ ప్ర ధాన ఆస్పత్రికి తరలించారు. బుల్లెట్ ఫ్రూఫ్ కార్ డ్రైవర్ (ఏఆర్ కానిస్టేబుల్) పార్ధసారధి (43), సోషల్ మీడియా ఇన్‌చార్జి పూర్ణేందర్ (35) మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అటెండర్ తాతారావు, వ్యక్తిగత పీఏ శివ, గన్‌మెన్ నరేష్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స నిమిత్తం వారిని హైదరాబాద్ తరలించారు. అప్పటి వరకు తనతోనే ఉన్న ఇద్దరు మృతి చెందడంతో మంత్రి దయాకర్‌రావు తీవ్ర మనోవేదనకు గురయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment