jangama
-
జనగామలో బండి సంజయ్ అరెస్ట్
-
బీసీల అభ్యున్నతికి సీఎం జగన్ కృషి: సజ్జల
సాక్షి, అమరావతి: బీసీల అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాటలు వేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. సోమవారం నిర్వహించిన జంగం కార్పొరేషన్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. శైవ క్షేత్రాల్లో జంగం కులం వారిని పెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. -
విషాదం.. చెరువులో జారిపడి అన్నాదమ్ముల మృతి
సాక్షి,కామారెడ్డి: కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం జనగామ గ్రామంలో విషాదం చోటుచేసుకొంది. ఇద్దరు అన్నదమ్ములు చెరువులో మునిగి మృతి చెందారు. యాడారం గ్రామంలో అంత్యక్రియలకు హాజరై జనగామ శివారులోని బురుకుంట చెరువులో కాళ్లు చేతులు కడుక్కునేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో జారిపడి మృతి చెందారు. మృతి చెందిన వారిలో 12 ఏళ్ల బెల్లెడ కార్తీక్ ఒకరు, కాగా మరొకరు 15 ఏళ్ల బెల్లెడ సంతోష్. తల్లిదండ్రులు రామస్వామి, శ్యామలలతో కలిసి పిల్లలు అంత్యక్రియలకు వెళ్లారు. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత వీరి తల్లిదండ్రులతో పాటు కార్తీక్, సంతోష్ లు చెరువులోకి వెళ్లారు. కాళ్లు కడుక్కునే క్రమంలో ప్రమాదవశాత్తు జారి అందులో పడి మృతి చెందారు. పిల్లల్ని కనిపెట్టుకుని ఉండకపోవడంతోనే ఘోరం జరిగిందని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్తీక్ జనగామ గ్రామంలో ఆరో తరగతి చదువుతున్నాడు. సంతోష్ బిక్కనూర్‌లోని రెసిడెన్షియల్లో ఇటీవల పదో తరగతి పూర్తి చేసుకున్నాడు. అన్నదమ్ములు మృతిచెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించి నట్లు పోలీసులు తెలిపారు. చదవండి:విషాదం: అదృశ్యమైన చిన్నారులు చెరువులో శవాలై. -
ముత్తిరెడ్డికి పాజిటివ్.. భార్య స్పందన
సాక్షి, హైదరాబాద్ : జనగామ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంపై ఆమె సతీమణి పద్మలతా రెడ్డి స్పందించారు. ఆయన ఆరోగ్యంపై స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో వాట్సప్ వాయిస్ రికార్డు ద్వారా ఓ ప్రకటన చేశారు. ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్‌గా తేలిందని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముత్తిరెడ్డి.. శుక్రవారం హైదరాబాద్‌లో కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలిందని చెప్పారు. నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. ఎమ్మెల్యేకు వైరస్ సోకడంతో అధికారులు సూచనల మేరకు తమ కుటుంబ సభ్యులంతా పరీక్షలు చేయించుకున్నామని, వాటి రిపోర్టు రావాల్సి ఉందన్నారు. (ఎమ్మెల్యేకు పాజిటివ్: నిర్బంధంలోకి హరీష్) ప్రస్తుతానికి తామంతా స్వీయ నిర్బంధంలో ఉన్నామని తెలిపారు. ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని మరో వారంలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని చెప్పారు. తమ నాయకుడి ఆరోగ్యంపై ఆరా తీస్తున్న కార్యకర్తలు, అభిమానులందరికీ ఆమె క్షతజ్ఞతలు తెలిపారు. ప్రజలంతా భౌతిక దూరం పాటిస్తూ ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలని పద్మలతా సూచించారు. కాగా తెలంగాణలో కరోనా బారినపడిన తొలి ఎమ్మెల్యే ముత్తిరెడ్డినే కావడం గమనార్హం. మరోవైపు మంత్రి హరీష్ రావు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సైతం స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. -
ఎర్రబెల్లి కాన్వాయ్‌లో వాహనం బోల్తా
జనగామ: గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కాన్వాయ్‌లోని ఓ వాహనం పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. శనివారం రాత్రి జనగామా జిల్లా లింగాలఘనపురం మండ లం చీటూరు శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. మంత్రి దయాకర్‌రావు హైదరాబాబాద్ నుంచి పాలకుర్తికి బయలు దేరారు. జనగా మ జిల్లా కేంద్రం వరకు కాన్వాయ్‌లోని వాహనాలన్నీ కలిసే వచ్చాయి. మంత్రితో ఉన్న కాన్వాయ్ మాత్రం వెళ్లిపోగా.. అందులోని ఒక వాహనం మధ్యలో కాసేపు ఆగి బయలు దేరింది. లింగాలఘనపురం మండలం చీటూరు శివారులో అదుపు తప్పి న వాహనం పల్టీలు కొట్టి రోడ్డుపక్కన పడిపోయింది. ప్రమాదం జరిగిన సమాచారాన్ని తెలుసుకున్న మంత్రి వెంటనే అక్కడికి చేరుకున్నారు. కారులో ఇరుక్కుపోయిన క్షతగాత్రులను జిల్లా ప్రభుత్వ ప్ర ధాన ఆస్పత్రికి తరలించారు. బుల్లెట్ ఫ్రూఫ్ కార్ డ్రైవర్ (ఏఆర్ కానిస్టేబుల్) పార్ధసారధి (43), సోషల్ మీడియా ఇన్చార్జి పూర్ణేందర్ (35) మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అటెండర్ తాతారావు, వ్యక్తిగత పీఏ శివ, గన్‌మెన్ నరేష్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స నిమిత్తం వారిని హైదరాబాద్ తరలించారు. అప్పటి వరకు తనతోనే ఉన్న ఇద్దరు మృతి చెందడంతో మంత్రి దయాకర్‌రావు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. -
నయా మోసగాళ్లు..
సాక్షి, జనగామ: గ్రామీణ ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఈజీగా డబ్బులు సాధించాలనే తపనతో తప్పుడు మార్గాలను ఎంచుకుంటున్నారు. ఏకంగా ప్రభుత్వ పథకాల పేరు చెప్పి ప్రజలను దోపిడీ చేయడానికి పక్కాగా ప్లాన్ వేస్తున్నారు. ఎక్కడ లేనట్లుగా ప్రజలను మభ్యపెట్టి డబ్బులు గుంజుతూ అడ్డంగా బుక్ అవుతున్నారు. జిల్లాలో ఇటీవల జరుగుతున్న వరుస ఘటనలు ఆద్యంతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. స్టేషన్‌ఘన్‌పూర్ మండలం నమిలిగొండలో జరిగిన ఆధార్ మోసం నుంచి తేరుకోక ముందే జనగామ మండలంలో డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేయడం సంచలనం సృష్టిస్తోంది. నమిలిగొండలో ‘ఆధార్’ మోసం.. జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్ మండలం నమిలిగొండలో ఆధార్ కార్డులతో ఓ వ్యక్తి మోసానికి పాల్పడ్డాడు. ఈ ఏడాది జూలై 1వ తేదీన నమిలిగొండ గ్రామానికి వరంగల్ రూర ల్ జిల్లా నెక్కొండ మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన అలువాల వినయ్‌కుమార్ చేరుకున్నారు. ప్రధాన మంత్రి మోదీ మీ ఖాతాల్లో డబ్బులు వేస్తారని గ్రామంలో దండోరా వేయించారు. ఆధార్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్ పట్టుకొని గ్రామ పంచాయతీకి రావాలని కోరారు. దీంతో గ్రామస్తులు ఆధార్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్కులను పట్టుకొని అక్కడకు చేరుకున్నారు. వినయ్‌కుమార్ నాలుగు రోజులు గ్రామంలోనే మాకాం వేసి ఆధార్ కార్డు ఆధారంగా గ్రామస్తుల ఖాతాల నుంచి డబ్బులను డ్రా చేసుకున్నారు. తమ ఖాతాల నుంచి డబ్బులు డ్రా అయినట్లు మెసేజ్ రావడంతో మోసపోయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుతో కొత్త వ్యక్తుల మాటలు నమ్మొద్దు.. గ్రామాల్లోకి కొత్త వ్యక్తులు వచ్చి ఏం చెప్పిన నమ్మొద్దు. ప్రభుత్వ పథకాల కోసం ప్రభుత్వ అధికారులకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. సులువుగా డబ్బులు సంపాదించానే ఉద్ధేశ్యంతో గ్రామీణ ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆధార్, బ్యాంకు నంబర్లు, ఏటీఎం పిన్ నంబర్లు అపరిచిత వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వరాదు. గ్రామాల్లోకి కొత్త వ్యక్తుల సంచారం ఉన్నా, అనుమానాస్పదంగా కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. – బి. శ్రీనివాసరెడ్డి, డీసీపీ -
నిట్‌తోనే నాకు గుర్తింపు
సాక్షి, కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్‌లో విద్యనభ్యసించడం ద్వారానే సినీ రంగంలో ప్రత్యేక గుర్తింపు లభించిందని ఆర్ఎక్స్ –100 హీరో కార్తి్కేయ తెలిపారు. నిట్‌లో నిర్వహిస్తున్న టెక్నోజియాన్–19 నోవస్ ముగింపు సందర్భంగా ఆదివారం గెస్ట్లెక్చర్లో భాగంగా ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ‘సాక్షి’తో తన సినీరంగ ప్రవేశం, నిట్ జ్ఞాపకాలను పంచుకున్నారు. చిన్నప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగానని, ఆయన స్ఫూర్తితో యాక్టింగ్ తనను సినీరంగంలోకి అడుగుపెట్టేందుకు దోహదపడిందన్నారు. నిట్‌తోనే హీరోగా ఎదిగే అవకాశం మాది హైదరాబాద్ విఠల్‌రెడ్డి, రజితలు నా తల్లిదండ్రులు. నాన్న అమ్మా నాగార్జున గ్రుప్ ఆఫ్ స్కూల్స్‌ను నిర్వహిస్తున్నారు. నన్ను మా అమ్మ ఎంతో ఇష్టపడి, నన్ను కష్టపెట్టి నిట్ వరంగల్‌లో సీటు సాధించే విధంగా చదివించింది. కానీ నాకు యాక్టింగ్ అంటే పిచ్చి. మా సీనియర్ మణికాంత్ తాను తీసే షార్ ఫిల్మ్స్‌లో నేను నటించేవాడిని. డ్యాన్స్ చేసే వాడిని నా తొలి డైరెక్టర్, అభిమాని తానే. నిట్ వరంగల్‌లో 2010 బ్యాచ్‌లో కెమికల్ ఇంజనీరింగ్‌లో చేరాను. టెక్నోజియాన్, స్ప్రీంగ్స్ప్రీలలో ఆడీనైట్లో నా డ్యాన్స్‌తో మైమరపించేవాడ్ని, గుడ్ డ్యాన్సర్ అంటూ అమ్మాయిలు మెసేజ్ పెట్టేవారు. నాలుగు సంవత్సరాల నిట్ విద్యాభ్యాసంలో నాలుగు వేల మందిని అలరించడంతో ధైర్యం వచ్చింది. నిట్‌లో చదువుకుంటున్న సమయంలో రామప్ప, వెయ్యిస్తంభాల గుడి, లక్నవరాన్ని సందర్శించేవాడ్ని. ప్రతి సినిమాను భవానీ టాకీస్‌లో చూసేవాడ్నీ. క్యాంపస్ ఇంటర్వ్యూలు వదిలేశా.. చిన్నప్పటి నుంచి యాక్టర్ కావాలనేదే నా ఆశయం. దీంతో నిట్‌లో ఉన్న నాలుగు సంవత్సరాలు యాక్టింగ్పైనే దృష్టి పెట్టాను. కళాశాలలో ప్రతి ఒక్క విద్యార్థి, ప్రొఫెసర్లు నన్ను యాక్టర్ అవుతావని ఎంకరేజ్ చేశారు. యాక్టర్ కావాలనే సంకల్పంతో నిట్‌లో క్యాంపస్ ఇంటర్వ్యూలు కూడా వదులుకున్నాను. నిట్‌లో చదువుకునే అవకాశం రావడం అదృష్టం. నిట్‌లో నుంచి బయటకు వెళ్లే సమయం ఫైనల్ ఇయర్లోనే కెరీర్ ఫైనల్ కావాలి. ఆర్ఎక్స్–100తో హీరోగా గుర్తింపు... నిట్ నుంచి 2014 బీటెక్ పూర్తి చేసి బయటకు వెళ్లిన తర్వాత సుబ్బారావు నేషనల్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ కోర్సులో చేరాను. 2018లో డైరెక్టర్ అజయ్ ఆర్ఎక్స్–100కు హీరోగా సెలెక్ట్ చేశారు. ఆర్ఎక్స్–100 నన్ను యాక్టర్‌గా, హీరోగా నిలబెట్టి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది. గ్యాంగ్ లీడర్లో నాని హీరోగా మంచి హీరోయిజంతో కూడిన విలన్ పాత్రను డైరెక్టర్ గుణ æవివరించగా ఒప్పుకున్నాను. త్వరలో 90 ఎంఎల్ సినిమాతో మీ ముందుకు వస్తున్నాను. నేను చదువుకున్న నిట్ వరంగల్‌కు నేను హీరోగా మారి అతిథిగా రావడం ఆనందంగా ఉంది. నాడు నేను చదువుకున్న తరగతులు, నేను డ్యాన్స్ చేసిన, నన్ను యాక్టర్‌గా తీర్చిదిద్దిన ఆడిటోరియాన్ని మరువలేను. -
జనగామలో కమలం దూకుడు
సాక్షి, జనగామ: వరుసగా కేంద్రంలో రెండోసారి అధికార పగ్గాలు చేపట్టడం.. ప్రధాని మోదీకి ఉన్న ప్రజాధరణతో క్షేత్రస్థాయిలో బలోపేతం కావడం కోసం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్ర ప్రయత్నాలు సాగిస్తోంది. జనంలో పలుకుబడి ఉన్న నాయకులను పార్టీలో చేర్చుకొని రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా నిలబడేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. జిల్లా కేంద్రమైన జనగామ మునిసిపాలిటీలో పాగా వేయడం కోసం ఆ పార్టీ నాయకులు రెండు నెలల నుంచి కసరత్తు ప్రారంభించారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎదుర్కొనేందుకు పార్టీశ్రేణుల్లో ఉత్తేజం నింపుతున్నారు. పెరిగిన రాష్ట్ర స్థాయి నేతల పర్యటనలు.. రెండు నెలల క్రితమే మునిసిపాలిటీ ఎన్నికలు జరుగుతాయనే ఊహాగానాల నేపథ్యంలో బీజేపీ నాయకులు దూకుడు పెంచారు. అప్పటి నుంచి జిల్లా కేంద్రానికి ఆ పార్టీ ముఖ్య నేతల పర్యటనలు పెంచారు. రాష్ట్ర కార్యదర్శి మంత్రి శ్రీనివాస్‌తో మొదలైన పర్యటనలు కొనసాగుతూనే ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే ఝెండల లక్ష్మీనారాయణ, రఘునందన్‌రావు, కొల్లి మాధవి వంటి రాష్ట్ర నాయకులు జిల్లా కేంద్రంలో జరిగిన పార్టీ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ నెల 13వ తేదీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్‌తోపాటు మాజీ ఎంపీలు వివేక్, రాపోలు ఆనందభాస్కర్, మాజీ మంత్రి విజయరామారావు వంటి నేతలు జిల్లా కేంద్రానికి వచ్చారు. ఇప్పటికే జనగామ జిల్లా సాధన కమిటీ, జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంత్‌రెడ్డితోపాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు బి. శ్రీనివాస్, సీనియర్ నాయకుడు కత్తుల రాజిరెడ్డి బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. జిల్లా కేంద్రానికి చెందిన మరో ఇద్దరు ప్రముఖులు పార్టీలో చేరయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. దళిత, గిరిజన సామాజిక వర్గాలకు చెందిన వారు కావడం, రాజకీయాలతో సంబంధం ఉండడంతో వారు చేరితే పార్టీకి అనుకూలంగా మారుతుందని భావిస్తున్నారు. క్లస్టర్, కోర్ కమిటీల ఏర్పాటు.. పార్టీని బలోపేతం చేయడంతోపాటు మునిసిపాలిటీ ఎన్నికలే టార్గెట్‌గా ఆ పార్టీ ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది. పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక క్లస్టర్‌గా విభజించారు. భువనగిరి పార్లమెంటు స్థానాన్ని క్లస్టర్‌గా ఏర్పాటు చేసి దుగ్యాల ప్రదీప్‌రావు, మనోహర్‌రెడ్డితోపాటు మరో ముగ్గురు సభ్యులతో క్లస్టర్ కమిటీని ఏర్పాటు చేశారు. మునిసిపాలిటీని పరిధిని కోర్ కమిటీగా నియమించారు. కోర్ కమిటీలో ఐదురుగు సభ్యులను నియమించారు. క్లస్టర్, కోర్ కమిటీలను రాష్ట్ర పార్టీ ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తుంది. సూర్యాపేట రోడ్డులో పార్టీ కార్యాలయ నిర్మాణం.. జిల్లా కేంద్రంలో శాశ్వత ప్రతిపాదికగా పార్టీ కార్యాలయాన్ని నిర్మించడానికి నాయకత్వం ఏర్పాట్లు చేస్తోంది. సూర్యాపేట రోడ్డులోని 163వ జాతీయ రహదారి బైపాస్ సమీపంలో ఎకరం స్థలం విస్తీర్ణంలో కార్యాలయాన్ని నిర్మించబోతున్నారు. కొత్త కలెక్టరేట్‌కు దగ్గరగా ఉండడంతోపాటు జనగామ, పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గాలకు అందుబాటులో ఉంటుందనే కారణంగానే అక్కడ పార్టీ కార్యాలయాన్ని నిర్మాణం చేస్తున్నట్లు పార్గీ వర్గాలు చెబుతున్నాయి. దసరా నాటికి పార్టీ కార్యాలయ నిర్మాణ పనులను ప్రారంభించే అవకాశాలున్నాయి. రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ చేతుల మీదుగా నిర్మాణ పనులు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
ప్రభాస్ రాకపోతే.. టవర్ నుంచి దూకేస్తా!
సాక్షి, జనగామ: సినీ తారలకు పెద్దసంఖ్యలో అభిమానులు ఉంటారు. తమ అభిమాన తారను చూసేందుకు ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటాను. కానీ, అభిమానం ముదిరి.. వెర్రీగా మారితేనే చిక్కు! అలాంటి ఘటన జనగామలో చోటుచేసుకుంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కోసం ఓ యువకుడు ఏకంగా సెల్ టవర్ ఎక్కాడు. అత్యంత ప్రమాదకరంగా సెల్ టవర్ అంచు మీద నిలబడి.. ప్రభాస్ వస్తేనే టవర్ దిగుతానని, లేకపోతే దూకి చస్తానని బెదిరిస్తున్నాడు. జనగామ జిల్లా యశ్వంత్‌పుర పెట్రోల్ బంక్ పక్కన ఉన్న సెల్ టవర్‌పైకి గుగులోతు వెంకన్న అనే యువకుడు ఎక్కాడు. గుగులోతు వెంకన్నది మహబూబాబాద్. అతడు ప్రభాస్ అభిమాని అని తెలుస్తోంది. ప్రభాస్ అంటే ఇష్టమని, ప్రభాస్‌ను చూడాలని ఉందని సెల్ టవర్‌పైకి ఎక్కిన వెంకన్న డిమాండ్ చేస్తున్నాడు. తనను చూసేందుకు, కలిసేందుకు ప్రభాస్ రాకపోతే సెల్ టవర్ పై నుంచి దూకేస్తానని అతను బెదిరించాడు. ఇదేమీ విడ్డూరమని విస్తుపోతున్న స్థానికులు.. యువకుడిని బతిమాలి కిందికి దించేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. -
దేవుడికే శఠగోపం
సాక్షి, స్టేషన్‌ఘన్‌పూర్ : అక్రమార్కులు దేవుడికే శఠగోపం పెట్టారు. సుమారుగా రూ. కోటిన్నర విలువ చేసే ఎకరం దేవాలయ స్థలాన్ని నిసిగ్గుగా కబ్జా చేసి దొంగ పట్టాలు సృష్టించారు. వాటిల్లో ఇప్పుడు నిర్మాణాలు చేపట్టారు. కబ్జా వెనుక ‘పెద్దల’ హస్తం ఉండడంతో అధికారులు చూసీ చూడనట్లు వదిలేశారు. ఐదేళ్లుగా సర్వేల పేరుతో కాలయాపన చేస్తున్నారు. ఇదీ జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ డివిజన్ కేంద్రం బస్టాండ్ సమీపంలోని శ్రీ తిరుమలనాథస్వామి దేవస్థానం భూముల పరిస్థితి. భూముల కబ్జాపై ప్రత్యేక కథనం.. స్టేషన్‌ఘన్‌పూర్ డివిజన్ కేంద్రం బస్టాండ్ సమీపంలోని శ్రీ తిరుమలనాథస్వామి దేవస్థానం ఉంది. సర్వేనెంబర్ 641లో మూడెకరాల 29 గుంటల దేవాలయ భూమి ఉంది. 1999 సంవత్సరంలో ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి దేవాదాయ శాఖ నుంచి రెండెకరాల భూమిని ఆర్టీసీ కొనుగోలు చేసింది. ఇంకా ఎకరం 29 గుంటల భూమి దేవాలయానికి ఉండాలి. దీనిపై ఐదేళ్ల క్రితం కొందరు అక్రమార్కుల కన్నుపడింది. దీంతో ‘పెద్దల’ సహకారంలో ఆక్రమణకు పూనుకున్నారు. అధికారుల, ప్రజాప్రతినిధుల అండదండలు, ఆర్థిక పలుకుబడితో అక్రమ పట్టాలు సృష్టించారు. యథేచ్చగా అమ్మకాలు చేపట్టారు. వాటిలో ప్రస్తుతం నిర్మాణాలు సైతం జరుగుతున్నాయి. ప్రస్తుతం దాదాపు 40 గుంటలలోపు భూమి మాత్రమే ఉంది. అధికారులు సర్వేలతో కాలయాపన చేస్తూ నిర్లక్ష్యం చేస్తే ఉన్న భూమి కూడా దక్కదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఆలయభూమిలో సగం వరకు అన్యాక్రాంతం కాగా అందులో ఇప్పటికే పలువురు భవనాలు నిర్మించారు. సర్వేలతో కాలయాపన దేవస్థాన భూములు అన్యాక్రాంతం చేస్తున్నారని భక్తులు, స్థానికులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో గాంధీ చౌరస్తా నుంచి తిరుమలనాధస్వామి దేవస్థానం వరకు దేవాదాయ శాఖ అధికారులు గతంలో పలుమార్లు సర్వే చేశారు. ఏడాదిన్నర క్రితం తిరిగి సర్వే చేసిన అధికారులు దేవస్థాన భూమి వద్ద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. హద్దులుగా కనీలను నాటించారు. అయితే కొందరు కనీలను తొలగించి బాటగా చేశారు. అయినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి దేవస్థాన భూములను పరిరక్షించాలని స్థానికులు కోరుతున్నారు. ఆలయ భూములను పరిరక్షించాలి తిరుమలనాధ దేవస్థాన భూములను పరిరక్షించాలి. ఇప్పటికే దేవస్థాన భూములు సగం వరకు అన్యాక్రాంతమయ్యాయి. అధికారులు ప్రత్యేక చొరవతో పనిచేయాలి. అన్యాక్రాంతమైన దేవస్థాన భూములను పరిరక్షించేలా చర్యలు తీసుకోవాలి. -కుంభం కుమారస్వామి, దేవస్థాన చైర్మన్ -
చెట్టును ఢీకొన్న బస్సు,24మందికి గాయాలు
-
‘మిషన్ భగీరథ’ పనులను పూర్తి చేయాలి
జనగామ అర్బన్ : జిల్లాలో మిషన్ భగీరథ పనులను సకాలంలో పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో బుధవారం సాయంత్రం అధికారులతో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 90శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన పది శాతం పనులను మే పదో తేదీ వరకు పూర్తి చేయాలన్నారు. ఇందుకు అవసరమైన చర్యలను కలెక్టర్‌తో పాటు మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్ విజయ్‌పాల్‌రెడ్డి, ఎస్ఈ ఏసురత్నాల నుంచి తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పనుల్లో అలసత్వం ప్రదర్శించే అధికారులను ఉపేక్షించేది లేదన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్నీ గ్రామాల్లో అర్హులైన వారి ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఓ వైపు పనులు చేస్తూనే మరోవైపు మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీరు సురక్షితమైందనే విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి మాట్లాడుతూ జఫర్‌గఢ్ మండలంలో కూడా మిషన్ భగీరథ పనులను సాధ్యమైనంత తర్వగా పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. సమావేశంలో ప్రభుత్వ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎంపీ బూరనర్సయ్య గౌడ్, రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య, ఎర్రబెల్లి దయాకర్‌రావు, అధికారులు పాల్గొన్నారు. -
జయహో జనగామ
ఉద్యమ గడ్డపై మిన్నంటిన సంబురాలు జనగామ జిల్లా ఏర్పాటుకు సీఎం అంగీకారం అన్ని వర్గాల్లో వెల్లువెత్తిన హర్షాతిరేకాలు పార్టీల జెండాలతో కార్యకర్తల కోలాహలం జనగామ : జనగామ పోరుగడ్డ తన ఉద్యమ పటిమను మరోమారు చాటుకుంది. పోరాటాలతో దేన్నైనా సాధించుకుంటామని నిరూపించుకుంది. జిల్లా కోసం ఏడాదిగా చేస్తున్న పోరాటంలో విజయం సాధించింది. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రజా ప్రతినిధుల సమావేశంలో జనగామ జిల్లా ఏర్పాటుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో డివిజన్వ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. సాయంత్రం 4.30 గంటలకు సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి సమాచారం అందుకున్న అధికార, ప్రతిపక్ష నాయకులు వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపైకి చేరుకొని పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. అన్ని వర్గాల ప్రజలు డప్పు చప్పుళ్లతో నృత్యాలు చేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సీహెచ్.రాజారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నాగారపు వెంకట్, మహిళా కౌన్సిలర్లు వంగాల కళ్యాణి, పన్నీరు రాధిక, వేమళ్ల పద్మతో పాటు అన్ని పార్టీల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జర్నలిస్టుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహం వద్ద స్వీట్లు పంపిణీ చేశారు. నెరవేరిన ప్రజల ఆకాంక్ష జిల్లాల పునర్విభజనలో జనగామ పేరు ప్రతిపాదించడంతో సంబురాలు చేసుకున్న ప్రజల సంతోషాలు క్షణాల్లో కనుమరుగయ్యాయి. దీంతో ఆగ్రహావేశాలకు లోనైన సకల జనులు ఉద్యమాలకు నాంది పలికారు. ఏడాది పాటు జాతీయ రహదారిని దిగ్భందిస్తూ, వరంగల్–హైదరాబాద్‌కు వెళ్లే అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు జనగామ పౌరుషాన్ని చూపించారు. అన్ని రాజకీయ పార్టీలతో కలసి జేఏసీగా ఏర్పడి అనేక ఉద్యమాలు చేశారు. రాజకీయంగా ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ..దైవాన్ని కూడ నమ్ముకున్నారు. జన గర్జన సభతో జనగామ సత్తా చాటిన ప్రజలు.. చివరకు జిల్లాను సాధించుకొని విజయగర్వంతో తలెత్తుకున్నారు. జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంత్‌రెడ్డి, డాక్టర్ లకీ‡్ష్మనారాయణ నాయక్, డాక్టర్ రాజమౌళి, బండ యాదగిరిరెడ్డి, ఆముదాల మల్లారెడ్డి, పోకల లింగయ్య, పజ్జూరి గోపయ్య, ఆకుల సతీష్, ఆకుల వేణు, ధర్మపురి శ్రీనివాస్, రంగరాజు ప్రవీన్‌కుమార్, ఉడ్గుల రమేష్, బర్ల శ్రీరాములు, వైఎస్ఆర్ సీపీ పట్టణ, మండల అధ్యక్షులు రొడ్డ కృష్ణ, చిన్నపాగ వెంకటరత్నం, కల్లెపు ప్రవీణ్ తదితరులు బాణసంచా పేల్చి వేడుకలు జరుపుకున్నారు. ప్రజాభీష్టం మేరకే జిల్లా ఏర్పాటు.. ప్రజాభీష్టం మేరకే సీఎం కేసీఆర్ జనగామ జిల్లాను ఏర్పాటు చేశారని స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. జనగామ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీతో కలసి జేఏసీ సంబురాలు భువనగరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌తో కలసి సీఎం క్యాంప్ కార్యాలయంలో జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంత్‌రెడ్డి, ఇమ్మడి శ్రీనివాస్‌రెడ్డి, రాజమౌళి, వీరేందర్‌రెడ్డి, ఆకుల సతీష్, మంగళంపల్లి రాజు, బొట్ల శ్రీనివాస్, సౌడ రమేష్ వేడుకలు జరుపుకున్నారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మహముద్ అలీ, ఎంపీ నర్సయ్యతోపాటు ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, తాటికొండ రాజయ్య, ఎంపీ వినోద్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డితోపాటు జిల్లాకు మద్దతిచ్చిన ప్రతి ఒక్కరిని కలసి కృతజ్ఞతలు తెలిపారు. -
జనగామ జిల్లా ఇక్కడి ప్రజల హక్కు
నర్మెట : జనగామ జిల్లా ఈ ప్రాంత ప్రజల హక్కు అని డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. జనగామను జిల్లా చేయాలని కోరుతూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బొత్తలపర్రె–బొంతగట్టునాగారంలోని ఏడుపోచమ్మ దేవాలయం వద్ద నుంచి నర్మెట వరకు సోమవారం పాదయాత్ర చేపట్టారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ జనగామను 11వ జిల్లాగా ఏర్పాటు చేస్తానని ప్రగల్భాలు పలికి మాట తప్పుతున్నారన్నారు. ప్రత్యేక తెలంగాణ లో ఎంసెట్–2 లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో అలసత్వం వహిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలు బయటపడకుండా ఉండేందుకే జిల్లాల పునర్విభజన తెరపైకి తెచ్చారని చెప్పారు. అనంతరం తహసీల్దార్ నర్సయ్యకు పలు వినతులతో కూడినపత్రాన్ని అందించారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు బనుక శివరాజ్‌యాదవ్, కీసర దిలీప్‌రెడ్డి, మంసంపల్లి లింగాజీ, తేజావత్ గోవర్ధన్, బొక్క సుజయ్, మండల అధ్యక్షుడు భూక్య జూంలాల్, అర్జుల సుధాకర్‌రెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కళ్యాణం లలిత ము రళి, ఎంపీటీసీ సంపత్, గాదర సందీప్, వేముల అంజయ్య తదితరులు ఉన్నారు. -
జనగామలో రెండో రోజూ బంద్
జనగామ: వరంగల్ జిల్లా జనగామ పట్టణంలో రెండోరోజు కూడా ఉద్రిక్తత చోటుచేసుకుంది. జనగామ జిల్లా కోసం.. జేఏసీ పిలుపు మేరకు శనివారం పట్టణంలో బంద్ జరిగింది. శుక్రవారం జరిగిన బస్సు దగ్ధం ఘటనను దృష్టిలో పెట్టుకుని పోలీసులు ఉదయం నుంచే భారీగా మోహరించారు. అడిషనల్ ఎస్పీ జాన్‌వెస్లీ, డీఎస్పీ పద్మనాభరెడ్డి ఆధ్వర్యంలో పారా మిలటరీ బలగాలు రంగంలోకి దిగాయి. గత కొద్ది రోజులుగా ఉద్యమాలకు కేంద్ర బిందువుగా ఉన్న జనగామ ఆర్టీసీ చౌరస్తాలో పోలీసుల ప్రదర్శన కనిపించింది. పట్టణంలో 144 సెక్షన్ విధించారు. అరుుతే, శనివారం ఉదయం కాంగ్రెస్ మహిళా కౌన్సిలర్లు వెన్నెం శ్రీలత, వేమెళ్ల పద్మ, పన్నీరు రాధిక, మహిళా సంఘ నాయకురాలు షాహిదా మరికొంతమంది కార్యకర్తలతో ఆర్టీసీ చౌరస్తాలో రాస్తారోకో చేయడానికి రాగా.. పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మేకల కళింగరాజు, ప్రశాంత్, మరికొందరు నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. వారిని కూడా పోలీసులు అరెస్టు చేయడానికి ప్రయత్నించగా వాగ్వాదం, తోపులాట జరిగింది. వారందరినీ పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలోనే బీజేపీ, జేఏసీ నాయకులు నినాదాలు చేసుకుంటూ చౌరస్తాకు రావడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. నాయకులను పోలీసులు ఈడ్చుకుంటూ డీసీఎం వాహనంలో ఎక్కించారు. కదులుతున్న వాహనం వెనుక డోర్ ఊడిపోవడంతో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, జేఏసీ నాయకుడు కేవీఎల్ఎన్ రెడ్డితోపాటు ఇద్దరు పోలీసులు కిందపడిపోయారు. కేవీఎల్ఎన్ రెడ్డి తలకు బలమైన గాయం కావడంతో అపస్మారక స్థితికి వెళ్లాడు. పోలీసులు అతడిని వెంటనే ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా, పరిస్థితి విషమంగా మారడంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న జేఏసీ ప్రతినిధులు, పార్టీ నాయకులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఇక్కడ ఈ ఆందోళన కొనసాగుతుండగానే కాంగ్రెస్, జేఏసీ నాయకులు బక్క శ్రీను, బనుక శివరాజ్ అంబేడ్కర్ విగ్రహం ఎదుట కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రాత్రి 7 గంటల వరకు ఉద్రిక్తత కొనసాగింది. అరెస్టు చేసిన జేఏసీ నాయకులను రిమాండ్‌కు పంపించారు. -
పుత్రభిక్ష పెట్టరూ..
జనగామ, న్యూస్‌లైన్ : ఉన్నత చదువులు చదివి తనకోసం తల్లి పడుతున్న కష్టాలను తీర్చాలనుకున్న ఆ యువకుడు ఇప్పుడు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. మంచానికే పరిమితమై ఆదుకునే ఆపన్నహస్తం కోసం కళ్లలో ప్రా ణాలు పెట్టుకుని ఎదురుచూస్తున్నాడు. జనగామకు చెందిన వంగపల్లి కనకరాజు తండ్రి చిన్నతనంలో మరణించాడు. తల్లి బాలలక్ష్మి రెక్కల కష్టంతో కొడుకును పెంచి పెద్దచేసింది. చదువుకు ఆటంకం రాకుండా జాగ్రత్త పడుతూ కష్టాన్ని కొడుకుకు తెలియనివ్వకుండా జాగ్రత్తగా పెంచింది. ప్రస్తుతం కనకరాజు.. ప్రసాద్ ఇంజినీరింగ్ కళాశాలలో బీఫార్మసీ చదువుతున్నాడు. ఇతనికి ఇంటర్ చదువుతున్న తమ్ముడు, ఓ కళాశాలలో అటెండర్‌గా పనిచేస్తున్న అన్నయ్య ఉన్నారు. ఉన్నంతలో హాయిగా జీవి తం సాగిపోతోందని అనుకుంటున్న సమయంలో జీవితం లో పెను విషాదం చోటుచేసుకుంది. బయటపడిందిలా.. మూడేళ్లక్రితం ఒంట్లో నలతగా ఉంటే ఆస్పత్రికి వెళ్లిన కనకరాజు గుండెపగిలే వార్త వినాల్సి వచ్చింది. కిడ్నీలు రెండూ పాడయ్యాయని వైద్యులు చెప్పడంతో తల్లి నిర్ఘాంతపోయింది. ఇక అప్పటి నుంచి వైద్యం కోసం ఆస్పత్రులన్నీ తి రుగుతున్నారు. ఫలితంగా చదువు మధ్యలోనే ఆగిపోయిం ది. డయాలసిస్ కోసం నెలకు రూ.25వేలు ఖర్చుచేస్తున్నా రు. కనీసం ఒక కిడ్నీ అయినా మార్పిడి చేస్తే తప్ప విద్యార్థి బతికే అవకాశం లేకపోవడంతో ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. చేతికొచ్చిన కొడుకు మంచాన పడి ఉండడాన్ని చూసి తట్టుకోలేకపోతోంది. కొడుకు ప్రాణాలు నిలబెట్టుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తోంది. తన కిడ్నీ ఇచ్చినా ఆపరేషన్‌కు సుమారు రూ.14లక్షలు ఖర్చవుతాయని వైద్యులు చెప్పడంతో ఏం చేయాలో, అంత సొమ్ము ఎక్కడి నుంచి తేవాలో తెలియక తల్లడిల్లుతోంది. ప్రభుత్వం, దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తే తప్ప కిడ్నీ మార్పిడి సాధ్యం కాదు కనుక వారి సహాయం కోసం దీనంగా అర్థిస్తోంది. కనకరాజు ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ఆయన చ దువుకున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు చందా లు పోగేసి రూ.12500 అందించారు.