medical bills
-
ప్రైవేట్ వైద్యం.. ఛార్జీలపై తీవ్రంగా స్పందించిన సుప్రీంకోర్టు
ప్రభుత్వాలు ఎన్ని పథకాలు తీసుకొస్తున్నా పేద, మధ్య తరగతి వర్గాలకు వైద్య ఖర్చులు మోయలేని భారంగానే మారుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య చికిత్సలకు అయ్యే ఖర్చులో గణనీయమైన వ్యత్యాసాన్ని భారత అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. వివిధ ప్రాంతాల జీవన ప్రమాణాలకు అనుగుణంగా వైద్య చికిత్సలకు ప్రామాణిక రేటును నిర్థారించే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ నిబంధనలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. వెటరన్స్ ఫోరమ్ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణ జరిపింది. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ రూల్స్, 2012లోని రూల్ 9 ప్రకారం రోగులకు ఆసుపత్రుల్లో ప్రతివైద్యానికి ప్రామాణిక ఫీజు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది. ఈ వివరాలను అన్ని ఆసుపత్రుల్లో స్థానిక భాషలో ప్రచురించి రోగులకు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి ప్రతి వైద్యానికి అయ్యే ఖర్చు వివరాలను ఆసుపత్రుల్లో ఉంచాలని తెలిపింది. అయితే, ఈ విషయంపై తమ సహకారం కోరుతూ రాష్ట్ర ప్రభుత్వాలతో అనేకసార్లు చర్చలు జరిపినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. అందరికీ అందుబాటు ధరలో వైద్యం అందించడం అనేది పౌరుల ప్రాథమిక హక్కు అని కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించరాదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇదీ చదవండి: 900 మంది ఉద్యోగులను తొలగించిన ప్రముఖ సంస్థ నెలలోపు స్టాండర్డ్ రేట్లను నోటిఫై చేసేలా అన్ని రాష్ట్రాల ఆరోగ్య కార్యదర్శులతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శిని కోరింది. లేదంటే పిటిషనర్ కోరికమేరకు సెంట్రల్ గవర్న్మెంట్ హెల్త్ స్కీమ్ సూచించిన ప్రామాణిక రేట్లను అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తామని అత్యున్నత న్యాయస్థానం హెచ్చరించింది. -
స్థానికంగానే టీచర్ల మెడికల్ బిల్లుల డేటా పరిశీలన
సాక్షి, అమరావతి: మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లుల సమాచారం స్థానిక డీడీవోల లాగిన్‌లోనే అందుబాటులో ఉంటుందని పాఠశాల విద్యా శాఖ కమిషనర్ సురేశ్‌కుమార్ తెలిపారు. వాటిని సరిగ్గా పరిశీలించి.. టీచర్లకు సరైన సమాచారం అందించాలని డీడీవోలను శనివారం కమిషనర్ ఆదేశించారు. మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లుల స్థితిగతులను తెలుసుకునేందుకు, ప్రొసీడింగ్స్ కాపీల కోసం దూరప్రాంతాల నుంచి ఇబ్రహీంపట్నంలోని కమిషనరేట్‌కు వచ్చి ఇబ్బంది పడొద్దని సూచించారు. బిల్లుల మంజూరు ప్రక్రియను ఆన్లైన్ ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నామని చెప్పారు. కానీ డీడీవోలైన హెచ్ఎంలు, ఎంఈవోలు, డీవైఈవోల లాగిన్‌లో పరిశీలించకపోవడం వల్ల సమస్య వస్తున్నట్లు గుర్తించామన్నారు. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నుంచి స్క్రూటినీ రిపోర్టులు వచి్చన వెంటనే ఎలాంటి జాప్యం చేయకుండా మంజూరు ప్రొసీడింగ్స్ ఆమోదించి, సంబంధిత డీడీవోల లాగిన్లకు పంపిస్తున్నామన్నారు. కానీ డీడీవోలు తమ లాగిన్‌లో బిల్లుల స్థితిగతులను సరిగ్గా పరిశీలించకపోవడం వల్ల టీచర్లు వాటి కోసం దూరప్రాంతాల నుంచి తమ కార్యాలయానికి వస్తూన్నారని, టీచర్లు, ఉద్యోగులు వీటి కోసం కమిషనరేట్‌ను సంప్రదించే పరిస్థితి వస్తే.. డీఈవోలు, డీడీవోలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బోధన, బోధనేతర సిబ్బందికి సంబంధించిన మెడికల్ రీయింబర్స్ బిల్లులను సంబంధిత డీడీవోలు ఆన్లైన్లోనే సమర్పించాలని.. లాగిన్ ఫిజికల్ బిల్లులు స్వీకరించేది లేదని కమిషనర్ స్పష్టం చేశారు. -
డాక్టర్లూ పదండి పల్లెకు పోదాం!
రాష్ట్రంలోని ప్రతి పల్లెలోనూ ఉచిత వైద్య సేవలు అందించేందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తెలంగాణ శాఖ ముందుకు వచ్చింది. తన సామాజిక బాధ్యతగా ప్రతి మారుమూల పల్లెకూ ఆరోగ్యభద్రత విషయంలో సంపూర్ణ సహకారం అందించాలన్న లక్ష్యంతో ‘ఆవో గావ్ చలే’ పేరిట వినూత్న కార్యక్రమం చేపట్టింది. ఈ మేరకు హైదరాబాద్ మినహా మిగిలిన అన్ని జిల్లాలనూ దత్తత తీసుకుంటారు. ముఖ్యంగా జిల్లా కేంద్రాలకు దూరంగా పల్లెల్లో వరుసగా ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించి మందులు అందజేస్తారు. తీవ్రమైన, దీర్ఘకాలిక వ్యాధులు ఏమైనా బయటపడితే.. వాటిని నగరంలోని ఉస్మానియా, గాందీ, నిమ్స్ లేదా స్తోమతను బట్టి ఇతర ఆసుపత్రులకు సిఫారసు చేయడంతో పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచితంగా ఆపరేషన్లు చేసే వీలు కూడా ఐఎంఏ కల్పిస్తామంటోంది. ఇందుకోసం అయ్యే ఖర్చును భరిస్తామని చెబుతోంది. – సాక్షి ప్రతినిధి, కరీంనగర్ ప్రతి ఊరికీ నలుగురు వైద్యుల బృందం ఐఎంఏ ఇటీవల ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెంలోని చర్లలో ఇప్పటికే వైద్య సేవలు ప్రారంభించింది. ఐఎంఏలో మొత్తం 20వేలమందికి పైగా వైద్యులు అందుబాటులో ఉన్నారని, వీరంతా ప్రతిరెండు నెలలకోసారి పల్లెల్లో నిర్వహించే ఉచిత వైద్యశిబిరాలలో సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నారని ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బీఎన్ రావు వెల్లడించారు. ప్రతి పల్లెకూ నలుగురు వైద్యుల బృందం వెళ్తుంది. అందులో ఫిజీషియన్, గైనిక్, ఆర్థో, ఆప్తమాలజీ వైద్య నిపుణులు ఉంటారు. వీరు తమకు కేటాయించిన ఊరిలో సమగ్ర హెల్త్ సర్వే రూపొందిస్తారు. గ్రామస్తులకు హెల్త్ చెకప్, వైద్యపరీక్షలు, మందుల పంపిణీ నిర్వహిస్తారు. అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులు రాకుండా అవగాహన కల్పిస్తారు. ఐఎంఏ లక్ష్యాలివే.. మెడికల్ షాపుల్లో వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండా ఇష్టానుసారంగా మందులు విక్రయిస్తున్నారని ఇలాంటి కౌంటర్ సేల్స్‌ను నిరోధించాలని ఐఎంఏ చాలాకాలంగా పోరాడుతోంది. దీనివల్ల ప్రజలు అనేక దీర్ఘకాలిక వ్యాధులు కొని తెచ్చుకుంటున్నారని వాపోతోంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో దళారీ వ్యవస్థ (యాంటీ క్వాకరీ) పెరిగిపోతోంది. కొందరు దళారులు అవసరం ఉన్నా.. లేకుండా తమ కమీషన్ల కోసం పేషెంట్లను కొన్ని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి ఆపరేషన్లు చేయిస్తున్నారు. దీనివల్ల వారి శరీరాలపై అనేక దు్రష్పభావాలు కలుగుతున్నాయి. వీటికి అడ్డుకట్ట వేస్తామంటోంది. సరైన వైద్య అర్హతలు లేకుండా కొందరు వైద్యం ప్రాక్టీస్ చేస్తున్నారు. అలాంటి వారి వల్ల ప్రజల ఆరోగ్యానికి హాని కలుగుతోంది. ఇలాంటి అక్రమ ప్రాక్టీసులను అరికట్టాలని డిమాండ్ చేస్తోంది. రాష్ట్రంలో వైద్యకాలేజీల పెంపును ఆహ్వనించిన ఐఎంఏ చాలామంది పేద వైద్య విద్యార్థులకు ఆర్థిక సాయం చేసేందుకు స్కాలర్షిప్పులు ప్రకటిస్తోంది ఐఎంఏకు దరఖాస్తు చేసుకున్న పేద వైద్య విద్యార్థులకు ఏటా రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తోంది. పల్లెల కోసం ‘ఆవో గావ్ చలే’ కార్యక్రమం చేపడుతున్న మాదిరిగానే.. పట్టణాల్లోని మురికివాడల్లోనూ ఇదే విధమైన సేవలు అందించాలని నిర్ణయించింది. పేదలపై భారం తప్పించేందుకే ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యఖర్చులు పెరిగిపోతున్నాయి. ప్రైవేటు డాక్టరుకు చూపించుకునే స్తోమతలేని వేలాదిమంది పల్లె వాసులు రోగాలను మౌనంగా భరిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఉన్న అలాంటి వారికి పూర్తి ఉచితంగా వైద్యసేవలు, పరీక్షలు, శస్త్రచికిత్సలు అందించడమే మా లక్ష్యం. – డాక్టర్ బీఎన్.రావు, ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు -
మొగిలయ్య వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది
సాక్షి,లక్డీకాపూల్(హైదరాబాద్): మొగిలయ్య వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. బలగం సినిమాలో..‘నా తోడుగా నా తోడు ఉండి’అనే పాటతో ఫేమస్ అయిన బుడగ జంగాల కళాకారుడు మొగిలయ్య కిడ్నీ సంబంధ సమస్యలతో నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కాగా, శుక్రవారం మొగిలియ్యను మంత్రి ఎర్రబెల్లి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ నిమ్స్‌లో పరామర్శించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. మొగిలయ్య ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నానని, ఆయనకు మంచి వైద్యం అందించాలని నిమ్స్ డాక్టర్లను ఆదేశించానని మంత్రి తెలిపారు. -
ఇవి తెలుసుకుంటే.. మెడికల్ బిల్లుల భారం తగ్గించుకోవచ్చు!
కుమార్ ప్రైవేటు ఉద్యోగి. ఇటీవలే కడుపులో తీవ్రమైన నొప్పితో హాస్పిటల్ లో చేరాడు. పరిశీలించిన వైద్యులు పేగు సంబంధిత ఇన్ఫెక్షన్గా తేల్చారు. మూడు రోజుల తర్వాత డిశ్చార్జ్ చేయగా, మొత్తం బిల్లు రూ.80వేలు వచ్చింది. నిజానికి కుమార్‌కు రూ.5 లక్షల ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ప్లాన్ ఉంది. దాంతో అతడు నిశ్చింతగా ఉన్నాడు. కానీ, అయిన బిల్లులో బీమా కంపెనీ చెల్లించింది కేవలం రూ.49,000. మిగిలిన రూ.31,000 తను జేబు నుంచి చెల్లించాల్సి వచ్చింది. బీమా సంస్థ అంత మొత్తం ఎందుకు తగ్గించిందన్నది అతడికి అంతుబట్టలేదు. ఇది కుమార్ ఒక్కడికే ఎదురైన పరిస్థితి అనుకోవద్దు. వైద్య చికిత్సల కోసం ప్రజలు పెద్ద ఎత్తున తమ సొంత ఖజానా నుంచి చెల్లించుకోవాల్సిన సందర్భాలు బోలెడు. నీతి ఆయోగ్ 2021 నివేదిక ప్రకారం.. దేశంలో ఆరోగ్య సంరక్షణ కోసం చేస్తున్న మొత్తం వ్యయాల్లో 63 శాతాన్ని ప్రజలు సొంతంగా భరిస్తున్నారు. ప్రపంచదేశాల్లోనే ఇది ఎక్కువ. దీని వెనుక ఎన్నో కారణాలున్నాయి. ఆరోగ్య బీమా పాలసీ ఉన్నా ఇలా మన జేబు నుంచి చెల్లించుకోవాల్సిన పరిస్థితులను తగ్గించుకోవాలంటే ఏం చేయాలో చెప్పే కథనమిది... అసలు హెల్త్ ఇన్సూరెన్స్ అన్నదే లేకపో వడం, ఉన్నా సమగ్ర కవరేజీతో తీసుకోకపోవడం కూడా క్లెయిమ్ సమయంలో పాలసీదారులపై అదనపు భారం పడేలా చేస్తోంది. చికిత్సలో భాగంగా ఉపయోగించే కొన్ని రకాల వస్తువులు, సేవలకు హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి మినహాయింపు ఉన్న విషయాన్ని నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ అండర్ రైటింగ్, ప్రొడక్ట్స్ క్లెయిమ్ డైరెక్టర్ డాక్టర్ బబతోష్ మిశ్రా గుర్తు చేశారు. ‘‘చాలా మంది సమగ్రమైన కవరేజీని ఎంపిక చేసుకోవడం లేదు. కరోనా సంక్షోభం తర్వాత పెరిగిపోయిన ద్రవ్యోల్బణ ప్రభావంతో, ఎక్కువ రోజుల పాటు హాస్పిటల్లో ఉండాల్సి వస్తే కవరేజీ చాలడం లేదు. దాంతో మిగిలిన మొత్తాన్ని పాలసీదారులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది’’ అని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ విభాగం హెడ్ భాస్కర్ నెరుర్కర్ పేర్కొన్నారు. ఔట్ పేషెంట్ రూపంలో పొందే వైద్య సేవలకు చాలా ప్లాన్లలో కవరేజీ ఉండదు. కో–పే, సబ్ లిమిట్ తదితర షరతులు క్లెయిమ్ సమయంలో పాలసీదారులపై చెల్లింపుల భారానికి కారణమవుతాయి. అందుకుని పాల సీ కవరేజీ విషయంలో కొన్ని ముందస్తు జా గ్రత్తలు తప్పనిసరి. దీనికితోడు పాలసీదారులు తమపై భారం తగ్గించుకునేందుకు అందుబాటు లోని ఇతర మార్గాలను గుర్తించడమే పరిష్కారం. బయటి ల్యాబ్‌లు ఔట్ పేషెంట్‌గా వైద్య చికిత్సలకు వెళ్లినప్పుడు హాస్పిటల్‌కు సంబంధించిన ల్యాబ్‌లలో కాకుండా, బయటి డయాగ్నోస్టిక్స్‌లో టెస్ట్‌లు చేయించుకోవడం ద్వారా ఖర్చును తగ్గించుకోవచ్చు. హాస్పిటల్ అనుబంధ కేంద్రాల్లో రక్త పరీక్షలు, ఎంఆర్ఐ, సీటీ స్కాన్, అల్ట్రాసౌండ్ తదితర రేడియో ఇమేజింగ్ సేవల చార్జీలు ఎంతో అధికంగా ఉంటుంటాయి. ప్రైవేటులోనూ హెల్త్ స్టార్టప్‌ల రూపంలో ఎన్నో కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. హెల్తియన్స్, థైరోకేర్ ఇలా చాలానే ఉన్నాయి. వైద్యులు పరీక్షలు సూచించినప్పుడు తక్కువ చార్జీలున్న వాటికి (న మ్మకమైన సంస్థలకే పరిమితం) వెళ్లొచ్చు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ పరీక్షలు చేయించుకోవచ్చు. హాస్పి టల్ చార్జీలతో పోలిస్తే 40–50 శాతం తక్కువకే ఎన్నో సంస్థలు ఈ సేవలను ఆఫర్ చేస్తున్నాయి. జనరిక్ మందులు వైద్యుల సూచించిన మందులను, హాస్పిటల్ వద్దనున్న ఫార్మసీల్లోనే తీసుకోవాలని లేదు. ఆ ప్రిస్కిప్షన్‌తో నేరుగా జనరిక్ ఫార్మసీ స్టోర్‌కు వెళ్లి వాటికి ప్రత్యామ్నాయాలను తీసుకోవచ్చు. కంపెనీ ఏదైనా, లోపల అదే మందు ఉంటే చాలు. బ్రాండెడ్ ఔషధాల పేర్లకు బదులు, ఫార్మా ఇంగ్రేడియంట్ పేర్లతోనే రోగులకు మందులు సూచించాలని జాతీయ వైద్య మండలి మార్గదర్శకాలు కూడా ఉన్నాయి. కనుక బ్రాండెడ్ ఔషధాలకు జనరిక్ మందులు మంచి ప్రత్యామ్నాయం. ఫార్మా కంపెనీలు తమ బ్రాండ్లను సిఫారసు చేయాలంటూ వైద్యులను కోరుతుంటాయి. ఇందుకోసం సిబ్బంది, వైద్యులకు ప్రయోజనాల రూపంలో చాలా ఖర్చు చేస్తుంటాయి. దీంతో బ్రాండెడ్ ఔషధాల ధరలు అధికంగా ఉంటాయి. జనరిక్ మందులకు ఈ బెడద లేదు. బ్రాండెడ్‌తో పోలిస్తే 80 శాతం చౌకగా లభిస్తాయి. ప్రధాన మంత్రి భారతీయ జనఔషధి పరియోజన కేంద్రాలు కూడా దేశవ్యాప్తంగా జనరిక్ ఔషధాలను విక్రయిస్తున్నాయి. తగినంత కవరేజీ ఒకరి అవసరాలకు తీర్చే, సరిపడా కవరేజీతో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఎంతో ముఖ్యమని మెడి అసిస్ట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ నిఖిల్ చోప్రా సూచించారు. ఏ పట్టణంలో నివసిస్తున్నారు? వయసు? కుటుంబంలో ఎంత మంది సభ్యులు ఉన్నారు? కుటుంబ ఆరోగ్య చరిత్ర అంశాల ఆధారంగా కవరేజీ ఎంతన్నది నిర్ణయించుకోవాలి. పెళ్లయి, పిల్లలతో మెట్రోల్లో నివసించే వారు కుటుంబం మొత్తానికి మెరుగైన కవరేజీతో ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ తీసుకోవాలి. కనీసం రూ.5–10 లక్షలకు బేస్ ప్లాన్ తీసుకుని, దీనికి రూ.20–25 లక్షలతో సూపర్ టాపప్ ప్లాన్ తీసుకోవాలి. వైద్య ద్రవ్యోల్బణం పెరుగుతున్న తరుణంలో సమ్ అష్యూరెన్స్ (కవరేజీ) చాలుతుందా? లేదా? అన్నది మధ్య మధ్యలో సమీక్షించుకుంటూ ఉండాలి. తీసుకునే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ సమగ్రంగా ఉండాలి. మెడికల్, నాన్ మెడికల్ ఖర్చులతోపాటు, ఇంట్లో ఉండి తీసుకునే చికిత్సలకు చెల్లింపులు చేసేలా ఉంటే మంచిది. అలాగే, బీమా సంస్థ హాస్పిటల్స్ నెట్వర్క్ పెద్దగా ఉండాలి. అప్పుడు నగదు రహిత చికిత్సలు పొందడానికి వీలుంటుంది. ప్రమాద మరణం, ప్రమాదంలో వైకల్యానికి కవరేజీనిచ్చే రైడర్‌ను జోడించుకోవాలి. కుటుంబంలో గుండె జబ్బులు, కేన్సర్ తదితర వ్యాధుల రిస్క్ ఉంటే, క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్‌ను సైతం తీసుకోవాలి. ఓపీడీ/డేకేర్ ఇండెమ్నిటీ ప్లాన్లలో బీమా సంస్థలు హాస్పిటల్లో చేరినప్పుడు అయ్యే వ్యయాలకే చెల్లింపులు చేస్తుంటాయి. అలాగే, డేకేర్ ట్రీట్మెంట్లకు కూడా చెల్లింపులు చేస్తాయి. అంటే హాస్పిటల్లో చేరకుండా, చికిత్స తీసుకుని అదే రోజు వెళ్లిపోయే వీలున్నవి. ఇవి కాకుండా, వైద్యం కోసం ప్రజలు చేస్తున్న ఖర్చులో సగం ఔట్ పేషెంట్ రూపంలో (హాస్పిటల్లో చేరాల్సిన అవసరం లేకుండా) సేవలపైనే ఉంటున్నట్టు ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ సీఈవో మయాంక్ భత్వాల్ తెలిపారు. డాక్టర్ కన్సల్టేషన్ చార్జీలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ఔషధాలకు చేస్తున్న వ్యయాలకు బీమా ప్లాన్లలో కవరేజీ ఉండడం లేదు. అందుకుని ఓపీడీ కవరేజీనిచ్చే బీమా ప్లాన్ తీసుకోవాలని భత్వాల్ సూచించారు. ‘‘మీ బీమా ప్లాన్ ఔట్ పేషెంట్ డిపార్ట్మెంట్ (ఓపీడీ) వ్యయాలకు కవరేజీ ఇవ్వకపోతే, అప్పుడు హాస్పిటల్స్‌కు వెళ్లొద్దు. క్లినిక్‌లకు వెళ్లండి. ఎందుకంటే హాస్పిటల్స్ అయితే చార్జీలపై 18 శాతం జీఎస్టీ కూడా విధిస్తాయి’’అని మిశ్రా వివరించారు. బీమా ప్లాన్‌లో రీస్టోరేషన్ సదుపాయం కూడా ఉండాలి. ఒక పాలసీ సంవత్సరంలో కవరేజీ మొత్తం ఖర్చయిపోతే, తిరిగి మరోసారి హాస్పిటల్లో చేరాల్సి వస్తే అప్పుడు ఈ రీస్టోరేషన్ (నూరు శాతం కవరేజీని పునరుద్ధరించేవి) సాయపడుతుంది. హాస్పిటల్లో చేరినప్పుడు డైలీ క్యాష్ బెనిఫిట్‌ను కొన్ని పాలసీలు ఇస్తున్నాయి. ఆస్పత్రిలో ఉన్నప్పుడు కవరేజీ పరిధిలోకి రాని వాటి కోసం ఈ మొత్తాన్ని ఖర్చు చేసుకోవచ్చు. ఇప్పటికే ప్లాన్ తీసుకుని, అందులో ఈ ఫీచర్లు లేకపోతే పోర్టింగ్ ద్వారా అన్ని ఫీచర్లు ఉన్న ప్లాన్‌కు మారిపోవడం మంచి మార్గం. క్యాష్‌లెస్ ఆస్పత్రులు బీమా కంపెనీ నెట్వర్క్ పరిధిలోని ఆస్పత్రికి వెళ్లడం ద్వారా తమపై పడే వ్యయాలను పాలసీదారులు తగ్గించుకోవచ్చు. బీమా సంస్థలకు దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో ఆస్పత్రులతో భాగ స్వామ్యం ఉంటుంది. వాటిలో చేరితే పాలసీదారులకు తక్కువ చార్జీలు అమలవుతాయి. దీనివల్ల అటు బీమా సంస్థకు, పాలసీదారుకు ప్రయోజనం ఉంటుంది. నగదు రహిత వైద్య సేవలతోపాటు, పాలసీదారు తన వంతుగా చెల్లింపులు చేయాల్సి వస్తే వాటిపైనా తక్కువ చార్జీలు పడతాయి. కన్జ్యూమబుల్స్ చార్జీలు విధించవు. లేదా చాలా పరిమితంగా వేస్తాయి. నెట్వర్క్ హాస్పిటల్స్‌కే పాలసీదారులు వెళ్లేలా చూడడం కోసం.. కొన్ని బీమాకంపెనీలు నాన్ నెట్వర్క్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటే కో–పేమెంట్ (బిల్లులో కొంత మొత్తం పాలసీదారు చెల్లించేలా) షరతు విధిస్తున్నాయి. హాస్పిటల్ రూమ్ పాలసీదారుడు హాస్పిటల్లో చేరినప్పుడు వైద్యేతర ఖర్చులకు (నాన్ మెడికల్) బీమా కంపెనీలు చెల్లింపులు చేయవు. రోగి రూమ్‌లో ఉన్నప్పుడు ఇచ్చే టిష్యూ, హ్యాండ్ వాష్, టూత్‌పేస్ట్ తదితర ఉత్పత్తులతోపాటు, హౌస్ కీపింగ్ చార్జీలు పాలసీలో కవర్ కావు. అలాగే, హాస్పిటల్లో చేరేందుకు రిజిస్ట్రేషన్ చార్జీలు, పోషకాహార నిపుణుడి చార్జీలు, కాటన్, బ్యాండేజ్‌లు, డిస్పోజబుల్కు బీమా సంస్థల చెల్లింపులు చేయవు. అయితే, వీటికి సైతం చెల్లింపులు చేసే ఆప్షన్‌ను బీమా సంస్థలు కొన్ని అందిస్తున్నాయి. ఇందుకోసం కొంత అదనపు ప్రీమియం వసూలు చేస్తా యి. హాస్పిటల్లో అన్ని చార్జీలు రూమ్ విభాగం ఆధారంగానే ఉంటాయని నివాబూపాకు చెందిన బబతోష్ మిశ్రా తెలిపారు. డాక్టర్ ఫీజులు, ఐసీయూ అడ్మిషన్ చార్జీలు, ఆహారం, ఇతర సేవలకు చార్జీలను రూమ్ కేటగిరీ ఆధారంగానే విధిస్తారు. సింగిల్ రూమ్‌కు బదులు ట్విన్ షేరింగ్ ఎంపిక చేసుకుంటే, అప్పుడు పాలసీదారు తాను సొంతంగా చెల్లించాల్సిన చార్జీలు చాలా వరకు తగ్గుతాయి. ఒకవేళ పాలసీలో సింగిల్ ఏసీ ప్రైవేటు రూమ్ అనే నిబంధన ఉంటే, దీనికంటే ఎగువ కేటగిరీ అయిన డీలక్స్ రూమ్‌లో చేరి చికిత్స పొందినప్పుడు, చార్జీలు కూడా అధికంగా పడతాయి. అప్పుడు పాలసీదారు జేబు నుంచి చెల్లించే మొత్తం పెరిగిపోతుంది. కో–పే, డిడక్టబుల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కో–పేమెంట్ లేదా డిడక్టబుల్ ఆప్షన్లతో తీసుకుంటే ప్రీమియం తక్కువగా ఉంటుంది. కానీ, చికిత్సలు అవసరమైనప్పుడు పాలసీదారు తన వంతు వాటాగా చెల్లించే మొత్తం ఎక్కువగా ఉంటుంది. కో–పే లేదా డిడక్టబుల్ అన్నవి నిర్ణీత మొత్తం దాటినప్పుడు అమల్లోకి వచ్చేవి. అందుకని తక్కువ కో–పే/డిడక్టబుల్ ఉన్న వాటినే ఎంపిక చేసుకోవాలి. ప్రీమియం భారం లేదనుకుంటే, కో–పే లేని ప్లాన్‌కు వెళ్లాలి. రైడర్లు ఎప్పుడో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుని, అందులో అన్ని రకాల ఫీచర్లు లేకపోతే.. అలాంటి అన్ని సదుపాయాలను ఆఫర్ చేస్తున్న బీమా కంపెనీకి పోర్ట్ ద్వారా మారిపోవాలి. పోర్టింగ్‌తో వేరే కంపెనీకి మారే ఉద్దేశ్యం లేకపోతే అప్పుడు అదనపు కవరేజీలను ఆఫర్ చేసే రైడర్లు తీసుకోవడం ద్వారా, చికిత్సలు అవసరమైనప్పుడు తమపై పడే భారాన్ని తగ్గించుకోవచ్చు. అన్ని యాడాన్లు అందరికీ ఉద్దేశించినవి కావు. అవసరమైన రైడర్లను జోడించుకోవచ్చు. ప్రస్తుత ప్లాన్‌లో రూమ్ రెంట్‌కు పరిమితులు ఉంటే, అప్పుడు రూమ్‌రెంట్ వేవర్ రైడర్ తీసుకోవాలి. డైలీ క్యాష్, కన్జ్యూమబుల్స్ కవరేజీలను కూడా ఎంపిక చేసుకోవాలి. డిస్కౌంట్స్ హాస్పిటల్స్ డిజిటల్ సేవలపై తగ్గింపులను ఆఫర్ చేస్తున్నాయి. కొన్ని ఆన్లైన్లో అపాయింట్మెంట్పై 10 శాతం డిస్కౌంట్ ఇస్తున్నాయి. డిస్కౌంట్‌తో కూడిన హెల్త్‌కార్డ్‌లను ఆఫర్ చేసేవీ ఉన్నాయి. ఫార్మసీ బిల్లులపైనా తగ్గింపు ఇస్తున్నాయి. ఇలాంటివి తెలుసుకుని వాటిని పొందడం ద్వారా ఖర్చుల భారం తగ్గించుకోవచ్చు. చదవండి: రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన ఆదాయానికి.. -
ఏం లైఫ్ రా అయ్యా.. రోగం వస్తే మింగే మందుల ఖర్చు ఎంతో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: జబ్బు చేస్తే రాష్ట్ర ప్రజలు మందుల కోసం చేసే ఖర్చు చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. తలసరి మందుల ఖర్చు ఏడాదికి రూ.663 ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఈ విషయమై దేశంలో తెలంగాణ 12వ స్థానంలో నిలిచిందని తెలిపింది. కాగా, రాష్ట్ర జనాభా 3.7 కోట్లు అనుకుంటే ఆ ప్రకారం ఒక్కొక్కరు చేసే ఖర్చు మొత్తం కలిపి రూ. 2,453 కోట్లు అవుతుంది. కేవలం మందుల కోసమే ఇంత ఖర్చు చేస్తుంటే, ఇక జబ్బుకు ఇతరత్రా చికిత్సకయ్యే ఖర్చులు సరేసరి. తలసరి ఖర్చు రూ. 663 కాగా, ప్రిస్క్రిప్షన్ లేకుండా నేరుగా మెడికల్ షాపులకు వెళ్లి మందులు కొనడం ద్వారా అయ్యే ఖర్చు రూ.122 ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ విషయంపై ఇటీవల పార్లమెంటులో ప్రశ్నోత్తరాల సమయంలో చర్చకు వచ్చింది. తెలంగాణ ప్రజలు ఏటా వైద్యం కోసం రూ.7,844 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అందులో 69 శాతం ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యఖర్చులకే సరిపోతుంది. అంటే ఆపరేషన్లు, వైద్య పరీక్షలకు తదితరాలకు అన్నమాట. మిగిలిన 31 శాతం మందుల కోసం ఖర్చు చేస్తున్నారు. వైద్యం కోసం ఆస్తులు అమ్ముకోవడం, కుటుంబ పెద్ద చనిపోతే అనేక కుటుంబాలు పేదరికంలోకి పోతున్నాయి. కరోనా సమయంలో ఈ పరిస్థితి ఎక్కువగా చూశాం. ఫలితంగా అనేక కుటుంబాలు ఛిన్నాభిన్నమయ్యాయి. చుట్టుముడుతున్న ప్రమాదకర వ్యాధులు ప్రస్తుత వ్యాధుల తీవ్రతకు, 2040 నాటికి గణనీయమైన మార్పులు చోటు చేసుకోనున్నాయి. బీపీ, షుగర్, స్థూలకాయం వంటి జీవనశైలి వ్యాధుల వల్ల అనేక ప్రమాదకర వ్యాధులు మున్ముందు పట్టిపీడిస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. 2016 లెక్కల ప్రకారం దేశంలో గుండె, డయేరియా, రోడ్డు ప్రమాదాలు, నవజాత శిశుమరణాలు, ఎయిడ్స్, టీబీ, లంగ్ క్యాన్సర్, డయాబెటిక్, కిడ్నీ వ్యాధులు, అల్జీమర్స్, లివర్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్లు అధికంగా జనాలను పీడిస్తున్నాయి. అట్టడుగున ఉన్న భయంకరమైన వ్యాధులు 2040 నాటికి మొదటిస్థానాల్లోకి వచ్చి చేరే పరిస్థితి నెలకొందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఉదాహరణకు 2016 నాటి లెక్కల ప్రకారం 15వ స్థానంలో ఉన్న డయాబెటిక్ 2040 నాటికి ఏడో స్థానంలోకి వచ్చి చేరనుంది. 16వ స్థానంలో ఉన్న కిడ్నీ వ్యాధి 2040 నాటికి ఐదో స్థానానికి రానుంది. అల్జీమర్స్ 2016లో 18వ స్థానంలో ఉంటే, 2040 నాటికి ఆరో స్థానానికి రానుంది. 20వ స్థానంలో ఉన్న కాలేయ క్యాన్సర్ 13వ స్థానానికి రానుంది. గుండె సంబంధిత వ్యాధులు, గుండెపోట్లు 2040 నాటికి కూడా మొదటిస్థానంలోనే ఉంటాయి. 29వ స్థానంలో ఉన్న బ్రెస్ట్ క్యాన్సర్ 2040 నాటికి 19వ స్థానానికి రానుంది. ప్రస్తుతం వివిధ వ్యాధులు వస్తున్న 100 మందిలో 30 శాతం మంది మలేరియా, డెంగీ తదితర సీజనల్ వ్యాధులతో బాధపడుతున్నారు. 60 శాతం మంది షుగర్, బీపీ, కిడ్నీ, గుండె, కాలేయం తదితర వ్యాధులతో బాధపడుతున్నారు. 10 శాతం మంది వివిధ రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. అందువల్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ 2025 నాటికి తన లక్ష్యాలను నిర్దేశించింది. పొగాకు వినియోగాన్ని 30 శాతానికి తగ్గించడం, శారీరక శ్రమ చేసేవారి సంఖ్యను మరో 10 శాతానికి పెంచడం, బీపీ సంఖ్య 25 శాతానికి తగ్గించడం, స్థూలకాయాన్ని సున్నా శాతానికి చేర్చడం, మద్యం అలవాటును 10 శాతానికి, ఉప్పు తీసుకోవడాన్ని 30 శాతానికి తగ్గించడం, 80 శాతం వరకు అత్యవసర మందులను అందుబాటులోకి తీసుకురావడంతోపాటు గుండెపోట్లను 50 శాతానికి తగ్గించాలని సూచించింది. ఇది కూడా చదవండి: మీ పిల్లలు ఆరోగ్యంగానే తింటున్నారా? -
లాక్డౌన్లో బ్యాంకుల ఆఫర్లు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడికి సంబంధించిన లాక్డౌన్ అమలవుతున్న వేళ బ్యాంకులు వినూత్న ఆఫర్లతో తమ కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఔషధాలను తమ కార్డులతో కొనుగోలు చేస్తే 15 శాతం దాకా డిస్కౌంట్ ఇస్తామంటూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) ఆఫర్ ఇచ్చింది. ‘ఈ కష్టకాలంలో ఫార్మసీ బిల్లుల భారం కాస్త తగ్గించుకునేందుకు సులభతరమైన మార్గం ఉంది. మీకు సమీపంలోని అపోలో ఫార్మసీ స్టోర్‌లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డులతో కొనుగోలు చేయడం ద్వారా 15 శాతం దాకా డిస్కౌంటు పొందండి‘ అని ట్వీట్ చేసింది. అటు ఎస్బీఐ కూడా ఇలాంటి ఆఫరే ఇచ్చింది. ‘అపోలో 24/7 నుంచి హెల్త్ చెకప్ చేయించుకోండి. యోనో ఎస్బీఐ యాప్ ద్వారా కొన్ని ల్యాబ్ టెస్టులపై ఆకర్షణీయ డిస్కౌంట్లు పొందండి‘ అని పేర్కొంది. అటు, అక్షయ తృతీయ రోజున తమ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసిన వారికి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆఫర్ ఇచ్చింది. రూ. 10,000 విలువ పైబడిన ప్రతీ కొనుగోలుపై 5 రెట్లు రివార్డ్ పాయింట్లు ఇస్తామని, పీఎం కేర్స్ ఫండ్‌కు రూ. 100 విరాళంగా ఇస్తామని తెలిపింది. ఇక బ్యాంకులు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మరింత మెరుగైన సేవలు అందించేందుకు నిబంధనలను కూడా సడలించాయి. ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా చేసుకున్నా జూన్ 30 దాకా ఎటువంటి చార్జీలు విధించబోమంటూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు ఆఫరిచ్చింది. -
రిటైర్డు ఉద్యోగులను వేధించకండి: సుప్రీం
న్యూఢిల్లీ: రిటైర్డు ఉద్యోగులను వేధించవద్దనీ, వారి వైద్య బిల్లులను వెంటనే చెల్లించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం(సీజీహెచ్ఎస్) కింద మెడికల్ చెల్లింపులను నెలలోగా పూర్తి చేసేలా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కోర్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖను ఆదేశించింది. సీజీహెచ్ఎస్ జాబితాలో ఉన్న ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకోలేదన్న కారణంతో అధికారులు తన వైద్య బిల్లులను ఆపేశారని ఓ రిటైర్డు ఉద్యోగి కోర్టును ఆశ్రయించడంతో ఈ ఆదేశాలిచ్చింది. కార్యదర్శి స్థాయి అధికారి నేతృత్వంలో వారంలోగా ప్రత్యేక కమిటీని నియమించాలని, ప్రతినెలా ఈ కమిటీ సమావేశమై బిల్లుల చెల్లింపు ప్రక్రియను సమీక్షించాలని తెలిపింది. అర్జీదారు విషయంలో సీజీహెచ్ఎస్ అధికారులు అమానవీయంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన ఏ ఆస్పత్రిలో చికిత్స పొందారన్నది కాకుండా ఎలాంటి పరిస్థితుల్లో ఆ చికిత్స పొందారనే అంశాన్నే పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందంది. -
నిందితులపై వేటుకు వేళాయె..!
హసన్‌పర్తి: పదేళ్ల క్రితం ఎస్సారెస్పీ ప్రాజెక్టులో జరిగిన మెడికల్ స్కాంలో నిందితులపై వేటుకు రంగం సిద్ధమైంది. నిందితులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అయితే, ఉద్యోగులను కాపాడేందుకు యూని యన్ నాయకులు రంగంలోకి దిగినట్లు సమాచారం. హైదరాబాద్‌కు వెళ్లి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావును కలసి మాట్లాడినట్లు తెలిసింది. ప్రభుత్వం సీరియస్‌గా చర్యలు తీసుకున్నట్లయితే 26 మందిపై వేటు పడే అవకాశం ఉంది. ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు చెందిన కొంత మంది ఉద్యోగులు 2008లో మెడికల్ బిల్లుల బాగోతానికి తెరలేపారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిని ఆశ్రయించి.. అక్కడ చికిత్స పొందినట్లు బిల్లులు పొందారు. ఒక్కొక్కరు రూ.89 వేల నుంచి రూ.3 లక్షలు వైద్యానికి ఖర్చయినట్లు బిల్లులు చూపించి డ్రా చేసుకున్నట్లు అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదు అందగా.. ప్రాథమిక విచారణ చేపట్టిన సర్కార్ 2016లో 26 మంది ఉద్యోగులపై చర్యలకు ఆదేశించింది. డబ్బుల రికవరీ.. సస్పెన్షన్‌కు గురైన 26 మంది ఉద్యోగులు డ్రా చేసుకున్న డబ్బులను వడ్డీతో సహా చెల్లించారు. ఆ తర్వాత ప్రభుత్వం ఆరు నెలల తర్వాత వారిని విధుల్లోకి తీసుకుంది.అయితే.. విచారణ మాత్రం యధావిధిగా కొనసాగించింది. వారికి పదోన్నతులు, ఇంక్రిమెంట్లను నిలిపివేసింది. విచారణ పూర్తి.. చర్యలకు ఆదేశం.. మెడికల్ స్కాంపై ఆరునెలల క్రితమే విచారణాధికారి పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందించారు. ఈ నివేదిక ఆధారంగా నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ ప్రభు త్వం నుంచి ఆదేశాలు అందినట్లు సమాచారం. ఈ విష యం చింతగట్టు క్యాంప్‌లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే నలుగురు ఉద్యోగ విరమణ.. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఇప్పటికే నలుగురు ఉద్యోగులు ఉద్యోగ విరమణ పొందారు. మరో ఇద్దరు ఉద్యోగులు నేడో, రేపో రిటైర్‌కానున్నారు. అయితే.. ఉద్యోగ విరమణ పొందిన వారికి ఇప్పటివరకు పెన్షన్ మంజూరు కాలేదు. ఇదిలా ఉండగా ఇందులో పెద్ద తలలు కూడా మెడికల్ బిల్లులు డ్రా చేసుకున్నప్పటికీ వారిపై చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి ఎస్సారెస్పీ ఎస్ఈ శ్రీనివాన్రెడ్డిని వివరణ కోరడానికి ప్రయత్నించగా.. అందుబాటులో లేరు. -
ప్యాకేజీని 25 % పెంచండి
ఆరోగ్య కార్డులపై 12 కార్పొరేట్ ఆసుపత్రుల విన్నపం 10 శాతానికి సిద్ధమన్న సర్కార్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగుల ఆరోగ్య కార్డుల శస్త్రచికిత్సల ప్యాకేజీని 25 శాతం పెంచాలని రాష్ట్రంలోని 12 ప్రధాన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు పునరుద్ఘాటించాయి. ఔట్ పేషెంట్లుగా వచ్చే ఉద్యోగుల నుంచి ప్రత్యేకంగా ఫీజు వసూలుకు అంగీకరించాలని మరోసారి విన్నవించాయి. సచివాలయంలో గురువారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఆయా సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రుల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. 12 ప్రధాన ఆసుపత్రులు నగదు రహిత ఆరోగ్య కార్డుల ఉద్యోగుల చికిత్సకు అంగీకరించకపోవడంతో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం ఆరోగ్యకార్డుల ద్వారానే కాక మెడికల్ బిల్లులు సమర్పించి రీయింబర్స్‌మెంటు చేసుకునే పద్ధతిని కూడా జూన్ వరకు అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీనికి పరిష్కారం కోసం లక్ష్మారెడ్డి ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ ప్యాకేజీని నిమ్స్, సీజీహెచ్ఎస్ ధరలకు అనుగుణంగా పెంచాలని యాజమాన్యాల ప్రతినిధులు కోరారు. మందులకు సంబంధించి సేకరణ ధర కాకుండా ఎమ్మార్పీపై కొనసాగించాలని కోరినట్లు తెలిసింది. ఔట్ పేషెంట్లుగా ఉచితసేవలు అందించడం చాలా కష్టమని అందుకు ఫీజు వసూలు చేసేందుకు అంగీకరించాలని కోరారు. శస్త్రచికిత్సల ప్యాకేజీని 10 శాతం పెంచుతామని, ఔట్ పేషెంట్లపై ఫీజుకు అంగీకరించేది లేదని మంత్రి స్పష్టం చేశారు. 15 శాతం పెంపుదలకు అంగీకారం? సమావేశ వివరాలను లక్ష్మారెడ్డి ‘సాక్షి’కి వివరిస్తూ.. వారంలోగా ఆయా ప్రధాన ఆసుపత్రు ల్లో ఉద్యోగుల ఆరోగ్య కార్డులకు సంబంధించి స్పష్టమైన నిర్ణయం జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తంచేశారు. రెండు మూడు రోజుల్లో వారొక నిర్ణయం తీసుకొని లేఖ రాస్తానని చెప్పారన్నారు. ఇదిలావుండగా శస్త్రచికిత్సలకు సంబంధించిన ప్యాకేజీని మధ్యస్థంగా అటు ప్రభుత్వానికి, ఇటు సూపర్‌స్పెషాలిటీలకు అంగీకారంగా 15 శాతం వరకు పెంచే సూచనలున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఇతర ఆసుపత్రులకు ప్రస్తుత ప్యాకేజీలనే అమలు చేయాలని భావిస్తున్నాయి. -
సర్వీసు రూల్స్.. ఇక సరళతరం!
ఉద్యోగుల నిబంధనలసడలింపుపై ఉన్నతస్థాయి కమిటీ ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి నేతృత్వంలో ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు నిబంధనలను సరళతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందులో తొలిదశలో భాగంగా ఆరు అంశాలను ప్రధాన ఎజెండాగా ఎంచుకుంది. ఉద్యోగుల ప్రమోషన్లకు ఉండాల్సిన కనీస సర్వీసు, అర్హతలు, కారుణ్య నియామకాలకు అర్హత విధానం, వైద్య బిల్లులు, అంతర్ జిల్లా, అంతర్ జోనల్ బదిలీలు, సొంత జిల్లాలు, సొంత సబ్ డివిజన్ల పరిధిలో పోస్టింగులకు ఉన్న నిబంధనల్లో సడలింపులు, మినహాయిం పులను తొలుత పరిశీలించనున్నారు. వీటితో పాటు రిటైర్డ్ అధికారుల నియామకాలు, వారి సేవల వినియోగించుకునే ప్రతిపాదనలను కూడా రూపొందిస్తారు. తెలంగాణ ముద్ర కనిపించేలా ఉద్యోగుల సర్వీస్ రూల్స్‌ను సరళతరం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పలుమార్లు ప్రకటించిన విషయం తెలి సిందే. ఉమ్మడి రాష్ట్రంలోని సేవా నిబంధనలను సమూలంగా మార్చి కొత్తవి రూపొం దించాల్సి ఉందని అధికారులతోనూ ఆయన ప్రస్తావించారు. అందులో భాగంగానే తాజా కసరత్తు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. సర్వీస్ రూల్స్‌ను సరళతరం చేసే ప్రక్రియను చేపట్టేందుకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో ఆరుగురు ఉన్నతాధికారులతో కమిటీని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణ పరిపాలనా విభాగం ముఖ్య కార్యదర్శి(రాజకీయ), కార్యదర్శి (సర్వీసెస్), వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉన్నారు. జీఏడీ డిప్యూటీ కార్యదర్శి(ఎస్ఆర్) కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ప్రతి 15 రోజులకోసారి ఈ కమిటీ సమావేశమవుతుంది. ఎజెండాలో ప్రస్తావిం చిన అంశాలకు సంబంధించిన నిబంధనల సడలింపులు, మినహాయింపుల ప్రతిపాదనలు, వాటిని సమర్థించే నివేదికలను అన్ని విభాగాలు కమిటీ సమావేశాలకు వారం రోజుల ముందే అందించాలని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అన్ని విభాగాల నుంచి అందిన ప్రతిపాదనల ఆధారంగా ఈ కమిటీ కొత్త సర్వీసు నిబంధనలకు రూపకల్పన చేస్తుంది. దీంతోపాటు ఉద్యోగ సంఘాలు, నిపుణులతో నూ ఈ కమిటీ చర్చలు జరిపే అవకాశం ఉంది. తెలంగాణ, ఏపీల మధ్య ఉద్యోగుల విభజన ప్రక్రియ మరో నెల రోజుల్లో ముగియనుండడంతో ప్రభుత్వం కొత్త సర్వీసు నిబంధనలపై దృష్టి సారించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘వైద్య బిల్లుల’పై దృష్టి.. హెల్త్ కార్డుల పథకాన్ని తెచ్చినప్పటికీ అది పూర్తిగా అమల్లోకి రాని నేపథ్యంలో... తాజాగా సర్వీసు నిబంధనలపై ఏర్పాటు చేసిన కమిటీకి మెడికల్ క్లెయిమ్‌ల అంశాన్ని అప్పగించడం ఉద్యోగులను ఆకర్షిస్తోంది. హెల్త్‌కార్డుల పథకం అమల్లోకి వస్తే తమకు నచ్చిన ఆసుపత్రిలో ఉద్యోగులు వైద్యం చేయించుకునే వీలుంది. కానీ రాష్ట్రంలో పేరొందిన కార్పొరేట్ ఆసుపత్రులు వాటిని ఆమోదించడం లేదు. దీంతో ప్రభుత్వం 1972 నుంచి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న మెడికల్ రీయింబర్స్మెంట్ విధానాన్నే కొనసాగిస్తోంది. ఈ విధానం ప్రకారం రూ. 50 వేలకు లోబడిన మెడికల్ బిల్లులను జిల్లా బోర్డుకు, అంతకు మించిన బిల్లులను రాష్ట్ర మెడికల్ బోర్డుకు పంపించాల్సి ఉంటుంది. అయితే అన్నిచోట్లా బిల్లుల రీయింబర్స్మెంట్ నెలల తరబడి పెండింగ్‌లో ఉంటోంది. దీంతోపాటు వైద్య చికిత్స బిల్లులను తగ్గిస్తుండడంతో ఇబ్బంది పడుతున్నామంటూ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కమిటీకి అప్పగించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఉద్యోగుల అంతర్ జిల్లా, అంతర్ జోనల్ బదిలీలకు కొన్ని విభాగాలు పరిమితంగా అవకాశం కల్పిస్తున్నాయి. అయితే సాధారణ బదిలీలతో పాటు వీటికి అవకాశం కల్పించాలని ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. వీటితో పాటు సొంత జిల్లాలు, సొంత సబ్ డివిజన్ల పరిధిలో పోస్టింగులు ఇవ్వాలా, వద్దా? ఏయే శాఖలకు మినహాయింపులు ఇవ్వాలనే అంశాన్ని కమిటీ పరిశీలించనుంది. వివిధ విభాగాల్లో రిటైర్డ్ అధికారుల సేవలను వినియోగించుకునే ప్రతిపాదనలు, అందుకు మార్గదర్శకాలను సిద్ధం చేయనుంది. ఇబ్బందులన్నీ తప్పేనా? ఉద్యోగులకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో 57 ఏళ్ల కిందటి నిబంధనలు, దశాబ్దం కిందటి రాష్ట్ర సబార్డినేట్ సర్వీసు నిబంధనలే ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. కాలానుగుణంగా పలు ప్రత్యేక నిబంధనలను చేర్చినప్పటికీ... ఉద్యోగుల నియామకాలు, పదోన్నతులు వంటి పలు అంశాల్లో ఏకరూపత కరువైంది. ప్రత్యక్ష, పరోక్ష నియామకాలతో పాటు సీనియారిటీ ఆధారిత పదోన్నతులు, ప్రతిభ ఆధారిత పదోన్నతులకు ఇప్పటికీ స్పష్టమైన మార్గదర్శకాలు లేవు. 1996 రాష్ట్ర సబార్డినేట్ సర్వీసు నిబంధనల ప్రకారం... ఉద్యోగి పైకేడర్కు పదోన్నతి పొందాలంటే ప్రస్తుత కేడర్‌లో మూడేళ్ల సర్వీసు పూర్తి చేసి ఉండాలనే నిబంధన ఉంది. ఇక కారుణ్య నియామకాల అంశంపై గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పరిస్థితి గందరగోళంగా మారింది. గతంలో ఇంటర్ పూర్తి చేసిన అభ్యర్థులకు కారుణ్య నియామకాల్లో జూనియర్ అసిస్టెంట్ స్థాయికి మించని ఉద్యోగం ఇచ్చే నిబంధన ఉంది. రాష్ట్ర విభజనకు ముందు ఇందుకు కనీస విద్యార్హతను డిగ్రీకి పెంచారు. కానీ అప్పటికే నాలుగేళ్లుగా అన్ని జిల్లాల్లో పెండింగ్‌లో ఉన్న వందలాది దరఖాస్తుల మాటేమిటనేదానిపై సర్కారు స్పష్టత ఇవ్వలేదు. -
కేసీఆర్ దీపావళి కానుక
హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగులకు, పింఛన్‌దారులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు దీపావళి కానుక ప్రకటించారు. ఉద్యోగులు, పింఛన్‌దారుల వైద్య ఖర్చులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. బుధవారం హెల్త్ కార్డుల జారీ ప్రక్రియను కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఉద్యోగుల వైద్య ఖర్చులపై పరిమితిని తొలగించారు. -
పాపను గెంటేశారు
-
మెడికల్ బిల్లులపై మార్గదర్శకాలు
సాక్షి, హైదరాబాద్ : హెల్త్‌స్కీంలో భాగంగా ప్రభుత్వాసుపత్రులకు వెళ్లే ప్రభుత్వ ఉద్యోగుల చికిత్సకు సంబంధించిన బిల్లు రూపకల్పన, తద్వారా వచ్చిన నిధులను వైద్యులు ఇతర సిబ్బందికి ఎలా పంచాలి అన్నదానిపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌సహాని శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఐసీయూలో ఉండే రోగి చికిత్సకు రోజుకు రూ.2,500, ఏసీ వార్డుకు రూ.1,500, శస్త్రచికిత్స అనంతరం సాధారణ వార్డుకు రోజుకు రూ.1000, ఆపరేషన్ థియేటర్ చార్జీల కింద గంటకు రూ.2వేల నుంచి రూ.3వేలు, ఆహారానికి రోజుకు వంద రూపాయలు, రక్తనిధికి సంబంధించిన చార్జీలను ఒక్కో బ్యాగు వెయ్యి రూపాయలుగా నిర్ణయించారు. ఉద్యోగులకు వైద్య చికిత్సల ద్వారా ప్రభుత్వాసుపత్రికి వచ్చే సొమ్ములో 20 శాతం నిధులను రివాల్వింగ్ ఫండ్ కింద ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ తీసుకుంటుంది. ఆ నిధులతో ఆసుపత్రుల్లో యంత్రాలు, ఇతర పరికరాలను సమకూరుస్తారు. మిగతా 80 శాతంలో 45 శాతం రోగుల చికిత్సల కోసం ఖర్చు చేస్తారు. 35 శాతం సొమ్మును వైద్యులు, నర్సులు తదితర వైద్య సేవలు అందించిన వారు తీసుకోవాలి. ఈ 35 శాతం సొమ్ములో ఎలా పంచుకోవాలో వివరించారు. ఇందులో శస్త్రచికిత్స చేసినవారు లేదా వైద్యసేవలు అందించిన వైద్య బృందం 75 శాతం, రక్తపరీక్షలు లేదా ఎక్స్‌రేలు (ఇన్వెస్టిగేషన్స్) చేసిన వారికి 10 శాతం, నర్సింగ్ సిబ్బందికి 10 శాతం, నాల్గవ తరగతి ఉద్యోగులకు 5 శాతం ఇవ్వాలి. వైద్యులకిచ్చే 75 శాతం సొమ్ములో 55 శాతం సంబంధిత డాక్టర్లు తీసుకుంటే, మిగతా 20 శాతం నిధులు అనస్థీషియన్ (మత్తు డాక్టరు) తీసుకోవాలని పేర్కొన్నారు. -
క్రిమినల్ కేసులు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా : ప్రభుత్వ ఉపాధ్యాయుల అక్రమాలు తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి. ఆదర్శంగా ఉండాల్సిన వారే అడ్డదారులు తొక్కిన వైనం విస్మయపరుస్తోంది. నకిలీ వైద్య బిల్లులు సమర్పించి లక్షల రూపాయలు రీయింబర్స్మెంట్ కింద పొందిన 18మంది ఉపాధ్యాయులపై ఇటీవల క్రిమినల్ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా బోగస్ సర్టిఫికెట్లు సమర్పించి విద్యాశాఖను తప్పుదోవ పట్టించిన వారిపై చర్యలకు రంగం సిద్ధమైంది. వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిందిగా రాష్ట్ర విద్యాశాఖ సంచాలకులు డీఈఓలకు ఆదేశాలు జారీ చేశారు. 2009 సంవత్సరంలో 9మంది ఎస్జీటీలు బోగస్ సర్టిఫికెట్లతో స్కూల్ అసిస్టెంట్ (ఇంగ్లీష్)లుగా పదోన్నతి పొందేందుకు ప్రయత్నించి విద్యాశాఖ అధికారులకు దొరికిపోయారు. తాజాగా డీఎస్ఈ ఆదేశాలతో వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నారు. 2009 సంవత్సరంలో ఉపాధ్యాయులకు పెద్ద సంఖ్యలో పదోన్నతులిచ్చారు. ఈ క్రమంలో కొందరు ఇతర రాష్ట్రాలకు చెందిన యూనివర్సిటీల్లో కోర్సులు పూర్తి చేసినట్లు సర్టిఫికెట్లు సమర్పించారు. అయితే వాటిలో చాలావరకు నకిలీవని విద్యాశాఖ అధికారులు గుర్తించారు. దీంతో వారికి పదోన్నతులు ఇవ్వకుండా పక్కనబెట్టారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఇదేతరహాలో అక్రమార్కులు ఉండడంతో కేసును సీఐడీకి అప్పగించారు. దీంతో వారు విచారణ ప్రక్రియ మొదలుపెట్టారు. ఇదిలా ఉండగా నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినట్లు 9మందిని గుర్తించిన విద్యాశాఖ అధికారులు వివరాలను రాష్ట్ర అధికారులకు సమర్పించారు. ఇందులో ఏడుగురు వినాయక మిషన్‌కు చెందినవారు కాగా, జేఆర్‌ఎన్ యూనివర్సిటీకి చెందన వారు ఇద్దరున్నారు. ఈ నేపథ్యంలో వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా విద్యాశాఖకు ఆదేశాలు అందాయి. దీంతో జిల్లా విద్యాశాఖ వారిపై కేసుల నమోదుకు సీఐడీకి లేఖ రాసింది. ఇందులో భాగంగా ముందుగా వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నట్లు జిల్లా విద్యాశాఖ సహాయ సంచాలకులు గోవర్ధన్ వెల్లడించారు. -
అక్రమార్కులకు అండదండలు
మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులు తప్పుడు పద్ధతుల్లో నకిలీ మెడికల్ బిల్లులు సృష్టించి విద్యాశాఖను బురిడీ కొట్టించి డబ్బు డ్రాచేశారు. బాధ్యులైన ఉపాధ్యాయులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆదేశాలు జారీచేసినా విద్యాశాఖ అధికారులు మీనమేషాలు లెక్కిస్తూ కూర్చున్నారు. వారి మౌనం అనేక అనుమానాలకు తావిస్తోంది. కొందరు ఉపాధ్యాయులు నకిలీ మెడికల్ బిల్లులు సమర్పించి జిల్లాలో రూ.23.97లక్షలు స్వాహాచేసిన విషయం తెలిసిందే. ఈ అవినీతి వ్యవహారం 2010 అక్టోబర్‌లో బయటపడటంతో అప్పట్లో వారిపై సస్పెన్షన్ వేటువేశారు. 34మంది ఉపాధ్యాయుల్లో ఇప్పటికే 9 మంది ఉపాధ్యాయులు రిటైర్డ్ కాగా మరో 25మంది ఉపాధ్యాయులు ప్రస్తుతం వివిధ పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. వారినుంచి డబ్బులు రికవరీ చేసిన అనంతరం 2011 జూన్ 18న వారికి తిరిగి పోస్టింగ్స్ ఇచ్చారు. ఇందులో భాగంగానే ఎన్.మధుసూదన్‌రెడ్డి, కె.అంజ్య, పి.హన్మంతు, ఎల్. రామచంద్రయ్య, పి.నరసింహారెడ్డి, రామచంద్రారెడ్డి, నాగేందర్, డి.గోపాల్, కె.రవీందర్, జె.ప్రవీణ్‌కుమార్, డి.నరసింహులు,ఆర్.క్రిష్ణ, ఆర్.రామచంద్రుడు, ఎం.వనిత, ఆయూబ్, ఆర్.రాజేందర్, బి.శంకర్, సాయులు, డి.దామోదర్‌రెడ్డి, వి.భాను చందర్ తదితరులు నకిలీ మెడికల్ బిల్లులు సమర్పించి డబ్బులు స్వాహా చేశారనే ఆరోపణలు రావడంతో వారి నుంచి ఇప్పటికే డబ్బులు రికవరీ చేసిన విషయం తెలిసిందే. జిల్లాలో నకిలీ బిల్లులు సమర్పించినట్లే రాష్ట్రంలోని కౄ్ణ, ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లో కూడా పలువురు ఉపాధ్యాయులు నకిలీ వైద్యబిల్లులు సమర్పించి డ్రా చేసినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు . అయితే 34 మంది ఉపాధ్యాయులు తప్పుడు బిల్లులు సమర్పించి అక్రమంగా డబ్బు దండుకున్న వారిని గతంలో సస్పెండ్ చేసి డబ్బు రికవరీ చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకుండా చేతులు దులుపుకున్నారు. చర్యలకు విద్యాశాఖ వెనకడుగు విజిలెన్స్ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా జిల్లాలో తప్పుడు బిల్లులు సమర్పించిన 34 మంది టీచర్లపై సెప్టెంబర్ 22వ తేదీలోగా క్రిమినల్ కేసులు నమోదుచేయాలని విద్యాశాఖ కమిషనర్ అండ్ డెరైక్టర్ జి.వాణిమోహన్ నుంచి గతనెల 21న అర్జెంట్, పర్సనల్ అడెన్షన్ పేరిట జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు వచ్చాయి. విద్యాశాఖ కమిషనర్ అండ్ డెరైక్టర్ నుంచి ఆదేశాలు వచ్చి 14 రోజులైనా క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు అధికారులు ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. క్రిమినల్ కేసులునమోదు చేయకుండా రక్షించేందుకు ఓ ఉపాధ్యాయ సంఘానికి చెందిన నాయకుడు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడనే ఆరోపణలు బలంగా వినిస్తున్నాయి. ఓ వైపు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నుంచి మరోవైపు విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినా చర్యలు తీసుకోవడానికి జిల్లా విద్యాశాఖ అధికారులు వెనకడుగు వేయడం వెనక మతలబు ఏమిటని పలువురు టీచర్లు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికీ విద్యాశాఖ అధికారుల్లో చలనం కలగకపోవడంతో ఈ తతంగం వెనక డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కేసు నమోదుకు చర్యలు: డీఈఓ బాధ్యులైన టీచర్లపై క్రిమినల్ కేసులు నమోదుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని డీఈఓ చంద్రమోహన్ తెలిపారు. కాగా సెప్టెంబర్ 22వ తేదీలోపు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినప్పటికీ ఇంతవరకు ఎందుకు పట్టించుకోలేదని వివరణగా కోరగా వాటికి సరైన సమాధానం ఇవ్వకుండా చర్యలు తీసుకుంటామని మాత్రమే చెప్పారు. -
మందుల బిల్లులకూ దిక్కులేదు!
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశాఖ పరిస్థితి మరింతగా దిగజారింది. ప్రభుత్వం మందుల కొనుగోలు బిల్లులు కూడా చెల్లించలేని స్థితికి చేరింది. మందుల కొనుగోలుకు, సరఫరాకు ఎప్పుడూ ఎలాంటి ఇబ్బంది ఉండదని, మందులకు సంబంధించిన నిధులు గ్రీన్‌చానల్‌లో ఉన్నాయని చెప్పే సర్కారు ఇప్పుడు చేతులెత్తేసింది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో సరఫరా అయిన మందుల బిల్లులు ఇప్పటి వరకూ చెల్లించలేదు. సుమారు రూ.64.44 కోట్లు బకాయిలు ఉన్నా పట్టించుకోలేదు. సాధారణంగా రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) నుంచి చెక్కులు వెళ్లిన రెండ్రోజుల్లోనే నిధులు విడుదలయ్యేవి. కానీ 2013 జూలై 29వ తేదీన ఆర్థికశాఖకు పంపిన చెక్కులకు ఇప్పటికీ అనుమతి రాలేదు. తొలుత సచివాలయంలోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ శాఖకు చెక్కులు వెళతాయి. అక్కడ్నుంచి చెక్కులు నగదు నిల్వల పరిశీలనకు ఆర్థికశాఖకు పంపిస్తారు. ఆర్థిక శాఖకు వెళ్లిన చెక్కులు ఇప్పటికీ రాలేదు. మందులు, శస్త్రచికిత్సల ఉపకరణాలకు సంబంధించిన 8 చెక్కులు ఆర్థికశాఖకు వెళితే ఇప్పటి వరకూ ఒక్క చెక్కుకు సంబంధించిన బిల్లుకు కూడా అనుమతి రాలేదు. దీంతో మందుల సరఫరాపై తీవ్ర ప్రభావం పడే అవకాశముందని, గతేడాది చివరి త్రైమాసికం బిల్లులకే దిక్కులేకుంటే ఈ ఏడాది ఏప్రిల్‌లో పెట్టిన బిల్లుల పరిస్థితి ఏంటని అధికారులు వాపోతున్నారు. ఆర్థికశాఖను నిధులపై ఏపీఎంఎస్ఐడీసీ అధికారులు పలు దఫాలు అడిగినా స్పందించలేదు. భారీగా తగ్గిన కొనుగోలు ప్రభుత్వం వద్ద నిధులు లేకనో.. నిధుల వినియోగంలో పొదుపు పాటించడమో తెలియదు గానీ ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో రూ.80 కోట్లకు మందులు కొనుగోలు చేయాల్సి ఉండగా, కేవలం రూ.20 కోట్లకు మాత్రమే ఆర్డర్లు పెట్టారు. గతంలో తీసుకున్న మందులు చాలా ఉన్నాయని, వాటిలో చాలా రకాల ఔషధాలు కాలపరిమితి తీరేందుకు చేరువగా ఉన్నందున వాటిని ముందుగా వినియోగిస్తేనే కొనుగోలు చేస్తామని ఏపీఎంఎస్ఐడీసీ అధికారి అన్నట్టు తెలిసింది. అయితే వర్షాలు కురుస్తూ మలేరియా, డెంగీ, తదితర దోమకాటు జ్వరాలు ప్రబలుతున్న తరుణంలో తగినన్ని మందులు లేకపోతే పరిస్థితి విషమిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. -
స్తంభించిన ప్రభుత్వ చెల్లింపులు
సాక్షి, తిరుపతి: సమైక్యాంధ్రకు మద్దతుగా జిల్లాలో ఖజానా శాఖ ఉద్యోగులు సమ్మె చేస్తుండడంతో ప్రభుత్వ చెల్లింపులు, రాబడి ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది. సమ్మె కారణంగా మూడు రోజుల్లో ప్రభుత్వ చెల్లింపులు రూ.141 కోట్ల వరకు పెండింగ్ పడ్డా యి. ప్రభుత్వ ఉద్యోగుల రుణాలు, పీ ఎఫ్ లోన్లు, మెడికల్ బిల్స్ వంటి ఫై ల్స్ పూర్తిగా పక్కకుపోయాయి. వివిధ ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టర్లు చేసిన పనులకు సంబంధించిన బిల్స్ కూడా పెండింగ్‌లో పడ్డాయి. చిత్తూరు ప్రధాన ఖజానా కార్యాలయంతో సహా తిరుపతి, మదనపల్లె డివిజన్లో ఉప కార్యాలయాలు పనిచేస్తున్నాయి. వీటి పరిధిలో ప్రజలు ప్రభుత్వానికి ఫీజులు, పన్నులు(రాబడి), వివిధ హెడ్లు, సబ్ హెడ్ అకౌంట్ల కింద చెల్లిస్తుం టారు. ఏపీఎన్జీవో సమ్మెలో భాగంగా ఖజానా ఉద్యోగులు నిరవధిక అందోళనకు దిగారు. ఆగస్టు చివరివరకు సమ్మె ఇదే రీతిలో జరిగితే జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ చెల్లింపులు, రాబడి రూ.వెయ్యి కోట్లకు పైగా కార్యకలాపాలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. సెప్టెంబర్ జీతాలు లేనట్లే అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలో ఉండడంతో వీరికి సెప్టెంబర్ జీతాలు వచ్చే పరిస్థితి లేదు. ఆయా ప్రభుత్వ శాఖల నుంచి బిల్స్ రాసి, ఖజానా శాఖ ఆమోదం పొంది, అక్క డి నుంచి బ్యాంక్‌లకు వెళితే గానీ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అకౌం ట్లలో పడవు. సాధారణంగా 15వ తేదీ నుంచే బిల్స్ రాసే ప్రక్రియ మొదలవుతుంది. సమ్మె కారణంగా నో వర్క్, నో పే పరిస్థితి ఉండడంతో ఖజానా శాఖ కూడా జీతాలు చెల్లిం చేందుకు వీలు కాదు. రెవెన్యూ, ఖజానా, వాణిజ్య, రిజిస్ట్రేషన్స్, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యుఎస్, ఆర్అండ్ బీ, ఉపాధి కల్పన, మున్సిపల్, పబ్లిక్ హెల్త్, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలు, డీఆర్డీఏ, ఆర్టీవో, ఐకేపీ వంటి ప్రధాన శాఖల జీతాలు, బిల్లుల చెల్లింపుల ప్రక్రియ పూర్తిగా స్తంభిం చాయి. ఆయా శాఖల రోజువారీ అవసరాలకు కంటెన్జెన్సీ నిధులు కూడా లేక అధికారులు ఇబ్బంది పడుతున్నారు. ప్రోటోకాల్ ఖర్చులకూ ఇబ్బందులే తిరుమల వెంకన్న దర్శనానికి వచ్చే ప్రభుత్వ పెద్దలు, అమాత్యులు, ప్రో టోకాల్ మర్యాదలు చేసేందుకు తిరుపతి ఆర్డీవో కార్యాలయం నిరంతరం కంటెన్జెన్సీ నిధులు ఖజానా ద్వారా తెప్పించుకోవాల్సి ఉంటుంది. సమ్మె కారణంగా ప్రోటోకాల్ విధులకు అం తరాయం ఏర్పడనుంది. ఈ వ్యవహారాలకు సంబంధించిన బిల్స్ రాసేవారు లేక, ప్రోటోకాల్ ఖర్చులకు నిధులు రాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. బ్యాంకులోనూ ఇక్కట్లు రిజిస్ట్రేషన్లు, సర్వే ఫీజులు, వివిధ సర్టిఫికెట్లు పొందేందుకు ప్రజలు చలానాల రూపంలో ప్రభుత్వానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా లక్షల్లో చెల్లిస్తుంటారు. పంచాయతీ కొళాయి లు, ఇతర మౌలిక సదుపాయల కల్పన ఫీజులు కూడా ఖజానాకు బ్యాంక్ చలానా ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. చలానా చెల్లించిన తర్వాత దానికి సంబంధించిన కౌంటర్ ఫైల్‌పై ట్రెజరీ నంబరు, సంబంధిత సిబ్బంది సంతకం, సీల్ వేసేందుకు ఒక ప్రత్యేక కౌంటర్ ఉంటుంది. సమ్మె వల్ల సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ప్రజలు చెల్లింపులను వాయిదా వేసుకోవాల్సి వస్తోంది.