
హసన్‌పర్తి: పదేళ్ల క్రితం ఎస్సారెస్పీ ప్రాజెక్టులో జరిగిన మెడికల్ స్కాంలో నిందితులపై వేటుకు రంగం సిద్ధమైంది. నిందితులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అయితే, ఉద్యోగులను కాపాడేందుకు యూని యన్ నాయకులు రంగంలోకి దిగినట్లు సమాచారం. హైదరాబాద్‌కు వెళ్లి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావును కలసి మాట్లాడినట్లు తెలిసింది. ప్రభుత్వం సీరియస్‌గా చర్యలు తీసుకున్నట్లయితే 26 మందిపై వేటు పడే అవకాశం ఉంది. ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు చెందిన కొంత మంది ఉద్యోగులు 2008లో మెడికల్ బిల్లుల బాగోతానికి తెరలేపారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిని ఆశ్రయించి.. అక్కడ చికిత్స పొందినట్లు బిల్లులు పొందారు. ఒక్కొక్కరు రూ.89 వేల నుంచి రూ.3 లక్షలు వైద్యానికి ఖర్చయినట్లు బిల్లులు చూపించి డ్రా చేసుకున్నట్లు అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదు అందగా.. ప్రాథమిక విచారణ చేపట్టిన సర్కార్ 2016లో 26 మంది ఉద్యోగులపై చర్యలకు ఆదేశించింది.
డబ్బుల రికవరీ..
సస్పెన్షన్‌కు గురైన 26 మంది ఉద్యోగులు డ్రా చేసుకున్న డబ్బులను వడ్డీతో సహా చెల్లించారు. ఆ తర్వాత ప్రభుత్వం ఆరు నెలల తర్వాత వారిని విధుల్లోకి తీసుకుంది.అయితే.. విచారణ మాత్రం యధావిధిగా కొనసాగించింది. వారికి పదోన్నతులు, ఇంక్రిమెంట్లను నిలిపివేసింది.
విచారణ పూర్తి.. చర్యలకు ఆదేశం..
మెడికల్ స్కాంపై ఆరునెలల క్రితమే విచారణాధికారి పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందించారు. ఈ నివేదిక ఆధారంగా నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ ప్రభు త్వం నుంచి ఆదేశాలు అందినట్లు సమాచారం. ఈ విష యం చింతగట్టు క్యాంప్‌లో చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే నలుగురు ఉద్యోగ విరమణ..
ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఇప్పటికే నలుగురు ఉద్యోగులు ఉద్యోగ విరమణ పొందారు. మరో ఇద్దరు ఉద్యోగులు నేడో, రేపో రిటైర్‌కానున్నారు. అయితే.. ఉద్యోగ విరమణ పొందిన వారికి ఇప్పటివరకు పెన్షన్ మంజూరు కాలేదు. ఇదిలా ఉండగా ఇందులో పెద్ద తలలు కూడా మెడికల్ బిల్లులు డ్రా చేసుకున్నప్పటికీ వారిపై చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి ఎస్సారెస్పీ ఎస్‌ఈ శ్రీనివాన్‌రెడ్డిని వివరణ కోరడానికి ప్రయత్నించగా.. అందుబాటులో లేరు.
Comments
Please login to add a commentAdd a comment