కేసీఆర్ దీపావళి కానుక
హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగులకు, పింఛన్దారులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు దీపావళి కానుక ప్రకటించారు. ఉద్యోగులు, పింఛన్దారుల వైద్య ఖర్చులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది.
బుధవారం హెల్త్ కార్డుల జారీ ప్రక్రియను కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఉద్యోగుల వైద్య ఖర్చులపై పరిమితిని తొలగించారు.