అక్టోబర్ 20 తేది డెడ్ లైన్ కాదు: కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పెన్సన్లు, ఆహార భద్రతా కార్టులకు అక్టోబర్ 20 తేది డెడ్ లైన్ కాదు అని ఐటీ శాఖామంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. దరఖాస్తుల సమర్పణ నిరంతర ప్రక్రియ, అర్హులైన ప్రతి లబ్దిదారుడు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన అన్నారు. గతంలో మాదిరిగానే సంతృప్తికరమైన పద్దతిలోనే పథకాల అమలు జరుగుతుందన్నారు.
సంక్షేమ పథకాల అమలుపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. దరఖాస్తు ఇప్పుడు ఇచ్చి, ధృవీకరణ పత్రం తర్వాత ఇచ్చినా ఫర్వాలేదని కేటీఆర్ మీడియాకు వివరించారు. లబ్దిదారులకు పథకాల సమాచారాన్ని అందించేందుకు కలెక్టర్లు, అధికారులతో కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.