ఉద్యోగుల స్థానికతపై ఆరా.. | Aura local employees .. | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల స్థానికతపై ఆరా..

Published Mon, May 26 2014 4:07 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM

ఉద్యోగుల స్థానికతపై ఆరా.. - Sakshi

ఉద్యోగుల స్థానికతపై ఆరా..

  •       జాబితాపై జేఏసీ ముమ్మర కసరత్తు
  •      జిల్లాలో 12 శాతం స్థానికేతరులు
  •      మండలాల వారీగా వివరాల సేకరణ
  •      నేడు కేసీఆర్‌కు సమర్పించే అవకాశం
  • హన్మకొండ, న్యూస్‌లైన్: జిల్లాలో ఎంత మంది తెలంగాణేతర ఉద్యోగులున్నారనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ రాష్ట్రంలో స్థానికేతరులు పనిచేసేందుకు వీలు లేదని కేసీఆర్ తేల్చిచెప్పడం, స్థానికేతరులను గుర్తించే బాధ్యతలను ఉద్యోగ జేఏసీకే అప్పగించడంతో జిల్లాలో కొలువుల లొల్లి నెలకొంది. శాఖల వారీగా ఉద్యోగుల పుట్టుపుర్వోత్తరాల సేకరణలో ఉద్యోగ జేఏసీ నాయకులు నిమగ్నమయ్యూరు.

    రెండు రోజుల నుంచి విభాగాల వారీగా ఆరా తీస్తున్నారు. ఇప్పటికే పలు శాఖల్లో జాబితా రూపొందించారు. మండలాల వారీగా పనిచేస్తున్న ఉద్యోగులు, సర్వీసు పుస్తకాల ఆధారంగా స్థానికత వివరాలను సేకరిస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... జిల్లాలో మొత్తం 12 శాతం మంది స్థానికేతరులు ఉద్యోగాలు చేస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఇప్పటివరకే విద్యుత్ శాఖలో స్థానికేతరుల గుర్తింపు ప్రక్రియ ముగిసింది.

    ఈ శాఖలో ఇంజినీరింగ్ సెక్షన్‌లో 91 మంది, అకౌంట్స్ విభాగంలో 84 మంది సీమాంధ్ర ప్రాంతానికి చెందిన అధికారులున్నట్లు తెలంగాణ ఇంజినీరింగ్ జేఏసీ జాబితా సమర్పించింది. జిల్లాలో మొత్తం 68 విభాగాలున్నట్లు ఉద్యోగ జేఏసీ నాయకులు చెబుతున్నారు. మొత్తం 52 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులున్నారని, ఇందులో సగటున 12 శాతం మంది పక్క రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు.

    అటవీ శాఖలో దాదాపు 42 మంది స్థానికేతరులున్నట్లు తేలింది. వీరందరి సమాచారం ఇవ్వాలని ఆయా విభాగాల ఉన్నతాధికారులకు ఉద్యోగ సంఘాల నేతలు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. మండలాల వారీగా సేకరించిన జాబితాలో . కొంతమంది ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు స్థానిక ధ్రువీకరణ పత్రాలు సమర్పించినట్లు తెలుస్తోంది.

    ఈ అనుమానాలను నివృత్తి చేసేందుకు వారు కసరత్తు ముమ్మరం చేశారు. కొంతమంది నకిలీ బోనఫైడ్ సర్టిఫికెట్లు సమర్పించారనే నేపథ్యంలో... వారు సమర్పించిన పాఠశాలలపై ఆరా తీస్తున్నారు. సర్వీసు రిజిస్టర్లలో వారు సమర్పించిన పాఠశాలలు ఉన్నాయా... ఏయేసంవత్సరాల్లో ఉన్నాయి... ఎప్పుడు మూసేశారు అనే కోణంలో ఆరా తీస్తున్నారు. దీనిపై సమగ్ర సమాచారం ఇవ్వాలని విద్యాశాఖాధికారులకు విన్నవించారు.

    సోమవారం ఈ వివరాలను వెల్లడించేందుకు కసరత్తు చేస్తున్నట్లు ఉద్యోగవర్గాలు పేర్కొంటున్నాయి. జిల్లాలో సగటున 12 శాతం స్థానికేతర ఉద్యోగులు న్నా.. ప్రధానంగా విద్యుత్, విద్య, అటవీ శాఖల్లో ఎక్కువగా ఉన్నట్లు టీఎన్జీవో నేతలు భావిస్తున్నారు. వైద్యారోగ్య శాఖలో ఏఎన్‌ఎంలు, ఎంపీహెచ్‌డబ్యుఓల్లో నాన్‌లోకల్ వారు ఎక్కువగా ఉన్నారని లెక్కలేస్తున్నారు. ఆయూ శాఖల్లో కనీసం 20 శాతానికిపైగా తెలంగాణేతరులు అధికారి నుంచి అటెండర్ స్థాయి వరకు ఉన్నారని అంచనా వేస్తున్నారు.

    సర్వీసు పుస్తకాల్లో పేర్కొన్నట్లుగా కొంతమంది అడ్రస్ లేని పాఠశాలల నుంచి బోనఫైడ్ సర్టిఫికెట్లు తెచ్చి సమర్పించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నారుు.ఈ నేపథ్యంలో ఉద్యోగుల ప్రాంతీయతను గుర్తించేందుకు వారి పుట్టుపుర్వోత్తరాలు, విద్యాభ్యాసం ఎక్కడ జరిగిందనే సమాచారాన్ని సేకరిస్తున్నామని, జిల్లా పాలనా యంత్రాంగం సైతం సహకరిస్తోంద ని చెప్పారు.

    అంతేకాకుండా... హెచ్‌ఎంఆర్ డాటా ప్రకారం ఉద్యోగు ల స్థానికతను గుర్తించాలని టీఎన్జీవో నేతలు జిల్లా యం త్రాంగాన్ని కోరినట్లు విశ్వసనీయ సమాచారం. తెలంగాణ ఉద్యమం ప్రధానంగా ఉద్యోగాల దోపిడిపైనే జరిగిందని, ఇప్పుడు తెలంగాణలోని నిరుద్యోగులకు అన్యాయం జరుగకుండా చూడాలనే ఉద్దేశంతో స్థానికేతరుల వివరాలను సమగ్రంగా సేకరిస్తున్నామని,సోమవారం అధికారికంగా కేసీఆర్‌కు జాబితా పంపించేందుకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు.
     
    ఆంధ్ర ఉద్యోగులుంటే వివరాలు అందించాలి..

    జిల్లా పరిషత్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగంగా ఉద్యోగుల విభజనకు సంబంధించి తెలంగాణేతర ఉద్యోగులు ఉంటే వారి వివరాలను జిల్లా కమిటీకి అందజేయాలని టీపీఆర్‌ఎంఏయూ జిల్లా అధ్యక్షుడు సాధుల ప్రసాద్ ఒక ప్రకటనలో కోరారు. తెలంగాణలో పుట్టి ఇక్కడే విద్యాభ్యాసం చేయని వారు జిల్లాలో ఎక్కడ పనిచేసినా తాలుకా యూనియన్‌లు గుర్తించి వివరాలు తెలియజేయాలని సూచించారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement