తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఉద్యోగ సంఘాలతో భేటీ కానున్నారు.
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఉద్యోగ సంఘాలతో భేటీ కానున్నారు. ఆప్షన్ల వివాదంపై ఆయన చర్చించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ పోరాటంలో సహకరించిన ఉద్యోగులను కేసీఆర్ అభినందించారు.
కాగా ఉద్యోగుల విభజనలో ఆప్షన్లు ఉండబోవని కేసీఆర్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన జరగాలని, మిగిలిన ఏ విషయాన్ని కూడా అంగీకరించబోమని ఆయన తెలిపారు. స్థానికతను గుర్తించే విషయంలోనూ కచ్చితమైన ప్రమాణాలను పాటించాల్సి ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలంగా వ్యవహరించినట్టుగానే ఉద్యోగులు తెలంగాణ నిర్మాణంలోనూ కీలకంగా పనిచేయాల్సి ఉంటుందని కేసీఆర్ అన్నారు.