
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన 122 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులను రిలీవ్ చేసింది. వారిని స్వరాష్ట్రానికి పంపాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన ఏపీ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రీలీవ్ అయ్యే వారు తమ కేడర్ చివరి ర్యాంక్‌లోనే విధుల్లో చేరతారని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment