
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలో పని చేస్తున్న తెలంగాణ ప్రాంత ఉద్యోగులు బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. తమ కుటుంబాలు హైదరాబాద్‌లో ఉన్నాయిని, తాము ఏపీలో ఉద్యోగం చేయటం ఇబ్బందిగా ఉందని సీఎం జగన్‌కు వివరించారు. తమను తెలంగాణ రాష్ట్రాని బదిలీ చేయాలని ఉద్యోగులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.
గతంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ అంశాన్ని సీఎం జగన్ ప్రస్తావించగా, సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్ సర్కార్ తెలంగాణ నుంచి ఏపీకి సంబంధిత ఫైల్‌ను పంపింది. ఈ సందర్భంగా వెంటనే ఉద్యోగుల బదిలీ ఫైల్‌ను క్లియర్ చేసి తెలంగాణకు పంపాల్సిందిగా సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. గొప్ప మనసుతో అంగీకరించి సీఎం జగన్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంపై తెలంగాణ ఉద్యోగులు హర్షం వ్యక‍్తం చేశారు.
చదవండి: రేపు నేనూ వ్యాక్సిన్ తీసుకుంటున్నా
Comments
Please login to add a commentAdd a comment