వైరల్
ఒక భాషలో మొదలైన పాట ఆ భాషలోనే ఆగిపోతుంది. అయితే ఈ పాట విషయంలో అలా జరగలేదు. మలయాళంలో మొదలైన పాట హిందీలోకి వచ్చింది. ఆ తరువాత బెంగాలీలోకి వచ్చి ఎండ్ అయింది.
ఎక్కడా కృత్రిమత్వం అనిపించదు. హాయిగా వినాలనిపిస్తుంది. మ్యాటర్‌లోకి వస్తే... స్మితాదేవ్ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ‘ఎడక్కడ్ బెటాలియన్’ అనే మలయాళ సినిమాలోని ‘ఎన్ జీవనే’ పాటను మూడు భాషల్లో చక్కగా పాడింది. స్మిత గొంతుకకు, ఆమె మల్టీ లింగ్వల్ టాలెంట్‌కు నెటిజనులు జేజేలు పలికారు.
హిందీ సంగతి సరే, మలయాళీ పాటను సహజంగా పాడడం అనేది గొప్ప విషయం. అచ్చం మలయాళీ సింగర్ పాడినట్లుగా ఉంది’ అని ఒక నెటిజన్ స్పందించాడు. ‘ఈ పాట పుణ్యమా అని మళయాళం, బెంగాలీ భాషల ధ్వనిలోని కొన్ని అద్భుతమైన సారూప్యతలను గమనించే వీలు కలిగింది’ అంటూ స్పందించాడు ఒక విశ్లేషకుడు. ‘మీ పాట మ్యూజిక్ స్ట్రీమింగ్ ΄్లాట్‌ఫామ్‌లలో ఉండేలా చూడండి’ అని ఒక ఇన్‌స్టాగ్రామ్ యూజర్ అడిగాడు.
Comments
Please login to add a commentAdd a comment