'సాహెబ్ బీబీ గులామ్'లోని సన్నివేశం
కోల్కతా: సెన్సార్ బోర్డు తీరుపై ప్రముఖ దర్శకుడు అంజన్ దత్తా విరుచుకుపడ్డారు. అర్హతలేని వ్యక్తులను సెన్సార్ బోర్డు పదవుల్లో నియమించారని ధ్వజమెత్తారు. బెంగాలీ సినిమా 'సాహెబ్ బీబీ గులామ్' సహా పలు సినిమాల్లో సెన్సార్ బోర్డు పలు సీన్లు తొలగించడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
'సెన్సార్ బోర్డులో అనర్హులకు పదవులిచ్చారు. చుంబనానికి, చెంపదెబ్బకు తేడా తెలియని వ్యక్తులు సెన్సార్ చేస్తున్నారు. సినిమా పరిజ్ఞానం లేనివారు సెన్సార్ బోర్డులో ఉన్నారు. చేతిలో కత్తెర ఉందని రెచ్చిపోతున్నారు. ఇష్టమొచ్చినట్టుగా సీన్లు తొలగిస్తున్నార'ని అంజన్ దత్తా మండిపడ్డారు.
'సాహెబ్ బీబీ గులామ్' సినిమాలో బీసీ పాత్రను ఎడిట్ చేయాలని చిత్ర దర్శకుడు ప్రతిమ్ డీ గుప్తాను రీజినల్ సెన్సార్ బోర్డు ఆదేశించింది. ఈ సినిమాలో రేప్ సీన్ తొలగించాలని సూచించింది. దీంతో దర్శకుడు ఎఫ్ సీఏటీనీ ఆశ్రయించడంతో చిన్నచిన్న కట్స్ తో సర్టిఫికెట్ ఇచ్చింది. ఆగస్టు చివరి వారంలో ఈ సినిమా విడుదలకానుంది.