
ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్: భువనగిరి మండలం రాయగిరి చెరువులో దూకి ఒక యువతి ఆత్మహత్యకు పాల్పడింది. కాగా, స్థానికుల సమాచారంతో పోలీసులు చెరువు దగ్గరకు చేరుకున్నారు. చెరువు కట్టపై లభించిన సెల్‌ఫోన్, ఇతర వస్తువుల ఆధారంగా యువతి.. హైదరాబాద్ లాలాపేట్‌కు చెందిన గీతా రాణి(26)గా పోలీసులు గుర్తించారు.
ఆ తర్వాత పోలీసులు యువతి బంధువులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment