cell phone signals
-
సెల్ నెంబరే కీలకం!
బంజారాహిల్స్: సినీ ఫక్కీలో జరిగిన జూబ్లీహిల్స్ దొంగతనం కేసులో నిందితుడి జాడ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఒక వైపు టాస్‌్కఫోర్స్ పోలీసులు, ఇంకోవైపు క్రైం పోలీసులు ఎనిమిది బృందాలుగా రాష్ట్రంతో పాటు సరిహద్దులు, ఇతర రాష్ట్రాలను జల్లెడపడుతున్నాయి. ఎనిమిది గంటల పాటు గర్భిణిని బంధించి మెడపై కత్తి పెట్టి రూ.10 లక్షలతో ఉడాయించిన ఘటనలో నిందితుడు వాడిన సెల్‌ఫోన్ నెంబర్ కీలకంగా మారనుంది. మూడుచోట్ల ఈ సెల్‌ఫోన్ వినియోగించడంతో పోలీసులు టవర్‌డంప్ చేస్తూ నిందితుడు ఎవరెవరితో మాట్లాడాడు.. ఫోన్ నెంబర్ ఏంటి అన్నదానిపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. ఒకటి, రెండు రోజుల్లో నిందితుడి ఆచూకీ పట్టుకునే దిశలో పోలీసులు ప్రయత్నాలు ముమ్మరంచేశారు. వైన్ బాటిల్ ఖాళీ చేశాడు... జూబ్లీహిల్స్ రోడ్ నెం.52లో నివసించే ప్రముఖ వ్యాపారి నడింపల్లి సత్యనారాయణ రాజు అలియాస్ ఎన్ఎస్ఎన్.రాజు ఇంట్లోకి గురువారం రాత్రి గుర్తు తెలియని ఆగంతకుడు ప్రవేశించాడు. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఎన్ఎస్ఎన్ రాజు ఇంటి పరిసరాల్లో రెక్కీ నిర్వహించాడు. అదే సమయంలో శుభకార్యం ముగించుకొని ఇంటికి వచ్చి న రాజు..ఆయన పెద్ద కూతురు అత్త, మామలు ఇంట్లోకి రాగా వారి వెనుకాలనే నిందితుడు కూడా ప్రవేశించాడు. కొద్దిసేపటికే ఇంట్లోకి వచ్చిన పనిమనిషి అక్కడ నిల్చున్న ఆగంతకుడిని చూసి ఎన్ఎస్ఎన్.రాజు పెద్ద కూతురి అత్త, మామల డ్రైవర్ అని భ్రమపడి లోనికి వెళ్లిపోయింది. కొద్దిసేపట్లోనే పెద్ద కూతురు అత్తమామలు వెళ్ళిపోగా రాజు ఆయన భార్య లీల తమ గదిలో నిద్రించారు. మరో గదిలో చిన్న కూతురు నవ్య వర్క్‌ఫ్రం హోం ముగించుకొని రాత్రి 1.30 గంటల సమయంలో వాట్సాప్ మెసేజ్ చూస్తుండగా ఆగంతకుడు ఆమె బెడ్రూమ్లోకి ప్రవేశించాడు. అరిస్తే పొడిచేస్తానంటూ కత్తి చూపి బెదిరించాడు. దీంతో ఆమె నోరు మెదపలేదు. తనకు రూ. 20 లక్షలు కావాలని డిమాండ్ చేశాడు. ఇంట్లో అరకిలో ఆభరణాలు ఉన్నాయని, తన చెవులకు రూ.15 లక్షల విలువ చేసే వజ్రాలు పొదిగిన కమ్మలు ఉన్నాయని, అవి తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేయగా తనకు కేవలం డబ్బులే కావాలని, నగలు కాదని చెప్పాడు. ఓ వైపు ఆమెతో మాట్లాడుతూనే ఇంకోవైపు ఇంట్లోనే ఉన్న వైన్ తాగుతూ..ఆమెతో ముచ్చటిస్తూ మరో వైపు తన ఫోన్లో చాటింగ్‌చేస్తూ ఇంకోవైపు రూ.20 లక్షలు ఎలాగైనా తెప్పించాలంటూ ఆమెపై ఒత్తిడి పెంచాడు. మాట వినకపోతే పొడుస్తానంటూ తరచూ ఆమెను బెదిరించసాగాడు. ఆమె ఇంటి విషయాలపై కూడా చర్చించాడు. మీ అక్క నాలుగేళ్ల కూతురు ఉండాలి కదా..ఆమె ఎక్కడ అంటూ ప్రశ్నించాడు. మీ గుట్టు మొత్తం నాకు తెలుసు డబ్బులు లేవంటే నమ్మను అంటూ లీలను హెచ్చరించాడు. ఇంట్లో నుంచే ఫోన్లో చాటింగ్ చేస్తూ వారితో మాట్లాడుతూ వారి యోగ క్షేమాలు తెలుసుకుంటూ కుటుంబ వివరాలు కనుక్కుంటూ డబ్బులు వచ్చేదాకా కాలంగడిపాడు. రెక్కీ నిర్వహించిన సమయంలో రోడ్డుపై ఒకసారి నిందితుడు ఫోన్లో మాట్లాడినట్లుగా ఇక్కడ సీసీ ఫుటేజీలు స్పష్టం చేస్తున్నాయి. ఇంట్లో ఛాటింగ్ చేసిన విషయం కూడా బాధితురాలు తెలిపింది. షాద్‌నగర్‌లో కారు దిగి బస్టాప్‌కు వెళ్లే క్రమంలో ఓ చోట ఆగి ఫోన్ మాట్లాడినట్లుగా అక్కడి సీసీఫుటేజీలు వెల్లడిస్తున్నాయి. ఈ మూడు సంఘటనల్లో సెల్‌ఫోన్ సిగ్నల్స్‌పైనే పోలీసులు ప్రధానంగా దృష్టిపెట్టారు. తనది నాందేడ్ అని నిందితుడు చెప్పిన క్రమంలో ఓబృందం అటు వైపు వెళ్ళింది. మరో బృందం బెంగళూరుకు, గోవాకు, ముంబైకి వెళ్ళింది. -
Yadadri: చెరువులో దూకి యువతి ఆత్మహత్య
హైదరాబాద్: భువనగిరి మండలం రాయగిరి చెరువులో దూకి ఒక యువతి ఆత్మహత్యకు పాల్పడింది. కాగా, స్థానికుల సమాచారంతో పోలీసులు చెరువు దగ్గరకు చేరుకున్నారు. చెరువు కట్టపై లభించిన సెల్‌ఫోన్, ఇతర వస్తువుల ఆధారంగా యువతి.. హైదరాబాద్ లాలాపేట్‌కు చెందిన గీతా రాణి(26)గా పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత పోలీసులు యువతి బంధువులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. చదవండి: ‘కిలేడి’ మహిళ.. ఇద్దరు పిల్లలతో బ్యాంక్‌కు వచ్చి.. -
ఇంటర్ కుర్రాడి కిడ్నాప్ డ్రామా..!
ఖమ్మం క్రైం: ఓ కాలేజీ కుర్రాడు వేసిన ‘కిడ్నాప్ డ్రామా’... ఒకవైపు అతడి తల్లిదండ్రులను, మరోవైపు కళాశాల సిబ్బందిని, ఇంకోవైపు పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. అసలేం జరిగిందంటే... ఖమ్మం అర్బన్ మండలం పాండురంగాపురం గ్రామానికి ఆ కుర్రాడి పేరు మధు. ఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల ప్రైవేటు కళాశాలలో ఇంటర్ (ఎంపీసీ) మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అతడు రోజులాగానే మంగళవారం ఉదయం కళాశాలకు వెళ్లాడు. కొద్దిసేపటి తరువాత.. ‘‘అమ్మా, నాన్నా.. ఆరుగురు వ్యక్తులు వచ్చి నన్ను కళాశాల ముందు కిడ్నాప్ చేసి ఇన్నోవా వాహనంలో తీసుకెళుతున్నారు. నన్ను రక్షించండి. లేదంటే వాళ్లు నన్ను చంపేస్తారు’’ అంటూ, తన సెల్ నుంచి తల్లిదండ్రులకు ఫోన్ చేసి కంగారు పడుతూ చెప్పాడు. ఆ తల్లిదండ్రులు తీవ్ర భయూందోళనతో రోదిస్తూ ఉరుకులు పరుగులతో కళాశాలకు వెళ్లి అక్కడి సిబ్బందితో చెప్పారు. వారు కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యూరు. ఆ కుర్రాడి తల్లిదండ్రులతో కలిసి టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా వెంటనే రంగంలోకి దిగారు. ఇంతలోనే మధు సెల్ నుంచి తల్లికి ఫోన్ వచ్చింది. ‘‘అమ్మా.. నన్ను కొడుతున్నారు... లక్ష రూపాయలు కావాలని డిమాండ్ చేస్తున్నారు’’ అని ఏడుస్తూ చెప్పాడు. అప్పటికే పోలీసులు ఆ సెల్ ఫోన్ సిగ్నల్స్‌పై దృష్టి పెట్టారు. ఈ ఫోన్ కాల్సన్నీ నగరంలోని ప్రకాష్ నగర్ బ్రిడ్జి సెల్ టవర్ నుంచి వస్తున్నట్టుగా గుర్తించారు. ఆ సెల్ పరిధిలోని ప్రాంతాల్లో టూటౌన్ సీఐ సారంగపాణి ఆధ్యర్యంలో ఎస్ఐ సురేష్, సిబ్బంది కలిసి వెతుకుతున్నారు. ఈ లోపు మధు ఫోన్ నుంచే మరో ఫోన్ కాల్ వచ్చింది. ‘‘మీ అబ్బాయిని కిడ్నాప్ చేశాం. డబ్బులు ఇచ్చి తీసుకెళ్లండి’’ అని, బెదిరింపు ధోరణిలో చెప్పాడు అవతలి వ్యక్తి. ఈ ఫోన్ కూడా ఇదే సెల్ టవర్ నుంచి వచ్చినట్టుగా పోలీసులు నిర్థారించుకున్నారు. ఆ ‘కిడ్నాపర్లు’ ఇక్కడో ఎక్కడో ఉంటారనుకుని పోలీసులు తేల్చుకున్నారు. వెతకగా.. వెతకగా... బ్రిడ్జి దగ్గరలోని ముళ్ల పొదల్లో ఆ సెల్ ఫోన్ ఉన్నట్టుగా గమనించి, నెమ్మదిగా అక్కడకు వెళ్లారు. ఆ ప్రదేశాన్ని చుట్టుముట్టారు. మరింతగా దగ్గరగా వెళ్లి చూశారు. ఏముంది...? ‘కిడ్నాపైన’ కుర్రాడు మధు అక్కడ ప్రశాంతంగా పడుకుని ఉన్నాడు..! పోలీసులను చూడగానే అతడు కొన్ని క్షణాలపాటు అవాక్కయ్యూడు. ఆ వెంటనే ఏడుస్తూ.. ‘‘నన్ను కిడ్నాప్ చేసినవారు ఇప్పుడే వెళ్లారు’’ అని చెప్పాడు. అతడిని పోలీసులు స్టేషన్‌కు తీసుళ్లి విచారించారు. అంతా ఉత్తిదే.. డ్రామా ఆడా.. ‘‘నన్నెవరూ కిడ్నాప్ చేయలేదు. అంతా ఉత్తిదే. నేనే కిడ్నాప్ డ్రామా ఆడా’’ అని, ఆ కుర్రాడు పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. ‘‘నాకు ఎంపీసీ గ్రూప్ ఇష్టం లేదు. అందుకే ఇలా చేశాను’’ అని చెప్పాడు. కిడ్నాపర్ మాదిరిగా తన తల్లిదండ్రులకు ఫోన్ చేసింది కూడా తానేనని, గొంతు మార్చి మాట్లాడానని చెప్పాడు. ఈ కుర్రాడు గతంలో కూడా ఇలాగే కిడ్నాప్ డ్రామా ఆడినట్టు పోలీసులు చెప్పారు. అతడిని పోలీసులు గట్టిగా మందలించారు. ఇంకోసారి ఇలా చేస్తే దండిస్తామని హెచ్చరించి తల్లిదండ్రులకు అప్పగించారు. కొన్ని గంటలపాటు కలవరపాటుకు గురిచేసిన ఈ వ్యవహారం ఇలా సుఖాంతమవడంతో అందరూ హారుుగా ఊపిరి పీల్చుకున్నారు. -
సత్ప్రవర్తన, సద్భావనతోనే శాంతి
కొడవలూరు, న్యూస్‌లైన్: ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తన, సద్భావన, దాతృత్వం, సద్గుణాలు అలవరుచుకుంటేనే శాంతి చేకూరుతుందని మత గురువులు బోధించారు. మహ్మద్ ప్రవక్త సందేశాన్ని అందరికీ వినిపించారు. చంద్రశేఖరపురంలో నిర్వహిస్తున్న ఇస్తిమా ఆదివారం రెండో రోజుకు చేరుకుంది. భక్తులనుద్దేశించి మత గురువులు మాట్లాడుతూ ఐదు పూటలా నమాజ్ చేయడంతో పాటు పొరుగువారికి సాయపడాలని పిలుపునిచ్చారు. భగవంతునిపై మనసు లగ్నం చేసి, దైనందిక కార్యక్రమాలను కొనసాగించినప్పుడే చెడు విషయాలకు దూరంగా ఉండగలరని పేర్కొన్నారు. ఉర్దూలో అర్థం కావడం లేదని కొందరు తెలియజేయడంతో 15 నిమిషాల పాటు తెలుగులో బోధన సాగింది. మరో మక్కా ఇస్తిమా ప్రాంగణం మరో మక్కాను తలపిస్తోంది. ఆదివారం సాయంత్రానికి సుమారు 5 లక్షల మంది ముస్లింలు ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముస్లింలు అత్యంత ప్రాముఖ్యతనిచ్చే ‘దువా’ కార్యక్రమం సోమవారం జరగనుంది. ఇందులో సుమారు పది లక్షల మంది వరకు పాల్గొనవచ్చని అంచనా వేస్తున్నారు. నిలిస్తే జనసంద్రమే జిల్లా నలుమూలలతో పాటు పొరుగు జిల్లాల నుంచి వచ్చిన వారు మతగురువుల ప్రసంగం విన్న వెంటనే తిరుగుముఖం పడుతున్నారు. వివిధ వ్యాపకాల్లో బిజీగా ఉన్న వారు ఏదో ఒక సమయంలో వచ్చి కొన్ని కార్యక్రమాలకు హాజరై వెళుతున్నారు. ఒకట్రెండు గంటలు మాత్రమే ఉండి వెళ్లిపోతున్నారు. మరోవైపు లక్షలాది మంది భక్తులు రాత్రింభవళ్లు ఇక్కడే ఉండి ప్రార్థనల్లో పాల్గొంటున్నారు. ఈ ప్రాంతంలో సెల్‌ఫోన్ సిగ్నల్స్‌ను నిషేధించడంతో మతపెద్దల చెబుతున్న అమూల్యమైన సందేశాలను ఎలాంటి అసౌకర్యం లేకుండా ఆలకిస్తున్నారు. భారీసంఖ్యలో వస్తున్న భక్తుల లగేజీలకు వెయ్యి మంది వలంటీర్లు రక్షణ కల్పిస్తున్నారు. 104,108 సిబ్బందితో పాటు నిజామ్స్, నారాయణ తదితర ఆస్పత్రుల ఆధ్వర్యంలో వైద్యసేవలు అందిస్తున్నారు. -
నిందితులను పట్టించిన సెల్ఫోన్లు
సాక్షి, ముంబై: నగరంలోని శక్తిమిల్లు ప్రాంగణంలో మహిళా ఫొటో జర్నలిస్టుపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితులను సెల్ఫోన్ల ఆధారంగానే పోలీసులు పట్టుకోగలిగారు. అత్యాచారం తర్వాత ఐదుగురు నిందితులూ సంఘటనా స్థలం నుంచి పారిపోయారు. ప్రధాన నిందితుడైన మహమ్మద్ కాసిం హఫీజ్ షేక్ అలియాస్ కాసిం బెంగాలీ మరీన్ లైన్స్ పరిసరాలకు వెళ్లాడు. అప్పటికే అత్యాచారం సంఘటనపై వార్త దావానలంగా వ్యాపించిన విషయాన్ని తెలుసుకుని, అప్రమత్తమయ్యాడు. తన సెల్‌ఫోన్‌ను స్విచాఫ్ చేసి రెండురోజులు దాక్కున్నాడు. రెండు రోజుల తర్వాత అతడు సెల్‌ఫోన్‌ను ఆన్ చేయడంతో సిగ్నల్స్ ద్వారా పోలీసులు అతడు ఇంకా నాగ్పాడా ప్రాంతంలోనే ఉన్న విషయాన్ని గుర్తించగలిగారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అక్కడకు చేరుకునే లోగానే అతడు అక్కడి నుంచి పారిపోయాడు. అయితే, సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అతడిని వెంటాడిన పోలీసులు ఆదివారం అతడిని పట్టుకోగలిగారు. జైభవానీనగర్ మురికివాడలో నివసించే మరో నిందితుడు చాంద్‌బాబు సత్తార్ షేక్‌ను సంఘటన జరిగిన 8 గంటల్లోనే పోలీసులు పట్టుకోగలిగారు. ఈ విషయం తెలియగానే అతడి సహచరుడు సలీం అన్సారీ గోవండిలోని మిత్రుని వద్దకు పారిపోయాడు. అతడి వద్ద కొంత డబ్బు తీసుకుని, కుర్లాలోని లోకమాన్య తిలక్ టెర్మినస్ నుంచి రైల్లో ఢిల్లీకి పారిపోయాడు. ఢిల్లీకి చేరుకున్నాక అతడు తన మిత్రుడికి ఫోన్ చేయడంతో సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు ఢిల్లీకి వెళ్లి అతడిని పట్టుకున్నారు. అతడిని సోమవారం కోర్టులో ప్రవేశపెట్టగా, కోర్టు అతడిని సెప్టెంబర్ 5 వరకు పోలీసు కస్టడీకి అప్పగించింది. ఇదిలాఉండగా, జరిగిన ఘాతుకాన్ని చిత్రించిన మొబైల్ ఫోన్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక్క ఫొటో మాత్రమే తీసినట్లు నిందితులు చెబుతున్నారని, అది కూడా మొబైల్లో ప్రస్తుతం లేదని, ఫోరెన్సిక్ నిపుణుల సాయంతో దానిని పునరుద్ధరించే ప్రయత్నాలు చేస్తున్నామని ముంబై పోలీసు కమిషనర్ సత్యపాల్ సింగ్ చెప్పారు. ఇందుకోసం కేంద్ర ఫోరెన్సిక్ నిపుణుల బృందం ఇప్పటికే ముంబై చేరుకుందని, గుజరాత్ ఫోరెన్సిక్ నిపుణులు త్వరలోనే రానున్నారని తెలిపారు. సాధ్యమైనంత త్వరలో చార్జిషీట్ దాఖలు చేయనున్నామన్నారు. నిందితుల్లో ముగ్గురు పాత నేరస్తులేనని చెప్పారు. చాంద్‌బాబు సత్తార్ షేక్, విజయ్ జాధవ్, మహమ్మద్ కాసింలపై చోరీ, దోపిడీ తదితర పలు కేసులు ఉన్నాయన్నారు. ఇదిలా ఉండగా, బాధితురాలు మెల్లగా కోలుకుంటోందని, మానసిక వైద్యనిపుణులు ఆమెకు కౌన్సెలింగ్ ఇస్తున్నారని జస్లోక్ ఆస్పత్రి సీఈవో డాక్టర్ తరంగ్ జ్ఞాన్‌చందానీ చెప్పారు. దేశ ప్రజలకు బాధితురాలి కుటుంబం కృతజ్ఞతలు అత్యాచారం సంఘటన తర్వాత తమ కుమార్తెకు అండగా నిలిచిన మహారాష్ట్ర వాసులతో పాటు దేశప్రజలందరికీ, మీడియాకు బాధితురాలి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు మీడియాకు లేఖ రాశారు. అందరి అండ లభించడంతో తాము ధైర్యంగా ఉండగలుగుతున్నామన్నారు.