2009లో వచ్చిన హాలీవుడ్ సినిమా ‘ఆర్ఫన్’ సంచలనం సృష్టించింది. ఈ సినిమాలో ఒక జంట.. తమ మూడవ సంతానం మృతి చెందిన నేపధ్యంలో రష్యాకు చెందిన ఒక చిన్నారిని దత్తత తీసుకుంటారు. ఈ సినిమాలోని కథనం ప్రకారం ఆ చిన్నారి 9 ఏళ్ల వయసులోకి అడుగుపెట్టగానే క్రూరంగా ప్రవర్తిస్తూ తన అన్నదమ్ములను, తల్లిదండ్రులను హత్య చేసేందుకు ప్రయత్నిస్తుంటుంది. ఇది ఒక కథ. అయితే అమెరికాకు చెందిన ఒక జంటకు ఇటువంటి పరిస్థితే ఎదురయ్యింది.
ఆమె చిన్నపిల్ల కాదు..
క్రిస్టీన్ బార్నెట్(45) ఆమె మాజీ భర్త మైఖేల్ బార్నెట్(43)లు తాము దత్తత తీసుకున్న 9 ఏళ్ల నటాలియా గ్రేస్‌ను అమెరికాలోని ఇండియానాలో వదిలివేసి, వారు కెనడా పారిపోయారనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ దంపతులకు తాము దత్తత తీసుకున్న నటాలియా చిన్నపిల్ల కాదని యువతి అని, చిన్నపిల్లలా ఉద్దేశపూర్వకంగా ప్రవర్తిస్తున్నదని బయటపడింది.
మరగుజ్జు లోపంతో..
ఉక్రెయిన్‌లో జన్మించిన నటాలియా గ్రేస్‌ను 2010లో వీరు దత్తత తీసుకున్నారు. అప్పుడు నటాలియాకు 6 ఏళ్ల అని అనాథాశ్రమం నిర్వాహకులు తెలిపారు. ఆమె బర్త్ సర్టిఫికెట్ మీద కూడా అదేవిధంగా ఉంది. మరుగుజ్జు లోపంతో బాధపడుతున్న నటాలియా మూడు అడుగుల ఎత్తు మాత్రమే వుంది. ఆమెను కొంతకాలం సంరక్షించిన మైఖేల్, క్రిస్టీన్ దంపతులు తరువాత ఆమెను వదిలిపెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసుల రిపోర్టులో నటాలియా నడవలేని స్థితిలో ఉన్నదని దానిలో పేర్కొన్నారు.
‘9 ఏళ్లు కాదు.. 22 ఏళ్లు’
డెయిలీ మెయిల్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో క్రిస్టీనా మాట్లాడుతూ తాము ఒక మోసగాడు చేసిన వంచనకు బలయ్యామని పేర్కొంది. దత్తత తీసుకున్న చిన్నారిని తాము విడిచిపెట్టే సమయానికి ఆమెకు 9 ఏళ్లు కాదని, 22 ఏళ్ల యువతి అని తెలిసిందన్నారు. తాము ఇంటిలో నిద్రిస్తున్న సమయంలో నటాలియా కత్తి తీసుకుని వచ్చి తమను బెదిరించేదని, కాఫీలో బ్లీచ్ కలిపేదని తెలిపారు. ఇంటిలోని విలువైన వస్తువులను పగులగొట్టేదని ఆరోపించారు. నటాలియా రాత్రి వేళ్లల్లో ఇలా ప్రవర్తిస్తుండటంతో తాము నిద్ర పోలేకపోయేవారమని క్రిస్టీనా తెలిపింది. తాము తాగే కాఫీలో నటాలియా బ్లీచ్, విండెక్స్ మొదలైనవాటిని కలపడాన్ని చూశామని పేర్కొంది. ఆ సమయంలో తాను ఇలా ఎందుకు చేస్తున్నవని నటాలియాను అడిగితే ‘మిమ్మల్ని చంపేందుకు ప్రయత్నిస్తున్నానని’ చెప్పిందన్నారు.
మీడియా ఆరోపణలపై దంపతుల కలత
నటాలియా విషయంలో తాము దుర్మార్గంగా ప్రవరిస్తున్నామని మీడియా ఆరోపిస్తున్నదని, దానిలో నిజం లేదని క్రిస్టీనా తెలిపింది. నటాలియా చిన్న పిల్ల కాదు.. యవతి అని, ఆమెకు పీరియడ్స్ కూడా వస్తుంటాయని, అయితే శారీరకంగా ఎదుగుదల లేకుండా చిన్నపిల్ల మాదిరిగానే కనిపిస్తున్నదని, ఆమె మరుగుజ్జు మనిషి అని క్రిస్టీనా పేర్కొంది. వైద్యులకు నటాలియాను చూపించగా, ఆమె అరుదైన వ్యాధితో బాధపడుతున్నదని, ఆమెను చిన్న పిల్లగా భావించకూడదని స్పషం చేశారని తెలిపింది.
నటాలియాకు అద్దె ఇంటిలో సౌకర్యాలు..
ఈ నేపధ్యంలో తాము నటాలియా విషయంలో మరింత శ్రద్ధ తీసుకున్నామని, తాము కెనడా వెళ్లిపోయే ముందు ఆమె ఉండేందుకు ఒక ఇంటిని అద్దెకు తీసుకుని, అక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఏడాది రెంట్ కూడా ముందే చెల్లించామని తెలిపారు. ఆహారం కోసం కూడా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఆమె ఎదిగిన వయసు కలిగినదనే భావనతో ఆక్కడే ఉంచామన్నారు.
అయితే 2013లో నటాలియా ఉన్నట్టుండి మాయమయ్యింది. ఫోను కూడా చేయడం మానివేసిందని క్రిస్టీనా తెలిపారు. తాజాగా నటాలియా తన కొత్త తండ్రితో ఇండియాలోని వాల్‌మార్ట్ పార్కింగ్ లాట్ బయట ఫైర్‌వర్క్స్ టెంట్‌లో పని చేస్తూ కనిపించింది. నటాలియా మీడియాకు కనిపించడంతో ఆమె ఉదంతం మరోసారి చర్చల్లోకి వచ్చింది.
ఇది కూడా చదవండి: అది అత్యంత పొడవైన రైలు.. ఎన్ని వందల బోగీలు ఉంటాయంటే..
Comments
Please login to add a commentAdd a comment