
పెళ్లంటేనే సందడి. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో ఇళ్లంతా పండగ వాతావరణం ఉంటుంది. పెళ్లిలో జరిగే ఫన్నీ, ఊహించని, ఆసక్తికర, షాకింగ్, ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. ఈ మధ్య వివాహ వేడుకల్లో ఎంజాయ్‌మెంట్ ఎక్కువైంది. అతి చేష్టలకు పోయి కొందరు ప్రమాదాలను కొనితెచ్చుకుంటారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
పెళ్లి వేడుకలో వధూవరుల ఫొటోలు తీస్తున్న ఓ మహిళ పొరపాటున కాలు జారి మురికి కాలువలో పడిపోయింది. అయితే ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు చోటుచేసుకుందో దానిపై క్లారిటీ లేదు కానీ.. వీడియో చూస్తుంటే విదేశాల్లో జరిగినట్లు తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో మహిళ వధూవరుల ఫొటోలను తన ఫోన్‌లో రికార్డ్ చేస్తూ కనిపించింది.
జంటను కెమెరాలో బంధించే క్రమంలో వెనక్కి నడుస్తుండగా ఉన్నట్టుండి మురుకు నీటి కాలువలో పడిపోయింది. అక్కడున్న వారంతా ఆమెను కాలువ నుంచి పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించడం కనిపించింది. ఇక ఈ వైరల్ వీడియోను కోటి మందికి పైగా వీక్షించారు. ఫోటోలో మునిగిపోవడమే కాకుండా.. చుట్టూ పిరిసరాలను గమనిస్తూ ఉంటే బాగుంటుంది. అదృష్టం బాగుండి ఎలాంటి గాయాలు కాలేదు. లేకుంటే ఎంత ఘోరం జరిగేది’ అంటూ పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment