
సాక్షి, న్యూఢిల్లీ : నోయిడాలోని ఓ కాలువలో తేలుతున్న యువకుడి మృతదేహాన్ని బుధవారం ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సెక్టార్ 8లో కాలువలో పడిఉన్న యువకుడి మృతదేహం గుర్తించిన స్ధానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగుచూసింది. స్ధానికుల సమాచారంతో కాలువ నుంచి యువకుడి మృతదేహాన్నివెలికితీసిన పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించారని సెక్టార్ 20 పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ మనోజ్ కుమార్ పంత్ పేర్కొన్నారు.
మృతదేహంపై ఎలాంటి గాయాల గుర్తులు లేవని, కుడి చేయితో పాటు ఛాతీపై విజయ్ అనే టాటూ ఉందని, రెండు చేతులపై ఓం అని రాసిఉందని పంత్ తెలిపారు. బాధితుడికి 28 సంవత్సరాల వయసు ఉంటుందని, ఆటోప్సీ నివేదిక వెలుగుచూస్తే యువకుడి మరణానికి స్పష్టమైన కారణం తెలుస్తుందని, ప్రస్తుతం బాధితుడిని గుర్తించే పనిలో ఉన్నామని ఎస్‌హెచ్‌ఓ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment