లక్నో: సోషల్ మీడియాలో ఓ యువకుడు చేసిన ఫీట్ సంచలనంగా మారింది. ప్రస్తుతం అతను సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాడు. ఇంతకీ అతను ఏం చేశాడంటే.. ప్రతీ రోజు రాత్రి 10 కిలోమీటర్లు రన్నింగ్ చేస్తాడు. ఎందుకో కారణం తెలిస్తే మీరు ఫిదా అయిపోతారు.
వివరాల్లోకి వెళ్తే.. నోయిడాకు చెందిన ప‍్రదీప్(19) పట్టణంలోని వీధుల్లో రాత్రి వేళ పరిగెత్తుతుండగా ఫిల్మ్ మేకర్ వినోద్ కాప్రీ చూశాడు. ఇంతలో వినోద్.. ప్రదీప్ దగ్గరికి వెళ్లి ఎందుకిలా పరిగెత్తుతున్నావని ప్రశ్నించగా.. అతడు చెప్పిన సమాధానం విని ఫిదా అయిపోయాడు. తాను ప్రతీ రోజు ఇలాగే 10 కిలోమీటర్లు రన్నింగ్ చేస్తానని ప్రదీప్ చెప్పాడు. ఎందుకని మళ్లీ ప్రశ్నించగా.. తన కల భారత ఆర్మీలో చేరడమేనని.. అందుకే తాను ఇలా ప్రాక్టీస్ చేస్తున్నట్టు తెలిపాడు.
ఈ క్రమంలో వినోద్.. ఉదయం సమయంలో రన్నింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు కదా అని అడగ్గా.. తాను మెక్‌డోనాల్డ్ సెక్టార్-16లో పని చేస్తున్నానని అన్నాడు. ఉదయాన్నే 8 గంటలకు లేచి వంట చేయాలని చెప్పాడు. తన తల్లి అనారోగ్యం కారణంగా మంచానపడిందని చెప్పిన ప్రదీప్.. తన తమ్ముడికి సైతం వంట చేసిపెట్టాలని సమాధానం ఇచ్చాడు. అందుకే తాను రాత్రి సమయంలోనే ఇలా రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తానని వివరించాడు. ప్రదీప్ రన్నింగ్ కొనసాగిస్తూనే ఇలా సమాధానాలు చెప్పడం విశేషం. చివరకు.. ప్రదీప్‌ను వినోద్ కాప్రీ తన కారులో ఇంటి వద్ద దింపుతానని చెప్పగా.. అతను నో చెప్పాడు. కారులో వస్తే ఈరోజు ప్రాక్టీస్ మిస్ అవుతానని చెప్పడంతో వినోద్ మరోసారి ఫిదా అయిపోయాడు. కాగా, అతను రన్నింగ్ చేస్తున్న విషయంలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ ఘటనపై ప్రముఖ పారిశ్రామికవేత‍్త ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. ఇది నిజంగా స్ఫూర్తిదాయకం. అయితే నా #MondayMotivation ఏమిటో మీకు తెలుసా? అతను చాలా గ్రేట్, రైడ్ ఆఫర్‌ను తిరస్కరించడం వాస్తవం. అతనికి సహాయం అవసరం లేదు. ఆయనే ఆత్మనిర్భర్ అంటూ ట‍్విట్టర్‌లో వీడియోను షేర్ చేశాడు.
Inspiring…all the best #Pradeep 👏🏼👏🏼👏🏼 https://t.co/Y1YMQBV5jW
— Sai Dharam Tej (@IamSaiDharamTej) March 21, 2022
ప్రదీప్ వీడియోపై టాలీవుడ్ హీర్ సాయి ధరమ్ తేజ్ స్పందిస్తూ.. స్పూర్తిదాయకం.. ఆద్ ది బెస్ట్ అంటూ కామెంట్స్ చేశారు.
The only impossible journey is the one you never begin 👍
Video Via @vinodkapri pic.twitter.com/ue5x482T2s
— Defence Squad (@Defence_Squad_) March 20, 2022
టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ స్పందిస్తూ..
What an exemplary person 🌟
— Krish Jagarlamudi (@DirKrish) March 20, 2022
Run #Pradeep Run 🏃♂️ https://t.co/hAibkgRU7U
Comments
Please login to add a commentAdd a comment