స్వచ్ఛ భారత్‌లో భాగంగా మన నాయకులు, సినిమా ప్రముఖులు, క్రీడాకారులు ఇలా ఒక్కరనేంటి దాదాపు దేశంలోని ప్రముఖులందరు కూడా చీపురు పట్టి రోడ్లు ఉడ్చిన సంఘటనలు అనేకం జరిగాయి. కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఓ వ్యక్తి స్వయంగా పార చేత పట్టుకుని మురికి కాలువలను శుభ్రం చేసిన సంఘటనలను ఎక్కడ చూసి ఉండం. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఓ వీడియో చూస్తే ఆ లోటు కూడా తీరిపోతుంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘స్వచ్ఛతాహై సేవా’ కార్యక్రమంలో భాగంగా ఓ ముఖ్యమంత్రి మురికి కాలువలో ఉన్న చెత్తను తొలగించారు.నలుగురికి చెప్పే ముందు మనం ఆచరించాలని చెప్పిన ఈ వ్యక్తి పుదుచ్చేరి కాంగ్రెస్ సీఎం వీ నారాయణస్వామి. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలో నారాయణస్వామి స్వయంగా మురికి కాలువలో ఉన్న చెత్తను తొలగించారు. ఈ వీడియో చూసిన అభిమానులు ఆయనను అభినందనలతో ముంచెత్తుతున్నారు.
మురికి కాలువను శుభ్రం చేసిన సీఎం
Published Tue, Oct 2 2018 11:33 AM | Last Updated on Thu, Mar 21 2024 6:13 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement