చిన్నారిని మింగిన నీటి తొట్టె
Published Wed, Aug 31 2016 12:57 AM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM
పత్తికొండ టౌన్: మండలంలోని పుచ్చకాయలమాడ గ్రామంలో మంగళవారం సాయంత్రం నీటితొట్టెలో పడి రెండేళ్ల చిన్నారి మృతి చెందాడు. గ్రామానికి చెందిన వనిత, కాశీనాథ్ దంపతుల కుమారుడు జయక్రిష్ణ సాయంత్రం ఇంటిముందు అరుగుపై ఆడుకుంటూ, ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న నీటితొట్టెలో పడిపోయాడు. తండ్రి బయటకు వెళ్లగా, ఇంటిలో పనిలో ఉన్న తల్లి గమనించ లేదు. చాలాసేపటి తర్వాత చిన్నారి కోసం వెతకగా, నీటితొట్టెలో అచేతనంగా పడిఉన్నాడు. తీసిచూడగా అప్పటికే మతి చెందాడు. కుమారుడి మతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Advertisement
Advertisement