Viral Video: నాకెందుకు అంత జుట్టు లేదు! | Girl Child Touches Moms Head She Doesnt Have Hair Reaction Video Viral | Sakshi
Sakshi News home page

Viral Video: నాకెందుకు అంత జుట్టు లేదు!

Published Wed, Nov 3 2021 7:48 PM | Last Updated on Wed, Nov 3 2021 9:30 PM

Girl Child Touches Moms Head She Doesnt Have Hair Reaction Video Viral - Sakshi

చిన్నారులు ఏదో ఒక సమయంలో తమ తల్లి జడతో ఆడుకోవటం చూస్తుంటాం. చాలా ఆశ్చర్యంగా పొడవాటి జుట్టును చేతిలోకి తీసుకొని ఏంటీ ఇది? అన్నట్లు చూస్తారు. అయితే ఓ చిన్నారి తన తల్లి జుట్టును పట్టుకొని తనకు అలా లేదన్నట్లు ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌తో కూడిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ చిన్నారి కుక్కపిల్లతో ఆడుకుంటుంది. అంతలోనే తన తల్లి జుట్టు కనిపించడంతో చేతితో పట్టుకుంటుంది. తల్లి జట్టును విడిచిపెట్టిన వెంటనే ఆ చిన్నారి తన తలపై అంత జుట్టు లేదు ఎంటీ? అన్నట్లు ఒక్కసారిగా తలను నిమురుకుంటుంది.

తన తలపై అంత జుట్టు లేదని అర్థం అవుతుంది. ఆ చిన్నారి ఇచ్చిన రియాక్షన్‌ కట్టిపడేస్తోంది. ktgirlie01పేరుతో ఉన్న ఓ యూజర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘చిన్నారికి తలపై జుట్టు లేదన్నట్లు అర్థం అయింది’ అని కామెంట్‌ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 1.7 లక్షల మంది వీక్షించారు. ‘ఓ బేబీ.. నీకు అంత జుట్టు వస్తుంది.. అందంగా ఉంటుంది!’.. ‘నాకు ఎందుకు అంత జుట్టు రాలేదు?’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement