roller coaster
-
సెన్సెక్స్ రోలర్ కోస్టర్
ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ ఎన్నికల ఫలితాలు బీజేపీ, ఎన్డీయే కూటమిని బిత్తరపోయేలా చేశాయి. అయితే, మిత్రపక్షాల దన్నుతో మళ్లీ సుస్థిర ఎన్డీయే సర్కారు కొలువుదీరడంతో మార్కెట్ వర్గాలు ఊపిరిపీల్చుకున్నాయి. ఫలితాల రోజున నష్టాలన్నింటినీ మూడు రోజుల్లోనే ఎగిరిపోయాయి. వృద్ధికి ఊతమిచ్చేలా 100 రోజుల అజెండాను ప్రకటించిన మోదీ ‘హ్యాట్రిక్’ ప్రభుత్వ చర్యలు ఇన్వెస్టర్లలో మళ్లీ ఉత్సాహా న్ని నింపాయి. విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాల బాటను వీడి మళ్లీ కొనుగోళ్ల రూట్లోకి రావడం కూడా మార్కెట్‌కు మరింతి ఇం‘ధనాన్ని’ అందించింది. రాబోయే కాలంలో మౌలిక రంగ ప్రాజెక్టులపై మోదీ సర్కారు భారీగా ఖర్చు చేయనుండటం, బడ్జెట్లో వృద్ధికి ఊతమిచ్చేలా పలు చర్యలు ఉంటాయన్న అంచనాలతో మార్కెట్లో ర్యాలీ కొనసాగుతోంది. తాజాగా 80,000 పాయింట్ల శిఖరాన్ని కూడా దాటేయడం దీనికి నిదర్శనం. కాగా, ఈ ఏడాది చివరికల్లా సెన్సెక్స్ 90,000 పాయింట్లను తాకే అవకాశాలు మెండుగా ఉన్నా యని సుందరం మ్యూచువల్ ఫండ్ మాజీ ఎండీ సునీల్ సుబ్రమణ్యం అంచనా వేయడం విశేషం. దీనికి ప్రధానంగా లార్జ్ క్యాప్ షేర్ల ర్యాలీ దన్ను గా నిలుస్తుందని కూడా ఆయన చెబుతున్నారు. కాగా, ఇన్వెస్టర్ల సంపద గత నెల రోజుల్లోనే రూ. 50 లక్షల కోట్లు దూసుకెళ్లింది. జూన్ 4నరూ.395 లక్షల కోట్లుగా ఉన్న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ జూలై 3న రూ.445.5 లక్షల కోట్లకు ఎగబాకడం గమనార్హం!జూన్ 4: ఎన్డీయేకు బంపర్ మెజారిటీ ఖాయమన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో ముందు రోజు 2,500 పాయింట్ల ర్యాలీ చేసి మార్కెట్ ఫుల్ జోష్ మీదుంది. అయితే, తెల్లారేసరికి అంచనాలు తారుమారయ్యాయి. మార్కెట్‌కు ఎన్నికల ఫలితాల ట్రెండ్ ఊహించన్ని షాకిచి్చంది. బీజేపీకి సొంతంగా మ్యాజిక్ ఫిగర్ కష్టమేనని తేలిపోవడంతో దేశీ స్టాక్ మార్కెట్‌పై అమ్మకాల సునామీ విరుచుకుపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ దాదాపు 6,234 పాయింట్లు దిగజారి ఏకంగా 70,234 పాయింట్లకు కుప్పకూలింది. చివరికి 4,390 పాయింట్ల భారీ నష్టంతో 72,079 వద్ద ముగిసింది.కట్ చేస్తే... జూలై 3: ఎన్నికల ఫలితాలతో బుర్రతిరిగిన బుల్.. మళ్లీ రంకెలేస్తూ దూసుకుపోయింది. సరిగ్గా నెల రోజుల వ్యవధిలో (ఫలితాల రోజు కనిష్ట స్థాయితో పోలిస్తే) దాదాపు 10,000 పాయింట్ల ర్యాలీతో దుమ్మురేపింది. చరిత్రలో తొలిసారి 80,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. రోజుకో సరికొత్త రికార్డులతో హోరెత్తిస్తోంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
గాల్లో ఆగిపోయిన రోలర్ కోస్టర్.. బిక్కుబిక్కుమంటూ పర్యాటకులు
లండన్: దక్షిణ ఇంగ్లండ్‌లోని ఓ రోలర్ కోస్టర్‌లో ప్రయాణిస్తున్న కొంతమంది పర్యాటకులు ఆ క్యాబిన్ స్ట్రక్ అయిపోవడంతో తలకిందులుగా వేలాడుతూ ఉండిపోయారు. చాలా సేపటి తర్వాత ఆ అమ్యూజ్మెంట్ పార్క్ వారు రంగంలోకి దిగిన తర్వాత అందులోని వారిని సురక్షితంగా కిందకు దించడంతో పెనుప్రమాదం తప్పింది. రోలర్ కోస్టర్ రైడ్ అంటే కొంతమందికి మహా సరదా. ఎత్తు పల్లాల్లో వేగంగా దూసుకుపోయే ఈ రైడ్‌లో ప్రయాణిస్తుంటే ప్రాణం గాల్లో తేలియాడుతూ మహదానందంగా ఉంటుంది. కానీ ఇదే రోలర్ కోస్టర్ రైడ్‌లో ఏదైనా అపశ్రుతి దొర్లితే జరిగే ప్రమాదం ఊహకు కూడా అందదు. అచ్చంగా అలాంటి ప్రమాదానికే అంచుల వరకు వెళ్లి తప్పించుకున్నారు లండన్‌లోని ఓ రోలర్ కోస్టర్‌లో ప్రయాణిస్తున్నవారు. ఈ రోలర్ కోస్టర్ మొదలైనప్పుడు మొదట భూమికి లంబంగా పైకి వెళ్తుంది... ఇక అక్కడి నుండి కిందకి జారుకుంటూ రివ్వున దూసుకుపోతుంది. కానీ ఇది పైకి వెళ్తున్నప్పుడే భూమికి సుమారు 72 అడుగుల ఎత్తులో ఆగిపోయింది. ఇందులో ఒకామె తన ఆరేళ్ళ కుమార్తెతో సహా ఇరుక్కుపోయింది. ఏం జరిగిందో అర్ధంకాక వారు బిక్కుబిక్కుమంటూ గుటకలు మింగుతూ ఉండిపోయారు. ఏదైనా జరగరానిది జరిగి పట్టుతప్పితే వారు కిందకి వచ్చేలోపే వారి ప్రాణాలు పైకి పోతాయి. అదృష్టవశాత్తు ఆ అమ్యూజ్మెంట్ పార్క్ సిబ్బంది సమయానికి స్పందించడంతో అందులో ఇరుక్కున్నవారిని సురక్షితంగా కిందకు దించారు. View this post on Instagram A post shared by @vedhamalhotra ఇది కూడా చదవండి: మనసులు గెలుచుకున్న పారా కరాటే చాంపియన్ -
Roller Coaster: తలకిందులుగా వేలాడుతూ.. 3 గంటలు నరకయాతన..
అమెరికా: అమెరికాలో ఒక అమ్యూజ్మెంట్ పార్కులో జనంతో ఉన్న ఒక రోలర్ కోస్టర్, రైడ్ జరుగుతుండగా సాంకేతిక లోపం తలెత్తి మధ్యలోనే ఆగిపోయింది. దీంతో అందులో ఉన్న వారు తలకిందులుగా వేలాడుతూ ప్రాణం గుప్పెట్లో పెట్టుకుని దాదాపు 3 గంటలపాటు నరకయాతన చూశారు. చాలామందికి రోలర్ కోస్టర్ రైడ్ అంటే మహా సరదా. గాల్లో గింగిరాలు తిరుగుతూ చేసే ఈ స్వారీ సాగుతున్నంత సేపు మహదానందాన్ని మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది. అయితే ఇలాంటి ఒక రోలర్ కోస్టర్ రైడ్ లో ఏదైనా అపశ్రుతి దొర్లితే జరిగే నష్టాన్ని కూడా ఊహించలేము. ముఖ్యంగా యాంత్రికంగా ఏవైనా సాంకేతిక లోపాలు తలెత్తినప్పుడు దేవుడిమీద భారం వేయడం తప్ప చేయగలిగింది ఏమీ ఉండదు. అచ్చంగా అలాంటి భయానకమైన సంఘటన ఒకటి అమెరికాలోని క్రాండన్ పార్క్ ఫారెస్ట్ కౌంటీ ఫెస్టివల్లో చోటు చేసుకుంది. రోలర్ కోస్టర్ రైడ్ జరుగుతుండగా సాంకేతిక సమస్య ఏర్పడటంతో కోచ్ మధ్యలోనే ఆగిపోయింది. దీంతో అందులో స్వారీ చేస్తున్నవారు తలకిందులుగా వేలాడుతూ ఊపిరిని బలంగా బిగపట్టి మూడు గంటలపాటు బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఆ క్షణంలో పరిస్థితి ఏమాత్రం పట్టు తప్పినా దారుణం జరిగుండేదని సంఘటనను ప్రత్యక్షంగా చూసిన వారు చెబుతున్నారు. ఆ సమయంలో తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆగిపోయిన రోలర్ కోస్టర్ లో ఎనిమిది మంది ఉండగా అందులో ఏడుగురు చిన్నారులేనని సహాయక బృందం వెంటనే స్పందించి వారిని సురక్షితంగా కిందకు దించారని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి తెలిపారు. మెకానికల్ సమస్య కారణంగానే రోలర్ కోచ్ మధ్యలో ఆగిపోయిందని.. విస్కాన్సిన్ బృందం ఇటీవలే ఇక్కడ తనిఖీలు కూడా చేశారని, అయినా ఇలా ఎందుకు జరిగిందో తెలియడంలేదని, ఇంతకు మించి మా వద్ద ఎటువంటి సమాచారం లేదని ఈ ఫెస్టివల్ నిర్వాహకులు తెలిపారు. Eight people hung upside down for about three hours, stuck in a roller coaster-like attraction. Emergency happened at a festival in American Wisconsin. Local media write that seven of the eight stranded are children. According to preliminary data, everyone got off with fright. pic.twitter.com/OP3Ow3syQZ — Sasha White (@rusashanews) July 4, 2023 ఇది కూడా చదవండి: టైటాన్ విషాదం: నా భర్త, బిడ్డ చివరి రోజులు తలచుకుంటే.. -
విరిగిన రోలర్ కోస్టర్ పిల్లర్.. తప్పిన పెను ప్రమాదం
నార్త్ కరోలినా: అత్యంత ఎత్తులో నిర్మితమైన ఓ రోలర్ కోస్టర్ రైడ్ జరుగుతున్న సమయంలో వీడియో తీశాడు ఓ సందర్శకుడు. వీడియోలో ఒక సన్నివేశం చూసి గగుర్పాటుకు గురై వెంటనే నిర్వాహకులను అప్రమత్తం చేశాడు. ఈ రోలర్ కోస్టర్ తాలూకా బ్రిడ్జి పిల్లర్ ఒకదానికి బీట రావడంతో రైడ్ సమయంలో పక్కకు కదులుతూ ప్రమాదకరంగా కనిపించింది. అలాగే నిర్లక్ష్యంగా దీనిని నిర్వహించి ఉంటే ఎంతటి దారుణం జరిగేదోనని అంటున్నారు నెటిజన్లు. ఫ్యూరీ 325 పేరుతో నడిచే రోలర్ కోస్టర్ కు స్థానికంగా విశేషమైన ప్రజాదరణ ఉంది. ఈ రైడ్ ను జీవితంలో ఒక్కసారి అయినా ఆస్వాదించాలని ఎక్కడెక్కడ నుంచో ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే దీని నిర్వహకులు దీనిలోని ఒక పిల్లర్ కు బీట వచ్చిన విషయాన్ని గమనించలేదు. రోలర్ కోస్టర్ స్థితిగతులను పట్టించుకోకుండా యధావిధిగా నిర్వహిస్తూ కాసులు గడించే పనిలో నిమగ్నమయ్యారు. ఇక్కడికి విచ్చేసిన ఓ సందర్శకుడు తన మొబైల్ లో రోలర్ కోస్టర్ రైడ్ ను బంధించాలని ప్రయత్నించాడు. ఆ సమయంలో అతను ఓ ప్రమాదాన్ని పసిగట్టాడు. ఆయన తీసిన వీడియోని నిశితంగా గమనించగా దీని పిల్లర్లలో ఒక పిల్లర్ కు పెద్ద బీటే వచ్చినట్లు కనిపించింది. వీడియోలో బీట వచ్చిన పిల్లర్ గుండా రోలర్ కోస్టర్ వెళ్ళినప్పుడు పిల్లర్ కదులుతున్న దృశ్యం స్పష్టంగా కనిపించింది. వెంటనే ఈ విషయాన్ని మేనేజ్మెంట్ దృష్టికి తీసుకుని వెళ్లడంతో ప్రస్తుతానికైతే ఈ రోలర్ కోస్టర్ రైడ్ ను నిలిపివేశారు. మరమ్మత్తులు పూర్తయిన తర్వాతే దీన్ని పునరుద్ధరిస్తామని తెలిపారు. ఈ వీడియోని ఆ సందర్శకుడు ట్విట్టర్లో పొందుపరిచాడు. రోలర్ కోస్టర్ ఏ మాత్రం పట్టుతప్పినా అందులో ఉన్నవారి ప్రాణాల సంగతేమి కాను. గాలిలోని ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయి. సందర్శకుడు ఈ అమ్యూజ్మెంటు సంస్థ మేనేజ్మెంటును అప్రమత్తం చేసి పెను విపత్తునే తప్పించాడని నెటిజన్లు అతడిని అభినందిస్తున్నారు. A visitor at a North Carolina amusement park spotted a large crack on a roller coaster's pillar on Friday. The ride, which was billed as one of the tallest of its kind, has now been closed as crews make repairs. https://t.co/9xqRRgXyWl pic.twitter.com/HTHculBdl9 — The New York Times (@nytimes) July 2, 2023 ఇది కూడా చదవండి: కుక్కను కారులోనే వదిలి తాజ్‌మహల్ చూసి వచ్చారు.. తిరిగొచ్చి చూస్తే.. -
పైకి వెళ్లిన తర్వాత కరెంటు పోతే..
-
ఇంట్లోనే కొడుకును రోలర్ కోస్టర్ ఎక్కించిన తండ్రి
-
చందమామ రావే... రోలర్ కోస్టర్ తేవే! రూపాయి ఖర్చు లేకుండా!
పిల్లల ఆనందానికి మించి తల్లిదండ్రులకు ఆస్తులు ఏం ఉంటాయి? ఈ ఇన్స్టాగ్రామ్ వైరల్ వీడియోను చూస్తే... ‘నిజమే సుమీ!’ అనిపిస్తుంది. పిల్లలు ఎంజాయ్ చేసే వాటిలో రోలర్ కోస్టర్ రైడ్ కూడా ఒకటి. అయితే బయటికి పిల్లల్ని తీసుకెళ్లి ఆ ఆనందంలో భాగం చేయడానికి టైమ్ సరిపోవడంతో పాటు డబ్బులు కూడా సరిపోవాలి. ఈ వైరల్ వీడియో దంపతులు తమ ఇంట్లో ఉన్న పెద్ద ఎల్ఈడీ టీవీతో ‘రోలర్ కోస్టర్ రైడ్’ను ఇంట్లోకి తీసుకువచ్చారు. సాఫ్ట్ కుషన్‌తో కూడిన టబ్‌లో పాపను కూర్చోబెట్టారు. చెరో పక్క పట్టుకొని టీవీ దగ్గరకు తీసుకువెళ్లారు. టీవీలో రోలర్ కోస్టర్ వర్చువల్ వీడియోను ప్లే చేశారు. పాప ఆ రైడ్‌లో భాగం అయింది. సంతోషంతో నవ్వుతూనే ఉంది! View this post on Instagram A post shared by Kaashvi Rathore (@princess_point_.l) -
వైరల్: అయ్యో.. బర్త్ డే అనుకుంటే.. డెత్ డేకు దాపురించిందే..!
జీవితంలో కొన్ని సరదా క్షణాలు ఉండాలని ఎంతో మంది కోరుకుంటారు. అది పుట్టిన రోజైతే చాలా మంది స్పెషల్‌గా ప్లాన్ చేస్తారు. ఆ మదుర క్షణాలు గుర్తు చేసుకున్నప్పడు మనసులో అదో రకమైన ఫీలింగ్ కలగాలి అనుకుంటారు. దాన్ని వర్ణించడం మాటల కందని విషయంగా.. అది మనిషిలో ఓ తెలియని భావాన్ని కలిగించేలా.. ఎంత బాగుండు అనిపిస్తుంది. అప్పుడప్పుడు గాల్లో ఎగరాలి అనిపించడం, రోలర్ కోస్టర్‌పై సరదాగా తిరగాలి అనిపించడం కూడా ఈ కోవలోకే వస్తాయి. వాషింగ్టన్: అమెరికాలోని న్యూజెర్సీలో ఇద్దరు అమ్మాయిలు తమ పుట్టిరోజును సరదాగా గడపాలని ప్లాన్ చేసుకున్నారు. ఇందులో భాగంగా రోలర్ కోస్టర్‌పై ఎక్కారు. అయితే భయంతో కూడిన ఉత్సాహంతో రైడ్ కోసం ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలో రోలర్ కోస్టర్ రైడ్ మొదలైన కొద్ది సేపటికే ఓ సీగల్ పక్షి వచ్చి ఓ అమ్మాయిపై పడింది. దీంతో చచ్చేంత భయంతో చెవులు గల్లలు పోయేల మొత్తుకుంది. కానీ ఆ అరుపు గాల్లో అలాగే కలిసి పోయింది. చివరకు ధైర్యం చేసి పక్షిని తనే స్వయంగా తీసివేసి ఊపిరి పీల్చుకుంది. కానీ ఆ అమ్మాయి పక్కనే కూర్చున్న మరో బాలిక కళ్లు బిగ్గరగా మూసుకోవడంతో ఇవేవీ గమనించలేదు. ఈ వీడియోను టైరోన్ పవర్ సోషల్ మీడియా యూజర్ నెట్టింట పంచుకోగా తెగ వైరలవుతోంది. దీని పై ఓ నెటిజన్ స్పందిస్తూ..‘‘ పుట్టిన రోజు శుభాకాంక్షలు! మీ భయం నిజం అయ్యింది. దెబ్బకు చచ్చినంత పనైంది.’’ అంటూ కామెంట్ చేశాడు. మరో నెటిజన్ ‘‘ భయపడనేలా.. రోలర్ కోస్టర్‌ను ఎక్కనేలా.. ఇది మీకు మంచి అనుభవాన్నే ఇచ్చినట్టుంది?’’ అంటూ రాసుకొచ్చారు. -
మార్కెట్.. రోలర్ కోస్టర్ రైడ్
ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన ప్రోత్సాహంతో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు మధ్యలో అమ్మకాల ఒత్తిడితో దెబ్బతిన్నాయి. తిరిగి మిడ్‌సెషన్ నుంచీ ఊపందుకుని చివరికి చెప్పుకోదగ్గ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 376 పాయింట్లు పెరిగి 33,605 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం లాభాల సెంచరీ చేసి 9,914 వద్ద స్థిరపడింది. యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ కార్పొరేట్ బాండ్ల కొనుగోలు ద్వారా కంపెనీలకు మరింత ఆర్థిక చేయూత నిచ్చేందుకు నిర్ణయించడంతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటుకు జోష్ వచ్చింది. దీంతో ఆసియా మార్కెట్లు 4-1 శాతం మధ్య జంప్ చేశాయి. ఈ బాటలో తొలుత సెన్సెక్స్ 800 పాయింట్ల వరకూ ఎగసింది. 34,000 పాయింట్ల మైలురాయిని అధిగమించి 34,022ను తాకింది. తదుపరి అమ్మకాల ఒత్తిడిలోపడి 33,000 పాయింట్ల దిగువన 32,953కు జారింది. ఇది 250 పాయింట్ల నష్టంకాగా.. ఇంట్రాడేలో 1,000 పాయింట్ల పరిధిలో ఊగిసలాడింది. ఈ బాటలో నిఫ్టీ తొలుత 10,046 వద్ద గరిష్టాన్ని తాకగా.. మిడ్‌సెషన్‌లో 9729 దిగువన కనిష్టాన్ని చవిచూసింది. ప్రయివేట్ బ్యాంక్స్ అప్ ఎన్ఎస్ఈలో ప్రధానంగా ప్రయివేట్ బ్యాంక్స్, మెటల్, మీడియా 2-1.25 శాతం మధ్య పుంజుకోగా.. పీఎస్‌యూ బ్యాంక్స్, రియల్టీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ 1-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో హెచ్డీఎఫ్సీ ద్వయం, ఐసీఐసీఐ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, యూపీఎల్, ఇన్ఫోసిస్, కొటక్ మహీంద్రా, హీరో మోటో, వేదాంతా 4-1.5 శాతం మధ్య ఎగశాయి. అయితే టాటా మోటార్స్ 6 శాతం పతనంకాగా.. ఇన్ఫ్రాటెల్, ఇండస్ఇండ్, టెక్ మహీంద్రా, యాక్సిస్, గెయిల్, ఐవోసీ, ఐటీసీ, ఎయిర్టెల్, పవర్‌గ్రిడ్ 3-1 శాతం మధ్య క్షీణించాయి. బాలకృష్ణ జోరు డెరివేటివ్స్‌లో బాలకృష్ణ, ఎల్ఐసీ హౌసింగ్, జిందాల్ స్టీల్, గోద్రెజ్ సీపీ, ఎస్బీఐ లైఫ్, అమరరాజా 5.2-3.3 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. ఐడియా, టాటా పవర్, శ్రీరామ్ ట్రాన్స్, అపోలో హాస్పిటల్స్, బీవోబీ, కేడిలా హెల్త్‌కేర్, ఎన్సీసీ 4.4-2.7 శాతం మధ్య పతనమయ్యాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.4 శాతం పుంజుకుంది. ట్రేడైన షేర్లలో 1380 లాభపడగా.. 1193 నష్టపోయాయి. ఎఫ్‌పీఐల అమ్మకాలు నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2960 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1076 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశాయి. ఇక శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 1311 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టగా.. డీఐఐలు రూ. 1945 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. -
+786 నుంచి –511 వరకూ...
సోమవారం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ రోలర్ కోస్టర్ రైడ్‌ను తలపించింది. స్టాక్ మార్కెట్ భారీగా లాభపడి, చివరి అరగంటలో ఈ లాభాలన్నింటినీ కోల్పోయి భారీగా నష్టపోయి, మళ్లీ ఈ నష్టాల్లో మూడో వంతు వరకూ రికవరీ చేసుకొని ఓ మోస్తరు నష్టాల్లో ముగిసింది. వేల్యూ బయింగ్‌కు తోడు షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు జత కావడంతో సెన్సెక్స్, నిఫ్టీలు ఇంట్రాడేలో భారీగా లాభపడ్డాయి. ముడి చమురు ధరలు 2.2 శాతం తగ్గడం, కుంటుపడుతున్న అంతర్జాతీయ వృద్ధిని గాడిన పడేయడానికి పలు దేశాల కేంద్ర బ్యాంకులు రేట్లను తగ్గిస్తాయని, ఉద్దీపన చర్యలు తీసుకుంటాయనే అంచనాలు...సానుకూల ప్రభావం చూపాయి. అయితే చివరి అరగంటలో సీన్ మారిపోయింది. భారత్‌లో తాజాగా రెండు కోవిడ్–19(కరోనా) వైరస్ కేసులు వెలుగుచూడటంతో ఈ లాభాలన్నీ ఆవిరయ్యాయి. చివరకు బీఎస్ఈ సెన్సెక్స్ 153 పాయింట్లు పతనమై 38,144 పాయింట్ల వద్ద, నిఫ్టీ 69 పాయింట్లు పతనమై 11,133 పాయింట్ల వద్ద ముగిశాయి. స్టాక్ సూచీలు ఏడో రోజూ నష్టాల్లోనే ముగిశాయి. ఆర్థిక, ఉక్కు, ఎఫ్ఎమ్సీజీ షేర్లు భారీగా పడ్డాయి. ఐటీ, టెక్నాలజీ సూచీలు మినహా మిగిలిన సూచీలు నష్టాల్లో ముగిశాయి. 1,297 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్.. గత ఆరు రోజుల నష్టాల కారణంగా తీవ్రంగా పతనమై ఆకర్షణీయంగా ఉన్న షేర్లలో కొనుగోళ్లు (వేల్యూ బయింగ్)జోరుగా జరిగాయి. కోవిడ్–19(కరోనా) వైరస్ ధాటికి విలవిలలాడుతున్న ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడానికి వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు ఉద్దీపన చర్యలు తీసుకోగలవన్న అంచనాలు, షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు సానుకూల ప్రభావం చూపాయి. ఫలితంగా సెన్సెక్స్ ఇంట్రాడేలో 786 పాయింట్ల లాభంతో 39,083 పాయింట్ల వద్దకు చేరింది. నిఫ్టీ కూడా 231 పాయింట్ల లాభంతో 11,433 పాయింట్లకు పెరిగింది. అయితే భారత్‌లో తాజాగా రెండు కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్రం ప్రకటించడంతో సూచీలు కుప్పకూలాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 511 పాయింట్ల నష్టంతో 37,786 పాయింట్లకు, నిఫ్టీ 166 పాయింట్ల నష్టంతో 11,036 పాయింట్లను తాకాయి. ఇంట్రాడే గరిష్ట స్థాయిల నుంచి చూస్తే, సెన్సెక్స్ 1,297 పాయింట్లు, నిఫ్టీ 397 పాయింట్ల మేర పతనమయ్యాయి. ఈ ఏడాది జనవరిలో ఎనిమిదేళ్ల గరిష్టానికి ఎగసిన భారత తయారీ రంగ వృద్ధి ఫిబ్రవరిలో ఒకింత మందగించినా ఆరంభంలో కొనుగోళ్లు జోరుగానే సాగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి అంచనాలను ఫిచ్ సొల్యూషన్స్ సంస్థ 5.1 శాతం నుంచి 4.9 శాతానికి తగ్గించడం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. షాంఘై, హాంకాంగ్, సియోల్, టోక్యో సూచీలు చెప్పుకోదగ్గ లాభాల్లో ముగిశాయి. యూరప్ మార్కెట్లు లాభాల్లోనే ఆరంభమైనా, ఆ తర్వాత నష్టాల్లోకి జారిపోయాయి. చివరకు మిశ్రమంగా ముగిశాయి. ► ఎస్బీఐ అనుబంధ కంపెనీ, ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్ సర్వీసెస్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ఆరంభమైన నేపథ్యంలో ఎస్బీఐ షేర్ 5% నష్టంతో రూ.287 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. సెన్సెక్స్ 153 పాయింట్ల నష్టంలో మూడో వంతు వాటా (55 పాయింట్లు) ఈ షేర్‌దే. ► 400కు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, గెయిల్ ఇండియా, హీరో మోటోకార్ప్, హిందాల్కో, హిందుస్తాన్ జింక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, మహీంద్రా అండ్ మహీంద్రా, మ్యారికో, ఎన్బీసీసీ, ఎన్టీపీసీ, ఆయిల్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, వేదాంత, ఏసీసీ, అపోలో టైర్స్, ఆశోక బిల్డ్‌కాన్, జిల్లెట్ ఇండియా, థెర్మాక్స్, లుపిన్, రేమండ్, భెల్, ఓఎన్జీసీ, హెచ్‌పీసీఎల్, టాటా పవర్, విప్రో తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► ఫిబ్రవరిలో వాహన అమ్మకాలు పుంజుకోవడంతో ఎస్కార్ట్స్ షేర్ 8 శాతం లాభంతో రూ.843 వద్ద ముగిసింది. ► నేడు(మంగళవారం) బోర్డ్ మీటింగ్ జరగనున్న నేపథ్యంలో మిధాని షేర్ ఇంట్రాడేలో 13 శాతం లాభంతో ఆల్‌టైమ్ హై, రూ.278ను తాకింది. చివరకు 3 శాతం నష్టంతో రూ.238 వద్ద ముగిసింది. ఈ సమావేశంలో కంపెనీ మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించనున్నట్లు సమాచారం. పుల్‌బ్యాక్ ర్యాలీకి బ్రేక్! గత ఆరు రోజులుగా 7 శాతం మేర నష్టపోయిన మార్కెట్లో ఈ వారం పుల్‌బ్యాక్ ర్యాలీ ఉండొచ్చని అంచనాలున్నాయని షేర్‌ఖాన్ బై బీఎన్పీ పారిబా అనలిస్ట్ గౌరవ్ దువా పేర్కొన్నారు. ఈ అంచనాలకనుగుణంగానే పుల్‌బ్యాక్ ర్యాలీ వచ్చినప్పటికీ, కొత్తగా నమోదైన కరోనా కేసులు ఈ పుల్‌బ్యాక్ ర్యాలీని ఆరంభంలోనే నిలువరించాయని వ్యాఖ్యానించారు. ప్రపంచ మార్కెట్లు స్థిరంగా ఉన్నా, మన మార్కెట్లో పతనం తప్పలేదని వివరించారు. ఏడు రోజుల నష్టాల కారణంగా రూ.13 లక్షల కోట్లు మేర ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్‌రూ.13 లక్షల కోట్లు తగ్గి రూ.145.80 లక్షల కోట్లకు పడిపోయింది. -
భలే ఐడియా.. ఈ నాన్నకు హ్యాట్సాఫ్!!
ప్రతీ తల్లిదండ్రులకు తమ పిల్లల సంతోషమే మొదటి ప్రాధాన్యం. అందుకోసం ఎంతటి కష్టాన్ని ఓర్చుకోవడానికైనా వారు సిద్ధపడతారు. అంతేకాదు పిల్లల భవిష్యత్తు కోసం చిన్న చిన్న సరదాలను సైతం పక్కనపెట్టేస్తారు. ఇక తమ చిట్టిపాపాయిలు.. ముఖ్యంగా కూతుళ్ల చిరునవ్వు కోసం వినూత్న ఆలోచనలు చేసే తండ్రులు కూడా ఎంతోమంది ఉంటారు. అలాంటి కోవకే చెందిన ఓ వ్యక్తి.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు. నెటిజన్ల చేత ఉత్తమ తండ్రి అంటూ అవార్డు కూడా అందుకున్నాడు. ఇంతకీ విషయమేమిటంటే... నికోలే అనే పాపాయి తండ్రి తన చిన్నారి కూతురికి రోలర్ కోస్టర్‌లో తిరిగిన అనుభూతి కలిగించాలనుకున్నాడు. అంత చిన్న పాపతో అటువంటి సాహసం ప్రమాదకరం కాబట్టి.. ఇంట్లోనే ఆ ఏర్పాటు చేశాడు. నికోలేను వాకర్‌లో కూర్చోబెట్టి... టీవీ స్క్రీన్‌పై రోలర్ కోస్టర్ వీడియో ప్లే చేస్తూ దానికి దగ్గరగా కూతుర్ని తీసుకువెళ్లాడు. దీంతో టీవీ చూస్తూ.. నిజంగానే తాను రోలర్ కోస్టర్‌లో విహరిస్తున్నట్లుగా ఆ చిన్నారి కేరింతలు కొడుతూ ఉంటే అతడు సంతోషంతో ఉప్పొంగిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోను...ఓ ట్విటర్ యూజర్ ‘‘ రోలర్ కోస్టర్ ఎక్కేంత పెద్దవాళ్లు కానపుడు ఇలా చేయండి’’ అని క్యాప్షన్‌తో షేర్ చేశారు. ఈ క్రమంలో.. ‘‘భలే ఐడియా.. ఈ నాన్నకు హ్యాట్సాఫ్.. ప్రతీ కూతురు తన తండ్రికి యువరాణే అని మరోసారి నిరూపించాడు’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
సూపర్ క్యాచ్ బాసూ..!
-
ఇలాంటి క్యాచ్‌ను ఎక్కడైనా చూశారా!?
సూపర్ క్యాచ్ బాసూ.. ఇలాంటి క్యాచ్‌ను ఎక్కడా చూడలేదు అంటూ నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎందుకంటే ఈ సంఘటన సంభవించింది ఆకాశంలో.. క్యాచ్ పట్టిన వస్తువు బాల్ కాకపోవడం ఇక్కడ విశేషం. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న రోలర్ కోస్టర్‌లో కూర్చున్న ఓ వ్యక్తి గాల్లో ఓ ఫోన్‌ను అద్భుతంగా క్యాచ్ పట్టి లెజెండ్ అనిపించుకుంటున్నాడు. వివరాలు.. శామ్యూల్ కెంఫ్ అనే వ్యక్తి ఈ నెల 4న స్పెయిన్‌లోని పోర్ట్అవెంచురా వరల్డ్ థీమ్ పార్కును సందర్శించాడు. ఈ పార్కులో అతిపెద్దది, వేగవంతమైన రోలర్ కోస్టర్‌లలో ఒకటైన శంభాల రైడ్‌ను ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాడు. శంభాల రోలర్ కోస్టర్‌ను ఎక్కి కూర్చున్నాడు. అది తిరగడం ప్రారంభించిన కొద్ది సేపటి తర్వాత తనకు కొన్ని సీట్ల ముందు కూర్చున్న వ్యక్తి ఫోన్ కిందపడటం గమనించాడు శామ్యూల్. వెంటనే అప్రమత్తమై ఆ ఫోన్‌ను గాల్లోనే క్యాచ్ పట్టుకున్నాడు. ఈ మొత్తం సంఘటన అంత అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. దాంతో పార్కు యాజమాన్యం ఈ వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది. ఇతర సోషల్ మీడియా వేదికల్లో కూడా దీన్ని షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. శామ్యూల్ సమయస్ఫూర్తికి నెటిజన్లు ఫిదా అవ్వడమే కాక ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘నిజంగా నువ్వు లెజెండ్‌వి’.. ‘ఇది ఓ గొప్ప ప్రయత్నం.. అతడు ఆ ఫోన్‌ను పట్టుకున్న విధానం నిజంగా గొప్పది. ఇందుకు అతనికి మెడల్, ట్రోఫిని ఇవ్వవచ్చు’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. -
దీన్ని ఎక్కాలంటే దమ్ముండాల్సిందే..
మీరెప్పుడైనా రోలర్ కోస్టర్ ఎక్కారా? గాలిలో రౌండ్లు తిరుగుతూ సర్రున దూసుకుపోయే సాధారణ రోలర్ కోస్టర్ అంటేనే చాలామంది భయపడతారు. మరి ప్రపంచంలోనే అత్యంత పొడవైన, వేగవంతమైన, ఎక్కువ మలుపులు, వంపులు ఉన్న రోలర్ కోస్టర్ ఎక్కాలంటే ఎంత ధైర్యం కావాలి? అలాంటి గుండె ధైర్యం ఉన్నవారికోసమే అమెరికాలోని ఇల్లినాయిస్లో ‘సిక్స్ ఫ్లాగ్స్’ అనే సంస్థ గోలియత్ అనే ఈ రోలర్ కోస్టర్‌ను ఏర్పాటుచేసింది. కలపతో రూపొందించిన ఈ కోస్టర్.. గురువారమే ప్రారంభమైంది. మలుపులు, వంపుల్లో కూడా గంటకు 72 మైళ్ల వేగంతో దూసుకుపోతుంది. అంతేకాదు.. పైనుంచి నిట్టనిలువుగా కిందకు అమాం తంగా దిగిపోతుంది. కేవలం 75 సెకన్లలోనే ఓ రౌం డ్ కొట్టేస్తుంది. దీనిపై తొలిసారిగా రైడ్ కొట్టినవారిలో జాన్ ముర్మన్ అనే 88 ఏళ్ల వ్యక్తి కూడా ఉండటం విశేషం. -
కెవ్వు కేక... ఈ పల్టీల విహారం
రంగులరాట్నంలో విహారం ఓ అద్భుతం అనుకుంటే, మొదలైన క్షణం నుంచి ఎక్కడా ఆగకుండా గిరికీలు కొడుతూ ‘కేక’పుట్టించే సంబరం రోలర్ కోస్టర్ కలిగిస్తుంది. చిన్నా, పెద్ద ఎగ్జిబిషన్లలో ఓ మోస్తరు రోలర్ కోస్టర్ లో విహారం చాలామందికి అనుభవమే! కానీ, ప్రపంచంలో అతి పెద్ద, పొడవైన... రోలర్కోస్టర్ల గురించి మీకు తెలుసా?! మిలీనియమ్ ఫోర్స్ పేరున్న స్టీల్ రోలర్ కోస్టర్ ఎత్తు 310 అడుగులు. అమెరికా సంయుక్తరాష్ట్రాలలోని సీడర్ పాయింట్ ఉద్యానంలో ఉంది. 9 కార్లతో ఉన్న 3 రైళ్లు రెండు దారులలో క్రాస్‌గా ప్రయాణిస్తాయి. ఒక్కో రైలులో 36 మంది వెళ్లచ్చు. టాప్ థ్రిల్ డ్రాగ్స్టెర్ అని పేరున్న స్టీల్ రోలర్ కోస్టర్ కూడా అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఉన్న సీడర్పాయింట్ ఉద్యానంలోనే ఉంది. దీని ఎత్తు 400 అడుగులు. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన రోలర్‌కోస్టర్. దీనిలో 5 కార్లతో ఉన్న ఆరు రైళ్లు రెండు దారులలో క్రాస్‌గా ప్రయాణిస్తాయి. ఒక్కో రైలులో 18 మంది ప్రయాణించవచ్చు. సూపర్‌మ్యాన్ అని పేరున్న రైడ్ ఆఫ్ స్టీల్ రోలర్‌కోస్టర్ మేరీల్యాండ్‌లోని సిక్స్ ఫ్లాగ్స్ అమెరికా థీమ్‌పార్క్‌లో ఉంది. దీని ఎత్తు 208 అడుగులు. పొడవు 5,400 అడుగులు. గంటకు 1,100 మంది పర్యాటకులు రైడ్ చేయగల సామర్థ్యం ఈ రోలర్‌కోస్టర్‌కు ఉంది. ద బీస్ట్ ఉడెన్ రోలర్ కోస్టర్ ఒహియోలోని కింగ్స్ ఐలాండ్‌లో ఉంది. ఇది ప్రపంచంలోని ఉడెన్ రోలర్‌కోస్టర్‌లలో అత్యంత పొడవైన, ఎత్తై, వేగవంతమైనది. 35 ఎకరాలలో విస్తరించిన ఉన్న ఈ రోలర్‌కోస్టర్‌ను ట్రెయిన్లో 4 నిమిషాలలో చుట్టిరావచ్చు. కింగ్స్ ఐలాండ్ వద్ద ఉన్న ప్రధాన టూరిస్ట్ అట్రాక్షన్లలో ఇదీ ఒకటి. ఆరు కార్లతో ఉన్న 3 ట్రెయిన్లు 3 దారులలో ప్రయాణిస్తాయి. ఒక్కో ట్రెయిన్లో 36 మంది వెళ్లచ్చు. ఒబిలివియన్ రోలర్‌కోస్టర్ ఇంగ్లండ్‌లోని అల్టన్ టవర్స్‌లో కొలువుదీరింది. ప్రపంచంలోనే లంబాకారంలో ఉన్న అతిపెద్ద రోలర్‌కోస్టర్ ఇదే! ఎత్తు 65 అడుగులు. లంబకోణంలో 180 అడుగులు. పొడవు 1,223 అడుగులు. దీంట్లో రైడర్స్ 1.4 మీటర్ల ఎత్తు వెళ్లడానికి మాత్రమే అనుమతి ఉంది. సింగిల్ రైడర్ లైన్ అందుబాటులో ఉంది.