సూపర్ క్యాచ్ బాసూ.. ఇలాంటి క్యాచ్‌ను ఎక్కడా చూడలేదు అంటూ నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎందుకంటే ఈ సంఘటన సంభవించింది ఆకాశంలో.. క్యాచ్ పట్టిన వస్తువు బాల్ కాకపోవడం ఇక్కడ విశేషం. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న రోలర్ కోస్టర్‌లో కూర్చున్న ఓ వ్యక్తి గాల్లో ఓ ఫోన్‌ను అద్భుతంగా క్యాచ్ పట్టి లెజెండ్ అనిపించుకుంటున్నాడు. వివరాలు.. శామ్యూల్ కెంఫ్ అనే వ్యక్తి ఈ నెల 4న స్పెయిన్‌లోని పోర్ట్‌అవెంచురా వరల్డ్ థీమ్ పార్కును సందర్శించాడు. ఈ పార్కులో అతిపెద్దది, వేగవంతమైన రోలర్ కోస్టర్‌లలో ఒకటైన శంభాల రైడ్‌ను ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాడు. శంభాల రోలర్ కోస్టర్‌ను ఎక్కి కూర్చున్నాడు.
అది తిరగడం ప్రారంభించిన కొద్ది సేపటి తర్వాత తనకు కొన్ని సీట్ల ముందు కూర్చున్న వ్యక్తి ఫోన్ కిందపడటం గమనించాడు శామ్యూల్. వెంటనే అప్రమత్తమై ఆ ఫోన్‌ను గాల్లోనే క్యాచ్ పట్టుకున్నాడు. ఈ మొత్తం సంఘటన అంత అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. దాంతో పార్కు యాజమాన్యం ఈ వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది. ఇతర సోషల్ మీడియా వేదికల్లో కూడా దీన్ని షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. శామ్యూల్ సమయస్ఫూర్తికి నెటిజన్లు ఫిదా అవ్వడమే కాక ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘నిజంగా నువ్వు లెజెండ్‌వి’.. ‘ఇది ఓ గొప్ప ప్రయత్నం.. అతడు ఆ ఫోన్‌ను పట్టుకున్న విధానం నిజంగా గొప్పది. ఇందుకు అతనికి మెడల్, ట్రోఫిని ఇవ్వవచ్చు’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment