కెవ్వు కేక... ఈ పల్టీల విహారం | Excursion to the development of higher psychological ... the flipped | Sakshi
Sakshi News home page

కెవ్వు కేక... ఈ పల్టీల విహారం

Published Thu, Mar 6 2014 11:39 PM | Last Updated on Sat, Sep 2 2017 4:25 AM

కెవ్వు కేక... ఈ పల్టీల విహారం

కెవ్వు కేక... ఈ పల్టీల విహారం

రంగులరాట్నంలో విహారం ఓ అద్భుతం అనుకుంటే, మొదలైన క్షణం నుంచి ఎక్కడా ఆగకుండా గిరికీలు కొడుతూ ‘కేక’పుట్టించే సంబరం రోలర్ కోస్టర్ కలిగిస్తుంది. చిన్నా, పెద్ద ఎగ్జిబిషన్‌లలో ఓ మోస్తరు రోలర్ కోస్టర్ లో విహారం చాలామందికి అనుభవమే! కానీ, ప్రపంచంలో అతి పెద్ద, పొడవైన... రోలర్‌కోస్టర్‌ల గురించి మీకు తెలుసా?!
     
మిలీనియమ్ ఫోర్స్ పేరున్న స్టీల్ రోలర్ కోస్టర్ ఎత్తు 310 అడుగులు. అమెరికా సంయుక్తరాష్ట్రాలలోని సీడర్ పాయింట్ ఉద్యానంలో ఉంది. 9 కార్లతో ఉన్న 3 రైళ్లు రెండు దారులలో క్రాస్‌గా ప్రయాణిస్తాయి. ఒక్కో రైలులో 36 మంది వెళ్లచ్చు.
     
టాప్ థ్రిల్ డ్రాగ్‌స్టెర్ అని పేరున్న స్టీల్ రోలర్ కోస్టర్ కూడా అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఉన్న సీడర్‌పాయింట్ ఉద్యానంలోనే ఉంది. దీని ఎత్తు 400 అడుగులు. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన రోలర్‌కోస్టర్. దీనిలో 5 కార్లతో ఉన్న ఆరు రైళ్లు రెండు దారులలో క్రాస్‌గా ప్రయాణిస్తాయి. ఒక్కో రైలులో 18 మంది ప్రయాణించవచ్చు.
     
సూపర్‌మ్యాన్ అని పేరున్న రైడ్ ఆఫ్ స్టీల్ రోలర్‌కోస్టర్ మేరీల్యాండ్‌లోని సిక్స్ ఫ్లాగ్స్ అమెరికా థీమ్‌పార్క్‌లో ఉంది. దీని ఎత్తు 208 అడుగులు. పొడవు 5,400 అడుగులు. గంటకు 1,100 మంది పర్యాటకులు రైడ్ చేయగల సామర్థ్యం ఈ రోలర్‌కోస్టర్‌కు ఉంది.
     
ద బీస్ట్ ఉడెన్ రోలర్ కోస్టర్ ఒహియోలోని కింగ్స్ ఐలాండ్‌లో ఉంది. ఇది ప్రపంచంలోని ఉడెన్ రోలర్‌కోస్టర్‌లలో అత్యంత పొడవైన, ఎత్తై, వేగవంతమైనది. 35 ఎకరాలలో విస్తరించిన ఉన్న ఈ రోలర్‌కోస్టర్‌ను ట్రెయిన్‌లో 4 నిమిషాలలో చుట్టిరావచ్చు. కింగ్స్ ఐలాండ్ వద్ద ఉన్న ప్రధాన టూరిస్ట్ అట్రాక్షన్‌లలో ఇదీ ఒకటి. ఆరు కార్లతో ఉన్న 3 ట్రెయిన్‌లు 3 దారులలో ప్రయాణిస్తాయి. ఒక్కో ట్రెయిన్‌లో 36 మంది వెళ్లచ్చు.
     
ఒబిలివియన్ రోలర్‌కోస్టర్ ఇంగ్లండ్‌లోని అల్టన్ టవర్స్‌లో కొలువుదీరింది. ప్రపంచంలోనే లంబాకారంలో ఉన్న అతిపెద్ద రోలర్‌కోస్టర్ ఇదే! ఎత్తు 65 అడుగులు. లంబకోణంలో 180 అడుగులు. పొడవు 1,223 అడుగులు. దీంట్లో రైడర్స్ 1.4 మీటర్ల ఎత్తు వెళ్లడానికి మాత్రమే అనుమతి ఉంది. సింగిల్ రైడర్ లైన్ అందుబాటులో ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement