
మన ఇంట్లో ఉండే చిన్నపిల్లలు ఎప్పుడెప్పుడూ మాట్లాడతారా.. అంటూ ఆశగా చూస్తూ ఉంటాం. అయితే వారి ముద్దు ముద్దు మాటలు, వచ్చిరాని మాటలు భలే ఆహ్లాదంగా అనిపిస్తాయి. పైగా మనం వారిని మాట్లాడించేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తుంటాం. అచ్చం అలానే ఇక్కడొక అమ్మ తన పిల్లాడి తోపాటు వాళ్ల పెంపుడు కుక్క పిల్లకు కూడా మాటలు నేర్పుతుంది.
(చదవండి: టీమ్ ఇండియాగా పని చేయాలి!... మన జట్టుకు కెప్టెన్ మోదీ)
అసలు విషయంలోకెళ్లితే...ఇక్కడొక మహిళ తన పిల్లాడిని , కుక్కపిల్లనూ మాట్లాడమంటూ ప్రోత్సహిస్తుంది. పైగా మీకు నచ్చిన ఆహారం పెడుతాను అని ఊరిస్తూ.. చెప్పండి అంటూ మరీ ప్రోత్సహిస్తుంది. దీంతో ఆ పిల్లాడు, కుక్కపిల్ల మాట్లాడటానికి తెగ ప్రయత్నిస్తుంటారు. అయితే ముందుగా కుక్కపిల్లే అమ్మా అంటూ భలే పిలిచేస్తుది. దీంతో నువ్వు మాట్లాడకు అంటూ ఆ పిల్లవాడు ఆ కుక్కపిల్లను ఆపడానికి ప్రయత్నిస్తుంటాడు. ఈ మేరకు ఈఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పైగా ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్‌లు వచ్చాయి. మీరు ఓ లుక్ వేయండి.
(చదవండి: కరోనా కొత్త వేరియంట్.. జర్మనీలో తీవ్రరూపం..రంగంలోకి వైమానిక దళం)
Mom & dad are trying to get their baby to say "mama" & "more". Instead, they burst out laughing when their dog says it first. That's one smart puppy!😮🐕⭐🐶⭐🐕😮
— GoodNewsCorrespondent (@GoodNewsCorres1) November 24, 2021
pic.twitter.com/PZ3ZJ7Oj44