కుక్కలకు విశ్వాసం ఎక్కువ అంటారు. అందుకే చాలా మంది కుక్కలను ఇష్టపడతారు. అంతేగాక వాటిని పెంచుకుంటూ ఇంటిల్లిపాతి కుక్కలతో ఎక్కువగా అటాచ్‌మెంట్ పెట్టుకుంటారు. ఇక కుక్కలు కూడా అంతే.. వారి యాజమాని పట్ల విశ్వాసాన్ని చూపిస్తుంటాయి. అయితే ఇంట్లోని వారిని గమనిస్తూ వారి ఇష్టాలకు తగినట్లుగా పెంపుడు కుక్కలు నడుచుకుంటాయని ఈ తాజా సంఘటతో మరోసారి రుజువైంది. ఓ చిన్నారి నేలపై పాకడం చూసి వారి పెంపు కుక్క సైతం నేలపై పాకుతూ చిన్నారితో ఆడుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంగ్లాండుకు చెందిన సీమోన్ బీఆర్‌ఎఫ్ హోప్‌కిన్స్ అనే సేవా సంస్థ ఈ వీడియోను తమ ట్విటర్ పేజీలో షేర్ చేసింది. దీనికి ‘బేబీ నడవలేదని తెలుసుకున్న పెంపుడు కుక్క ఎలా పాకలో నేర్పిస్తుంది’ అనే క్యాప్షన్‌తో ట్వీట్ చేసింది. (చదవండి: అక్కడ హాయిగా పానీపూరీ లాగించేయవచ్చు!)
This dog realised he can't walk so decided to teach him how to crawl instead ❤️ pic.twitter.com/W7T3U5EsBB
— Simon BRFC Hopkins (@HopkinsBRFC) November 10, 2020
దీంతో ఈ వీడియోకు నెటిజన్‌లు ఫిదా అవుతున్నారు. ఆ బేబీ నడవలేదని తెలిసి తనలాగే పాకుతూ చిన్నారితో ఆడుకుంటున్నఈ వీడియో నెటిజన్‌లను తెగ ఆకట్టుకుంటుంది. ‘కుక్కులు చాలా తెలివైనవి’, ‘కుక్కలను ప్రేమించండి అవి చాలా విశ్వాసమైనవి’, ‘మనుషుల కంటే కుక్కలే ఉత్తమైనవి’ అంటూ నెటిజన్‌లు కామెంట్స్ పెడుతున్నారు. కాగా 15 సెకన్‌ల నిడివి గల ఈ వీడియోలో చిన్నారి నేలపై పాకుతూ బొమ్మలతో ఆడుకుంటోంది. ఈ క్రమంలో కుక్క చిన్నారి దగ్గరికి వచ్చింది. బాబు పాకలేడని తెలిసి అది కూడా పొట్టతో పాకుతూ చిన్నారితో ఆడుకుంటుంది. (చదవండి: వీల్ ఛైర్‌లో ఉన్నా డ్యాన్స్ అదరగొట్టింది!)
Comments
Please login to add a commentAdd a comment