lg company
-
ఎల్ఈడీ టీవీల రేట్లకు రెక్కలు
దేశంలో ఎల్ఈడీ టీవీల ధరలకు ఏప్రిల్ 1 నుంచి రెక్కలు రానున్నాయి. గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో ఓపెన్ సెల్ ప్యానెల్స్ ధరలు పెరగడంతో టీవీల ధరలను పెంచాల్సి వస్తుందని టీవీ తయారీ దారులు పేర్కొంటున్నారు. గత నెల రోజుల్లోనే ఓపెన్ సెల్ ప్యానెల్స్ ధరలు 35 శాతం మేర పెరిగాయి. ఇప్పటికే ఎల్ జీ కంపెనీ టీవీల ధరలను పెంచింది. పానసోనిక్, హయర్, థామ్సన్ వంటి సంస్థలు కూడా ఏప్రిల్ 1 నుంచి ధరలు పెంచాలని ఆలోచిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌ను బట్టి 5 నుంచి 7 శాతం మేర పెరిగే అవకాశం ఉన్నట్లు పానాసోనిక్ ఇండియా, దక్షిణాసియా ప్రెసిడెంట్, సీఈవో మనీష్ శర్మ పేర్కొన్నారు. మరోవైపు హయర్ సంస్థ ఇండియా ప్రెసిడెంట్ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. ధరలు పెంచడం తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేశారు. టీవీల తయారీలో ఓపెన్ సెల్ ప్యానెల్స్ అనేవి చాలా కీలకమైనవి. మొత్తం టీవీ తయారు ఖర్చులో 60 శాతం కేవలం ఓపెన్ సెల్ ప్యానెల్స్‌కు ఖర్చుకానుంది. డిమాండ్‌కు అనుగుణంగా ఓపెన్ సెల్ ప్యానెల్ తయారీ లేకపోవడంతో మార్కెట్లో వీటికి కొరత ఏర్పడిందని, అందుకే గత ఎనిమిది నెలల్లో వీటి ధర మూడు రెట్లు పెరిగిందని సూపర్ ప్లాస్ట్రోనిక్స్ ప్రయివేట్ లిమిటెడ్ సీఈవో అవనీత్ సింగ్ మర్వా వెల్లడించారు. కంపెనీలు అన్నీ కూడా ఓపెన్ సెల్ దశలో ప్యానెల్స్‌ను దిగుమతి చేసుకొని తర్వాత వాటిని అసెంబుల్ చేస్తాయి. చదవండి: సింగిల్ ఛార్జింగ్ తో 240 కి.మీ ప్రయాణం కొత్త కారు కొనేవారికి అదిరిపోయే ఆఫర్ -
ఎల్జీ ఎయిర్ ప్యూరిఫైర్ ఫేస్‌మాస్క్
న్యూఢిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో మాస్కులు ధరించడం తప్పనిసరి అయ్యింది. ముఖానికి మాస్కు లేకుండా బహిరంగ ప్రదేశాల్లో సంచరిస్తే పోలీసులు జరిమానా కూడా విధిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఎల్జీ ప్రజలకు గుడ్ న్యూస్ అందించింది. ఎల్జీ పూర్యరీకేర్ వేరబుల్ ప్యూరిఫైర్ ఫేస్ మాస్కును తయారు చేసినట్లు శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇప్పుడున్న మాస్కుల కన్నా మరింత ఎక్కువగా వడపోత ప్రక్రియ చేపడుతుందని ఎల్జీ కంపెనీ పేర్కొంది. దీనిలో బ్యాటరీతో నడిచే రెండు ఫ్యాన్లుతోపాటు రెస్పిరేటరీ సెన్సార్ పరిశుభ్రమైన, తాజా గాలిని అందిస్తుంది. అలాగే వేర్వేరు స్థాయిల్లో వేగాన్ని సర్దుబాటు చేసుకునేలా, అందరికీ సరిపోయేలా రూపొందించారు. అయితే ముఖానికి ధరించే పోర్టబుల్ ఎయిర్ ప్యూరిఫైయర్ మాస్క్ ధర వంటి వివరాలను మాత్రం సెప్టెంబరులో జరగనున్న ఐఎఫ్ఏ 2020లో వెల్లడించనున్నారు. ఎల్జీ ప్యూరీకేర్ వేరబుల్ ఎయిర్ ప్యూరిఫైర్‌లో గాలిని శుద్ధి చేసేందుకు రెండు హెచ్13 హెచ్ఈపీఏ ఫిల్టర్లు ఉపయోగించారు. అవసరమైనప్పుడు వాటిని మార్చుకోవచ్చు. ఇందులో అంతర్గతంగా రెండు ప్యాన్లను ఉపయోగించారు. ఇవి మూడు స్పీడ్ లెవల్స్ కలిగి ఉంటాయి. గాలి పీల్చుకునేటప్పుడు ఇవి వాటంతట అవే వేగం పుంజుకుని, వదిలేటప్పుడు నెమ్మదిస్తాయి. ఈ మాస్క్‌లో ఉపయోగించిన రెస్పిరేటరీ సెన్సార్ మాస్క్ ధరించిన వారి శ్వాస చక్రం, పరిమాణాన్ని గుర్తించి అందుకు అనుగుణంగా ఫ్యాన్ల వేగాన్ని సర్దుబాటు చేస్తుంది. (మాస్క్ ధరించలేదని ఫోన్ లాక్కొని..) ఫేస్‌మాస్క్‌లో 820 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగించారు. మోడ్‌లో 8 గంటలు, హై మోడ్‌లో రెండు గంటలు పనిచేస్తుంది. ఎలక్ట్రానిక్ పరికరం కావడం వల్ల, దీనిని ఛార్జ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మాస్కులో చిక్కుకున్న హానికరమైన సూక్ష్మక్రిములను చంపే సందర్భంలో అతినీలలోహిత కాంతి వస్తుంది. ఫిల్టర్లను మార్చాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా గుర్తించి ఎల్జీ థింక్యూ యాప్ ద్వారా మనకు సంకేతాలను ఇస్తుంది. ఫేస్ మాస్క్‌లతో ప్రజలు కలిగి ఉన్న ఆందోళనలలో ఒకటి సౌకర్యం, రెండోది గాలి బయటకు రాకుండా సరిపోయేలా పూరీకేర్‌ను రూపొందించినట్లు ఎల్జీ పేర్కొంది. చివరికి ఎక్కువ గంటలు ధరించేంత సౌకర్యంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. -
సర్వర్ రోబోలు వచ్చేస్తున్నాయి!
రోబోలతో ఉద్యోగాలు పోతాయి అంటే ఏమో అనుకున్నాం. కానీ వరస చూస్తూ ఇది నిజమే అనిపిస్తోంది. ఫొటోల్లో కనిపిస్తున్న రోబలే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. కొరియా కంపెనీ ఎల్జీ తయారు చేసింది వీటిని. మొత్తం మూడు రకాలున్నాయి. ఒకటి ఎయిర్‌పోర్టులో ప్రయాణీకులకు సాయపడేదైతే... ఇంకోటి హోటళ్లలను మన ఆర్డర్లకు తగ్గట్టుగా ఆహారాన్ని టేబుళ్లపైకి తీసుకొచ్చేది. ముచ్చటగా మూడోది షాపింగ్ మాల్స్‌లో సరుకులు మోసుకొచ్చేందుకు పనికొస్తుందని చెబుతోంది ఎల్జీ. దీని పేరు ‘క్లో –ఈ’. హోటళ్లు సిబ్బందిని తగ్గించుకునేందుకు... ఎయిర్‌పోర్టుల్లో సెక్యూరిటీ సమస్యలను తక్కువ చేసేందుకు ఇవి ఎంతో ఉపయోగపడతాయని కంపెనీ చెబుతోంది. హోటళ్లలో సర్వర్లకు బదులుగా క్లో –ఈ లను వాడితే అలుపన్నది లేకుండా 24 గంటలూ పనిచేస్తాయి. అలాగే ఎయిర్‌పోర్టుల్లో పనిచేసే వాళ్లపై నిత్యం సెర్చ్ చేయాల్సిన అవసరమూ తగ్గుతుందని.. రోబోలైతే ఎంచక్కా లోపలే అన్ని పనులూ చక్కబెట్టగలవని సంస్త వివరిస్తోంది. చాలా హోటళ్లలో ఆర్డర్లు కూడా కంప్యూటర్ల ఆధారంగా జరిగిపోతూండటం వల్ల క్లో –ఈ వంట గది నుంచి ఆహారాన్ని నేరుగా వినియోగదారుడి టేబుల్‌పైకి చేర్చేస్తుంది. ఇక షాపింగ్ మాల్స్‌లో మనం ఎంత వేగంగా షాపింగ్ ముగించినా.. బిల్లింగ్ దగ్గర విపరీతమైన జాప్యం జరుగుతూంటుంది. అదే క్లో–ఈ దగ్గరుంటే.. మనం సెలెక్ట్ చేసుకునే ప్రతి వస్తువును అక్కడికక్కడే బార్కోడ్ స్కానర్ సాయంతో లెక్కలు వేసేసి ఉంచుతుంది. ఫలితంగా కౌంటర్ వద్ద నేరుగా బిల్లు కట్టేస్తే సరి అన్నమాట! -
ఎల్జీ ‘మ్యాక్స్’ స్మార్ట్‌ఫోన్
ధర రూ.10,990 న్యూఢిల్లీ : ఎల్జీ కంపెనీ కొత్త స్మార్ట్‌ఫోన్, ఎల్జీ మ్యాక్స్‌ను శుక్రవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ 3జీ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 10,990గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్లో 1.3 గిగా హెట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 5 అంగుళాల డిస్ప్లే, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఎక్స్పాండ్ చేసుకోగల మెమరీ, 8 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 2,540 ఎంఏహెచ్ రీప్లేసబుల్ బ్యాటరీ వంటి ఫీచర్లున్నాయని కంపెనీ పేర్కొంది. ఎల్జీ ప్రముఖ ఫీచర్లైన గెశ్చర్ షాట్, సెల్ఫీ ఫ్లాష్ వంటి ప్రత్యేకతలున్నాయని కూడా పేర్కొంది. గత ఏడాది అందించిన ఎల్జీ బెల్లో స్మార్ట్‌ఫోన్‌కు కొనసాగింపుగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తున్నామని పేర్కొంది. -
అతికించేద్దాం.. చూసేద్దాం..
ఈ ఫొటోలో ఉన్న అమ్మాయి గోడకు ఏదో పేపర్ అతికిస్తోంది అనుకుంటున్నారా? కాదు ఈ అమ్మడు అతికిస్తున్నది టీవీని! టీవీ ఏంటి గోడకు అతికించడమేంటి అనేగా మీ సందేహం! ఈ టీవీ పేరు ‘వాల్‌పేపర్ టీవీ'. ఈ సరికొత్త టీవీని తయారుచేసిన ఎల్జీ కంపెనీ కొరియాలో ప్రదర్శించింది. 55 అంగుళాలుండే ఈ ఓఎల్ఈడీ టీవీ కేవలం ఒక్క మిల్లీమీటర్ కన్నా తక్కువ మందం, 1.9 కిలోల బరువు మాత్రమే ఉంటుంది. దీన్ని అయస్కాంతం సహాయంతో గోడకు అతికించుకోవచ్చు. అంతేకాదు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసేసి పేపర్లా మడిచి భద్రపరుచుకోవచ్చు కూడా. వీటి తయారీలో పాలీఇమైడ్ ఫిల్మ్‌లను ఉపయోగించడం వల్ల టీవీని వంచవచ్చు. -
ఎల్జీ బెల్లో@రూ.18,500
హైదరాబాద్: ఎల్జీ కంపెనీ ఎల్ సిరీస్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్, బెల్లోను మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ధర రూ.18,500 అని ఎల్జీ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. తమ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ జీ3కు అందుబాటు ధరలో లభించే ప్రత్యామ్నాయ ఫోన్‌గా ఈ ఎల్ బెల్లో ఫోన్‌ను అందిస్తున్నామని ఎల్జీ మొబైల్స్, ఇండియా మార్కెటింగ్ హెడ్ అమిత్ గుజ్రాల్ పేర్కొన్నారు. ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5 అంగుళాల ఐపీఎస్ డిస్ప్లే, 1.3 గిగాహెర్ట్స్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమెరీ, 8 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 2,540 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లున్నాయని వివరించారు. స్క్రీన్‌పై ఎక్కడ టచ్ చేసినా ఫొటో/వీడియో తీసుకునే టచ్ అండ్ షూట్ ఫీచర్ కూడా ఉందని తెలిపారు. గెశ్చర్ షాట్ ఫీచర్‌తో చేతుల స్వల్ప కదలికలతోనే సెల్ఫీలు తీసుకోవచ్చని పేర్కొన్నారు. నాక్కోడ్, స్మార్ట్ కీబోర్డ్, గెస్ట్‌మోడ్, క్యాప్చర్ ప్లస్, ఈజీ హోమ్, క్యూస్లైడ్, క్విక్ మెమోప్లస్ వంటి ఫీచర్లున్నాయని వివరించారు. -
భారత్‌లోకి ఎల్జీ జీ3 స్మార్ట్‌ఫోన్
16 జీబీ వేరియంట్ ః రూ.47,990 32 జీబీ వేరియంట్ ః రూ.50,990 జీ స్మార్ట్‌వాచ్ ః రూ.15,000 ముంబై: ఎల్జీ కంపెనీ తన ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్- జీ3ని భారత మార్కెట్లో సోమవారం ఆవిష్కరించింది. దీంతో పాటు జీ స్మార్ట్‌వాచ్‌ను కూడా విడుదల చేసింది. జీ3 స్మార్ట్‌ఫోన్ 16 జీబీ వెర్షన్ ధర రూ.47,990, 32 జీబీ వెర్షన్ ధర రూ. 50,990 అని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ఎండీ సూన్ క్వాన్ పేర్కొన్నారు. జీ స్మార్ట్‌వాచ్ ధర రూ.15,000 ఉంటుందన్నారు. 5.5 అంగుళాల డిస్ప్లే ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఓఎస్‌పై పనిచేసే జీ3 స్మార్ట్‌ఫోన్‌లో 5.5 అంగుళాల క్వాడ్ హెచ్డీ డిస్ప్లే, ఫోన్ వెనకభాగంలో 13 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజర్ ప్లస్ కెమెరా, 2.1 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ ఇంటర్నల్ మెమరీ, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని సూన్క్వాన్ పేర్కొన్నారు. స్లిమ్ మెటాలిక్ డిజైన్ ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌లో లేజర్ ఆటో ఫోకస్ కెమెరా, స్మార్ట్ కీ బోర్డ్, స్మార్ట్ నోటీస్ తదితర ఫీచర్లున్నాయని వివరించారు. ఫోన్ పోయినప్పుడు, అది పనిచేయకుండా చేసే కిల్ స్విచ్ వంటి ప్రత్యేక ఫీచర్ కూడా ఉందని వివరించారు. బ్రాండ్ అంబాసిడర్‌గా అమితాబ్ ఇక ఈ ఎల్జీ జీ3 స్మార్ట్‌ఫోన్‌కు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారని పేర్కొన్నారు. అమితాబ్ బచ్చన్ సంతకంతో కూడిన 15,000 లిమిటెడ్ ఎడిషన్ జీ3 ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తామని, ఈ ఫోన్లను కొన్న కొద్దిమంది వినియోగదారులకు అమితాబ్ బచ్చన్‌ను కలుసుకునే అవకాశం ఉంటుందని వివరించారు. ఈ ఏడాది చివరి కల్లా 5 లక్షల జీ3 ఫోన్లు విక్రయమవుతాయని కంపెనీ అంచనా వేస్తోంది. వాచ్ ధరకు సమానంగా డిస్కౌంట్లు ఆండ్రాయిడ్ వేర్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే జీ స్మార్ట్‌వాచ్‌లో 1.65 అంగుళాల డిస్ప్లే, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్, 512 ఎంబీ ర్యామ్, 4 జీబీ ఇంటర్నల్ మెమరీ, బ్లూటూత్ కనెక్టివిటీ, 400 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లున్నాయని సూన్ క్వాన్ వివరించారు. దుమ్ము, నీళ్లలో పడినా ఈ వాచ్ పాడైపోదని పేర్కొన్నారు. రూ.15,000 ధర ఉన్న ఈ వాచ్‌కు అంతే విలువ గల ఆఫర్లనందిస్తున్నామని చెప్పారు. జీ3 ఫోన్‌తో కలిపి ఈ వాచ్‌ను కొనుగోలు చేస్తే రూ.5,000 డిస్కౌంట్ అందిస్తామని, రూ.3,500 క్విక్ సర్కిల్ కేస్ ఉచితమని, రూ.6,500 విలువైన వన్‌టైమ్ స్క్రీన్ రీప్లేస్మెంట్ కూడా ఉచితంగా అందిస్తామని పేర్కొన్నారు. 10 శాతం మార్కెట్ వాటా అంతర్జాతీయంగా జీ3 ఫోన్ మంచి అమ్మకాలు సాధిస్తోందని, భారత్‌లో కూడా ఇదే విధంగా విజయవంతమవుతుందన్న ఆశాభావాన్ని సూన్ క్వాన్ వ్యక్తం చేశారు. భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 10 శాతం మార్కెట్ వాటా సాధించడం లక్ష్యమని క్వాన్ పేర్కొన్నారు. రూ.20,000-30,000 రేంజ్లో మరిన్ని స్మార్ట్ఫోన్లను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. -
ఎల్జీ నుంచి 4జీ రెడీ ఫోన్
గుర్గావ్: ఎల్జీ కంపెనీ 4జీ రెడీ స్మార్ట్‌ఫోన్, ఎల్జీ జీ2 ను సోమవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్‌ను 16జీబీ, 32 జీబీ మెమెరీల్లో అందిస్తున్నామని, ధరలు రూ.41,500 నుంచి ప్రారంభమవుతాయని ఎల్జీ ఇండియా ఎండీ, సూన్ క్వాన్ చెప్పారు. ఈ రెండు ఫోన్లలోనూ ఎక్స్‌పాండబుల్ మెమెరీ లేదని, అయితే ఈ ఫోన్ల జీవిత కాలం వరకూ 50 జీబీ క్లౌడ్ స్టోరేజీని ఉచితంగా ఆఫర్ చేస్తామని తెలిపారు. ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఓఎస్‌పై పనిచేసే ఈ ఫోన్లో 5.1 అంగుళాల డిస్ప్లే, 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 2.1 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయి. క్విక్ రిమోట్ ఫీచర్ కారణంగా ఇంట్లో ఉన్న టీవీ, హోమ్ థియేటర్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల ఫంక్షన్స్‌ను కంట్రోల్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది. 3జీ నెట్‌వర్క్‌ను కూడా ఈ ఫోన్లు సపోర్ట్ చేస్తాయని ఎల్జీ ఇండియా మార్కెటింగ్ హెడ్ అమిత్ గుజ్రాల్ చెప్పారు. 4జీ నెట్వర్క్ సిద్ధం కాగానే ఈ ఫోన్లను అప్‌గ్రేడ్ చేస్తామన్నారు. వచ్చే ఏడాది చివరికల్లా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 10 శాతం వాటా సాధించడం లక్ష్యమని సూన్ క్వాన్ పేర్కొన్నారు. ఒక్క ఎల్జీ జీ2 ఫోన్ల విక్రయాలతోనే రూ,150-200 కోట్ల టర్నోవర్ సాధించాలనుకుంటున్నామని వివరించారు