అతికించేద్దాం.. చూసేద్దాం.. | lg company launched wall paper tv | Sakshi
Sakshi News home page

అతికించేద్దాం.. చూసేద్దాం..

Published Thu, May 21 2015 3:15 AM | Last Updated on Sun, Sep 3 2017 2:23 AM

అతికించేద్దాం.. చూసేద్దాం..

అతికించేద్దాం.. చూసేద్దాం..

ఈ ఫొటోలో ఉన్న అమ్మాయి గోడకు ఏదో పేపర్ అతికిస్తోంది అనుకుంటున్నారా? కాదు ఈ అమ్మడు అతికిస్తున్నది టీవీని! టీవీ ఏంటి గోడకు అతికించడమేంటి అనేగా మీ సందేహం! ఈ టీవీ పేరు ‘వాల్‌పేపర్ టీవీ'. ఈ సరికొత్త టీవీని తయారుచేసిన ఎల్‌జీ కంపెనీ కొరియాలో ప్రదర్శించింది.

55 అంగుళాలుండే ఈ ఓఎల్‌ఈడీ టీవీ కేవలం ఒక్క మిల్లీమీటర్ కన్నా తక్కువ మందం, 1.9 కిలోల బరువు మాత్రమే ఉంటుంది. దీన్ని అయస్కాంతం సహాయంతో గోడకు అతికించుకోవచ్చు. అంతేకాదు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసేసి పేపర్‌లా మడిచి భద్రపరుచుకోవచ్చు కూడా. వీటి తయారీలో పాలీఇమైడ్ ఫిల్మ్‌లను ఉపయోగించడం వల్ల టీవీని వంచవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement