కొంతమందికి కార్లంటే ఇష్టం, మరికొందరికి బైకులు, ఇంకొందరికి వాచీలు. ఇలా ఎవరి అభిరుచి వారిది. అయితే వాచీలను ఎక్కువగా ఇష్టపడే వారిలో భారతీయ కుబేరుడు ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు 'అనంత్ అంబానీ' (Anant Ambani) కూడా ఒకరు. గతేడాది 'రాధికా మర్చెంట్'ను (Radhika Merchant) పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడైన అనంత్.. ఇటీవల ఓ ఖరీదైన వాచ్ ధరించి కనిపించారు.
అనంత్ అంబానీ ధరించిన వాచ్ ధర ఏకంగా రూ. 22 కోట్లు అని తెలుస్తోంది. ఇది ది రిచర్డ్ మిల్లే RM 52-04 స్కల్ బ్లూ సఫైర్. ప్రపంచంలోనే అత్యంత అరుదైన వాచీలలో ఇది ఒకటి. ఇలాంటివి ప్రపంచంలో కేవలం మూడు మాత్రమే ఉన్నాయని సమాచారం. ఈ వాచ్ రష్యా అధ్యక్షుడు 'వ్లాదిమిర్ పుతిన్' ప్రెస్ సెక్రటరీ 'డిమిత్రి పెస్కోవ్' (Dmitry Peskov) వద్ద కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
రిచర్డ్ మిల్లే RM 52-04 బ్లూ సఫైర్ ఒకే పీస్‌తో తయారు చేశారు. ఇది చూడటానికి చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ వాచ్ మాత్రమే కాకుండా అనంత్ అంబానీ వద్ద పటెక్ ఫిలిప్పె, అడెమార్స్ పిగ్యుట్ వంటి ఇతర బ్రాండెడ్ వాచీలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
రిచర్డ్ మిల్లే RM 52-04 స్కల్ బ్లూ సఫైర్ ప్రత్యేకతలు
ఒకే పీస్‌తో తయారైన ఈ వాచ్ మధ్య భాగంలో ఒక పుర్రె ఆకారం.. క్రాస్‌బోన్ ఉండటం చూడవచ్చు. దీని కింద వంతెనల లాంటి నిర్మాణాలను చూడవచ్చు. ఇవన్నీ ఖరీదైన మెటల్‌తో రూపొందించడం వల్ల చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. పేరుకు తగ్గట్టుగానే ఇది నీలం రంగులో ఉండటం కూడా గమనించవచ్చు, ఇది ఐస్ క్యూబ్ మాదిరిగా ఉంటుంది.
అనంత్ అంబానీ
అనంత్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు. అనంత్ జూలై 12, 2024న రాధిక మర్చంట్‌ను పెళ్లి చేసుకున్నారు. ఈయన వద్ద ఖరీదైన వాచీలు మాత్రమే కాకుండా.. రోల్స్ రాయిస్ కల్లినన్ వంటి కార్లు కూడా ఉన్నాయి. ఇషా అంబానీ, ఆకాష్ అంబానీలు.. అనంత్ అంబానీ తోబుట్టువులు.
Comments
Please login to add a commentAdd a comment