అనంత్‌-రాధిక ప్రీ వెడ్డింగ్‌: నీతా అంబానీ వాచ్‌ ధర అన్ని కోట్లా..! | Anant's Cruise Party: Nita Ambani's Expensive Sapphire-Embedded Watch | Sakshi
Sakshi News home page

అనంత్‌-రాధిక ప్రీ వెడ్డింగ్‌: నీతా అంబానీ వాచ్‌ ధర అన్ని కోట్లా..!

Published Tue, Jun 4 2024 4:52 PM | Last Updated on Tue, Jun 4 2024 5:20 PM

Anant's Cruise Party: Nita Ambani's Expensive Sapphire-Embedded Watch

అపర కుబేరుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ మొదటి ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు గత మార్చి నెలలో గుజరాత్‌లోని జామ్‌ నగర్‌లో సినీతారలు, ప్రముఖులు, సెలబ్రిటీల సమక్షంలో అత్యంత అట్టహాసంగా జరిగాయి. ఆ తర్వాత ఇటీవల ఇటలీ నుంచి ఫ్రాన్స్‌ వరకు దాదాపు 4500 కిలోమీటర్లు క్రూయిజ్‌లో రెండో ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు అత్యంత లగ్జరియస్‌గా ముగిశాయి. ఆ వేడుకల్లో స్పెషల్‌ డ్రెస్సింగ్‌ కోడ్‌ను కూడా ఏ‍ర్పాటు చేసింది అంబానీ కటుంబం.

ఈ వేడుకల్లో అంబానీ కుటుంబం ధరించే డ్రెస్‌లు, నగలు ఎప్పడూ స్పెష్టల్‌ అట్రాక్షన్‌గా నిలుస్తాయనే విషయం తెలిసిందే. అలానే ఈసారి అనంత్‌ రాధిక ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో అత్యంత హైలెట్‌గా నీతా చేతి వాచ్‌ నిలిచింది. అందరి దృషిని ఆకర్షించింది. ఆ వాచ్‌ ధర, స్పెషాలిటీ  ఏంటో చూద్దామా..!

 

ఇటీవలే ముగిసిన క్రూయిజ్‌లోని ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో ఆమె చేతి వాచ్‌ అత్యంత స్టైయిలిష్‌గా, లగ్జరియస్‌గా ఉంది. ఈ వేడుకలో ఆమె ధరించిన దుస్తుల ధర కంటే వాచ్‌ ధరం అత్యంత ఖరీదు కూడా. ఆమె ప్రముఖ డిజైనర్‌ ఆస్కార్ డి లా రెంటా పెయింటెడ్ పాప్పీస్ ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ మ్యాక్సీ దుస్తులను ధరించారు. వాటి ధర కేవలం రూ. 6 లక్షలు కాగా ఆమె ధరించిన వాచ్‌ ధర అంతకు మించి అన్న రేంజ్‌లో ఉంది. 

నీలమణులతో ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుంది ఈ వాచ్‌. ఇది జాకోబ్‌ అండ్‌ కో బ్రాండ్‌కి చెందిన టైమ్‌పీస్‌. దీని ధర ఏకంగా రూ 3 కోట్లు. ఈ వాచ్‌ ఇంద్రధనస్సులా మెరిసే నీలమణులతో కూడిన గోల్డ్‌ కేస్‌, దానికి నొక్కు కూడా ఉంటుంది. అందుకు తగ్గట్టు లైట్‌ మేకప్‌తో, జుట్టు వదులు చేసి అత్యంత స్టన్నింగ్‌ లుక్‌లో కనిపించింది నీతా. ఈ ఆహార్యం నీతా ఆధనాతన స్టెయిలింగ్‌ శైలి రేంజ్‌ ఏంటన్నది చెప్పకనే చెప్పింది.

 

(చదవండి: దగ్గడంతో తొడ ఎముక విరిగిపోవడమా?..షాక్‌లో వైద్యులు!)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement