
Chirajeevi Expensive Watch: ఇటీవల విడుదలైన బేబీ చిత్రం అంచనాలను దాటుకుంటూ మంచి వసూళ్లను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో భాగంగానే ఆ చిత్ర బృందం జులై 30న హైదరాబాద్‌లో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిధిగా మెగాస్టార్‌ని ఆహ్వానించారు. ఈ వేడుకల్లో కనిపించిన చిరంజీవి చేతికున్న వాచ్ చాలా మందిని ఆకర్శించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం, బేబీ చిత్ర బృందం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి హాజరైన చిరంజీవి కట్టుకున్న వాచ్ ధర 230000 డాలర్లు లేదా రూ. 1.90 కోట్లు వరకు ఉంటుందని అంచనా. ఇది రోలెక్స్ కంపెనీకి చెందిన కాస్మోగ్రాఫ్ డేటోనా ఐ ఆఫ్ ది టైగర్ వాచ్ కావడం గమనార్హం.
ఇదీ చదవండి: ధనవంతుడవ్వాలనే తపన సరిపోదు.. ఈ టిప్స్ తప్పనిసరి!
ఇది చూడటానికి చాలా సింపుల్‌గా ఉన్నప్పటికీ ధర మాత్రం భారీగా ఉందని తెలుస్తోంది. ఇప్పటికే తెలుగు చలన చిత్ర సీమలో రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి నటులు కూడా ఖరీదైన వాచ్‌లు కలిగి ఉన్నారన్న సంగతి గతంలో చాలా సార్లు అనేక కథనాల్లో వెల్లడయ్యాయి. కాగా మెగాస్టార్ త్వరలో భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకులను అలరించున్నారు.
Comments
Please login to add a commentAdd a comment