Past
-
ప్రెగ్నెన్సీ రూమర్స్.. గుండె కొట్టుకోవట్లేదని తెలిసినా కడుపులో మోశా! (ఫోటోలు)
-
తొమ్మిది నెలలు నడిచాను
సుప్రసిద్ధ నటి హెలెన్ గొప్ప నాట్యగత్తెగా అందరికీ తెలుసు.రచయిత సలీం భార్యగా, సల్మాన్ ఖాన్ మారుతల్లిగా కూడా తెలుసు.కాని ఆమెకు ఒక వెంటాడే గతం ఉంది.తన కుమారుడు అర్బాజ్ ఖాన్ చేస్తున్న తాజా షోలోఆమె ఆ గతాన్ని గుర్తు చేసుకుంది.ఆ జ్ఞాపకాలు కదిలించేవిగా ఉన్నాయి. ‘నేను ఇవాళ ఈ స్థాయికి వచ్చానంటే, సినిమాల్లో నిలబడ్డానంటే దానికి మా అమ్మే కారణం. ఆమె చాలా ఆత్మస్థయిర్యం ఉన్న స్త్రీ’ అని గుర్తు చేసుకున్నారు 84 ఏళ్ల హెలెన్. సాధారణంగా ఇంటర్వ్యూలకు దూరంగా ఉండే హెలెన్ నటుడు అర్బాజ్ ఖాన్ టాక్ షో ‘ది ఇన్విన్సిబుల్స్’లోపా ల్గొని మాట్లాడింది. ఆ సందర్భంగా తన బాల్యాన్ని, తల్లిని గుర్తు చేసుకుంది. ‘మా అమ్మది బర్మా (మయన్మార్). నాన్న ఆంగ్లో ఇండియన్. నేను పెద్దదాన్ని. నా తర్వాత తమ్ముడు. చెల్లెలు. 1943లో అమ్మ గర్భంతో ఉండగా నాన్న చనిపోయాడు. అప్పుడే బర్మాను జపాన్ ఆక్రమించింది. అంతటా రెండో ప్రపంచ యుద్ధ మేఘాలు. బర్మాలో ఉండే పరిస్థితి లేదు. ఆ సమయానికి నాకు ఆరేళ్లు. అమ్మ నన్ను తమ్ముణ్ణి చెల్లెల్ని తీసుకుని ఇండియా వెళ్లడానికి ఎయిర్‌పోర్ట్‌కు వెళితే సరిగ్గా మేము వెళ్లే సమయానికి జపాన్ విమానాలు వచ్చి బాంబులు వేశాయి. ఇక విమానంలో వెళ్లే పరిస్థితి లేదు. దాదాపు 350 మంది నడక ద్వారానే ఇండియాకు బయలుదేరాం. అమ్మ ప్రెగ్నెంట్ అయినా భయపడక నన్ను, తమ్ముణ్ణి, చెల్లెల్ని తీసుకుని ఆ బిడారులో బయలుదేరింది. 9నెలలపా టు నడిచాం. దారిలోని పల్లెల్లో కొంతమంది మాకు అన్నం పెట్టేవాళ్లు. బ్రిటిష్ సైనికులు కనిపించి తినడానికి ఇచ్చేవారు. దారిలో అమ్మకు అబార్షన్ అయ్యింది. చెల్లెలు చనిపోయింది. నేను, తమ్ముడు ఎముకల గూడుగా మారాం. ఇండియా చేరేనాటికి 350 మందిలో సగం మందిమే మిగిలాం. మేము మొదట అస్సాంకు తర్వాత కోల్‌కతాకు చేరాం. ఆ తర్వాతే బాంబే వచ్చి స్థిరపడ్డాం’ అని చెప్పిందామె. మరి సినిమా రంగానికి ఎలా వచ్చారు అని అర్బాజ్ అడగగా– ‘బాంబేలో మేమున్న ఇంటి ఎదురుగా ఒక మణిపూరి డాన్సర్ ఉండేది. ఆమె దగ్గర అమ్మ నాకు మణిపురి నేర్పించింది. ఆ రోజుల్లో కుకూ అనే డాన్సర్ సినిమాల్లో ఫేమస్. ఆమెకు అమ్మతో స్నేహం కుదిరింది. ఆమెలా నేనూ డాన్సర్ అవ్వాలని అమ్మ అనుకుంది. కుకు నన్ను సినిమాల్లోకి గ్రూప్ డాన్సర్‌గా తీసుకెళ్లింది. దేవ్ ఆనంద్ నటించిన ‘బారిష్’ (1957)లోని ‘మిస్టర్ జాన్ బాబాఖాన్’పా టతో ఐటమ్ గర్ల్‌గా మారాను. ‘హౌరాబ్రిడ్జ్’ (1958)లోని ‘మేరా నామ్ చిన్ చిన్ చూ’పా టతో నాకు స్టార్డమ్ వచ్చింది’ అని చెప్పిందామె. ‘మా నాన్న (రచయిత సలీం ఖాన్)తో మీ స్నేహం ప్రేమ, పెళ్లి దాకా ఎలా దారి తీసింది’ అని అర్బాజ్ అడగగా ‘1970లో నా ఆస్తి మొత్తం పోయింది (హెలెన్ మొదటి భర్త పి.ఎన్.అరోరా వల్ల). కోర్టు కేసుల్లో చిక్కుకున్నాను. ఆ సమయంలో మీ నాన్న నా ఇబ్బందిని గమనించి తాను రాసే సినిమాల్లో నాకు వేషాలు వచ్చేలా చూశాడు. అలా ప్రేమ ఏర్పడింది. పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు నా కోసం ఆయన తన కుటుంబం నుంచి విడిపోయి రావడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. అందరూ కలసి ఉండేలా చూడమని గట్టిగా కోరాను. మీ అమ్మ (సల్మా ఖాన్), మీరు ఆ రోజుల్లో ఎక్కువ వేదన అనుభవించి ఉంటారు. నేనైతే మీ అమ్మకు ఎదురుపడటానికి కూడా భయపడేదాన్ని. ఏమైనా కొన్నాళ్లకు మీరంతా నన్ను యాక్సెప్ట్ చేశారు. నన్ను హెలెన్ ఖాన్‌గా గౌరవించారు. సల్మా, నేను మంచి ఫ్రెండ్స్ అయ్యాం. అర్పిత (సల్మాన్ చెల్లెలు) పెళ్లిలో శుభలేఖలో నా పేరు కూడా వేశారు. ఇంతకన్నా ఏం కావాలి?’ అందామె. -
అలా జరిగి ఉండకపోతే..
ఆ రోజు ఆ సంఘటన జరిగి ఉండకపోతే... అసలు కథ మరోలా ఉండేదిరా అంటూ ఉంటాం. నిజ జీవితంలోనైనా, సాహిత్యంలోనైనా ఓ చిన్న ఘటనే అనుకోని మలుపైపోతుంది. అనూహ్య పరిణామాలకు దారి తీస్తుంది. యథార్థ జీవితంలోని ఘటనలను మనం çసృష్టించలేం. అదే సాహిత్యంలో అయితే... ఇటువంటి మలుపులను రచయితలు చాలా తెలివిగా çసృష్టిస్తారు. ఇక అక్కడి నుండి కథను ఎక్కడెక్కడికో తీసుకుపోతారు. ఆ ట్విస్టే అద్భుత రచనలకు ప్రత్యేక ఆకర్షణ అయిపోతుంది. అదే రచయితలోని చమత్కారాన్ని చాటి చెబుతుంది. మహాభారతాన్నే తీసుకోండి. పాండురాజు కుమారులు ప్రశాంతంగా తమ రాజ్యాన్ని తాము ఏలుకుంటూ సుఖంగా జీవిస్తోన్న తరుణంలో రచయిత వ్యాసుడి మెదడులో ఓ మెరుపులాంటి మలుపు తట్టింది. తాను సృష్టించిన పాత్రలతో ఓ కొత్త ఆట ఆడుకోవాలనిపించింది. అంతే ధర్మ రాజును జూదానికి ప్రేరేపించాడు. అది మామూలు ద్యూతం అయితే అనుకున్న ట్విస్ట్ రాదు కాబట్టి అధర్మ, మాయా ద్యూతాన్ని సృష్టించాడు. అందుకోసం శకునికి ఓ పెద్ద నేపథ్యం సృష్టించి, పాచికలు శకుని ఎలా చెబితే అలా ఆడేలా ప్లాన్ చేశాడు. ఆ రోజున శకుని మాయోపాయంతో కౌరవులు ధర్మరాజుని జూదానికి పిలవగానే జూదం అంటే మితిమీరిన ప్రేమ కలిగిన ధర్మరాజు మరో ఆలోచనే లేకుండా సై అన్నాడు. జూదం ఆడి శకుని మాయలో పడి రాజ్యాన్నీ, ధర్మపత్నినీ కూడా జూదంలో పోగొట్టుకున్నాడు. ఆ రోజు జూదం ఆడి ఉండకపోతే... పాండవులు అరణ్య వాసానికి వెళ్లాల్సి వచ్చేది కాదు... కౌరవులపై పాండవులకు కక్ష పుట్టేది కాదు... ఇద్దరి మధ్య కురుక్షేత్ర యుద్ధం జరగాల్సిన అవసరమూ ఉండేది కాదు! కేవలం జూదం కారణంగా లక్షలాది సైనికుల ప్రాణాలు తీసే యుద్ధం అనివార్యమైంది. ఆ తర్వాత పాండవులు, కౌరవుల్లో ఎవరూ మిగలకుండా అందరూ చనిపోవలసి వచ్చింది. ఇంత పెద్ద కథ రాసుకోవడం కోసం... వ్యాసుడు çసృష్టించిన అద్భుతమైన ట్విస్టే– మాయా ద్యూతం. ఇదే లేకపోతే అసలు మహాభారతంలో మసాలాయే లేదు. ‘తింటే గారెలు తినాలి... వింటే భారతం వినాలి’ అని మనవాళ్ళు అని ఉండేవారు కారు. ఇటువంటి ట్విస్టే రామాయణంలో రచయిత వాల్మీకీ ప్రయోగించారు. అయితే వాల్మీకి రెండు మలుపులు పెట్టారు. కైకేయికి దశరథుడు ఏం కావాలంటే అది ఇస్తానని వరం ఇవ్వకుండా ఉంటే... రాముడు అరణ్యవాసానికి వెళ్లాల్సి వచ్చేది కాదు. సరే... అరణ్యానికి వెళ్లాడే అనుకుందాం. అక్కడైనా పధ్నాలుగేళ్ల పాటు అడవిలో సీతారామ లక్ష్మణులు ప్రశాంతంగా గడిపేసి, తిరిగి అయోధ్య వచ్చేయ వచ్చు. అందుకే వాల్మీకి అడవిలో పెద్ద ట్విస్ట్ పెట్టాడు. బంగారు లేడి కోసం రాముడు వెళ్లగానే, రాముడు ప్రమాదంలో ఉన్నాడనుకుని సీతమ్మ చెప్పిన వెంటనే లక్ష్మణుడూ వెళ్లాడు. వెళ్లే ముందు ఓ గీత గీసి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గీత దాటద్దని షరతు విధించాడు. సీతమ్మ దానికి కట్టుబడి ఉంటే బాగుండేది. కానీ.. రావణుడు మారు వేషంలో వచ్చి సీతమ్మను గీత దాటేలా ప్రేరేపించడంతో లక్ష్మణుడి మాట పెడచెవిన పెట్టిన సీతమ్మ గీత దాటింది. అంతే... రావణుడు ఆమెను లంకకు ఎత్తుకుపోయాడు. సీతను రక్షించుకోవడం కోసమే రాముడు వానర సైన్యం సాయంతో సముద్రాన్ని దాటి, లంకలో రావణుడితో యుద్ధానికి దిగాల్సి వచ్చింది. సీతే కనక గీత దాటి ఉండకపోతే – ఇంత కథ ఉండేది కాదు. వాల్మీకి సృష్టించిన ఈ ట్విస్టుతో రామాయణం నిత్య పారాయణమైంది. వ్యాసుడు, వాల్మీకే కాదు... యుగాల తరబడి గొప్ప గొప్ప రచయితలంతా కూడా తమ ఉద్గ్రంథాల్లో ఏదో ఓ చిన్న ట్విస్ట్ తో మొత్తం కథను నడుపుతారు. కథలోని ఆ కీలకమైన మలుపులే ఆ రచయితనూ, రచననూ కలకాలం గుర్తుండేలా చేస్తాయి. శకుంతలా దుష్యంతుల కథ అయిన ‘అభిజ్ఞాన శాకుంతలం’లో మొత్తం మెలోడ్రామాకి ఉంగరమే పెద్ద ట్విస్ట్. దుష్యంతుడికి మతి మరుపు శాపం అనేది కథకు కొక్కెం. అందుకే ఆ కథ, ఆ నాటకం ఏ రూపంలో వచ్చినా అంత పెద్ద హిట్ అయ్యింది. ఇక యథార్థ జీవితంలోనూ ఇటువంటి మలుపులు లేకపోలేదు. ప్రపంచ చరిత్రలో జర్మనీ నియంత హిట్లర్ సోవియట్ రష్యా పైకి యుద్ధానికి కాలు దువ్వి ఉండకపోతే... జర్మనీ కథ మరోలా ఉండేది. సోవియట్ రష్యాకు సవాల్ విసరడం వల్లనే జర్మనీపై ప్రతీకారం తీర్చుకోవడానికి స్టాలిన్ యుద్ధానికి వెళ్లాడు. సోవియట్ ఆర్మీ చుట్టుముట్టడంతో తప్పించుకునే మార్గం లేక చివరకు హిట్లర్ ఆత్మహత్య చేసుకొని చనిపోవాల్సి వచ్చింది. సోవియట్ జోలికి వెళ్లకుండా ఉండి ఉంటే జర్మనీని మరికొన్నేళ్ల పాటు హిట్లర్ ప్రశాంతంగా ఏలుకుని ఉండేవాడేమో? ఈ స్క్రిప్ట్‌ను ఎవరూ రాయలేదు. దానంతట అది ఆవిర్భవించడంతో చరిత్రకారులు దాన్ని రాసుకున్నారు. బ్రిటిష్ వాడిని మొదట్లోనే అడ్డుకొని, ‘ఎవర్రా నువ్వు? మా దేశంలోకి ఎందుకొచ్చావ్?’ అని కాలర్ పట్టుకొని ఉంటే, భారతదేశం తెల్లవాడి పాలనలో బానిస బతుకు బతకాల్సి వచ్చేది కాదు. స్వాతంత్య్ర సంగ్రామం అవసరమయ్యేదీ కాదు. ఇది కూడా చరిత్ర సృష్టించిన ట్విస్ట్. ఇందులోని అసలు గొప్పతనం ఏమిటంటే... రచయితలు çసృష్టించే మలుపులు చాలా సహజంగా ఉంటాయి. అవి నిజమే కాబోలు అనిపించేలా ఉంటాయి. అలా రాయడంలోనే వారి నైపుణ్యం కనపడుతుంది. మహారచయితలంతా కథాంశంలోని కీలకమైన మలుపులను ఆసరాగా చేసుకొన్నవారే! తమ రచనలను చిరస్మరణీయ గ్రంథాలుగా మలుచుకున్నవారే! కథల్లోని మలుపులతో ప్రపంచ సాహిత్యాన్నే మలుపు తిప్పిన రచయితలకు వందనాలు. -
Negative Thoughts: గత అనుభవాలు, నెగెటివ్ ఆలోచనలు వెంటాడుతున్నాయా?
గతంలో సంభవించిన అపజయాలు, ఎదురైన అనుభవాల వల్ల ప్రతికూల ఆలోచనలు రావడం సహజం. అయితే నెగెటివ్ ఆలోచనల వల్ల ఆత్మవిశ్వాసం కోల్పోతారు. నిరాశా నిస్పృహలతో కుంగిపోతారు కనుక ప్రతికూల ఆలోచనల నుంచి బయటపడటానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుందని చెబుతున్నారు మానసిక నిపుణులు. మనకు చేదు అనుభవాలు ఎదురైన గతాన్ని ఓ పీడకలలా మర్చిపోవాలి. గతంలో జరిగిన తప్పులు, ఇతరుల వల్ల మనకు ఎదురైన అవమానాలను గుర్తు చేసుకోకూడదు. అదేవిధంగా మన వల్ల ఇతరులకు కలిగిన ఇబ్బందులు, అసౌకర్యాలు పునరావృతం కాకుండా జాగ్రత్తపడాలి. ప్రతికూల ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని ఓ పుస్తకంలో రాసుకోవాలి. అవి మనం తీసుకొనే నిర్ణయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఆలోచించాలి. అసలు ఇలాంటి ఆలోచనలు ఎందుకు కలుగుతున్నాయో తెలుసుకోవాలి. వాటినుంచి బయట పడాలనే బలమైన కోరిక, తపన మనకు ఉండాలి. భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించడం, అసలు ఆలోచించక పోవడం రెండూ తప్పే. భవిష్యత్తులో అలా జరుగుతుందేమో... ఇలా జరుగుతుందేమో అనే నెగెటివ్ ఆలోచనల వల్ల ఆరోగ్యం పాడవుతుంది. అందువల్ల అంతా మంచే జరుగుతుందనే ఆలోచన మంచిది. చదవండి: కాలేయాన్ని కాపాడుకోవాలంటే...ఏం చేయాలి? ఎప్పుడైతే మీపై మీకు నమ్మకం లేదో ప్రతికూల ఆలోచనలు చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి అయేలా చేస్తాయి. అందువల్ల మన మీద మనకు ఇష్టం, గౌరవం, నమ్మకం ఉండేలా చూసుకోవడం అత్యవసరం. ప్రతికూల ఆలోచనలు వచ్చినప్పుడు... వాటిని సానుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేయాలి. ► చివరగా ఒక మాట.. నెగెటివ్ ఆలోచనలు మనల్ని చుట్టుముట్టకూడదంటే ముందు మనల్ని మనం అన్ కండిషనల్‌గా ప్రేమించుకోవాలి. సాధ్యమైనంత వరకూ సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతాం. చదవండి: Laser Comb: విగ్గు పెట్టుకోవాల్సిన అవసరం లేదు.. నొప్పి ఉండదు.. ధర ఎంతంటే! -
తవ్వకాల్లో బయటపడ్డ సొరంగం
-
అతికించేద్దాం.. చూసేద్దాం..
ఈ ఫొటోలో ఉన్న అమ్మాయి గోడకు ఏదో పేపర్ అతికిస్తోంది అనుకుంటున్నారా? కాదు ఈ అమ్మడు అతికిస్తున్నది టీవీని! టీవీ ఏంటి గోడకు అతికించడమేంటి అనేగా మీ సందేహం! ఈ టీవీ పేరు ‘వాల్‌పేపర్ టీవీ'. ఈ సరికొత్త టీవీని తయారుచేసిన ఎల్జీ కంపెనీ కొరియాలో ప్రదర్శించింది. 55 అంగుళాలుండే ఈ ఓఎల్ఈడీ టీవీ కేవలం ఒక్క మిల్లీమీటర్ కన్నా తక్కువ మందం, 1.9 కిలోల బరువు మాత్రమే ఉంటుంది. దీన్ని అయస్కాంతం సహాయంతో గోడకు అతికించుకోవచ్చు. అంతేకాదు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసేసి పేపర్లా మడిచి భద్రపరుచుకోవచ్చు కూడా. వీటి తయారీలో పాలీఇమైడ్ ఫిల్మ్‌లను ఉపయోగించడం వల్ల టీవీని వంచవచ్చు. -
జన్మంటూ ఉంటే స్విస్‌లో పుట్టాలి!
జీవితాన్ని బాగా ఇష్టపడతారు నటుడు అలీ. భూత, భవిష్యత్, వర్తమానాలపై ఆయనకు నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. దేన్నీ తేలిగ్గా తీసుకోరు. ఎదురైన ప్రతి అనుభవాన్నీ ప్రేమిస్తారు. కాసేపు మాట్లాడితే చాలు.. జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి.. ఇలా నాన్‌స్టాప్‌గా ఎన్నో విషయాలు చెబుతారు. ఆయన అభిరుచుల్ని తెలుసుకోవడానికి చేసిన చిరు ప్రయత్నం... వాళ్లిద్దరి సినిమాలూ పక్కన పెడితే నేను లేను! నా జీవితంపై అయిదుగురి ప్రభావం బలంగా ఉంది. వారు.. నా గురువుగారు శ్రీపాద జిత్‌మోహన్ మిత్రా, దర్శకులు కె. రాఘవేంద్రరావు, జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ, ఎస్వీ కృష్ణారెడ్డి. బాల్యంలోనే రాజమండ్రిలో కళాకారుడిగా నా ప్రయాణం మొదలైంది. అప్పుడు మా గురువు మిత్రాగారే అన్నీ తానై నన్ను నడిపించారు. ఆయన ఆధ్వర్యంలో ఎన్నో మిమిక్రీ ప్రోగ్రామ్‌లు చేశాను. ఇక, సినిమాల్లోకొచ్చాక... వెన్నంటి ఉండి నడిపించింది - రాఘవేంద్రరావుగారు. ఒక వ్యక్తిగా ఆయనను చూసి చాలా నేర్చుకున్నా. ఇక, జంధ్యాల గారి సినిమాల్లో నేను నటించింది తక్కువైనా, కమెడియన్‌గా నాపై అంతులేని ప్రభావాన్ని చూపించారాయన. ఇక ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం ఈవీవీ సత్యనారాయణ, ఎస్వీ కృష్ణారెడ్డి. వీళ్లిద్దరి సినిమాలను పక్కన పెట్టి అలీని చూస్తే ఏమీ కనిపించదు. దశాబ్దం పాటు నా వేలు పట్టుకొని నడిపించారు ఈవీవీ. నన్ను హీరోను చేసి కెరీర్‌ను పూర్తిగా మార్చేశారు కృష్ణారెడ్డి. ఈ అయిదుగుర్నీ జీవితంలో మర్చిపోలేను. మళ్లీ జన్మంటూ ఉంటే స్విస్‌లో పుట్టాలి! కళాకారుణ్ణి కావడం వల్ల, ముఖ్యంగా సినిమా నటుణ్ణి అవడం వల్ల.. ప్రపంచం మొత్తం తిరగగలిగాను. ఎన్ని దేశాలు తిరిగినా... ఓ అయిదు ప్రాంతాలు మాత్రం నా మనసులో అలా నిలిచిపోయాయి. అవే.. రాజమండ్రి, కేరళ, కన్యాకుమారి, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్. వీటిల్లో రాజమండ్రి నా జన్మస్థలం. నటుడిగా నేను ఓనమాలు దిద్దింది కూడా అక్కడే. సో... రాజమండ్రిని అభిమానించడంలో తప్పేం లేదు. ఇక కన్యాకుమారి విషయానికొస్తే... ‘సీతాకోక చిలుక’ సినిమా అక్కడే ఎక్కువ తీశారు. సినీ నటునిగా నా తొలి అడుగులు పడ్డవి అక్కడే. అందుకే కన్యాకుమారి ఓ తీపి జ్ఞాపకంగా నిలిచిపోయింది నాకు. న్యూజిలాండ్ అంటే ఇష్టపడడానికి కారణం... అక్కడ కాలుష్యం సున్నా. నేరాలు శూన్యం. ఎంత ఉండాలో అంతే ఉండే జన సాంద్రత. స్విట్జర్లాండ్ విషయానికొస్తే... ‘ఇక్కడేమైనా కర్ఫ్యూ పెట్టారా!’ అన్నట్లు ఉంటుంది. చాలా ప్రశాంత వాతావరణం. మనం కలలో కూడా చూడనన్ని అందమైన రంగులతో రకరకాల పూలమొక్కలు రోడ్డు పక్కనే దర్శనమిస్తుంటాయి. అంతేకాదు... ఏదైనా పని ఉంటే తప్ప జనం ఇళ్ల నుంచి బయటకు రారు. ‘మళ్లీ జన్మంటూ ఉంటే... స్విస్‌లోనే పుట్టాలి’ అనిపిస్తుంది అక్కడి వాతావరణం. చివరగా కేరళ. అక్కడ ఇంట్లో అయిదుగురు సభ్యులుంటే... నలుగురు పనిచేస్తారు. రాష్ట్రాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రతి వ్యక్తీ కష్టపడతాడు. ఇళ్ల ముందు ఆకులు రాలినా... వాటిని చిమ్మి, కుప్పగా పోసి, కిరోసిన్ పోసి తగులపెడతారు. నీట్‌గా ఉంటారు. నీతిగా ఉంటారు. అమ్మాయిలైతే అందంగా ఉంటారు. దాదాపు అందరూ చదువుకున్నవాళ్లే. నా జీవితం ఆధారంగా బోల్డన్ని పుస్తకాలు రాయొచ్చు! నేను పుస్తకాలు చదవను. అయినా... నా జీవితంలోనే కావాల్సినన్ని ఘట్టాలున్నాయి. వాటి ఆధారంగా బోల్డన్ని పుస్తకాలు రాయొచ్చు. తల్లిదండ్రుల దగ్గర పెరగాల్సిన వయసులో వాళ్లను వదులుకొని దూరంగా బతికాను. మా ఊరు కాని ఊరు మద్రాసులో, భాష కాని భాష మధ్య నాకంటూ నేపథ్యం కానీ, ఎవరి సహాయం, తోడు కానీ లేకుండా కొన్నేళ్ల పాటు జీవనం సాగించాను. ఈ రోజు ఈ స్థాయికి వచ్చాను. ఇది మామూలు విషయం కాదు. నాది మామూలు జన్మ కాదని నేను నమ్ముతాను. నా జీవితమనే పుస్తకాన్ని ఎప్పటికప్పుడు నెమరువేసుకోవడమే నాకు సరిపోతుంది. ఇక వేరే పుస్తకాలు చదివే టైమ్ ఎక్కడిది! - బుర్రా నరసింహ