ఎల్‌జీ ఎయిర్ ప్యూరిఫైర్ ఫేస్‌మాస్క్‌ | LG Aannounced The Puri Care Wearable Air Purifier Face Mask | Sakshi
Sakshi News home page

ఎల్‌జీ ఎయిర్ ప్యూరిఫైర్ ఫేస్‌మాస్క్‌

Published Fri, Aug 28 2020 12:06 PM | Last Updated on Fri, Aug 28 2020 12:54 PM

LG Aannounced The Puri Care Wearable Air Purifier Face Mask  - Sakshi

న్యూఢిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో మాస్కులు ధరించడం తప్పనిసరి అయ్యింది. ముఖానికి మాస్కు లేకుండా బహిరంగ ప్రదేశాల్లో సంచరిస్తే పోలీసులు జరిమానా కూడా విధిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ ఎల్‌జీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌ అందించింది. ఎల్‌జీ పూర్యరీకేర్‌ వేరబుల్‌ ప్యూరిఫైర్‌ ఫేస్‌ మాస్కును తయారు చేసినట్లు శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇప్పుడున్న మాస్కుల కన్నా మరింత ఎక్కువగా వడపోత ప్రక్రియ చేపడుతుందని ఎల్‌జీ కంపెనీ పేర్కొంది. దీనిలో బ్యాటరీతో నడిచే రెండు ఫ్యాన్లుతోపాటు రెస్పిరేటరీ సెన్సార్‌ పరిశుభ్రమైన, తాజా గాలిని అందిస్తుంది. అలాగే  వేర్వేరు స్థాయిల్లో వేగాన్ని సర్దుబాటు చేసుకునేలా, అందరికీ సరిపోయేలా రూపొందించారు. 

అయితే ముఖానికి ధరించే పోర్టబుల్ ఎయిర్ ప్యూరిఫైయర్‌ మాస్క్ ధర వంటి వివరాలను మాత్రం సెప్టెంబరులో జరగనున్న ఐఎఫ్ఏ 2020లో వెల్లడించనున్నారు. ఎల్‌జీ ప్యూరీకేర్ వేరబుల్ ఎయిర్ ప్యూరిఫైర్‌లో గాలిని శుద్ధి చేసేందుకు రెండు హెచ్13 హెచ్‌ఈపీఏ ఫిల్టర్లు ఉపయోగించారు. అవసరమైనప్పుడు వాటిని మార్చుకోవచ్చు. ఇందులో అంతర్గతంగా రెండు ప్యాన్లను ఉపయోగించారు. ఇవి మూడు స్పీడ్ లెవల్స్ కలిగి ఉంటాయి. గాలి పీల్చుకునేటప్పుడు ఇవి వాటంతట అవే వేగం పుంజుకుని, వదిలేటప్పుడు నెమ్మదిస్తాయి. ఈ మాస్క్‌లో ఉపయోగించిన రెస్పిరేటరీ సెన్సార్ మాస్క్ ధరించిన వారి శ్వాస చక్రం, పరిమాణాన్ని గుర్తించి అందుకు అనుగుణంగా ఫ్యాన్ల వేగాన్ని సర్దుబాటు చేస్తుంది. (మాస్క్‌ ధరించలేదని ఫోన్‌ లాక్కొని..)

ఫేస్‌మాస్క్‌లో 820 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగించారు. మోడ్‌లో 8 గంటలు, హై మోడ్‌లో రెండు గంటలు పనిచేస్తుంది. ఎలక్ట్రానిక్ పరికరం కావడం వల్ల, దీనిని ఛార్జ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మాస్కులో చిక్కుకున్న హానికరమైన సూక్ష్మక్రిములను చంపే సందర్భంలో అతినీలలోహిత కాంతి వస్తుంది. ఫిల్టర్లను మార్చాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా గుర్తించి ఎల్‌జీ థింక్యూ యాప్‌ ద్వారా మనకు సంకేతాలను ఇస్తుంది. ఫేస్ మాస్క్‌లతో ప్రజలు కలిగి ఉన్న ఆందోళనలలో ఒకటి సౌకర్యం, రెండోది గాలి బయటకు రాకుండా సరిపోయేలా పూరీకేర్‌ను రూపొందించినట్లు ఎల్‌జీ పేర్కొంది. చివరికి ఎక్కువ గంటలు ధరించేంత సౌకర్యంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement