LG brand
-
ఎల్జీ ఎయిర్ ప్యూరిఫైర్ ఫేస్‌మాస్క్
న్యూఢిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో మాస్కులు ధరించడం తప్పనిసరి అయ్యింది. ముఖానికి మాస్కు లేకుండా బహిరంగ ప్రదేశాల్లో సంచరిస్తే పోలీసులు జరిమానా కూడా విధిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఎల్జీ ప్రజలకు గుడ్ న్యూస్ అందించింది. ఎల్జీ పూర్యరీకేర్ వేరబుల్ ప్యూరిఫైర్ ఫేస్ మాస్కును తయారు చేసినట్లు శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇప్పుడున్న మాస్కుల కన్నా మరింత ఎక్కువగా వడపోత ప్రక్రియ చేపడుతుందని ఎల్జీ కంపెనీ పేర్కొంది. దీనిలో బ్యాటరీతో నడిచే రెండు ఫ్యాన్లుతోపాటు రెస్పిరేటరీ సెన్సార్ పరిశుభ్రమైన, తాజా గాలిని అందిస్తుంది. అలాగే వేర్వేరు స్థాయిల్లో వేగాన్ని సర్దుబాటు చేసుకునేలా, అందరికీ సరిపోయేలా రూపొందించారు. అయితే ముఖానికి ధరించే పోర్టబుల్ ఎయిర్ ప్యూరిఫైయర్ మాస్క్ ధర వంటి వివరాలను మాత్రం సెప్టెంబరులో జరగనున్న ఐఎఫ్ఏ 2020లో వెల్లడించనున్నారు. ఎల్జీ ప్యూరీకేర్ వేరబుల్ ఎయిర్ ప్యూరిఫైర్‌లో గాలిని శుద్ధి చేసేందుకు రెండు హెచ్13 హెచ్ఈపీఏ ఫిల్టర్లు ఉపయోగించారు. అవసరమైనప్పుడు వాటిని మార్చుకోవచ్చు. ఇందులో అంతర్గతంగా రెండు ప్యాన్లను ఉపయోగించారు. ఇవి మూడు స్పీడ్ లెవల్స్ కలిగి ఉంటాయి. గాలి పీల్చుకునేటప్పుడు ఇవి వాటంతట అవే వేగం పుంజుకుని, వదిలేటప్పుడు నెమ్మదిస్తాయి. ఈ మాస్క్‌లో ఉపయోగించిన రెస్పిరేటరీ సెన్సార్ మాస్క్ ధరించిన వారి శ్వాస చక్రం, పరిమాణాన్ని గుర్తించి అందుకు అనుగుణంగా ఫ్యాన్ల వేగాన్ని సర్దుబాటు చేస్తుంది. (మాస్క్ ధరించలేదని ఫోన్ లాక్కొని..) ఫేస్‌మాస్క్‌లో 820 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగించారు. మోడ్‌లో 8 గంటలు, హై మోడ్‌లో రెండు గంటలు పనిచేస్తుంది. ఎలక్ట్రానిక్ పరికరం కావడం వల్ల, దీనిని ఛార్జ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మాస్కులో చిక్కుకున్న హానికరమైన సూక్ష్మక్రిములను చంపే సందర్భంలో అతినీలలోహిత కాంతి వస్తుంది. ఫిల్టర్లను మార్చాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా గుర్తించి ఎల్జీ థింక్యూ యాప్ ద్వారా మనకు సంకేతాలను ఇస్తుంది. ఫేస్ మాస్క్‌లతో ప్రజలు కలిగి ఉన్న ఆందోళనలలో ఒకటి సౌకర్యం, రెండోది గాలి బయటకు రాకుండా సరిపోయేలా పూరీకేర్‌ను రూపొందించినట్లు ఎల్జీ పేర్కొంది. చివరికి ఎక్కువ గంటలు ధరించేంత సౌకర్యంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. -
గృహోపకరణాల విక్రయాల్లోకి ఐటీ మాల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కంప్యూటర్ ఉపకరణాల విక్రయంలో ఉన్న ఐటీ మాల్ గృహోపకరణాల విభాగంలోకి ప్రవేశిస్తోంది. శాంసంగ్, ఎల్జీ బ్రాండ్లను తొలుత ప్రవేశపెడుతోంది. ఒకట్రెండు నెలల్లో సోనీ ఉత్పత్తుల విక్రయాలను ప్రారంభిస్తామని ఐటీ మాల్ ఎండీ మొహమ్మద్ అహ్మద్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. అన్ని ప్రముఖ బ్రాండ్లకు చెందిన టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, ఏసీల వంటి ఉపకరణాలను విక్రయిస్త్తామని చెప్పారు. కొత్త విభాగం కోసం ఐటీ మాల్ రూ.6 కోట్లకుపైగా వ్యయం చేసే అవకాశం ఉంది. ఇందుకు కావాల్సిన నిధులను బ్యాంకుల నుంచి సమీకరించనుంది. ఆపిల్ స్టోర్ ఏర్పాటుకు ఆ కంపెనీతో ఒప్పందం కుదిరిందని అహ్మద్ పేర్కొన్నారు. మార్చికల్లా స్టోర్‌ను తెరుస్తామని వెల్లడించారు. ఖైరతాబాద్‌లోని ఐటీ మాల్ 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. సోనీ, శాంసంగ్, హెచ్‌పీ, డెల్, లెనోవో, ఏసర్, ఏసూస్, తోషిబా, ఇంటెల్, ఏఎండీ ఎక్స్‌క్లూజివ్ ఔట్లెట్లు మాల్లో కొలువుదీరాయి.