ఎల్‌జీ ‘మ్యాక్స్’ స్మార్ట్‌ఫోన్ | LG 'Max' smartphone | Sakshi
Sakshi News home page

ఎల్‌జీ ‘మ్యాక్స్’ స్మార్ట్‌ఫోన్

Published Sat, Jul 25 2015 1:05 AM | Last Updated on Sun, Sep 3 2017 6:06 AM

ఎల్‌జీ ‘మ్యాక్స్’ స్మార్ట్‌ఫోన్

ఎల్‌జీ ‘మ్యాక్స్’ స్మార్ట్‌ఫోన్

 ధర రూ.10,990

 న్యూఢిల్లీ : ఎల్‌జీ కంపెనీ కొత్త స్మార్ట్‌ఫోన్, ఎల్‌జీ మ్యాక్స్‌ను శుక్రవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ 3జీ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 10,990గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్‌లో 1.3 గిగా హెట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్,  5 అంగుళాల డిస్‌ప్లే, 1 జీబీ ర్యామ్,  8 జీబీ ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్‌డీ స్లాట్ ద్వారా ఎక్స్‌పాండ్ చేసుకోగల మెమరీ, 8 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 2,540 ఎంఏహెచ్ రీప్లేసబుల్ బ్యాటరీ వంటి ఫీచర్లున్నాయని కంపెనీ పేర్కొంది.

ఎల్‌జీ ప్రముఖ ఫీచర్లైన గెశ్చర్ షాట్, సెల్ఫీ ఫ్లాష్ వంటి ప్రత్యేకతలున్నాయని కూడా పేర్కొంది. గత ఏడాది అందించిన ఎల్‌జీ బెల్లో స్మార్ట్‌ఫోన్‌కు కొనసాగింపుగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తున్నామని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement