స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనాలు సృష్టించిన చైనీస్ స్మార్ట్‌ఫోన్ల తయారీ దిగ్గజం.. ‘స్మార్ట్ లివింగ్’ పోర్టుఫోలియోలో కూడా తనదైన శైలిలో దూసుకుపోతుంది. ఎయిర్ ప్యూరిఫైయర్స్‌ను, స్మార్ట్ సెక్యురిటీ సిస్టమ్‌ను, ఫిట్‌నెస్ బ్యాండ్లను, స్మార్ట్ టీవీలను ప్రవేశపెడుతూ.. కస్టమర్లను మరింత ఆకట్టుకుంటోంది. నేడు కూడా షావోమి ఐదు సరికొత్త ప్రొడక్ట్‌లను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. అవేమిటంటే.. ఎంఐ ఎల్‌ఈడీ టీవీ 4 ప్రొ సిరీస్‌లను, ఎంఐ బ్యాండ్ 3, ఎంఐ ఎయిర్ ప్యూరిఫైయర్ 2ఎస్, ఎంఐ హోమ్ సెక్యురిటీ కెమెరా 360, ఎంఐ లగేజీని మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది.
షావోమి ఎంఐ ఎల్‌ఈడీ టీవీ 4 ప్రొ- సిరీస్....
గురువారం షావోమి ఎంఐ ఎల్‌ఈడీ టీవీ 4 ప్రొ రేంజ్‌లో మూడు స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. గతేడాది లాంచ్ చేసిన టీవీలకు సక్సెసర్‌గా వీటిని తీసుకొచ్చింది. 32 అంగుళాలు, 49 అంగుళాలు, 55 అంగుళాల స్క్రీన్ సైజ్‌లో ఎంఐ ఎల్‌ఈడీ టీవీ 4 ప్రొలు మార్కెట్‌లోకి వచ్చాయి. 32 అంగుళాల టీవీ ధర 14,999 రూపాయలు కాగ, 49 అంగుళాల మోడల్ ధర 29,999 రూపాయలు, 55 అంగుళాల మోడల్ ధర 49,999 రూపాయలు. ఈ కొత్త టీవీల ప్రత్యేకత పునరుద్ధరించిన సాఫ్ట్‌వేర్. ఆండ్రాయిడ్ సపోర్ట్‌తో ప్యాచ్‌వాల్ యూఐ రిఫ్రెస్‌తో ఈ టీవీలు పనిచేస్తున్నాయి. అంటే ఆండ్రాయిడ్ లేదా ప్యాచ్‌వాల్ ఏ విధంగానైనా టీవీ మోడ్‌లోకి వెళ్లవచ్చు. ఆండ్రాయిడ్ సపోర్ట్‌తో గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కొత్త టీవీలకు క్రోమోకాస్ట్ సపోర్టు కూడా ఉంది. రిమోట్‌లోనే వాయిస్ సపోర్ట్‌ను ప్రవేశపెట్టింది. 55 అంగుళాల టీవీ 4కే ప్లస్ హెచ్‌డీఆర్ సపోర్ట్‌తో వచ్చింది. ప్రపంచంలో పలుచైన టీవీ ఇదే. డోల్బే ప్లస్ డీటీఎస్ సినిమా ఆడియో క్వాలిటీ, 3 హెచ్‌డీఎంఐ పోర్ట్‌లు, 2 యూఎస్‌బీ 3.0 పోర్ట్‌లు, వైఫై, బ్లూటూత్ 5.0, 2జీబీ ర్యామ్, 8జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ వీటిలో ఫీచర్లుగా ఉన్నాయి.
ఎంఐ బ్యాండ్ 3...
షావోమి కొత్త ఫిట్‌నెస్ బ్యాండ్ ఇది. దీని ధర 1,999 రూపాయలు. ఎంఐ బ్యాండ్ 3 అతిపెద్ద డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఎస్‌ఎంఎస్‌లు, ఇతర మెసేజింగ్ అప్లికేషన్ల కంటెంట్‌ను ఇది చూపిస్తోంది. రిజెక్ట్ అయిన కాల్స్‌ను కూడా దీని స్క్రీన్‌పై చూడొచ్చు. హార్ట్-రేటు మానిటర్‌ను ఇది కలిగి ఉంది. 50 మీటర్ల వరకు వాటర్ రెసిస్టెంట్ పవర్, 20 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఉన్నాయి.
ఎంఐ ప్యూరిఫైయర్ 2ఎస్.....
షావోమి నేడు తన సరికొత్త ఎంఐ ఎయిర్ ప్యూరిఫైయర్ 2ఎస్‌ను కూడా మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ధర రూ.8,999గా నిర్ణయించింది. ఓలెడ్ డిజిటల్ డిస్‌ప్లే, లేజర్ సెన్సార్, 360 డిగ్రీల ట్రిపుల్ లేయర్ ఫిల్టర్‌తో ఈ డివైజ్ రూపొందించింది. ఈ ఎయిర్ ప్యూరిఫైయర్‌ను మీ ఫోన్లలో ఉన్న ఎంఐ యాప్ ద్వారా నియంత్రించుకోవచ్చు. అంతేకాక ఎంఐ ఎయిర్ ప్యూరిఫైయర్ 2ఎస్ అమెజాన్ అలెక్సాను, మెరుగైన నియంత్రణ కోసం గూగుల్ అసిస్టెంట్ ఇంటిగ్రేషన్‌ను ఆఫర్ చేస్తుంది. ఎంఐ ఎయిర్ ప్యూరిఫైయర్ 2ఎస్ తొలి సేల్‌ను సెప్టెంబర్ 28న మధ్యాహ్నం 12 గంటలకు చేపట్టనుంది షావోమి కంపెనీ. దీన్ని ఎంఐ.కామ్, అమెజాన్.ఇన్, ఫ్లిప్‌కార్ట్‌లలో కొనుగోలు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎంఐ హోమ్, ఇతర ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా ఎంఐ ఎయిర్ ప్యూరిఫైయర్ 2 ఎస్‌అందుబాటులోకి రానుంది.
ఎంఐ హోమ్ సెక్యురిటీ కెమెరా 360....
టూ-వే ఆడియోతో 360 డిగ్రీలు చూసే యాంగిల్‌లో ఎంఐ హోమ్ సెక్యురిటీ కెమెరాను షావోమి తీసుకొచ్చింది. ఫుల్ హెచ్‌డీ వీడియో రికార్డింగ్, ఐదు రోజుల వరకు ఫుటేజీ స్టోరేజ్, ఇన్ఫ్రారెడ్ నైట్ వ్యూ, ఏఐ మోషన్ డిటెక్షన్, 64జీబీ వరకు స్టోరేజ్‌ను విస్తరించుకునేందుకు మైక్రో ఎస్డీ కార్డు స్లాట్ దీనిలో ఉన్నాయి. ఎంఐ హోమ్ స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారానే సెక్యురిటీ కెమెరాను కంట్రోల్ చేసుకోవచ్చు.
ఎంఐ లగేజ్... 20 అంగుళాలు, 24 అంగుళాల సైజుల్లో షావోమి ఎంఐ లగేజ్‌ను లాంచ్ చేసింది. చిన్న దాని ధర 2,999 రూపాయలు కాగా, 24 అంగుళాల మోడల్ ధర 4,299 రూపాయలు. గ్రే, బ్లూ, రెడ్ రంగుల్లో ఇది మార్కెట్‌లోకి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment