గని కార్మికులకు ఎల్‌ఈడీ టీవీల పంపిణీ
Published Tue, Jul 26 2016 12:13 AM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM
కోల్‌బెల్ట్(వరంగల్) : సింగరేణి కార్మికులకు యాజమాన్యం భూపాలపల్లి ఏరియాలో సోమవారం సబ్సిడీపై ఎల్‌ఈడీ టీవీలను పంపిణీ చేసింది. స్థానిక సింగరేణి భారత్ గ్యాస్ సూపర్‌బజార్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో యాక్టింగ్ జనరల్ మేనేజర్ బళ్లారి శ్రీనివాసరావు గని కార్మిక కుటుంబాలకు టీవీలను అందజేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యా జమాన్యం కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అత్యాధునికమైన ఎల్‌ఈడీ టీవీలను సబ్సిడీపై పంపిణీ చేస్తున్నదని చెప్పారు. త్వర లో మరి న్ని గృహోపకరణ వస్తువులను అంద జేయడానికి సంస్థ చర్యలు చేపట్టిందని తెలిపారు. కార్యక్రమంలో పర్సనల్ మేనేజర్ రేవు సీతారాం, గుర్తింపు సంఘం బ్రాంచి ఉపాధ్యక్షుడు బడితెల సమ్మయ్య, కార్యదర్శి కటకం స్వామి, భారత్ గ్యాస్ డివిజన ల్ మేనేజర్ కె.ప్రకాష్‌రావు, పర్సనల్ మేనేజర్ ప్రభాకర్‌రెడ్డి, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ శ్యాంసుందర్, వెల్పేర్ ఆఫీసర్‌లు మదార్ ఆహ్మద్, రాజేశం సూపర్‌బజార్ మేనేజర్ సంపూర్ణ తదితరులు పాల్గొన్నారు.
Advertisement