సాక్షి, న్యూఢిల్లీ: సౌత్ కొరియా దిగ్గజం శాంసంగ్ అతి ఖరీదైన హోం థియేటర్‌ను లాంచ్ చేసింది. దేశీయంగా ఇన్ హోం ఎంటర్‌టైన్‌మెంట్‌ను సమూలంగా మార్చివేసే లక్ష్యంతో 'ఎల్‌ఈడీ ఫర్ హోమ్' ప్రారంభించామని శాంసంగ్ ప్రకటించింది. ముఖ్యంగా ప్రపంచంలోనే మొట్ట మొదటి ఎల్‌ఈడీ హోమ్ స్క్రీన్‌ను శాంసంగ్ మంగళవారం భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. యాక్టివ్ ఎల్‌ఈడీ పేరిట ఈ హోమ్ స్క్రీన్‌ను లాంచ్ చేసింది. సూపర్ ప్రీమియం స్ర్కీన్ తో ఇంట్లోనే థియేట్ అనుభవాన్ని పంచేందుకు ఈ సరికొత్త ఎల్‌ఈడీ హోం థియేటర్లను అందుబాటులోకి తెచ్చింది.
హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో తాజా ఆవిష్కరణ ఒక విప్లవంగా పేర్కొంది. ఈ హోమ్ స్క్రీన్‌పై వినియోగదారులు అత్యద్భుతమైన, అత్యంత నాణ్యత కలిగిన దృశ్యాలను ఎక్స్‌పీరియన్స్ చేయవచ్చని తెలిపింది. అంతేకాదు హోమ్ స్క్రీన్లు అన్నింటికీ ఒక లక్షకు పైగా గంటల జీవిత కాలం ఉంటుందని శాంసంగ్ వెల్లడించింది.
110-అంగుళాల ఫుల్ హెచ్‌డీ, 130-అంగుళాల ఫుల్ హెచ్‌డీ, 220 అంగుళాలు (అల్ట్రా హెచ్‌డీ) 260-అంగుళాలు (అల్ట్రా-హెచ్‌డీ) సిరీస్ వీటిని అందుబాటులోకి తెచ్చింది. వీటి ధరలు రూ. 1 కోట్లు, రూ. 3.5 కోట్లు గా ఉండనున్నాయి.తమ లేటెస్ట్ డివైస్ కట్టింగ్-ఎడ్జ్ డిస్‌ప్లే అనుభవాన్ని వినియోగదారులను అందించేందుకు అంకితభావంతో ఉన్నామని పునీత్ సేథి, (వైస్ ప్రెసిడెంట్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఎంటర్ప్రైజ్ బిజినెస్ శాంసంగ్ ఇండియా )ప్రకటనలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment