led
-
ఎల్ఈడీ లిప్ మెషిన్
ఏ ఛాయలో ఉన్నా, ఏ వయసు వారైనా తమ పెదవులు మృదువుగా, చూడచక్కగా ఉండాలనే కోరుకుంటారు. అలాంటి వారికి చిత్రంలోని ఈ డివైస్ చాలా చక్కగా పని చేస్తుంది. ఈ ఎల్ఈడీ లిప్ మెషిన్ అధరాలను అందంగా మార్చేస్తుంది.పదవులపై ముడతలు, పగుళ్లు, గీతలు ఇలా అన్నింటినీ పోగొట్టి, ‘అధర’హో అన్నట్లుగా మెరిపిస్తుంది. ఈ మెషిన్ నాలుగు వేరువేరు మోడ్స్‌తో, 56 డీప్ పెనిట్రేటింగ్ ఎల్ఈడీ టెక్నాలజీతో యూజర్ ఫ్రెండ్లీగా ఉపయోగపడుతుంది. దీన్ని పెదవులకు ఆనించి, బటన్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. సుమారు 8 వారాల పాటు రోజుకు 3 నిమిషాలు ఈ లిప్ డివైస్‌తో ట్రీట్మెంట్ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.ఈ మెషిన్ని మీ మేకప్ కిట్‌లో భాగం చేసుకుంటే పెదవులను అందంగా, సహజంగా దొండపండులా మలచుకోవచ్చు. సురక్షితమైన సిలికాన్ తో రూపొందిన ఈ డివైస్‌తో ఎలాంటి నొప్పి కలుగదు. వేడి తీవ్రత ఇబ్బందికరంగా ఉండదు. ఈ పరికరం కొలాజన్ ఉత్పత్తిని ప్రేరేపించడంతో పాటు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. దీనితో ట్రీట్మెంట్ ఎవరికి వారు స్వయంగా చేసుకోవచ్చు. అయితే దీన్ని వినియోగించిన ప్రతిసారి పెదవులకు ఆనించే సిలికాన్ భాగాన్ని టిష్యూతో లేదా క్లాత్‌తో క్లీన్ చేసుకుంటూ ఉండాలి. డివైస్‌కి ముందే చార్జింగ్ పెట్టుకుని వైర్‌లెస్‌గా వాడుకోవచ్చు. చార్జింగ్ బేస్ వేరుగా, ట్రీట్మెంట్ వైబ్రేషన్ మసాజర్ వేరుగా ఉండటంతో వాడకం సులభంగా ఉంటుంది. -
సర్జికల్ స్ట్రైక్ హీరోకి మణిపూర్ అల్లర్ల బాధ్యతలు
ఇంఫాల్:మణిపూర్‌లో హింసాత్మక ఘటనల తర్వాత ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. శాంతియుత పరిస్థితులు నెలకొల్పడానికి కావాల్సిన అన్ని కోణాల్లో ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే అక్కడి పరిస్థితుల్ని చక్కదిద్దడానికి కీలక అధికారిని నియమించింది. 2015లో మయన్మార్‌పై జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ లో కీలక పాత్ర పోషించిన రిటైర్డ్ ఆర్మీ అధికారి నెక్టార్ సంజెన్‌బామ్‌ను నియమించింది. Kirti Chakra for Lt Col Nectar Sanjenbam. Part of the Army's Myanmar cross-border strike. #IDay2015 pic.twitter.com/rNqfgb9o1o — Shiv Aroor (@ShivAroor) August 14, 2015 మణిపూర్ పోలీస్ డిపార్ట్మెంట్లో కల్నల్ నెక్టార్ సంజెన్‌బామ్‌ను సీనియర్ సూపరింటెండెంట్‌గా ప్రభుత్వం నియమించింది. ఐదేళ్ల పాటు పదవిలో ఆయన కొనసాగనున్నారని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆగష్టు 24న నియమాక ఉత్తర్వుల్లో పేర్కొంది. కల్నల్ నెక్టార్ సంజెన్‌బామ్‌కు అత్యున్నత పురష్కారాల్లో రెండోదైన కీర్తి చక్రతో పాటు మూడో అత్యున్నత పురస్కారం శౌర్య చక్ర కూడా ఇప్పటికే లభించాయి. సహసోపేతమైన నిర్ణయాలతో ఎలాంటి పరిస్థితుల్నైన చక్కదిద్దే వ్యూహాలను రచించగలరనే పేరు ఆయనకు ఉంది. Lt Col (Now Col) Nectar Sanjenbam, Kirti Chakra, Shaurya Chakra of 21 PARA SF. On 8 June 2015, he led his team nd carried out cross-border raid on insurgents in Myanmar to revenge the ambush on the soldiers of 6 DOGRA. The operation resulted in the eliminating of 300+ insurgents. pic.twitter.com/kf4PHuLrxg — Guardians_of_the_Nation (@love_for_nation) January 23, 2021 ఈ మేరకు కేబినెట్ జూన్ 12న నిర్ణయం తీసుకుందని ఆగష్టు 24న మణిపూర్ హోం శాఖ తెలిపింది. మణిపూర్‌లో మెయితీ, కుకీ తెగల మధ్య ఇంకా ఘర్షణలు జరుగుతున్నాయి. గత ఐదు రోజుల్లోనే రాష్ట్రంలో 12 మంది మరణించారు. 30 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో అల్లరి మూకలను అణిచివేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మెయితీ తెగ ప్రజలకు గిరిజన హోదా ఇవ్వాలని హైకోర్టు తీర్పు వెలువరించిన తర్వాత రాష్ట్రంలో అశాంతియుత పరిస్థితులు నెలకొన్నాయి. మెయితీ, కుకీ తెగల మధ్య మే 3న మొదటిసారి ఘర్షణలు జరిగాయి. ఇప్పటివరకు అక్కడ జరిగిన హింసాత్మక ఘటనల్లో 170 మందికి పైగా మరణించారు. ఇదీ చదవండి: సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి వివాదాస్పద వ్యాఖ్యలు.. -
అలర్ట్: మూసీ గ్రాస్‌లో లెడ్ ఆనవాళ్లు.. పాలు, మాంసం, పశుగ్రాసంలో..
సాక్షి, హైదరాబాద్: చారిత్రక మూసీ పరివాహక ప్రాంతంలో విరివిగా సాగవుతున్న గడ్డిలోనూ మానవ ఆరోగ్యానికి హానికారకంగా పరిణమించే లెడ్ ఆనవాళ్లు అధికంగా ఉన్నట్లు నేషనల్ రీసెర్చి సెంటర్ ఫర్ మీట్ (ఎన్ఆర్సీఎం) తాజా పరిశోధనలో తేలింది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చి పర్యవేక్షణలో ఎన్ఆర్సీఎం ఆధ్వర్యంలో పాలు, మాంసం, పశుగ్రాసంలో లెడ్ ఆనవాళ్లను పరిశీలించగా ఈ విషయం తేలింది. మూసీలో హుస్సేన్‌సాగర్ జలాలు అధికంగా చేరే నాగోల్– ఉప్పల్ మార్గంలో ఈ ఆనవాళ్లు అధికంగా ఉన్నట్లు వెల్లడైంది. గండిపేట్ నుంచి ఘట్కేసర్ వరకు 21 ప్రాంతాల్లో మూసీ నీటి నమూనాలను పరీక్షించగా.. ప్రతి లీటరు నీటిలో లెడ్ మోతాదు 61 పార్ట్స్ పర్ మిలియన్ (పీపీఎం)గా నమోదైనట్లు ఈ సంస్థ తాజా నివేదిక తెలిపింది. పీసీబీ నిబంధనల ప్రకారం ఈ మోతాదు 20 పీపీఎంకు మించరాదు. ఫార్మా కంపెనీల వ్యర్థాలు అధికంగా చేరడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని నివేదిక స్పష్టం చేసింది. లెడ్ మోతాదు అధికమైతే మానవ, పాడి పశువుల ఆరోగ్యంపై దుష్ప్రభావం తప్పదని నివేదిక వెల్లడించింది. కాలుష్యానికి కారణాలివీ.. నగరంలో రోజువారీగా గృహ, వాణిజ్య, పారిశ్రామిక కార్యకలాపాల ద్వారా నిత్యం 1800 మిలియన్ లీటర్ల మురుగు నీరు ఉత్పన్నమవుతోంది. ఇందులో సుమారు 900 మిలియన్ లీటర్ల మురుగు నీటిని జలమండలి 23 ఎస్టీపీల్లో శుద్ధి చేస్తోంది. మిగతా నీరు శుద్ది ప్రక్రియ లేకుండానే మూసీలో కలుస్తోంది. ఈ మురుగు నీటిలో కూకట్పల్లి నాలా నుంచి హుస్సేన్ సాగర్‌లోకి అటు నుంచి వచ్చి మూసీలోకి చేరుతున్న సుమారు 400 మిలియన్ లీటర్ల మేర ఫార్మా, బల్క్‌డ్రగ్ వ్యర్థ జలాలు కూడా ఉన్నాయి. ఈ జలాల చేరికతోనే లెడ్ తదిర హానికారక భారలోహ అవశేషాలు మూసీలోకి చేరుతున్నాయి. కలుషిత జలాలతో దుష్ఫలితాలు.. ►ఆక్సిజన్ స్థాయి తగ్గడంతో నదిలో చేపలు, వృక్ష, జంతు ఫ్లవకాలు చనిపోతున్నాయి. పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతుంది. జీవావరణ సమతౌల్యం దెబ్బతింటుంది. పశువులు దాహార్తి తీర్చుకునే పరిస్థితి ఉండదు. ►పరీవాహక ప్రాంతాల్లో సాగు చేస్తున్న గడ్డి తిన్న పశువుల పాలల్లో కాలుష్య కారకాలు చేరడంతో ఇవి మానవ దేహంలోకి ప్రవేశిస్తున్నాయి. ►ఈ నీరు తాగిన వారు న్యుమోనియా, టైఫాయిడ్, కామెర్లు, విరేచనాలు, కోరింత దగ్గు, పోలియో వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. నగరంలోకి ప్రవేశించగానే కాలుష్య కాటు.. వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండలు మూసీ జన్మస్థానం. 90 కి.మీ ప్రవహించి బాపూఘాట్ వద్ద నగరంలోకి ప్రవేశిస్తోంది. నగరంలో ఫార్మా, వాణిజ్య, గృహ వ్యర్థ జలాలు చేరుతుండడంతోనే మూసీ కాలుష్య కాసారమవుతోంది. -
సినిమాలను తలదన్నేలా ప్రీ వెడ్డింగ్ షూట్లు
సాక్షి, ఎదులాపురం(ఆదిలాబాద్): వివాహ వేడుకలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అందుబాటులోకి వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తక్కువ సమయంలో మర్చిపోలేని రీతిలో.. మధుర జ్ఞాపకంలా యువతీ యువకులు పెళ్లికి సిద్ధమవుతున్నారు. సినిమాలను తలదన్నేలా ప్రీ వెడ్డింగ్ షోలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మొదట ఖర్చుకు వెనుకాడినా.. క్రేజీ పెరుగుతుండడంతో ఇప్పుడు డబ్బులకూ వెనుకాడకుండా పెళ్లికి ముందే ప్రీ వెడ్డింగ్ షూట్లు చేసుకుంటున్నారు. సినిమా తరహా మాదిరిగా సినీ, జానపద గీతాలపై కాబోయే జంటలు వీడియో షూట్లో చేసి వాటిని పెళ్లి జరిగే రోజు ఎల్ఈడీ స్క్రీన్‌పై ప్రదర్శిస్తున్నారు. ప్రత్యేకమైన లొకేషన్స్.. ప్రీవెడ్డింగ్ షూట్ కోసం ఫొటో, వీడియో గ్రాఫర్లు ప్రత్యేక లొకేషన్లు ఎంపిక చేస్తున్నారు. జిల్లాలో కొర్టికల్, కుంటాల, పొచ్చెర జలపాతం, సాత్నాల ప్రాజెక్టు, ఖండాల, ఆదిలాబాద్ గాంధీ పార్కు, మత్తాడి వాగులు, ఆలయాలు, ప్రకృతివనాల్లో షూటింగ్ చేస్తున్నారు. ఒక్కో ఫ్రీ వెడ్డింగ్‌షో చిత్రీకరణకు రెండు నుంచి మూడు రోజుల సమయం తీసుకుంటున్నారు. రూ.20 వేల వరకు చార్జి ఒక్కో ప్రీవెడ్డింగ్ షోకు ఫొటో, వీడియో గ్రాఫర్లు రూ. 15 వేల నుంచి రూ.20 వేల వరకు చార్జి చేస్తున్నారు. వాహన, డ్రెస్సు, కాస్టూమ్స్, ఇతర ఖర్చులన్నీ వెడ్డింగ్ షో చేయించుకునేవారు భరిస్తారు. పెళ్లి ఫొటో, వీడియోలు, ఫ్రీ వెడ్డింగ్‌కు రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు తీసుకుంటున్నారు. ఫ్రీ వెడ్డింగ్ షో ద్వారా జిల్లాలోని యువత ఫొటోగ్రఫీ ద్వారా ఉపాధి పొందుతున్నారు. మధుర జ్ఞాపకం ప్రీ వెడ్డింగ్ ఒక మంచి అనుభూతి. పెళ్లికి ముందు ఒకరి భావాలు మరొకరికి అంతగా తెలియదు. ప్రీ వెడ్డింగ్‌తో ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి వేదికగా నిలుస్తోంది. ఒక మధుర జ్ఞాపకం. అంతే కాకుండా ప్రస్తుతం ఒక ట్రెండ్‌గా సాగుతుండడంతో ప్రీ వెడ్డింగ్ తీయించుకున్నాం. – సౌరబ్, శ్రీజ, ఆదిలాబాద్ సినిమా తరహాలో వెడ్డింగ్ షో సినిమా తరహాలో పాటలు చిత్రీకరించేలా వెడ్డింగ్ షో చేస్తున్నాం. ఒక పాటకు రూ.20 వేలు తీసుకుంటుంన్నాం. స్వయం ఉపాధి పొందడంతోపాటు నలుగురికి ఉపాధి చూపుతున్నాం. చిత్రీకరించిన పాటను పెళ్లిరోజు ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా ప్రదర్శిస్తున్నాం. – నవీన్, ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ చదవండి: మీసాల వెంట్రుకలతో సూటు.. ఎంత అందంగా ఉందో చూడండి! -
వెదర్ రిపోర్ట్ ఇక ఈజీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల్లో, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) జోనల్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ (టీఎస్‌డీపీఎస్) ఎల్ఈడీ డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేయనుంది. శనివారం ఈ మేరకు సచివాలయంలో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ డిస్ప్లే బోర్డులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి లాంఛనంగా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏర్పాటు చేసే ఎల్ఈడీ డిస్ప్లే బోర్డుల ద్వారా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయా జిల్లాల అధికారులు ప్రజలకు సూచనలు చేస్తారన్నారు. ఈ ఎల్ఈడీ డిస్ప్లే బోర్డులతో రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత వాతావరణ పరిస్థితులే కాకుండా వచ్చే 3 రోజుల ముందస్తు వాతావరణ పరిస్థితులను సైతం తెలుసుకునేందుకు వీలవుతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 924 ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ల ద్వారా అన్ని ప్రాంతాల వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు రికార్డు చేసి, టీఎస్‌డీపీఎస్ అధికార వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా ప్రజలకు, అధికారులకు అందుబాటులో ఉంచనున్నట్లు రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. -
భారతీయ బాలల మేధస్సుకు లెడ్ ముప్పు
మెల్బోర్న్: లెడ్.. దీనినే మనం సీసం అంటాం. ఇది ఒక రసాయన మూలకమని మనందరికీ తెలుసు. లెడ్ మానవ శరీరంలోకి వెళ్తే అనేక దుష్ప్రభావాలకు దారి తీస్తుంది. ఇలాంటి ప్రమాదకరమైన రసాయనం భారతీయ విద్యార్థులపై చెడు ప్రభావం చూపుతోందని తాజా అధ్యాయనల్లో వెల్లడైంది. రక్తంలో అధికంగా ఉన్న లెడ్ పరిమాణం భారతీయ చిన్నారుల మేధోసంపత్తిని, వారి ఐక్యూ స్థాయిలను హరిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. ఆస్ట్రేలియాలోని మాక్యూర్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు.. భారతీయ చిన్నారుల రక్తంలోని లెడ్ స్థాయిలను తొలిసారి విశ్లేషించారు. అధ్యయన వివరాలు ప్రకారం... గత అధ్యయనాల్లో తేలిన దాని కంటే తాజా పరిశోధనలో లెడ్ పరిమాణం గణనీయంగా పెరిగింది. అది పిల్లల్లో మేధో వైకల్యానికి కారణమవుతోంది. ఈ విషయమై మాక్యూర్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు బ్రెట్ ఎరిక్సన్ మాట్లాడుతూ... ‘చిన్నారుల 100 మిల్లీ లీటర్ల రక్తంలో 7 మైక్రోగ్రామ్‌ల పరిమాణంలో లెడ్ ఉంటే వారి ఐక్యూపై ప్రతికూల ప్రభావం పడుతోందని మా పరిశోధనలో తేలింది. బ్యాటరీలను కరిగించడం (బ్యాటరీ స్మెల్టింగ్) వల్ల భారత్‌లో అధిక స్థాయిలో లెడ్ విడుదలవుతోంది. దీనిపై ఎలాంటి నియంత్రణ లేదు. వాహనాలు వాడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండడం, వాటిలో ఉపయోగించే బ్యాటరీల జీవిత కాలం రెండేళ్లే కావడంతో... బ్యాటరీలను అధికంగా రీసైక్లింగ్ చేస్తున్నారు. దీని కారణంగా ముఖ్యంగా పట్టణ ప్రాంత్లాలో వాయుకాలుష్యం బాగా పెరుగుతోంది. దీంతో లెడ్ వాతావరణంలోకి అధిక స్థాయిలో చేరుతోంది. ఇది పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంద’న్నారు. కేవలం లెడ్ మాత్రమే కాకుండా కొన్ని అయుర్వేద ఔషధాలతోపాటు, నూడుల్స్, సుగంధద్రవ్యాల వల్ల కూడా రక్తంలో లెడ్ పరిమాణం పెరుగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఇప్పటికైనా తగిన చర్యలు చేపట్టి లెడ్ తాలూకు దుష్ఫలితాలను నియంత్రించాలని సూచిస్తున్నారు. -
శాంసంగ్ హోం థియేటర్లు : ధర ఎంతంటే?
సాక్షి, న్యూఢిల్లీ: సౌత్ కొరియా దిగ్గజం శాంసంగ్ అతి ఖరీదైన హోం థియేటర్‌ను లాంచ్ చేసింది. దేశీయంగా ఇన్ హోం ఎంటర్టైన్మెంట్ను సమూలంగా మార్చివేసే లక్ష్యంతో 'ఎల్ఈడీ ఫర్ హోమ్' ప్రారంభించామని శాంసంగ్ ప్రకటించింది. ముఖ్యంగా ప్రపంచంలోనే మొట్ట మొదటి ఎల్ఈడీ హోమ్ స్క్రీన్‌ను శాంసంగ్ మంగళవారం భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. యాక్టివ్ ఎల్ఈడీ పేరిట ఈ హోమ్ స్క్రీన్‌ను లాంచ్ చేసింది. సూపర్ ప్రీమియం స్ర్కీన్ తో ఇంట్లోనే థియేట్ అనుభవాన్ని పంచేందుకు ఈ సరికొత్త ఎల్ఈడీ హోం థియేటర్లను అందుబాటులోకి తెచ్చింది. హోమ్ ఎంటర్టైన్మెంట్లో తాజా ఆవిష్కరణ ఒక విప్లవంగా పేర్కొంది. ఈ హోమ్ స్క్రీన్‌పై వినియోగదారులు అత్యద్భుతమైన, అత్యంత నాణ్యత కలిగిన దృశ్యాలను ఎక్స్పీరియన్స్ చేయవచ్చని తెలిపింది. అంతేకాదు హోమ్ స్క్రీన్లు అన్నింటికీ ఒక లక్షకు పైగా గంటల జీవిత కాలం ఉంటుందని శాంసంగ్ వెల్లడించింది. 110-అంగుళాల ఫుల్ హెచ్డీ, 130-అంగుళాల ఫుల్ హెచ్డీ, 220 అంగుళాలు (అల్ట్రా హెచ్డీ) 260-అంగుళాలు (అల్ట్రా-హెచ్డీ) సిరీస్ వీటిని అందుబాటులోకి తెచ్చింది. వీటి ధరలు రూ. 1 కోట్లు, రూ. 3.5 కోట్లు గా ఉండనున్నాయి.తమ లేటెస్ట్ డివైస్ కట్టింగ్-ఎడ్జ్ డిస్ప్లే అనుభవాన్ని వినియోగదారులను అందించేందుకు అంకితభావంతో ఉన్నామని పునీత్ సేథి, (వైస్ ప్రెసిడెంట్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఎంటర్ప్రైజ్ బిజినెస్ శాంసంగ్ ఇండియా )ప్రకటనలో తెలిపారు. -
ఎల్ఈడీ సినిమా తెర
ఇప్పటి వరకు ఎల్ఈడీ టీవీలనే చూశాం. ఇకపై సినిమా థియేటర్లలో కూడా ఎల్ఈడీ తెరను చూడవచ్చు. దేశ రాజధాని ఢిల్లీలో పీవీఆర్ మల్టీప్లెక్స్‌లో ఎల్ఈడీ తెరను ఇటీవల ఏర్పాటు చేశారు. దేశంలో మొట్టమొదటి ఎల్ఈడీ సినిమా తెర ఇదే. శామ్సంగ్ సంస్థ సహకారంతో ఏర్పాటు చేశారు. మామూలు తెరతో పోలిస్తే ఎల్ఈడీ తెరపై సినిమా మరింత ప్రకాశవంతంగా స్పష్టంగా కనిపిస్తుందని, శబ్దం కూడా క్లియర్‌గా ఉంటుందని పీవీఆర్ మల్లీప్లెక్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ కుమార్ బిజ్లి చెప్పారు. ఎల్ఈడీ తెరకు ప్రొజెక్టర్ అవసరం ఉండదు. మామూలుగా సినిమా నడిచేటప్పుడు హాల్లో లైట్లన్నీ ఆర్పేస్తారు. అయితే, ఎల్ఈడీ తెర ఉంటే లైట్లు ఆర్పాల్సిన అవసరం లేదు. థియేటర్లో లైట్లు ఉన్నా సినిమా చూడటా నికి ప్రేక్షకులకు ఇబ్బంది ఉండదు. ఈ తెర ఏర్పాటుకు రూ.7 కోట్లు ఖర్చయింది. 2017లో తొలిసారిగా కొరియాలో ఎల్ఈడీ తెర(ఆనిక్స్ స్క్రీన్)ను పరిచయం చేశామని, ఇంతవరకు ప్రపంచంలో 12 చోట్ల ఈ తెర లున్నాయని శామ్సంగ్ ప్రతినిధి చెప్పారు. -
ఎయిర్‌పోర్టులో మరో మైలురాయి
శంషాబాద్:పర్యావరణ హితంగా అడుగులు వేస్తున్న శంషాబాద్ ఎయిర్‌పోర్టు మరో ముందడుగు వేసింది. విమానాశ్రయాన్ని వందశాతం ఎల్ఈడీ వెలుగులతో నింపినట్లు జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్‌పోర్టు సంస్థ ప్రకటించింది. ఆరునెలల కిందట ఆరవైశాతం ఎల్ఈడీ దీపాలను అమర్చిన జీఎంఆర్ సంస్థ తాజాగా ఎయిర్‌ఫీల్డ్ గ్రౌండ్లో ఉన్న సైన్ బోర్డులను సైతం పూర్తి స్థాయిలోకి ఎల్ఈడీ దీపాలను అమర్చింది. ఎయిర్‌ఫీల్డ్ గ్రౌండ్లో ఇప్పటి వరకు ఫ్లోరోసెంట్ దీపాలు ఉన్న చోట్ల మొత్తం 350 ఎల్ఈడీ దీపాలను అమర్చింది. ఈ దీపాలను కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఇక్కడ పూర్తి స్థాయిలో అమర్చారు. ఎయిర్‌ఫీల్డ్‌లో ఉన్న ఈ సైన్ బోర్డులు రాత్రి సమయాలతో పాటు ఉదయం వెలుతురు తక్కువగా ఉన్న సమయాల్లో విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌లతో పాటు వాటిని పార్కింగ్ చేసేందుకు సూచికలుగా ఉపయోగపడతాయని వారు పేర్కొన్నారు. వందశాతం ఎల్ఈడీ ఏర్పాటుతో ఎయిర్‌పోర్టులో ఏటా 45 శాతం విద్యుత్ ఆదా అవుతుందని అధికారులు వెల్లడించారు. దీంతో పాటు కర్బన రహితంగా ఉండడంతో కాలుష్యాన్ని గణనీయంగా తగ్గిస్తుందన్నారు. పర్యావరణ హితంగా ఎయిర్‌పోర్టు ఇప్పటికే పలు అవార్డులు దక్కించుకుందని ఈ సందర్భంగా సీఈఓ ఎస్జీకే కిషోర్ అన్నారు. తాజాగా ఎయిర్‌పోర్టును వందశాతం ఎల్ఈడీ దీపాలను ఏర్పాటు చేయడం మరో మైలురాయి అని ఆయన అభివర్ణించారు. ఇప్పటికే పగటి సమయాల్లో స్థానికంగా ఉత్పత్తి చేస్తున్న సౌరవిద్యుత్‌ను వినియోగిస్తున్నామని ఆయన తెలిపారు. -
కనిపించని బల్బులు వచ్చేస్తున్నాయి!
ఎల్ఈడీలు తెలుసుగా.. అతి తక్కువ కరెంటు ఖర్చుతో దీర్ఘకాలం పాటు బోలెడంత వెలుగునిచ్చే సరికొత్త బల్బులు. కాలిఫోర్నియా యూనివర్శిటీ (బెర్క్లీ) ఇంజినీర్లు తాజాగా ఇంకో కొత్త రకం ఎల్ఈడీలు తయారుచేశారు. కేవలం కొన్ని మిల్లీమీటర్ల పరిమాణంలో ఉండే ఈ కొత్త బల్బుల్ని ఆఫ్ చేసినప్పుడు పూర్తి పారదర్శకంగా ఉంటాయి. ఈ బల్బులో కేవలం మూడు పరమాణువుల మందంతో ఉండే అర్ధవాహకం (సెమీ కండక్టర్) పొర ఒకటి ఉంటుంది. అయితే ఏంటి అంటున్నారా? చాలా సింపుల్. ఈ సరికొత్త బల్బులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే.. టీవీలు, కంప్యూటర్లు, హోర్డింగులు వంటి అన్ని రకాల తెరలూ మాయమైపోతాయి. అదెలా అనొద్దు. ఆఫ్‌లో ఉన్నప్పుడు పారదర్శకంగా ఉంటాయని ముందే చెప్పుకున్నాం కదా.. అందుకన్నమాట! గాజు కిటికీలు, తలుపుల్లోపలే డిస్ప్లే తెరలను ఏర్పాటు చేసేందుకు ఈ కొత్త బల్బులు ఉపయోగపడతాయని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డెర్ హీన్ లీన్ తెలిపారు. బల్బులో వాడే మూడు పరమాణువుల మందమైన పొర నాలుగు రకాల పదార్థాలతో తయారు చేయవచ్చునని... ఒక్కోటి ఒక్కో ప్రాథమిక రంగును వెదజల్లుతుంది కాబట్టి... వీటిని నియంత్రించడం ద్వారా తెరపై మనకు నచ్చిన రంగును సృష్టించవచ్చునని వివరించారు. అతి పలుచగా ఉండే ఈ కొత్త బల్బులను మనిషి చర్మంపై పచ్చబొట్టు మాదిరిగా ఏర్పాటు చేసుకోవచ్చునని చెప్పారు. అయితే ఈ స్థాయిలో వీటిని ఉపయోగించుకునేందుకు మరికొంత సమయం పట్టవచ్చునని లీన్ స్పష్టం చేశారు. -
రెండేళ్లలో ఎల్ఈడీ కాంతులు
సాక్షి, హైదరాబాద్: రెండేళ్లలో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఎల్ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేసేలా కార్యాచరణ సిద్ధం చేసినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఎంపిక చేసిన 60 మంది సర్పంచ్‌లకు ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటుపై శుక్రవారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో జూపల్లి పాల్గొన్నారు. 2019 మార్చి 31 నాటికి ప్రతి గ్రామానికి ఎల్ఈడీ దీపాలు ఏర్పాటు చేసే లక్ష్యంతో 60 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్ చేపడుతున్నామన్నారు. ఇందుకోసం కేంద్ర ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీస్ లిమిటెడ్ (ఈఎఫ్‌ఎస్‌ఎల్)తో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. ఈ బల్బులు అమర్చడం వల్ల గ్రామ పంచాయతీలపై ఎలాంటి ఆర్థిక భారం పడదని, పెట్టుబడి లేకుండా పంచాయతీలు విద్యుత్ ఆదా చేయవచ్చని పేర్కొన్నారు. థర్డ్ వైర్ సౌకర్యం ఉన్న పంచాయతీలు ముందుకు వస్తే ఈఎఫ్‌ఎస్‌ఎల్.. ఆయా గ్రామాల్లో ఎల్ఈడీ లైట్లను ఉచితంగా ఏర్పాటు చేస్తుందన్నారు. పంచాయతీలు సొంతంగా లేదా విద్యుత్ శాఖ ద్వారా లేదా 14వ ఫైనాన్స్ నిధుల నుంచి థర్డ్ వైర్ సౌకర్యం కల్పించుకోవచ్చన్నారు. 72 గంటల్లో పునరుద్ధరణ బల్బుల పనితీరును ఆన్లైన్ ద్వారా ఈఎఫ్‌ఎస్‌ఎల్ సంస్థ ప్రతినిధులు పర్యవేక్షిస్తారని తెలిపారు. వెలగని బల్బులను 72 గంటల్లో తిరిగి పునరుద్ధరిస్తారని, అలా పునరుద్ధరించకుంటే.. రోజుకి బల్బుకి రూ.5 చొప్పున పంచాయతీకి కంపెనీ చెల్లిస్తుందన్నారు. గ్రామ పంచాయతీలు సంస్థతో 5, 7, 10 ఏళ్లు ఒప్పందం కుదుర్చుకోవచ్చని తెలిపారు. ఒప్పందాన్ని బట్టి ఆదా అయిన డబ్బులో 80 శాతం సంస్థకు, 20 శాతం పంచాయతీకి దక్కుతుందన్నారు. మున్సిపాలిటీల్లో ఇప్పటికే ఎల్ఈడీ వీధి దీపాలు ఏర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని పంచాయతీలు ఉపయోగించుకోవాలన్నారు. -
మిక్ ఎలక్ట్రానిక్స్ మరో ప్లాంట్
⇒ చైనా దిగ్గజం లేయార్డ్తో కలిసి ఏర్పాటు ⇒ భాగ్యనగరి వద్ద రూ.450 కోట్లతో హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎల్ఈడీ పరికరాల తయారీలో ఉన్న మిక్ ఎలక్ట్రానిక్స్ హైదరాబాద్ సమీపంలో ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. ఎల్ఈడీ వీడియో డిస్ప్లేల ఉత్పత్తిలో ప్రపంచ నంబర్–1 అయిన చైనా దిగ్గజం లేయార్డ్తో కలిసి దీనిని నెలకొల్పుతోంది. ప్లాంటు విషయమై చర్చించేందుకు లేయార్డ్తోపాటు యూఎస్ కేంద్రంగా ఉన్న ఈ సంస్థ అనుబంధ కంపెనీ ప్లానర్ సిస్టమ్స్ ప్రతినిధులు భాగ్యనగరికి ఈ వారమే వస్తున్నారు. 50 ఎకరాల్లో రానున్న ప్రతిపాదిత యూనిట్ ఏర్పాటుకు రూ.450 కోట్లకుపైగా వ్యయం చేసే అవకాశం ఉంది. 2018 మార్చి నాటికి నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలని 3 కంపెనీలు భావిస్తున్నాయి. ప్లాంటుకయ్యే వ్యయాన్ని లేయార్డ్ గ్రూప్ వెచ్చిస్తుంది. తయారీ ప్రక్రియను మిక్ చేపడుతుంది. మిక్ ఎలక్ట్రానిక్స్‌కు ఇప్పటికే హైదరాబాద్‌తోపాటు ఉత్తరాఖండ్‌లో ప్లాంట్లు ఉన్నాయి. పేటెంటు ఊపుతో..: మిక్ ఎలక్ట్రానిక్స్ ఇటీవలే ఎల్ఈడీ టీవీ డిస్ప్లే సిస్టమ్‌కు పేటెంటు దక్కించుకుంది. దీంతో ఇతర కంపెనీలు మిక్‌తో భాగస్వామ్యానికి ఆసక్తి చూపుతున్నాయి. ప్రతిపాదిత కొత్త ప్లాంటులో స్మార్ట్ స్ట్రీట్ లైటింగ్, సోలార్ లైటింగ్, డిస్ప్లే ఉపకరణాలను తయారు చేస్తారు. డిస్ప్లేల విషయంలో ఒక్క భారత్‌లోనే ఏటా రూ.1,350 కోట్ల వ్యాపారావకాశాలు ఉన్నాయని మిక్ చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇది రూ.1,20,000 కోట్లకుపైమాటే. కాగా, స్మార్ట్ సిటీస్ ప్రాజెక్టులో భాగంగా న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్‌కు స్మార్ట్ స్ట్రీట్ లైట్లను సరఫరా చేస్తున్నట్టు మిక్ ఎండీ ఎమ్వీ రమణారావు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. స్మార్ట్ స్ట్రీట్ లైట్లతో 72% విద్యుత్ ఆదా అవుతుందని చెప్పారు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి రూ.30 కోట్ల విలువైన సోలార్ స్ట్రీట్ లైట్ల సరఫరా తుది దశకు చేరుకుందన్నారు. మరో రూ.90 కోట్ల విలువైన లైట్లను మూడు నెలల్లో అందజేస్తామన్నారు. -
వెలుగులు ఇక నిరంతరం
పాడైన ఎల్ఈడీ బల్పుల మార్పునకు ప్రత్యేక కేంద్రాలు మండల కేంద్రం సెక్షన్ ఆఫీస్‌లో కౌంటర్ పెట్టిన ఏపీఈపీడీసీఎల్ లబ్ధిదారులకు ఉపసమనం జిల్లాలో 22.58 లక్షల ఎల్ఈడీ బల్బుల పంపిణీ మూడేళ్ల వరకు గ్యారెంటీ... పాడైతే ఎన్నిసార్లయినా మార్చుకునే వెలుసుబాటు ఆధార్, విద్యుత్ బిల్లు తీసుకెళితే చాలు.. పాడైన ఎల్ఈడీ బల్బులను ఇచ్చి కొత్తవి తీసుకునేందుకు ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు లబ్ధిదారులు పాడైన బల్బులను మార్చుకోవాలంటే నియోజకవర్గ కేంద్రానికి వస్తున్నారు. అది కూడా కొద్ది రోజులు మాత్రమే ఈసేవలు అందించారు. దీని వల్ల లబ్ధిదారులు ఇబ్బందులు పడుతుండడంతో శనివారం నుంచి ఆయా మండల కేంద్రాల్లో మార్చుకునే విధంగా విద్యుత్ అధికారులు చర్యలు చేపట్టారు. మండల కేంద్రంలోని సెక్షన్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. పని వేళల్లో ఎప్పుడైనా లబ్ధిదారులు పాడైన బల్బులను అక్కడ ఇచ్చి కొత్తవి తీసుకొవచ్చు. ఇందుకు పాత బల్బుతోపాటు లబ్ధిదారులు తమ ఆధార్ కార్డు, విద్యుత్ బిల్లు తీసుకురావాల్సి ఉంటుందని రాజమహేంద్రవరం డీఈ శ్యాంంబాబు తెలిపారు. - సాక్షి, రాజమహేంద్రవరం రేషన్‌కార్డు ప్రాతిపదికగా బల్బుల పంపిణీ గృహ అవసరాలకు సాధారణ బల్బులు వాడడం వల్ల విద్యుత్ వినియోగం పెరుగుతోంది. విద్యుత్ వాడకంలో మిగులు సాధించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం దీన్‌దయాల్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన పథకం ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఎనర్జీ ఎఫిషిఎన్సీ సర్వీస్ లిమిటెడ్(ఈఈఎస్ఎల్), విద్యుత్ పంపిణీ సంస్థల భాగస్వామ్యంతో ఎల్ఈడీ బల్బులను పింపిణీ చేసింది. రేషన్ కార్డు ప్రాతిపదికగా ప్రతి లబ్ధిదారుడుకి రూ.300 విలువైన ఎల్ఈడీ బల్బులను రూ.10 చొప్పున ఏపీఈపీడీసీఎల్ రెండు బల్బులు పంపిణీ చేసింది. జిల్లాలో 24 లక్షల 40 వేల బల్బులు పంపిణీ చేయాలన్న లక్ష్యంతో 2015 నవంబర్ 17న పింపిణీ కార్యక్రమం ప్రారంభించింది. ఇప్పటి వరకు 11,28,732 లబ్ధిదారులకు 22,57,283(93 శాతం) బల్బులును విద్యుత్ అధికారులు పంపిణీ చేశారు. పాడైతే కొత్త బల్బు మూడేళ్ల గ్యారెంటీతో ఏపీఈపీడీసీఎల్ అధికారులు ప్రతి గ్రామంలో బల్బులను పంపిణీ చేశారు. పగిలిపోవడం కాకుండా పాడైతే ఎప్పడైనా మార్చుకునే వెలుసుబాటు కల్పించారు. అయితే ఇప్పటి వరకు లబ్ధిదారులు బల్బులను మార్చుకునేందుకు నియోజకవర్గ కేంద్రానికి రావాల్సిన పరిస్థితి ఉండడంతో ఇబ్బందులు పడతున్నారు. ఈ నేపథ్యంలో మరింత ఉన్నతంగా సేవలు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు ప్రతి మండల కేంద్రంలోని సెక్షన్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. లబ్ధిదారుడు పాడైన తమ ఎల్ఈడీ బల్బులను ఇక్కడ మార్చుకోవచ్చు. ఇప్పటి వరకు నియోజకవర్గ కేంద్రాల్లో 37,659 బల్బులను పాడైన వాటి స్థానంలో మార్పు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక మండల కేంద్రాల్లో మార్పిడి కేంద్రాలు పెట్టడం వల్ల వినియోగదారులకు దూరాబారం నుంచి ఉపసమనం కలుగనుంది. త్వరలో టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు పాడైన ఎల్ఈడీ బల్బులను మార్చుకునేందుకు ఈఈఎస్ఎల్ సంస్థతో మండల కేంద్రంలోని సెక్షన్ కార్యాలయం వద్ద కౌంటర్లు పెట్టిస్తున్నాం. ఇప్పటి వరకు పలు డివిజన్లలో ఈ ప్రక్రియ ముగిసింది. లబ్ధిదారులు సమాచారం తెలుసుకునేందుకు త్వరలో టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేయబోతున్నాం. పాడైన బల్బుతోపాటు ఆధార్, విద్యుత్‌బిల్లు తీసుకువచ్చి కొత్త బల్బు తీసుకెళ్లవచ్చు. - ఎస్ఎన్ ప్రసాద్, సూపరింటెండెంట్ ఇంజనీర్, ఏపీఈపీడీసీఎల్ -
కాంతివంతంగా..
పది మందికి ఉపాధి కల్పిస్తున్న గిరిజన యువతి.. ఎల్ఏడీ బల్బ్‌ల యూనిట్‌తో అద్భుతాలు సృష్టిస్తున్న వీరలక్ష్మి రాజవొమ్మంగి : గిరిజనులు అంటే కొండ చీపుర్లు, చింతకాయలు అమ్ముకొనేవారు కాదని, తాము కూడా పెద్దపెద్ద పరిశ్రమలు నెలకొల్పగలమని, పది మందికి ఉపాధి చూపగలమనే దృఢ నిశ్ఛయంతో ఉన్నారు. దీనికి నిదర్శనమే తూర్పు ఏజెన్సీ అడ్డతీగల మండలం బొడ్లంక గ్రామానికి చెందిన కొల్లపురెడ్డి వీరలక్ష్మి. ఈమె కాకినాడ జేఎన్టీయూలో బీటెక్ చదివారు. అంతకు ముందు ప్రాథమిక స్థాయి నుంచి ఇంటర్ వరకు రాజవొమ్మంగి బాలికల గురుకుల పాఠశాలలో చదివింది. రంపచోడవరంలో రూ.కోటితో ట్విలైట్ (ట్రైబుల్ విమన్ ఇన్స్టాల్డ్ లెడ్ ఇన్ ఐటీడీఏ ఆఫ్ రంపచోడవరం) పేరుతో బల్బ్‌ల అసెంబుల్డ్ యూనిట్‌ను స్థాపించింది. రంపచోడవరం ఐటీడీఏ, జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్ ఈమెను ప్రోత్సహించి బ్యాంకులోన్ ఇప్పించారు. ప్రస్తుతం ఏపీఈపీడీసీఎస్ ద్వారా లక్ష బల్బ్‌లకు ఆఫర్ వచ్చిందని, ఈ నేపథ్యంలో ప్రతి పంచాయతీ పరిధిలో గిరిజన కుంటుంబానికి రెండు ఎల్ఈడీ బల్బ్‌లు రాయితీ ధరకు (రెండు బల్బ్‌లు రూ.20 మాత్రమే, అసలు ఖరీదు రూ.250) సరఫరా చేస్తున్నట్టు వీరలక్ష్మి చెబుతోంది. తాను ట్విలైట్ యూనిట్‌కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ కాగా తనతో పాటు మరో 42 మంది చదువుకొన్న గిరిజన యువతులు ఈ కంపెనీ ద్వారా ఉపాధి పొందుతున్నారన్నారు. తామంతా సొసైటీగా (రంప గిరిజన మహిళా సమాఖ్య పారిశ్రామిక సహకార సంఘంగా) ఏర్పడి తక్కువ విద్యుత్ ఖర్చుతో ఎక్కువ కాంతినిచ్చే ఎల్ఈడీ బల్బ్‌లు, ట్యూబ్లైట్స్, స్ట్రీట్‌లైట్స్, విద్యుత్ లేనప్పుడు ఉపయోగించే ఎమర్జెన్సీ లైట్స్ తయారు చేస్తున్నామన్నారు. -
హైదరాబాద్‌లో ఇంటెక్స్ ప్లాంట్
• సుమారు 500 కోట్ల పెట్టుబడి • మొబైల్స్, ఎల్ఈడీల తయారీ • కంపెనీ డైరెక్టర్ నిధి మార్కండేయ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రానిక్స్ తయారీలో ఉన్న ఇంటెక్స్ టెక్నాలజీస్ దక్షిణాదిన తొలి ప్లాంటును హైదరాబాద్ వద్ద నెలకొల్పాలని నిర్ణయించింది. ఈ విషయమై కంపెనీ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంతో తొలి విడత చర్చలు జరిపింది. ప్రతిపాదిత ప్లాంటుకు రూ.500 కోట్ల దాకా పెట్టుబడి అవసరం అవుతుందని ఇంటెక్స్ కంజ్యూమర్ డ్యూరబుల్స్, ఐటీ–యాక్సెసరీస్ బిజినెస్ హెడ్ నిధి మార్కండేయ్ మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. తొలుత మొబైళ్లు, ఎల్ఈడీ టీవీలను ఈ ప్లాంటులో తయారు చేస్తారు. ఆ తర్వాత వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్ల వంటి ఇతర ఉత్పత్తులను దశలవారీగా జోడిస్తారు. కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న కంపెనీ 6వ ప్లాంటు సైతం ఉత్తరాదికే పరిమితమైంది. హైదరాబాద్ ప్లాంటు నుంచే దక్షిణాది రాష్ట్రాలకు ఉత్పత్తులను సరఫరా చేస్తారు. 600 మందికిపైగా ఉపాధి.. ప్లాంటు ఏర్పాటైతే 600 మందికిపైగా ఉపాధి లభిస్తుందని నిధి మార్కండేయ్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. భారీ స్థాయిలోనే దీనిని స్థాపిస్తామన్నారు. నోట్ల రద్దు పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వంతో మలి దశ చర్చలకు కాస్త బ్రేక్ పడిందని అన్నారు. దక్షిణాది ప్లాంటు హైదరాబాద్‌లోనే నెలకొల్పడం ఖాయమని స్పష్టం చేశారు. ఆర్అండ్డీ విభాగం సైతం ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు. ఇంటెక్స్కు దక్షిణాది రాష్ట్రాల నుంచి 26 శాతం ఆదాయం సమకూరుతోంది. కాగా, నోట్ల రద్దు తర్వాత అమ్మకాలు 45 శాతం దాకా తగ్గాయని ఆమె చెప్పారు. ఎల్ఈడీలకు కొరత ఏర్పడిందని, ఇంటర్నల్ మెమరీ కార్డుల ధర పెరిగినప్పటికీ ధరలు పెంచే పరిస్థితి లేదన్నారు. ఇంటెక్స్ ఆదాయంలో 25 శాతమున్న కంజ్యూమర్ డ్యూరబుల్స్, ఐటీ–యాక్సెసరీస్ వాటాను మూడేళ్లలో 50శాతానికి చేరుస్తామన్నారు. -
నెలకు రూ.7 కరెంట్ బిల్లు!
♦ ఎల్ఈడీతో తక్కువ విద్యుత్ వినియోగం ♦ గదిని బట్టి రంగు మారే లైట్లు ♦ సెల్‌ఫోన్ నుంచే ఆపరేటింగ్ చేసుకునే వీలు సాక్షి, హైదరాబాద్: బల్బు, ట్యూబ్‌లైట్లలో డే లైట్, వామ్ లైట్ అనే రెండు రంగులు మాత్రమే ఉంటాయి. అదే ఎల్ఈడీ లైట్లలో మనం కోరుకున్న రంగు మార్కెట్లో దొరుకుతుంది. అంతేకాదు ఇంట్లో గదిని బట్టి, ఆయా రోజును బట్టి కూడా లైట్ రంగును మార్చుకోవచ్చు కూడా. ఈమధ్య కాలంలో నగర వాసుల్లో ఈ విధమైన అభిరుచి బాగా పెరిగిపోయింది. పూజ గదిలో ఎరుపు, గార్డెనింగ్‌లో ఆకుపచ్చ, పడక గదిలో నీలం, హాల్లో వామ్ లైట్, స్టడీ రూంలో డే వైట్ లైట్, ఆఫీసుల్లో ప్యూర్ వైట్, జువెల్లరీ, బట్టల దుకాణాల్లో వామ్ లైట్, రెస్టారెంట్లు, పబ్బుల్లో నీలం, ఎరుపు, ఆరెంజ్ రంగులను ఎక్కువగా వినియోగిస్తారు. సెల్‌ఫోన్ నుంచే ఆపరేటింగ్.. ప్రస్తుతం ఎల్ఈడీ లైట్లలో లైట్ ఆటోమిషన్ ట్రెండ్ నడుస్తోంది. ఈ రకమైన ఎల్ఈడీ లైట్లు గదిలోకి రాగానే దానంతటదే లైట్ ఆన్ అవుతుంది. వెళ్లిపోగానే ఆఫ్ అవుతుంది. టీవీ సౌండ్ పెంచినట్టుగా రిమోట్ సహాయంతో లైట్ వెలుతురు (లుమిన్స్)ను ఎక్కువ, తక్కువ చేసుకోవచ్చు కూడా. ఇక వెబ్ బేస్డ్ సొల్యుషన్స్ ఎల్ఈడీ లైట్లయితే ఇంటర్నెట్ సహాయంతో ఐ-ఫోన్, ఐప్యాడ్ల నుంచే ఆపరేట్ చేసుకోవచ్చు. ఇవి ఎక్కువగా రెస్టారెంట్లు, పబ్బులు, గేమింగ్ జోన్లు, థియేటర్లు, షాపింగ్ మాళ్లులో వినియోగిస్తుంటారు. ధర ఎక్కువైనా.. బల్బు, సీఎఫ్ఎల్, ట్యూబ్‌లైట్లతో పోల్చుకుంటే ఎల్ఈడీ లైట్ల ధర కాస్త ఎక్కువే. కానీ, విద్యుత్ వినియోగం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. నెలకు రూ.7 కరెంట్ బిల్లు.. ఎల్ఈడీ లైట్లు విద్యుత్‌ను చాలా తక్కువగా తీసుకుంటాయి. రోజుకు 10 గంటల చొప్పున బల్బును నెల రోజుల పాటు వినియోగిస్తే 27 యూనిట్ల విద్యుత్ ఖర్చవుతుంది. అంటే నెలకు రూ. 39.15 పైసలు కరెంట్ బిల్లు వస్తుంది. (డొమెస్టిక్ వినియోగంలో 0-50 యూనిట్లకు రూ. 1.45 పైసలుగా ఉంది) ట్యూబ్‌లైట్ విషయానికొస్తే.. నెలకు 21 యూనిట్ల విద్యుత్ ఖర్చవుతుంది. అంటే రూ. 30.45 పైసలు బిల్లు వస్తుంది. అదే ఎల్ఈడీ లైట్‌కు అయితే నెలకు కేవలం 5 యూనిట్లే ఖర్చవుతుంది. అంటే రూ. 7.25 పైసలు మాత్రమే కరెంట్ బిల్లు వస్తుందన్నమాట. -
‘ప్రయోగం’లోనే ఎల్ఈడీ
ఆరు నెలలైనా ముందుకు కదలని ప్రాజెక్ట్ ఐదు డివిజన్లకే పరిమితమైన బల్బులు కరీంనగర్ కార్పొరేషన్: విద్యుత్ ఆదాతోపాటు నిర్వహణ ఖర్చులు తగ్గించుకునేందుకు కరీం‘నగరం’లో ఎల్ఈడీ లైట్ల బిగింపునకు శ్రీకారం చుట్టింది. ప్రయోగాత్మకంగా మెుదలుపెట్టిన లెడ్ లైట్ల బిగింపు ఇంకా అదే స్థాయిలోనే ఉండడం గమనార్హం. ప్రయోగాలను దాటకపోవడంతో నగరవాసులకు లెడ్ వెలుగులు పూర్తిస్థాయిలో అందడం లేదు. కరీంనగర్ నగరపాలకసంస్థలో ఎల్ఈడీ(లెడ్) బల్బులు ఆరు నెలలు గడిచినా ప్రయోగ దశలోనే ఉన్నాయి. మొదటి దఫా ప్రయోగాత్మకంగా 16, 22, 23వ డివిజన్లలో మెజారిటీ ఏరియాల్లో, 24, 25 డివిజన్లలో ఒక్కో లైన్‌కింద గత ఫిబ్రవరిలో 328 లెడ్ బల్బులు ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్(ఈఈఎస్ఎల్) బిగించింది. తర్వాత దశలవారీగా నగరంలోని అన్ని డివిజన్లలో బిగిస్తామని చెప్పినా ఒక్క అడుగు ముందుకు పడలేదు. అంతా హడావుడే.. విద్యుత్ పొదుపుతోపాటు వీధిదీపాల నిర్వహణ ఖర్చులు తగ్గించుకునేందుకు లెడ్ వీధి దీపాలు బిగించుకోవాలని ప్రభుత్వం మున్సిపాలిటీలను ఆదేశించింది. ఈఈఎస్ఎల్ సంస్థకు కాంట్రాక్టు అప్పగించింది. దీంతో నగరంలో లెడ్ లైట్లు బిగించేందుకు ఈఈఎస్ఎల్ సంస్థ 16, 17, 22, 23, 24 డివిజన్లలో వరుసగా ఉండే స్తంభాలను గుర్తించి లెడ్ బల్బులతోపాటు మీటరు బిగించి విద్యుత్ ఆదాకోసం ప్రయోగాత్మక ప్రయత్నాలు మొదలుపెట్టింది. విద్యుత్ వినియోగం, బిల్లుల చెల్లింపు తదితర పలుమార్లు మేయర్, కమిషనర్‌తో చర్చించారు. హడావుడి చేసిన సంస్థ దశలవారీగా అన్ని డివిజన్లలో బిగిస్తామని ఐదు డివిజన్లకే పరిమితం చేసింది. ఆదా..అధిక వెలుగు ఎల్ఈడీ బల్బుల బిగింపుతో విద్యుత్ ఆదాతోపాటు అధిక వెలుగు వస్తుంది. ప్రస్తుతం నరగపాలకసంస్థలో నెలకు రూ.30 లక్షల మేర వీధిదీపాల బిల్లులు చెల్లిస్తున్నారు. ఈ లెక్కన ఏటా రూ.3.6కోట్లు చెల్లింపులు భారంగా మారుతున్నాయి. వీటితోపాటు నిర్వహణ గుదిబండగా మారింది. ఒక్క పైసా ఖర్చు లేకుండా సదరు కాంట్రాక్టు పొందిన సంస్థనే ఎల్ఈడీ లైట్లు బిగించే ఒప్పందం ఉంది. ప్రయోగాత్మకంగా చేపట్టిన ప్రాంతాల్లో ఈఈఎస్ఎల్ సంస్థ మొదట పాత వీధిదీపాలను తొలగించి ఎల్ఈడీలు బిగించింది. లెడ్‌ల వినియోగంతో కలిగే విద్యుత్ ఆదాకు సంబంధించి మిగిలే బిల్లులు సంస్థ రాబట్టుకోనుంది. ప్రయోగం ఎన్నాళ్లు? ఎల్ఈడీ పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపికైన నగరపాలకసంస్థ పరిధిలో 10,745 ట్యూబ్‌లైట్లు, 2,517 ఎస్వీ లైట్లు, 568 సెంట్రల్లైట్లు, 264 మినీ హైమాస్ట్‌లైట్లు, 268 హైమాస్ట్ లైట్లు ఉన్నాయి. వీటి స్థానంలో ఎల్ఈడీ బల్బులు బిగించాలి. ఎనిమిది నెలలు గడిచినా ఇటు పాలకులు కానీ, అటు ఈఈఎస్ఎల్ సంస్థకానీ పట్టించుకోవడంలేదు. మొదటి దఫా ఎల్ఈడీల బిగింపు పూర్తయ్యాక రెండు నెలలపాటు పరిశీలించి దశల వారీగా అన్ని డివిజన్లలో బిగించేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. అయితే ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. దీంతో ఎల్ఈడీ వెలుగులు నగర ప్రజలందరూ చూడాలంటే మరిన్ని రోజులు ఆగాల్సిందే. -
సగం మందికే ఎల్ఈడీ వెలుగులు!
భ్రాంతిగా మారిన ఎల్ఈడీ కాంతి ఇంటికి రెండిస్తామని చెప్పిన ప్రభుత్వం శతశాతం పంపిణీ చేస్తామన్న ఈపీడీసీఎల్ మూలకు చేరిన బల్బులకు అతీగతీ లేదు బల్బులకు ముఖం చాటేస్తున్న ఈఈఎస్ఎల్ శ్రీకాకుళం టౌన్: విద్యుత్ వాడకాన్ని తగ్గించుకునేందుకు ప్రతి ఇంటికీ ఎల్ఈడీ బల్బులను సబ్సిడీపై పది రూపాయలకే అందిస్తున్నామని చెప్పుకున్న ప్రభుత్వం ఆ మేరకు లక్ష్యాన్ని చేరుకోలేక పోయింది. విద్యుత్ బిల్లులు తగ్గుతాయన్న ఆశతో వినియోగదారులు ఇంట్లో ఉన్న బల్బులను తీసేసి ఎల్ఈడీలను అమర్చుకోవడానికి సిద్ధపడ్డారు. ప్రతీ ఇంటికి రెండు బల్బులను తప్పనిసరి చేస్తే విద్యుత్ వినియోగం పెద్దెత్తున తగ్గుతోందని అధికారులు అంచనా వేశారు. అందులో భాగంగా జిల్లాలో విద్యుత్ వినియోగదారులందరికీ తన ఇంట్లో ఉన్న బల్బులకు తోడు రెండునెలల పాటు విద్యుత్ వినియోగానికి చెల్లిస్తున్న చార్జీల బిల్లులను అందజేయడంతో పాటు 20 రూపాయలు చెల్లిస్తే గ్రామంలోనే ఎల్ఈడీ బల్బులు అందజేస్తామని ప్రటనలు ఇచ్చారు. అకారణంగా బల్బులు పాడైతే తిరిగి వాటిని బిల్లు చెల్లించే చోట అందజేస్తే కొత్తవి ఇస్తామని ప్రకటించారు. ఈ మాటలు నమ్మిన వినియోగదారులు పెద్ద ఎత్తున ఎల్ఈడీ బల్బులకు క్యూ కట్టారు. అయితే జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఎల్ఈడీ విద్యుత్ దీపాల పంపిణీ కార్యక్రమంలో ఇంకా లక్షన్నర కుటుంబాల దరి చేరలేక పోయింది. జిల్లా వ్యాప్తంగా విద్యుత్ శాఖ గణాంకాల ప్రకారం 6.44 లక్షల గృహ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటికి తోడు గత ఏడాది కొత్తగా 32 వేల కనెక్షన్లను మంజూరు చేశారు. ఈ ఏడాది ఇప్పటివరకు మరో 12 వేల కొత్త కనెక్షన్లు మంజూరయ్యాయి, మొత్తం గృహ వినియోగదారుల సంఖ్య 6.90 లక్షల వరకు చేరింది. కాని ఇంతవరకు తొలివిడతలో 5.32 లక్షల మందికి ఒక సర్వీసుకు రెండు బల్బుల వంతున గత ఏడాది మార్చి 31వ తేదీ నాటికి 10.65 లక్షల బల్బులను సరఫరా చేశారు. ఈ ఏడాది మార్చిలో రెండో విడత కింద 19,128 మంది లబ్థిదారులకు 38,256 బల్బులను మాత్రమే పంపిణీ చేశారు. ఇంకా లక్షన్నర కుటుంబాలకు ఎల్ఈడీ బల్బులను సబ్సిడీపై ప్రభుత్వం సరఫరా చేయాల్సి ఉంది. దీనికితోడు ఎల్ఈడీ బల్బులు సరఫరా చేసిన ఈఈఎస్ఎల్ సంస్థ ఇప్పుడు ముఖం చాటేస్తుండడంతో కొత్త సమస్య తలెత్తుతోంది. గతంలో పంపిణీ సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ఏకారణం చేతనైనా బల్బు వెలగక పోతే వాటిని తిరిగి సంస్థ తీసుకుని కొత్తవి ఇస్తారని గతంలో ప్రభుత్వంతోపాటు సంస్థ ప్రతినిధులు చెప్పుకొచ్చారు. ఈపీడీసీఎల్ సంస్థ కార్యాలయంలో బిల్లులు చెల్లించే స్థలాల్లో వీటిని తిరిగి తీసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. కాని అలాంటి కౌంటర్లు ఇంతవరకు ప్రారంభం కాకపోవడంతో సంబంధిత అధికారులకు ఫిర్యాదులు అందుతున్నా.. వారు ఏమీ చేయలేని స్థతిలో నిట్టూరుస్తున్నారు. మూడున్నర లక్షల బల్బులు అవసరం జిల్లాకు ఇంకా మూడున్నర లక్షల ఎల్ఈడీ బల్బులు అవసరమవుతోందని గుర్తించి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయానికి గతంలో లేఖలు రాశాం. రెండో విడత కేవలం 32 వేల బల్బులే పంపిణీ అయ్యాయి. మిగిలిన రెండున్నర లక్షల బల్బులు ఇంకా సరఫరా కావాల్సిఉంది. ఈఈఎస్ఎల్ సంస్థ ప్రతినిధులను ఇప్పటికే పలుమార్లు సరఫరా కోసం సంప్రదించాం. ఇంకా బల్బులు రాక పోవడంతో పంపిణీ సాధ్యం కాలేదు. – డి.సత్యనారాయణ, ఎస్ఈ, తూర్పు విద్యుత్ పంపిణీసంస్థ(ఆపరేషన్స్) -
ఔటర్‌పై ఎల్ఈడీ వెలుగులు
సిటీబ్యూరో: నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్)పై రోడ్డు ప్రమాదాల నివారణకు హెచ్ఎండీఏ చర్యలు చేపడుతోంది. పగలు కంటే.. రాత్రివేళల్లోనే అధిక సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి. అదే స్థాయిలో మరణాలు సంభవిస్తున్నాయి. నగరం చుట్టూ 158 కిలోమీటర్ల మేర విస్తరించిన ఓఆర్ఆర్పై శంషాబాద్-గచ్చిబౌలి మధ్యనే ఎక్కువ సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా సోమవారం చోటుచేసుకున్న రెండు వేర్వేరు ప్రమాదాలు రాత్రి వేళ జరిగినవే. ఈఘటనలో ముగ్గురు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. వెలుతురు సరిగా లేకపోవడమే ఈ ప్రమాదాలకు కారణమని హెచ్ఎండీఏ గుర్తించింది. ఈ క్రమంలో శంషాబాద్-గచ్చిబౌలి దారిలో ఎల్ఈడీ బల్బులు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయిందని హెచ్ఎండీఏ కమిషనర్ టి. చిరంజీవులు తెలిపారు. 24 కిలోమీటర్ల మేర రూ. 56 కోట్ల వ్యయంతో బల్బులు ఏర్పాటు చేసేందుకు ఫిలిప్స్ కంపెనీ కాంట్రాక్ట్ దక్కించుకుందని చెప్పారు. వచ్చే మూడు నెలల్లో వీటిని పూర్తి స్థాయిలో అమరుస్తారని తెలిపారు. వాస్తవంగా గంటకు గరిష్టంగా 120 కి.మీ వేగంతో వాహ నాలు రాకపోకలు సాగించేలా ఓఆర్ఆర్ని డిజైన్ చేశారు. అయితే, అంతకు మించిన వేగంతో వాహనాల రాకపోకలు సాగిస్తుండడం ప్రమాదాలకు హేతువు అవుతోంది. ఈ క్రమంలో వాహనాల వేగానికి కళ్లెం వేయడానికీ కసరత్తు చేస్తున్నారు. హెచ్ఎండీఏ, పోలీసు శాఖ సంయుక్తంగా వేగ నియంత్రణ చేపట్టే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. -
ఇక ఇన్ఫోకస్ ఎల్ఈడీ టీవీలు..
♦ ధరల శ్రేణి రూ.10-70 వేలు ♦ కస్టమర్ల ఇంటివద్ద ఉచిత డెమో హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల విక్రయంలో ఉన్న అమెరికన్ కంపెనీ ఇన్ఫోకస్... ఎల్ఈడీ టీవీల విభాగంలోకి ప్రవేశించింది. 24, 32 అంగుళాల సైజులో హెచ్డీ ఎల్ఈడీ టీవీలను విడుదల చేసింది. వీటి ధరలు వరుసగా రూ.9,999, రూ.15,999 ఉన్నాయి. అలాగే ఫుల్ హెచ్డీ ఎల్ఈడీల శ్రేణిలో 50, 60 అంగుళాల సైజులో టీవీలను తీసుకొచ్చింది. ఈ మోడళ్ల ధర వరుసగా రూ.34,999, రూ.69,999గా నిర్ణయించింది. మొబైల్ ఫోన్ల విక్రయం ద్వారా భారత్‌లో 10 లక్షల మందికి చేరువయ్యామని ఈ సందర్భంగా ఇన్ఫోకస్ ఇండియా హెడ్ సచిన్ థాపర్ చెప్పారు. ఇదే ఊపుతో ఇప్పుడు టీవీలను తీసుకొచ్చామన్నారు. ‘టీవీలకు అత్యుత్తమ డిస్ప్లే ప్యానళ్లను వినియోగించాం.జపాన్‌లో తయారైన షార్ప్ ప్యానెల్‌తో 60 అంగుళాల టీవీని రూపొందించాం. పరిశ్రమలో తొలిసారిగా ఫ్రీ డెమోను ప్రారంభించాం’ అని వివరించారు. ఇంటివద్ద ఉచిత డెమో..:ఇన్ఫోకస్ మొబైళ్లతోపాటు టీవీలను ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ దిగ్గజం ఫాక్స్‌కాన్ రూపొందిస్తోంది. ఈ-కామర్స్ కంపెనీ స్నాప్‌డీల్‌లో మాత్రమే ఫిబ్రవరి 29 నుంచి టీవీలు అందుబాటులో ఉంటాయి. ఆన్లైన్ షాపింగ్ అనుభూతిని తిరగరాస్తూ ఇన్ఫోకస్ తొలిసారిగా ‘ఫ్రీ డెమో ఎట్ హోం’ను ప్రకటించింది. కస్టమర్ల ఇంటి వద్ద 50 అంగుళాల ఫుల్ హెచ్డీ టీవీ పనితీరును డెమో ద్వారా వివరిస్తారు. 18 ప్రధాన నగరాల్లో ఈ సౌకర్యం ఉందని స్నాప్‌డీల్ పార్ట్నర్షిప్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ టోనీ నవీన్ తెలిపారు. కాగా, స్మార్ట్ యూవీ2ఏ టెక్నాలజీని టీవీల్లో వాడారు. వీక్షకుల కళ్లపై తక్కువ కాంతి పడుతుందని కంపెనీ తెలిపింది. -
చొక్కా రంగును బట్టి లైటింగ్!
సాక్షి, హైదరాబాద్: బల్బు, ట్యూబ్లైట్ల రోజులు పోయాయి. ఇప్పుడు లైట్ ఎమిటింగ్ డయోడ్ (ఎల్ఈడీ) ట్రెండ్ నడుస్తోంది. దీని ప్రత్యేకత ఏంటంటే.. మనం కోరుకున్న రంగు, గదిని బట్టి, ఆయా రోజును బట్టి కూడా లైట్ రంగును ఎంచుకోవచ్చంటున్నారు కాస్మో డ్యూరబుల్స్ ప్రై.లి. ఎండీ డాక్టర్ హరినాథ్ బాబు. పూజ గదిలో ఎరుపు, గార్డెనింగ్‌లో ఆకుపచ్చ, పడక గదిలో నీలం, హాల్లో వామ్ లైట్, స్టడీ రూంలో డే వైట్ లైట్, ఆఫీసుల్లో ప్యూర్ వైట్, దుకాణాల్లో వామ్ లైట్, రెస్టారెంట్లు, పబ్బుల్లో నీలం, ఎరుపు, ఆరెంజ్ రంగులను ఎక్కువగా వినియోగిస్తారని పేర్కొన్నారు. సెల్‌ఫోన్ నుంచే ఆపరేటింగ్: ఇప్పుడు లైట్ ఆటోమిషన్ ట్రెండ్ నడుస్తోంది. ఈ ఎల్ఈడీ లైట్లు గదిలోకి రాగానే వాటంతటవే ఆన్.. వెళ్లిపోగానే ఆఫ్ అవుతాయి. టీవీ సౌండ్ పెంచినట్టుగా రిమోట్ సహాయంతో లుమిన్స్ను ఎక్కువ, తక్కువ చేసుకోవచ్చు. వెబ్ బేస్డ్ సొల్యూషన్స్ ఎల్ఈడీ లైట్లను ఇంటర్నెట్ సహాయంతో ఐ-ఫోన్, ఐప్యాడ్ల నుంచే ఆపరేట్ చేసుకోవచ్చు. ఇవి ఎక్కువగా రెస్టారెంట్లు, పబ్బులు, గేమింగ్ జోన్లు, మాల్స్‌లో వినియోగిస్తుంటారు. ధర ఎక్కువైనా: బల్బు, సీఎఫ్ఎల్, ట్యూబ్‌లైట్లతో పోల్చుకుంటే ఎల్ఈడీ లైట్ల ధర కాస్త ఎక్కువే. కానీ, విద్యుత్ వినియోగం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. నెలకు రూ.7 కరెంట్ బిల్లు: ఎల్ఈడీ లైట్లు విద్యుత్‌ను చాలా తక్కువ. రోజుకు 10 గంటల చొప్పున బల్బును నెల రోజుల పాటు వినియోగిస్తే 27 యూనిట్ల విద్యుత్ ఖర్చవుతుంది. అంటే నెలకు రూ. 39.15 పైసలు కరెంట్ బిల్లు వస్తుంది. (డొమెస్టిక్ వినియోగంలో యూనిట్ విద్యుత్‌కు రూ. 1.45 పైసలు) ట్యూబ్‌లైట్‌కు నెలకు 21 యూనిట్ల విద్యుత్‌కు.. రూ. 30.45 పైసలు బిల్లు వస్తుంది. అదే ఎల్ఈడీ లైట్‌కు నెలకు కేవలం 5 యూనిట్లే ఖర్చవుతుంది. అంటే రూ. 7.25 పైసల కరెంట్ బిల్లు వస్తుందన్నమాట. క్రోమో థెరపీ లైట్లు కూడా: ప్రస్తుతం ఎల్ఈడీ లైట్లలో డౌన్, షో, షాండలైయర్స్, డ్రైవే, వాక్‌వే, స్విమ్మింగ్ పూల్ వంటి రకాలు ఉన్నాయి. జాగ్వార్, విస్టోసీ, ఆర్టేమిడీ వంటి బ్రాండ్లు ఉన్నాయి. ఇవి స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్ దేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి. ధరలు రూ.650 నుంచి ప్రారంభం. లైటింగ్‌తో మనిషి మూడ్‌ను మార్చే క్రోమోథెరపీ లైట్లు కూడా ఉన్నాయి. వీటి ధరలు లక్ష నుంచి ప్రారంభం. ప్రెస్టిజ్, ఎన్సీసీ, అశోకా వంటి నిర్మాణ సంస్థలతో పాటుగా పలు మీడియా సంస్థలకు, యాజమాన్యాలకు లైట్లను సరఫరా చేశాం. -
మన్యంలో నోబెల్ వెలుగులు
విద్యుత్ పొదుపులో గిరిజనుల భాగస్వామ్యం సీఎఫ్ఎల్, ఎల్ఈడీ బల్బుల వినియోగం 1002 మంది గిరిజనులు ఆదర్శం పాడేరు : తక్కువ విద్యుత్‌తోనే ఎక్కువ వెలుగులు పంచుతూ... పర్యావరణానికి మేలు చేకూర్చే నీలి ఎల్ఈడీ సాంకేతికతను ఆవిష్కరించిన ముగ్గురు జపాన్ శాస్త్రవేత్తలకు ఈ ఏడాది భౌతిక శాస్త్ర నోబెల్ దక్కింది. ఎల్ఈడీ, సీఎఫ్ఎల్ బల్బులను వినియోగిస్తూ విద్యుత్‌ను పొదుపు చేస్తున్న పాడేరు మండలం డి.గొందూరు, బర్సింగి పంచాయతీ ప్రజల కృషి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పరిశీలనకు వెళ్లింది. కరెంటు కొరత తీవ్రంగా వేధిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రెండు విషయాలూ సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. డి.గొం దూరు, బర్సింగి గ్రామాల్లోని 1002 మంది గిరిజనులు తమ నివాసాల్లో సీఎఫ్ఎల్, ఎల్ఈడీ బల్బులను వినియోగించుకుంటున్నారు. గతంలో మామూలు బల్బుల వినియోగంతో రెండు బల్బులు వాడినా రూ.200 నుంచి 300 బిల్లులు వస్తుండటంతో వ్యవసాయంపైనే ఆధారపడి జీవించే ఈ గిరిజనులంతా అధిక బిల్లులు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడేవారు. కానీ ప్రస్తుతం ఈ గిరిజనులంతా విద్యుత్‌ను పొదుపు చేస్తునే మరోవైపు అధిక కాంతిని ఇస్తున్న ఎల్ఈడీ బల్బులను వినియోగిస్తున్నారు. గతంలో వెలుగు సంస్థ సీఎఫ్ఎల్ బల్బులను పంపిణీ చేయగా వాటిని గత 3 ఏళ్ల నుంచి అనేక గిరిజన కుటుంబాలు వినియోగిస్తున్నాయి. ఇప్పటికీ ఈ బల్బులు చెక్కు చెదరకుండా పని చేస్తుండటంతో గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నెల రోజుల క్రితం ఎల్ఈడీ బల్బులను ఈ రెండు పంచాయతీల పరిధిలోని డి.గొందూరు, కరకపుట్టు, మద్దులబంద, గుర్రంపనుకు, వాకపల్లి, పాలమాను శంక, బర్సింగి, జి.కొత్తూరు, కురిడిమెట్ట, గడివలస తదితర గ్రామాల్లోని 1002 మంది గిరిజనులు సబ్సిడీ ధరపై కొనుగోలు చేశారు. తమ పాత బల్బులను ఇచ్చి ఒకొక్క ఎల్ఈడీ బల్బును రూ.200 ధరతో గ్రామానికి వచ్చిన ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా కొనుగోలు చేశారు. దీంతో గత నెల రోజుల నుంచి ఎల్ఈడీ బల్బుల వెలుగులతో ఈ గ్రామాలు విరాజిల్లుతున్నాయి. కాంతి అధికంగా ఉండటంతో గిరిజనులు ఈ బల్బులను చూసి సంబరపడుతున్నారు. సుదీర్ఘకాలంపాటు ఎల్ఈడీ బల్బులు పని చేసే వీలుండటంతో బల్బుల ఖర్చు కూడా మిగులుతుందని పేర్కొంటున్నారు. ఎల్ఈడీ కాంతి అద్భుతం ఎల్ఈడీ బల్బు ద్వారా అధిక కాంతి ఏర్పడుతుంది. గతంలో సాధారణ బల్బు వినియోగించినప్పుడు ఎర్రని కాంతితో ఇబ్బందులు పడేవాళ్లం. తెల్లటి కాంతిని ఇస్తున్న ఎల్ఈడీ బల్బులు అద్భుతంగా ఉన్నాయి. విద్యుత్ బిల్లులు కూడా తక్కువగా వస్తున్నాయి. - డిప్పల ముత్యాలమ్మ, డి.గొందూరు గ్రామం, పాడేరు మండలం విద్యుత్ ఆదా.. అధిక కాంతి గతంలో పంపిణీ చేసిన సీఎఫ్ఎల్, ఇటీవల కొనుగోలు చేసిన ఎల్ఈడీ బల్బులను గృహ అవసరాలకు వినియోగిస్తున్నాను. విద్యుత్ బిల్లులు తక్కువగా రావడం సంతోషంగా ఉంది. ఇంట్లో పిల్లలు చదువుకోవడానికి కూడా అధిక కాంతి ఎంతో మేలు చేస్తుంది. - పి.బొజ్జన్న, కురిడిమెట్ట, పాడేరు మండలం -
ఎల్ఈడీ బల్బుకు నోబెల్
స్టాక్‌హోం(స్వీడన్): తక్కువ విద్యుత్‌తోనే ఎక్కువ వెలుగులు పంచుతూ.. పర్యావరణానికి మేలు చేకూర్చే నీలి ఎల్ఈడీ సాంకేతికతను ఆవిష్కరించిన ముగ్గురు జపనీస్ శాస్త్రవేత్తలకు ఈ ఏడాది భౌతిక శాస్త్ర నోబెల్ దక్కింది. ఇంధన అవసరాన్ని తగ్గించడం ద్వారా పరోక్షంగా భూతాపోన్నతి(గ్లోబల్‌వార్మింగ్)నీ తగ్గించే నీలి ఎల్ఈడీని ఆవిష్కరించిన ఇసామూ అకసాకి (85), హిరోషీ అమానో(54), షుజీ నకమురా(60)లను భౌతిక శాస్త్ర విభాగంలో విజేతలుగా మంగళవారం నోబెల్ జ్యూరీ ప్రకటించింది. అకసాకి, అమానోలు గతంలో జపాన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ నగోయాలో పనిచేశారు. నకమురా తొకుషిమాలోని నిచియా కెమికల్స్ అనే చిన్న కంపెనీలో పనిచేశారు. వీరు రూపొందించిన నీలి ఎల్ఈడీ ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ సౌకర్యం అందుబాటులో లేని 150 కోట్ల మంది పేద ప్రజల జీవితాల్లో స్వల్ప సౌర విద్యుత్‌తోనే వెలుగులు నింపుతుందని జ్యూరీ ప్రశంసించింది. ‘సంప్రదాయ ఇన్‌క్యాండిసెంట్(ఫిలమెంట్ ఉండే) లైట్ బల్బులు 20వ శతాబ్దంలో వెలుగులు పంచాయి. ఇక 21వ శతాబ్దం ఎల్ఈడీ(లైట్-ఎమిటింగ్ డయోడ్) కాంతులతో ప్రకాశిస్తుంది’ అని జ్యూరీ వీరిని అభినందించింది. విజేతలు ముగ్గురికీ కలిపి 80 లక్షల స్వీడిష్ క్రోనార్ల(రూ.6.81 కోట్లు) మొత్తం అందనుంది. కాగా, దైవకణం(హిగ్స్ బోసాన్)ను కనుగొన్నందుకు బ్రిటన్ శాస్త్రవేత్త పీటర్ హిగ్స్, బెల్జియం శాస్త్రవేత్త ఫ్రాంకోయిస్ ఎంగ్లెర్ట్‌లకు గతేడాది భౌతిక శాస్త్ర నోబెల్ దక్కింది. నీలి ఎల్ఈడీకి ఎందుకింత ప్రాధాన్యం..? నీలి ఎల్ఈడీని ఆవిష్కరణకు ఏకంగా నోబెల్ బహుమతా? అంటే.. నీలి ఎల్ఈడీకి ఉన్న ప్రాధాన్యం అంత తక్కువేం కాదు. ఎందుకంటే.. ప్రస్తుతం మనం చూస్తున్న ఎల్ఈడీ బల్బులన్నింటి తయారీకీ.. నీలి ఎల్ఈడీ టెక్నాలజీయే మార్గం చూపింది. దీనిని కొంచెం వివరంగా పరిశీలిస్తే.. తెలుపు రంగు కాంతిలో ఏడు రంగులు ఉంటాయని, అవి వేర్వేరు తరంగదైర్ఘ్యాల్లో ఉంటాయనీ మనకు తెలిసిందే. కానీ.. ఎరుపు, ఆకుపచ్చ, నీలి రంగు కాంతులు మూడింటిని కలిపినా.. తెలుపు కాంతి ఏర్పడుతుంది. అయితే.. నీలి రంగు కాంతి తరంగదైర్ఘ్యం(వేవ్లెంత్) చాలా తక్కువగా ఉండటం, కొన్ని పదార్థాలతో మాత్రమే ఉత్పత్తి చేయగలగడం వల్ల దానిని ఉపయోగించడం పెద్ద ప్రతిబంధకంగా మారింది. దీనివల్ల ఎరుపు, ఆకుపచ్చ ఎల్ఈడీ లను ఐదు దశాబ్దాల క్రితమే కనుగొన్నప్పటికీ.. తెలుపు కాంతులు వెదజల్లే ఎల్ఈడీల తయారీ సాధ్యం కాలేదు. నీలి రంగు ఎల్ఈడీల ఆవిష్కరణకు మూడు దశాబ్దాలుగా ఎంతో మంది కృషిచేసినా.. ఎవరూ సఫలం కాలేకపోయారు. ఈ నేపథ్యంలో 1990లలో ప్రయోగాలు చేపట్టిన ఈ ముగ్గురూ ఎట్టకేలకు సెమీకండక్టర్ల ద్వారా ప్రకాశవంతమైన నీలి కాంతి పుంజాలు విడుదలయ్యేలా చేశారు. దీంతో తెలుపు ఎల్ఈడీలకు మార్గం సుగమం అయింది. ఆ తర్వాతే ప్రపంచమంతా ఎల్ఈడీ కాంతులు పరుచుకున్నాయి. ఎల్ఈడీలు అంటే..? విద్యుత్ వాహక(సెమీ కండక్టర్) పదార్థాల పొరలు ఎక్కువగా కలిగి ఉండి, కాంతిని వెదజల్లే పరికరాలనే ఎల్ఈడీలుగా చెప్పుకోవచ్చు. వీటిలో విద్యుత్ నేరుగా కాంతి కణాలు(ఫొటాన్లు)గా మారుతుంది. దీనివల్ల చాలా తక్కువ విద్యుత్ ఖర్చవుతుంది. అదే ఇన్‌క్యాండిసెంట్ బల్బులు ఫిలమెంట్ తీగను వేడిచేయడం ద్వారా కాంతిని వెదజల్లుతాయి. అయితే.. చాలా విద్యుత్ ఫిలమెంట్ తీగను వేడిచేసేందుకే ఖర్చవుతుంది. ఇక ఫ్లోరోసెంట్(ట్యూబ్‌లైట్లు) బల్బులూ తక్కువ విద్యుత్‌తో పనిచేస్తాయని భావించినా.. వాటి ద్వారా కూడా వేడి, ఇతర సమస్యలున్నాయి. అదే ఎల్ఈడీలు అయితే.. అన్ని బల్బుల కన్నా ఎక్కువకాలం పనిచేస్తాయి. వేడెక్కవు. తక్కువ విద్యుత్‌తోనే ఎక్కువ వెలుగులు పంచుతాయి. బల్బులుగా మాత్రమే కాకుండా మొబైల్ఫోన్లు, కెమెరాల వంటి ఎన్నో ఎలక్ట్రానిక్ పరికరాలకూ ఇవి ఉపయోగపడతాయి. నీలి ఎల్ఈడీ.. దీనిలో గాలియం నైట్రైడ్, ఇండియం, అల్యూమినియం మిశ్రమంతో కూడిన అనేక పొరలు ఉంటాయి. వీటిని విద్యుత్ వాహకాలుగా ఉపయోగించడం ద్వారానే జపనీస్ శాస్త్రవేత్తలు నీలి ఎల్ఈడీ కాంతి పుంజాలను సాధ్యం చేయగలిగారు. ఎల్ఈడీ.. ఎలక్ట్రిక్ వోల్టేజీ నెగెటివ్ లేయర్ నుంచి ఎలక్ట్రాన్లను ప్రవహింపచేస్తుంది. పాజిటివ్ లేయర్లో ఉండే రంధ్రాలు, నెగెటివ్ లేయర్‌తో కలిసేచోట కాంతి పుంజం ఏర్పడుతుంది. ఇక్కడ విద్యుత్ వాహకంగా ఉపయోగించిన పదార్థాన్ని బట్టి కాంతి తరంగదైర్ఘ్యం ఉంటుంది. ఇందులో కాంతి పుంజాలను ఉత్పత్తి చేసే ఎల్ఈడీలు ఒక్కోటి ఇసుక రేణువు అంత మాత్రమే ఉంటాయి. -
ఓ.. ఎల్ఈడీ! ఎక్కడున్నావ్?
న్యూఢిల్లీ: సీఆర్టీ, ఫ్లాట్, ప్లాస్మా, ఎల్సీడీ, ఎల్ఈడీ... ఇవన్నీ ఏంటో తెలుసా? ఒకదాని తరవాత ఒకటిగా మన ఇళ్లను ఏలేసిన టీవీ మోడళ్లు. సీఆర్టీ టీవీల తరవాత వచ్చిన ఫ్లాట్ టీవీలు కొన్నాళ్లపాటు దుమ్ము దులిపాయి. తరవాత ప్లాస్మా వచ్చినా కొన్నాళ్లకే మసకబారింది. ఆ తరవాత వచ్చిన ఎల్సీడీ, ఎల్ఈడీ టీవీలు ఇప్పటికే మన ఇళ్లను, కళ్లను అలరిస్తూనే ఉన్నాయి. వీటిని తలదన్నేలా ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడ్ (ఓఎల్ఈడీ) టీవీల్ని తేవాలని పెద్ద కంపెనీలన్నీ చాలా పెద్ద ప్రణాళికలేశాయి. కాకపోతే పరిస్థితులు చూస్తుంటే ఇవి పురిట్లోనే సంధికొట్టేసేలా ఉన్నాయి. ఎందుకంటే వీటి తయారీకి భారీ వ్యయం అవుతుండటం, కొత్త టెక్నాలజీపై జనంలో ఇంకా నమ్మకం ఏర్పడకపోవటంతో వీటిపై అనుమానాలు రేగుతున్నాయి. మెరుగైన టెక్నాలజీతో, అందుబాటు ధరలో ఓలెడ్ టీవీలు తేవాలని పరిశ్రమ దిగ్గజాలు సోనీ, పానాసోనిక్ ఇప్పటికే ఒక జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేశాయి. కాకపోతే దానికి డిసెంబరు 31తో గడువు ముగిసిపోయింది. పొడిగించుకునే ప్రయత్నాలేవీ కంపెనీలు చేయకపోవటం ఈ సందర్భంగా గమనార్హం. అధిక ధర, విశ్వసనీయత కొరవడటం వంటి కారణాల వల్ల టీవీ ఉత్పత్తిదారులు ఓలెడ్ టీవీలకు బదులు అల్ట్రా హెచ్డీ టీవీలవైపే మొగ్గు చూపిస్తూ వస్తున్నారు. లిక్విడ్ క్రిస్టల్ టెక్నాలజీతో తయారయ్యే వీటి రిజల్యూషన్ ప్రస్తుత హై డెఫినిషన్ స్క్రీన్ల కంటే నాలుగు రెట్లు మెరుగ్గా ఉంటుంది. నిజానికి ఎల్జీ, శామ్‌సంగ్‌లు తయారు చేస్తున్న 55 అంగుళాల ఓలెడ్ టీవీలు ఇప్పటికే మార్కెట్లోకి వచ్చాయి. కొన్ని చోట్ల వీటి ఆరంభ ధర 8 వేల డాలర్లు. అయితే ఎల్జీ సంస్థ భారతదేశంలో తొలిసారిగా ప్రవేశపెట్టిన 55 అంగుళాల ఓలెడ్ కర్వ్డ్ టీవీని ఇటీవలే హైదరాబాద్‌లో కూడా ప్రదర్శనకు పెట్టింది. దీని ధర అక్షరాలా పది లక్షలు. ఎల్జీ బెస్ట్ షాపులన్నిట్లోనూ ఇది దొరుకుతుందంటూ దీన్ని మార్కెట్లోకి విడుదల చేశారు కూడా. ఓలెడ్ టీవీల ధర ఎక్కువ కావటంతో వీటిని తక్కువ ధరలోనే ఉత్పత్తి చేయడానికి సోనీ, పానాసోనిక్లు 2012లో జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేశాయి. ఉత్పత్తి మొదలు కాకముందే గత నెలతో దీని గడువు ముగిసింది. ఉత్పత్తి వ్యయం, టెక్నాలజీ సంబంధ సమస్యలను అధిగమించగలిగితే అత్యంత స్పష్టమైన చిత్రాలను చూపే ఓలెడ్ టీవీలను ప్రజలు ఆదరించగలుగుతారు. మరి ఆ అవకాశం వస్తుందా..? -
సభకు LEDలు,ప్రత్యేక మొబైల్ స్క్రీన్ల ఏర్పాటు