
బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ ఇటీవల భూల్ భూలయ్యా సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ప్యార్ కా పంచ్‌నామా చిత్రంలో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం న్యూ ఇయర్ సందర్భంగా పారిస్‌లో సందడి చేశారు. ఈ వేడుకల్లో మాజీ ప్రియురాలు సారా అలీ ఖాన్‌తో కలిసి పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది. 2023కి స్వాగతం పలుకుతూ ఆదివారం ఓకే ప్రదేశంలో ఉన్న ఫోటోలను షేర్ చేసింది ఈ జంట.
గతంలో సారా అలీ ఖాన్ సోదరుడు ఇబ్రహీం అలీ ఖాన్‌తో ఉన్న చిత్రాలను పోస్ట్ చేశారు కార్తీక్ ఆర్యన్. అయితే ఈ జంట బ్రేకప్ విషయాన్ని గురించి ఇంతవరకు పెదవి విప్పలేదు. ఒకసారి కరణ్ జోహార్ మాత్రమే తన చాట్ షోలో వీరిద్దరి రిలేషన్‌ను ప్రస్తావించారు. గతంలో ఈ జంట 'లవ్ ఆజ్ కల్' చిత్రంలో నటిస్తున్నప్పుడు ఏడాది పాటు డేటింగ్‌లో ఉన్నారు.
సినిమాల విషయాకొనిస్తే కార్తిక్ ఆర్యన్ చేతిలో 'షెహజాదా', 'సత్యప్రేమ్ కీ కథ', 'ఆషికి 3' 'కెప్టెన్ ఇండియా' ప్రాజెక్టులు ఉన్నాయి. అలాగే సారా అలీ ఖాన్ 'మెట్రో ఇన్ డినో అనౌన్స్', 'గ్యాస్‌లైట్', 'నఖ్రేవాలి', విక్కీ కౌశల్‌తో లక్ష్మణ్ ఉటేకర్ అనే చిత్రంలో కనిపించనుంది.
Comments
Please login to add a commentAdd a comment