Paramour Relationship
-
పర్సనల్ వీడియోలు లీక్ చేసిన మాజీ ప్రియుడు.. చిక్కుల్లో ఎన్నారై యువతి
మాజీ ప్రియుడి కారణంగా ఓ ఎన్నారై యువతి చిక్కుల్లో పడింది. తనతో తిరిగి స్నేహం చేయలంటూ ఒత్తిడి చేస్తున్న అతనికి కుటుంబ సభ్యులతో కలిసి గట్టిగా బుద్ధి చెప్పింది. యువతి సాహచర్యం కోసం దిగజారి ప్రవర్తించిన ఆ యువకుడు చివరకు కటకటాలపాలయ్యాడు. అహ్మదాబాద్ నగరానికి చెందిన పార్థ్ చంపానేరి (23)కి స్థానికంగా ఉన్న యువతితో గతేడాది పరిచయమైంది. తర్వాత కాలంలో ఆ స్నేహం ప్రేమగా మారింది. ఈ క్రమంలో ఇద్దరు చాలా చనువుగా మెలిగారు. ఈ సమయంలో ఆమెతో ఏకాంతంగా ఉన్న వీడియోలు, ఫోటోలను పార్థ్, తన ఫోన్లో షూట్ చేశాడు. ఇటీవల మనస్పర్థలు రావడంతో ఆ యువకుడితో స్నేహానికి ఆమెకి చెక్ పెట్టింది. ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లి పోయింది. అయితే తనతో స్నేహం కొనసాగాలించాలంటూ ఆ పార్థ్ ఆ యువతిని వేధించడం ప్రారంభించారు. దీంతో అతని ఫోన్ నంబర్ బ్లాక్‌లో పెట్టింది. తన ఫోన్ నంబర్ బ్లాక్ పెట్టడంతో నీచానికి దిగజారాడు పార్థ్. తామిద్దరు సన్నిహితంగా మెలిగిన వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. అంతటితో ఆగకుండా ఆ యువతి కుటుంబ సభ్యులకు సైతం పంపాడు. వెంటనే తన నంబర్ అన్ బ్లాక్ చేయాలని, తనతో మాట్లాడాలటూ కండీషన్ పెట్టాడు. అలా చేయని పక్షంలో పర్సనల్ వీడియోలను మరింతగా వైరల్ చేస్తానంటూ బెదిరించాడు. పార్థ్ నుంచి వేధింపులు శృతిమించడంతో వెంటనే యువతి జరిగిన విషయం ఇండియాలో ఉన్న తండ్రికి తెలిపింది. వెంటనే అతను స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పార్థ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కి తరలించారు. సోషల్ మీడియాతో పాటు అతని ఫోన్ నుంచి ఈ వీడియోలు డిలీట్ చేశారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని అహ్మాదాబాద్ పోలీసులు తెలిపారు. -
బిడ్డా.. నేనూ నీ వద్దకే
సాక్షి,యాదాద్రి: ‘నా బిడ్డలేని లోకంలో ఉండలేను. నేనూ నా కూతురు దగ్గరకే వెళ్తాను’ అంటూ కూతురు ఆద్య హత్యానంతరం తల్లడిల్లిన తండ్రి కళ్యాణ్.. శనివారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ప్రాణంగా చూసు కునే కూతురి మరణం.. ప్రేమించి పెళ్లి చేసు కున్న భార్య చేసిన మోసం జీర్ణించుకోలేక 9 రోజులుగా మానసికంగా కుంగిపోయిన ఆయన తనువు చాలించిన వైనం అందరినీ కంటతడి పెట్టించింది. భార్య వివాహేతర సంబంధం పెట్టుకుని భర్తకు ద్రోహం చేయ డమే కాక, ఇద్దరి మరణాలకు కారణమైందని, బయట తలెత్తుకుని తిరిగే పరిస్థితి లేకే కళ్యాణ్ ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు ఆవే దన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ జరిగిన ఘోరం.. భువనగిరికి చెందిన సూరనేని కళ్యాణ్‌రావు, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా గుత్తికి చెందిన అనూషది ప్రేమ వివాహం. మిస్డ్‌కాల్ ద్వారా ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి, 2011లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2015లో ఆద్య జన్మించింది. పంచాయతీ కార్యదర్శిగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మ కూర్ (ఎం) మండల కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న కళ్యాణ్‌రావు.. కుమార్తె చదువు కోసం రెండేళ్ల క్రితం ఘట్కేసర్ మండలం ఇస్మాయిల్‌ఖాన్‌గూడ విహారి హోమ్‌కు మకాం మార్చారు. ఈ క్రమంలో అనూష.. ఓ సెల్‌ఫోన్ షోరూమ్‌లో పరిచయమైన కరుణా కర్కు సన్నిహితమైంది. రోజూ ఆమె ఇంటికి వచ్చివెళ్లే క్రమంలో కరుణాకర్ తన మిత్రుడు రాజశేఖర్‌ను కూడా వెంట తీసుకెళ్లేవాడు. ఆమె రాజశేఖర్‌కు సన్నిహితంగా ఉంటున్నట్టు అను మానించిన కరుణాకర్ ఈ నెల 2న అనూష ఇంటికి వెళ్లాడు.దీంతో అనూష రాజశేఖర్‌తో కనిపించడంతో ఆగ్రహంతో ఊగిపోతూ అక్కడే ఉన్న ఆద్య గొంతును సర్జికల్ బ్లేడుతో కోసి హతమార్చాడు. ఆపై తననూ గాయపర్చుకున్నాడు. కరుణాకర్, రాజశేఖర్‌పై పోలీసులు కేసు పెట్టి జైలుకు పంపించారు. కుమార్తె మృతితో తల్లడిల్లి.. ఆద్య మృతితో కళ్యాణ్ తల్లిడిల్లిపోయాడు. ఆద్య అంత్యక్రియలు భువనగిరిలో నిర్వహిం చారు. అప్పటి నుంచి భార్య అనూషతో కలిసి ఇక్కడే ఉంటున్నాడు. కుమార్తె అంతిమ సంస్కారం పూర్తయిన రోజు నుంచి కళ్యాణ్ అన్నం తినడం మానేసినట్లు తెలిసింది. తన జీవితం నాశనమైందని, కూతురు వద్దకు వెళ్తానని చెప్పి విలపించే వాడని బంధువులు చెప్పారు. మరోవైపు తనను పలకరించడానికి వచ్చిన వారికి భార్య గురించి చెçప్పుకోలేక కుమిలిపోయాడు. కాగా, శనివారం అనూష తన తల్లిగారి గ్రామమైన అనంతపురం జిల్లా గుత్తికి వెళ్తానని చెప్పడంతో ఉదయం భువనగిరి నుంచి సికింద్రాబాద్ తీసుకెళ్లాడు. జూబ్లీ బస్‌స్టేషన్‌లో గుత్తికి వెళ్లే బస్సు ఎక్కించాడు. అక్కడి నుంచి నేరుగా మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో తిరిగి భువనగిరి చేరుకున్న అతను రైల్వేస్టేషన్లో కొద్దిసేపు కూర్చున్నాడు. తర్వాత నడుచుకుంటూ కొద్ది దూరం వెళ్లి కిలోమీటర్ నంబర్ 239/10–12 వద్ద సికింద్రాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్తున్న గుర్తుతెలియని రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గమనించి రైల్వే పోలీసులకు తెలిపారు. పోలీసులు కళ్యాణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు రైల్వే హెడ్‌కానిస్టేబుల్ ఎస్.కాంతారావు తెలిపారు. 5 నిమిషాలలో వస్తానన్నాడు.. కళ్యాణ్ సికింద్రాబాద్ వెళ్లినప్పటి నుంచి సోదరుడు వెంకటేశ్ పలుమార్లు ఫోన్ చేస్తూనే ఉన్నాడు. ‘బయటికి ఎక్కడికీ వెళ్లకు.. నేరుగా ఇంటికి రా’ అని చెప్పాడు. చివరిగా ఫోన్ చేసినప్పుడు ‘భువనగిరికి వచ్చాను. ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నా.. ఐదు నిమిషాల్లో ఇంటికి వస్తా’ అని చెప్పినట్లు వెంకటేశ్ ‘సాక్షి’కి తెలిపారు. కానీ అంతలోనే రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం వచ్చిందని విలపించాడు. అందరికీ ధైర్యం చెప్పేవాడు.. 2003లో రామన్నపేటలో బిల్‌కలెక్టర్‌గా ఉద్యోగంలో చేరిన కళ్యాణ్‌రావు, ఆలేరు గ్రామ పంచాయతీలో పనిచేశారు. గ్రేడ్–3 పంచాయతీ కార్యదర్శిగా పదోన్నతిపై ఆత్మకూర్ మండల కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నాడు. సీనియర్‌గా పంచాయతీ కార్యదర్శులకు అండగా ఉండేవాడని సన్నిహితులు చెప్పారు. విధి నిర్వహణలో జూనియర్లకు సలహా సూచనలిస్తూ సహకరించేవాడని, ఉన్నతాధికారులతో చర్చించి సహచర కార్యదర్శుల సమస్యలను పరిష్కారానికి కృషిచేసే వాడని తోటి ఉద్యోగులు గుర్తుచేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. విధి నిర్వహణలో సైతం కుమార్తె గురించే ఆలోచిస్తుండే వాడని స్నేహితులు తెలిపారు. -
భార్య చేసిన పనికి కూతురు హత్యకు గురి కావడంతో..
సాక్షి, మేడ్చల్, యాదాద్రి : వారం రోజుల క్రితం ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ సంబంధం నేపథ్యంలో అయిదేళ్ల చిన్నారి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కూతురి మరణాన్ని తట్టుకోలేకపోయిన చిన్నారి తండ్రి శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. భువనగిరి ప్రాంతానికి చెందిన కళ్యాణ్ 2011లో అనూష అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి 2015లో ఆద్య అనే చిన్నారి జన్మించింది. రెండు సంవత్సరాలుగా ఈ దంపతులు ఘట్కేసర్ పరిధిలోని ఇస్మాయిల్ ఖాన్‌గూడలో నివాసం ఉంటున్నారు. వృత్తిరీత్యా కళ్యాణ్ యాదాద్రి జిల్లా ఆత్మకూరులో గ్రామ కార్యదర్శిగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. (డిగ్రీ విద్యార్థిని లైవ్ డెత్!) ఈ క్రమంలో కొన్ని నెలల క్రితం అనూషకు కరుణాకర్ అనే అబ్బాయితో పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇదిలా కొనసాగుతుండగా ఇటీవల కరణాకర్‌ను దూరం పెడుతూ.. అనూష మరో స్నేహితుడు రాజశేఖర్‌తో చనువుగా ఉంటోంది. ఇది తట్టుకోలేని కరుణాకర్ గురువారం అనూష ఇంటికి వెళ్లాడు. అప్పటికి ఇంట్లో రాజశేఖర్ ఇండటంతో ఆవేశానికి లోనైన కరుణాకర్ అతన్ని బయటకు రావాలని హెచ్చరించాడు. లేకుంటే తన వెంట తెచ్చుకున్న సర్జికల్ కత్తితో బయట ఆడుకుంటున్న అనూష కూతురు ఆద్యను చంపేస్తానంటూ బెదిరించాడు. అతని మాటలను పట్టించుకోకపోవడంతో కరుణాకర్ వెంటనే చిన్నారి గొంతు కోసి హత్యకు పాల్పడ్డాడు. ఇది జరిగిన వారం రోజుల్లోనే తండ్రి కళ్యాణ్ మానసికంగా కుంగిపోయి భువనగిరి రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్య చేసుకున్నాడు. (ప్రేమికురాలిని హత్య చేసిన ప్రేమికుడు) -
వివాహేతర సంబంధానికి అడ్డుగా వున్నాడని..
సాక్షి, మంచిర్యాల : అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని కట్టుకున్న భర్తనే అతి కిరాతకంగా హత్యచేసిన భార్య ఉదంతం మంచిర్యాల జిల్లా కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై ఓంకార్ యాదవ్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. జటంగుల లక్ష్మణ్ (50)తన భార్య జనని, కూతుర్లు రమ్య, పండు, కుమారుడు కార్తికేయలతో కలిసి జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. లక్ష్మణ్ ప్రైవేటు ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తుండగా అతని భార్య జనని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వీపర్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలో జననికి అక్రమ సంబంధం ఉందన్న కారణంతో భార్యాభర్తల ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడి నాలుగేళ్లుగా లక్ష్మణ్ తన స్వగ్రామమైన కుమురంభీంజిల్లా కౌటాల మండలంలోని తలోడి గ్రామంలో ఉంటున్నాడు. పెద్దకూతురికి వివాహం కాగా జనని రాజీవ్‌నగర్‌లోని ఓ అద్దె ఇంట్లో ఇద్దరు పిల్లలతో ఉంటోంది. పిల్లలను చూసేందుకు లక్ష్మణ్ తరచూ వచ్చేవాడు. ఈ క్రమంలోనే ఈ నెల 24న సాయంత్రం రాజీవ్‌నగర్‌లో ఉంటున్న జనని ఇంటికి వచ్చాడు. మళ్లీ ఎందుకు వచ్చావని ఇద్దరి మధ్యా వాగ్వివాదం జరిగింది. ఇదే అదనుగా భావించిన జనని సోదరుడు పానుగంటి సత్యనారాయణ. తల్లి లక్ష్మిలతో కలిసి హత్య చేసినట్లు మృతుని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్సై తెలిపారు. జననిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. హత్య జరిగిన తీరు 24న రాత్రి జనని కుటుంబ సభ్యులు, మరికొందరితో కలిసి లక్ష్మణ్‌ను తీవ్రంగా కొట్టి చనిపోయాడనుకుని బయట స్తంభానికి కట్టేశారు. తెల్లవారుజామున 4గంటలకు వెళ్లి చూడగా బతికే ఉన్నాడని తెలుసుకుని మళ్లీ ఇంట్లోకి తీసుకువచ్చి గొంతు నులిమి చంపారు. మళ్లీ తీసుకువెళ్లి స్తంభానికి కట్టివేశారు. మద్యం సేవించి ఇంట్లో గొడవ చేసినందుకు కాలనీవాసులు స్తంబానికి కట్టేశారని కట్టుకథ అల్లిన జనని ఓస్థానిక నాయకునితో కలిసి పోలీసులకు సమాచారం అందించిందని మృతుని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు కొందరు నాయకులు యత్నిస్తున్నారన్నారు. హతురాలికి చాలామందితో అక్రమ సంబంధాలున్నాయని, కొంతమంది స్థానిక నాయకులే ఆమెకు అండగా ఉన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
స్నేహితుడే కాలయముడు!
►వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ► హతమార్చిన వైనం తల, చేతులు ►నరికి తీసుకెళ్లిన నిందితుడు ► కొండమల్లేపల్లి శివారులో మొండెం లభ్యం దేవరకొండ / మాడ్గుల : స్నేహితుడు, బంధువని చేరదీసిన వ్యక్తే కాలయముడయ్యాడు. ఆశ్రయమిచ్చిన మిత్రుడి భార్యతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకొని అడ్డుగా ఉన్నాడని చివరికి దారుణంగా హతమార్చాడు. అనంతరం శరీర భాగాల ను వివిధ ప్రాంతాల్లో విసిరేశాడు. ఈ ఉదంతం నల్లగొండ జిల్లా దేవరకొండ మండలంలోని కోల్‌మంతల్ పహాడ్ సమీపంలో వెలుగుచూసింది. వివరాలిలా ఉన్నాయి. పెద్దవూర మండలం పర్వేదుల గ్రామపంచాయతీ పరిధిలోని పాల్త్యీతండాకు చెందిన పి.రవి (31), శ్యామల దంపతులు. రోజువారీ కూలిపని చేసుకుంటూ జీవ నం సాగిస్తున్నారు. అదే తండాకు చెందిన శ్రీధర్ సమీప బం ధువు, మిత్రుడు. దీంతో తరచూ రవి ఇంటికి వస్తూ ఉండేవా డు. ఈ క్రమంలోనే శ్యామలతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం బయటపడటంతో రెండేళ్ల క్రితం రవి, శ్రీధర్‌కు మధ్య గొడవ జరిగింది. పెద్ద మనుషులను ఆశ్రయించడంతో పంచాయితీ పెట్టి శ్రీధర్‌ను హైదరాబాద్‌కు పం పించారు. అనంతరం రవి తన భార్యను తీసుకుని మహబూబ్‌నగర్ జిల్లా మాడ్గుల మండలం అన్నెబోయిన పల్లి సమీపంలోని వెంకటేశ్వర పౌల్ట్రీఫాం లో పనికి కుదిరాడు. ఇటీవల శ్రీధర్ తిరిగి వచ్చి అక్కడే పని చేస్తున్నాడు. ఎలాగైనా తుదముట్టించాలని పథకం పన్ని ఈనెల 10న మాయమాటలు చెప్పి రవిని కొండమల్లేపల్లికి తీసుకెళ్లి అదే అర్ధరాత్రి చంపేశాడు. మరుసటి రోజు మృతుడి తండ్రి పీకానాయక్కు ఫోన్ చేసి ‘మృతదేహం కోల్‌మంతల్ పహాడ్ సమీపంలో ఉంది. వచ్చి తీసుకెళ్లండి..’ అని సమాచారమిచ్చా డు. దీంతో మృతుడి బంధువులు ముందుగా మాడ్గుల పోలీసులకు కిడ్నాప్ అయినట్టు ఫిర్యాదు చేశారు. చివరకు ఆదివారం మధ్యాహ్నం సంఘటన స్థలానికి వెళ్లగా తల, చేతులు లేని మృతదేహాన్ని గుర్తించారు. కాగా, దేవరకొండ సీఐ గట్టు మల్లు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు జరుపుతున్నారు. అంతా మిస్టరీనే.. రవిని ఎలా హత్య చేశారనే విషయం పూర్తిగా బహిర్గతం కావడంలేదు. మృతదేహంపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో శ్రీధర్‌తోపాటు మరికొందరు కలిసి రాయితో తలపై మోది హత్య చేశారని పోలీసులు భావిస్తున్నారు. అనంతరం తల, చేతులను కత్తితో నరికి నిందితులు తీసుకెళ్లారని ప్రాథమిక అంచనాకు వచ్చారు. -
బంధాన్ని వీడలేక.. బలవన్మరణం
♦ వివాహితుల మధ్య వివాహేతర సంబంధం ♦ ఇద్దరూ పాతాళగంగలో దూకి ఆత్మహత్య ♦ మృతులు ప్రకాశం జిల్లా పాపినేనిపల్లె వాసులు శ్రీశైలం : వారిరువురికి వేర్వేరుగా ఇతరులతో వివాహాలు అయినప్పటికీ వివాహేతర బంధం ఏర్పడింది. కుటుంబసభ్యులకు భయపడుతూనే కొన్నేళ్లు కొనసాగించారు. ఇక బంధాన్ని వీడలేక.. కలసి ఉండలేక చనిపోయి ఒక్కటవుద్దామనుకున్నారు. చచ్చినా విడిపోకూడదని భావించి ఇద్దరు నడుముకు లుంగీతో కట్టుకుని శ్రీశైలం పాతాళగంగలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులది ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం పాపినేనిపల్లె గ్రామానికి చెందిన ముద్దార్పు రమణ(45), దొంత పద్మ(38)గా పోలీసులు గుర్తించారు. పాపినేనిపల్లె గ్రామానికి చెందిన ముద్దార్ప రమణకు వరమ్మతో వివాహైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. అదే గ్రామానికి చెందిన దొంత పద్మకు వెంకటేశ్వర్లుతో 20 ఏళ్ల క్రితం వివాహమై, ఇద్దరు కుమారులు ఉన్నారు. వివాహమైన కొన్నాళ్లకే రమణ, పద్మ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. పిల్లలు పెరిగి పెద్దవారవుతున్నా వీరు వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఏమైందో తెలియదు కానీ.. ఇద్దరు బంధాన్ని వీడలేక.. కలసి చచ్చిపోవాలని ఆదివారం శ్రీశైలం వచ్చారు. మంగళవారం ఉదయం స్థానిక జాలర్లు పాతాళగంగలో ఇద్దరు మృతదేహాలు నీటిపై తేలుతున్న విషయాన్ని పోలీసులకు సమాచారం అందజేశారు. రమణ, పద్మలు చచ్చిపోయేటప్పుడు విడిపోకూడదని ఇద్దరు నడుములను లుంగీతో, మెడలను టవల్‌తో గట్టిగా కట్టుకుని పాతాళగంగలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. రమణ మృతదేహం వద్ద లభించిన ఆధార్‌కార్డు, ఫోన్ నెంబర్ల ద్వారా వారి బంధువులకు సమాచారం అందజేశామని సీఐ చక్రవర్తి, ఎస్ఐ లోకేష్‌కుమార్ తెలిపారు. -
వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని..
భానుపురి :వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణాల మీదకు వచ్చి ంది. వావివరసలు మరచి తన భార్యతో వివాహేతర సంబం ధం పెట్టుకున్నాడని బావమరిదినే బావ హతమార్చిన ఉదంతమిది. ఈ నెల 13న సూర్యాపేట పట్టణ శివారు జాతీయ రహదారి పక్కన తెల్లవారుజామున జరిగిన హత్య కేసును పోలీ సులు ఛేదించారు. సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ జి.శ్రవణ్‌కుమార్ హత్య కేసు వివరాలు వెల్లడించారు. నూతన్‌కల్ మండలం పోలుమళ్ల గ్రామానికి చెందిన కుంచం రవికి తిరుమలగిరి మండలం తొండ గ్రామానికి చెందిన శైలజతో 12 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వారికి కుమార్తె, కుమారుడు జన్మించారు. కొన్నాళ్ల తర్వాత రవి తన కుటుంబంతో పాటు హైదరాబాద్‌కు వెళ్లి ఉప్పల్ సమీపంలో రెండు టాటా ఏస్ వాహనాలను కొనుగోలు చేసి జీవనం సాగిస్తున్నాడు. అయితే వరుసకు తన మేన బావమరిది అయ్యే తుంగతుర్తి మండలం కర్విరాల కొత్తగూడెం గ్రామానికి చెందిన గోగుల శ్రీకాంత్ కుటుంబం హైదరాబాద్‌లోని బీరంగూడ వద్ద నివాసం ఉంటున్నారు. దీంతో బంధువులు ఉన్న ప్రదేశంలో తాను కూడా ఉండాలని రవి భావిం చాడు. దీంతో తన కుటుం బాన్ని బీరంగూడేనికి మార్చాడు. నాలుగు నెలల నుంచి రవి భార్య శైలజ తరచు భర్త రవితో ఘర్షణ పడుతోంది. ఆమె ప్రవర్తనలో కూడా మార్పు వచ్చింది. దీంతో పలుమార్లు పెద్ద మనుషుల్లో రవి పంచాయితీ పెట్టిం చా డు. ఆ క్రమంలో కొన్నాళ్ల పాటు శైలజను సూర్యాపేటలో నివాసముండే ఆమె సోదరి వద్దకు పంపించాడు. నెల రోజులు గడిచినప్పటికీ భార్య తిరిగి కాపురానికి తిరిగి రావడం లేదు. ఈ లోపు భార్య శైలజ భర్తతో తనకు ఇబ్బందులు ఉన్నాయని అతడిపై చర్య తీసుకుని విడాకులు ఇప్పించాలని నల్లగొండలోని మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసుల ద్వారా విషయం తెలుసుకున్న రవి తన భార్య తనపై కేసు పెట్టడమేమిటని బీరంగూడెంలో నివసించే బంధువులను సంప్రదించాడు. అప్పటికే శైలజతో వివాహేతర సంబంధం పెట్టుకున్న శ్రీకాంత్ రవిని సంప్రదించాడు. నీ భార్యను తీసుకొచ్చే బాధ్యత నాదేనని సూర్యాపేటకు వెళ్లి వస్తానని నమ్మబలికాడు. శైలజతో మాట్లాడి కాపురం చేయడానికి ఒప్పించి హైదరాబాద్‌కు రప్పించాడు. కొన్ని రోజులు బాగానే ఉన్న శైలజ వివాహేతర సంబంధానికి భర్త రవి అడ్డు వస్తున్నాడని తిరిగి సూర్యాపేటకు చేరుకుంది. ఈలోపు కేసు విషయమై రావాలని నల్లగొండలోని మహిళా పోలీస్‌స్టేషన్ సిబ్బంది రవిని కోరారు. ఈ క్రమంలో ఈనెల 12వ తేదీన శ్రీకాంత్ బైక్‌పై రవి కలిసి నల్లగొండకు బయలుదేరారు. మార్గమధ్యలోకి రాగా నే శ్రీకాంత్ శైలజతో ఉన్న వివాహేతర సంబంధం విషయాన్ని రవికి చెప్పాడు. అయినప్పటికీ అక్కడ అతడిని ఏమనకుండా నేరుగా నల్లగొండలోని మహిళా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ పోలీ సులను సంప్రదించి ఒకరోజు గడువు కావాలని కోరి సూర్యాపేటకు బయలుదేరారు. కేతేపల్లి సమీపంలోకి రాగానే శ్రీకాంత్ వద్ద డబ్బులు లేకపోవడంతో తన సోదరి గ్రామమైన కేతేపల్లి మండలం చెర్కుపల్లికి వెళ్లాడు. గ్రామానికి వెళ్లగానే రవి మాత్రం శ్రీకాంత్ సోదరి ఇంటికి వెళ్లకుండా దూరంగా ఉన్నాడు. అక్కడ గంట గడిపిన ఇద్దరు తిరిగి సూర్యాపేటకు చేరుకున్నారు. సూర్యాపేటలో శైలజ సోదరి నివాసంలో లేదు. వారి బంధువులు నివసించే చింతలచెరువులో ఉందని తెలుసుకున్నారు. అప్పటికే అర్ధరాత్రి కావడంతో శ్రీకాంత్ తాను పాతర్లపహాడ్‌కు వెళ్లి వస్తానని ఈ లోపు మీ తోడళ్లుడుతో మాట్లాడుతూ ఉండూ అని రవికి చెప్పి వెళ్లాడు. అనంతరం రవి ఓ ఆటోలో పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్దకు చేరుకొని శ్రీకాంత్‌కు ఫోన్ చేసి రప్పించాడు. ఇద్దరు కలిసి శైలజ వద్దకు చింతలచెరువుకు వెళ్లగా అక్కడ వారు తలుపులు తీయలేదు. దీంతో ఇద్దరు కలిసి హైవే పక్కన జనగామ క్రాస్‌రోడ్డు సమీపంలో గల దుర్గాభవాని దాబాహోటల్ వద్దకు వెళ్లి టీ తాగారు. అనంతరం పక్కనే ఉన్న పోలంపల్లి శ్రీనివాస్ టైర్ల దుకాణం ముందు కూర్చున్నారు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకొని తన కుటుంబం ఇబ్బందుల పాలుకావడానికి కారణమైన శ్రీకాంత్‌ను హత్య చేసేందుకు రవి నిర్ణయించుకున్నాడు. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్న క్రమంలో ఒక్కసారిగా రవికి ఆగ్రహం వచ్చి టైర్ల కొట్టు వద్ద పంక్చర్లు చేసేందుకు ఉపయోగించే కర్రతో శ్రీకాంత్ తలపై మోదాడు. అనంతరం రవి అక్కడి నుంచి పరారయ్యాడు. తెల్లవారుజామున గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. రక్తపు మడుగులో ఉన్న శ్రీకాంత్‌ను పోలీసులు ఏరియాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడు శ్రీకాంత్ తండ్రి వెంకన్న ఫిర్యాదు మేరకు ఇన్స్పెక్టర్ ఎస్.శ్రీనివాసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టాడు. కుంచం రవి సెల్‌ఫోన్ ఆధారంగా కేసును ఛేదించారు. నడిగూడెం మండలం త్రిపురవరంలో ఉన్న రవిని ఐడీ పార్టీ సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారించారు. తానే శ్రీకాంత్‌ను హత్య చేసినట్లు రవి ఒప్పుకున్నాడు. అతడిని కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ చెప్పారు. హత్య కేసును ఒక్కరోజులోనే ఛేదించిన ఇన్స్పెక్టర్ ఎస్.శ్రీనివాసులు, ఐడీ పార్టీ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. సమావేశంలో ఎస్ఐలు ఎంఏ జబ్బార్, రాములు, ఐడీ పార్టీ సిబ్బంది గొర్ల కృష్ణయ్య, గోదేషి కరుణాకర్, కె.అరవింద్ ఉన్నారు.