స్నేహితుడే కాలయముడు! | Paramour relationship to murder in friend | Sakshi
Sakshi News home page

స్నేహితుడే కాలయముడు!

Published Mon, Mar 14 2016 1:50 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

స్నేహితుడే కాలయముడు! - Sakshi

స్నేహితుడే కాలయముడు!

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని
హతమార్చిన వైనం  తల, చేతులు
నరికి తీసుకెళ్లిన నిందితుడు

కొండమల్లేపల్లి శివారులో మొండెం లభ్యం
 
  దేవరకొండ / మాడ్గుల :  స్నేహితుడు, బంధువని చేరదీసిన వ్యక్తే కాలయముడయ్యాడు. ఆశ్రయమిచ్చిన మిత్రుడి భార్యతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకొని అడ్డుగా ఉన్నాడని చివరికి దారుణంగా హతమార్చాడు. అనంతరం శరీర భాగాల ను వివిధ ప్రాంతాల్లో విసిరేశాడు. ఈ ఉదంతం నల్లగొండ జిల్లా దేవరకొండ మండలంలోని కోల్‌మంతల్ పహాడ్ సమీపంలో వెలుగుచూసింది. వివరాలిలా ఉన్నాయి. పెద్దవూర మండలం పర్వేదుల గ్రామపంచాయతీ పరిధిలోని పాల్త్యీతండాకు చెందిన పి.రవి (31), శ్యామల దంపతులు. రోజువారీ కూలిపని చేసుకుంటూ జీవ నం సాగిస్తున్నారు. అదే తండాకు చెందిన శ్రీధర్ సమీప బం ధువు, మిత్రుడు. దీంతో తరచూ రవి ఇంటికి వస్తూ ఉండేవా డు. ఈ క్రమంలోనే శ్యామలతో వివాహేతర సంబంధం ఏర్పడింది.

ఈ విషయం బయటపడటంతో రెండేళ్ల క్రితం రవి, శ్రీధర్‌కు మధ్య గొడవ జరిగింది. పెద్ద మనుషులను ఆశ్రయించడంతో పంచాయితీ పెట్టి శ్రీధర్‌ను హైదరాబాద్‌కు పం పించారు. అనంతరం రవి తన భార్యను తీసుకుని మహబూబ్‌నగర్ జిల్లా మాడ్గుల మండలం అన్నెబోయిన పల్లి సమీపంలోని వెంకటేశ్వర పౌల్ట్రీఫాం లో పనికి కుదిరాడు. ఇటీవల శ్రీధర్ తిరిగి వచ్చి అక్కడే పని చేస్తున్నాడు. ఎలాగైనా తుదముట్టించాలని పథకం పన్ని ఈనెల 10న మాయమాటలు చెప్పి రవిని కొండమల్లేపల్లికి తీసుకెళ్లి అదే అర్ధరాత్రి చంపేశాడు.

మరుసటి రోజు మృతుడి తండ్రి పీకానాయక్‌కు ఫోన్ చేసి ‘మృతదేహం కోల్‌మంతల్ పహాడ్ సమీపంలో ఉంది. వచ్చి తీసుకెళ్లండి..’ అని సమాచారమిచ్చా డు. దీంతో మృతుడి బంధువులు ముందుగా మాడ్గుల పోలీసులకు కిడ్నాప్ అయినట్టు ఫిర్యాదు చేశారు. చివరకు ఆదివారం మధ్యాహ్నం సంఘటన స్థలానికి వెళ్లగా తల, చేతులు లేని మృతదేహాన్ని గుర్తించారు. కాగా, దేవరకొండ సీఐ గట్టు మల్లు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు జరుపుతున్నారు.


 అంతా మిస్టరీనే..
రవిని ఎలా హత్య చేశారనే విషయం పూర్తిగా బహిర్గతం కావడంలేదు. మృతదేహంపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో శ్రీధర్‌తోపాటు మరికొందరు కలిసి రాయితో తలపై మోది హత్య చేశారని పోలీసులు భావిస్తున్నారు. అనంతరం తల, చేతులను కత్తితో నరికి నిందితులు తీసుకెళ్లారని ప్రాథమిక అంచనాకు వచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement